లేఖన కథలు
మిస్సోరీలో కష్టము


“మిస్సోరీలో కష్టము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“మిస్సోరీలో కష్టము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1831 జూలై–1833 జూలై

2:42

మిస్సోరీలో కష్టము

అపాయకరమైన సమయాల్లో విశ్వాసాన్ని బలంగా నిలుపుకొనుట

ఇండిపెండెన్స్‌లో పరిశుద్ధుల రాకతో కలత చెందుతున్న కొంతమంది వ్యక్తులు.

మిస్సోరిలోని ఇండిపెండెన్స్‌లో నివసించడానికి చాలా మంది పరిశుద్ధులు వచ్చారు. అక్కడ సీయోను నగరాన్ని నిర్మించాలని ప్రభువు వారిని కోరారు. కానీ పరిశుద్ధులు మరియు అప్పటికే ఇండిపెండెన్స్‌లో నివసిస్తున్న ప్రజల మధ్య సఖ్యత లేదు. చాలా విషయాల్లో వారు విభేదించారు. ఊరిలో కొంతమంది కోపంతో ఉన్నారు మరియు పరిశుద్ధులు వెళ్లిపోయేలా చేయాలనుకున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 57:1–3; Saints, 1:171–74

ఇండిపెండెన్స్‌లో ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌ను కలుసుకున్న నాయకులు.

ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ ఇండిపెండెన్స్‌లో బిషప్పు. పట్టణంలోని నాయకులతో ఆయన ఒక సమావేశానికి వచ్చారు. పరిశుద్ధులు ఇండిపెండెన్స్‌ను విడిచిపెట్టాలని వారు అన్నారు. ఇండిపెండెన్స్‌లో పరిశుద్ధులు సీయోనును నిర్మించాలని దేవుడు కోరుకున్నారని బిషప్పు పాట్రిడ్జ్‌కు తెలుసు. పరిశుద్ధులు విడిచివెళ్ళలేరని ఆయన అన్నారు.

Saints, 1:176

ఇళ్లు మరియు భవనాలు కూల్చివేస్తున్న కోపంతో ఉన్న వ్యక్తులు.

కోపంతో ఉన్న వ్యక్తులు పరిశుద్ధులు నిర్మించిన ఇళ్ళను మరియు భవనాలను కూల్చివేయడం ప్రారంభించారు.

Saints, 1:177–78, 182

ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ మరియు చార్లెస్ అలెన్‌లను పట్టుకున్న వ్యక్తులు.

ఆ వ్యక్తులు బిషప్పు పాట్రిడ్జ్‌ను మరియు చార్లెస్ అలెన్ అనే మరొక వ్యక్తిని వారి ఇళ్ల నుండి తీసుకెళ్లారు. వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులను పట్టణం మధ్యలోకి లాక్కొచ్చారు.

Saints, 1:179

తారు మరియు ఈకలతో కప్పబడి ఉన్న ఎడ్వర్డ్ మరియు చార్లెస్.

బిషప్పు పాట్రిడ్జ్‌ ఇలా అన్నారు, “నా మతం కోసం నేను బాధపడవలసి వస్తే, అది నాకంటే ముందు ఇతరులు చేసిన దానికంటే ఎక్కువ కాదు.” ఆ వ్యక్తులు బిషప్పు పాట్రిడ్జ్‌ మరియు చార్లెస్‌లను నేలపైకి తోసారు. వారి శరీరాలపై వేడి తారు పోసి, ఈకలు అంటించారు.

Saints, 1:179–80

అడవుల్లో దాక్కున్న విలియం మెక్‌లెల్లిన్.

ఇండిపెండెన్స్‌లో సంఘ సభ్యుడైన విలియం మెక్‌లెల్లిన్, కోపంతో ఉన్న జనులు ఏమి చేస్తున్నారో విన్నాడు. అతను భయపడి, దాక్కోవడానికి అడవిలోకి పరిగెత్తాడు.

Saints, 1:182

అతను పట్టుబడితే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న విలియం.

కోపంగా ఉన్న వ్యక్తులు తనను కనుగొంటే ఏమి జరుగుతుందో అని విలియం ఆశ్చర్యపోయాడు. దానికోసం వారు అతన్ని చంపడానికి ప్రయత్నించినప్పటికీ, మోర్మన్ గ్రంథము నిజమని అతను ఇంకా చెబుతాడా?

Saints, 1:182–83

విలియం‌ను కనుగొన్న ఆలీవర్ కౌడరీ మరియు డేవిడ్ విట్మర్.

విలియం స్నేహితులైన ఆలీవర్ కౌడరీ మరియు డేవిడ్ విట్మర్ అతన్ని అడవుల్లో కనుగొన్నారు. ఆలీవర్ మరియు డేవిడ్ మోర్మన్ గ్రంథాన్ని నమ్మారని విలియం‌కు తెలుసు. ఒక దేవదూత వారికి బంగారు పలకలను చూపించాడు. “చెప్పండి, ఆ మోర్మన్ గ్రంథము నిజమేనా?” అని విలియం వారిని అడిగాడు.

Saints, 1:183

విలియంతో తమ సాక్ష్యాన్ని పంచుకుంటున్న ఆలీవర్ మరియు డేవిడ్.

మోర్మన్ గ్రంథము నిజమని ఆలీవర్ మరియు డేవిడ్‌లు విలియంతో చెప్పారు. కోపంతో ఉన్న వ్యక్తులు తమను చంపడానికి ప్రయత్నించినప్పటికీ, వారు తమ సాక్ష్యాన్ని జనులతో పంచుకోవడం ఎప్పటికీ ఆపరని చెప్పారు. “నేను మిమ్మల్ని నమ్ముతున్నాను,” అన్నాడు విలియం.

సిద్ధాంతము మరియు నిబంధనలు 17:3–6; Saints, 1:183