లేఖన కథలు
లూసీ మోర్లే మరియు ఆమె కుటుంబము


“లూసీ మోర్లే మరియు ఆమె కుటుంబము” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)

“లూసీ మోర్లే మరియు ఆమె కుటుంబము” సిద్ధాంతము మరియు నిబంధనలు

1830 నవంబరు

2:43

లూసీ మోర్లే మరియు ఆమె కుటుంబము

అనేకమంది నమ్మి, బాప్తీస్మము పొందారు

అబిగైల్ డానియేల్స్ యొక్క ఇంటిలోపలికి లూసీ మోర్లే ముగ్గురు సువార్తికులను ఆహ్వానించింది.

ఒకరోజు, 15 సంవత్సరాల లూసీ మోర్లే తన పొరుగువారైన, అబిగైల్‌ డానియేల్స్‌కు దుస్తులను నేయడంలో సహాయపడుతున్నది. వారు పని చేస్తున్నప్పుడు, తలుపు తట్టబడటం విన్నారు. వచ్చింది ముగ్గురు సువార్తికులు. అబిగైల్‌ వారిని లోపలికి ఆహ్వానించింది. ఒక సందేశాన్ని పంచుకోవడానికి యేసు క్రీస్తు వారిని పంపారని వారు చెప్పారు.

పరిశుద్ధులు, 1:102–3

సువార్తికులు లూసీ మరియు అబిగైల్‌కు మోర్మన్ గ్రంథము గురించి బోధిస్తున్నారు.

జోసెఫ్ స్మిత్‌ను ఒక ప్రవక్తగా ఉండడానికి ప్రభువు పిలిచారని ఆ వ్యక్తులు లూసీ మరియు అబిగైల్‌కు చెప్పారు. వారు మోర్మన్ గ్రంథము గురించి కూడా వారికి చెప్పారు.

పరిశుద్ధులు, 1:103

అబిగైల్ సువార్తికులను తన ఇంటిని విడిచి వెళ్ళేలా చేసింది.

లూసీ యొక్క ఆశ్చర్యానికి, అబిగైల్‌కు కోపం వచ్చింది. ఆమె సువార్తికులను తన ఇంటిని విడిచి వెళ్ళేలా చేసింది.

పరిశుద్ధులు, 1:103

లూసీ సువార్తికులను తన కుటుంబాన్ని దర్శించమని అడుగుతుంది.

ఈ సువార్తికులు దేవుని సేవకులని లూసీకి తెలుసు. మార్గములో ఉన్న తన కుటుంబాన్ని సందర్శించమని ఆమె వారితో చెప్పింది. “మా నాన్న ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో నివసిస్తున్నారు,” అని ఆమె అన్నది. “అక్కడికి వెళ్ళండి, మీరు ఆహారం మరియు సంరక్షణ ఇవ్వబడతారు.”

పరిశుద్ధులు, 1:103–4

సువార్తికులు లూసీ మరియు ఆమె కుటుంబంతో కలిసి భోజనం చేసారు.

లూసీ చెప్పింది సరైనది. సువార్తికులు మోర్లే కుటుంబ పొలము వద్ద మంచి భోజనం చేసారు. లూసీ తల్లిదండ్రులు సిడ్నీ రిగ్డన్‌కు స్నేహితులు. వారికి కలిగిన సమస్తాన్ని ఇతరులతో పంచుకోవాలని యేసు వారిని కోరుతున్నాడని వారు నమ్మారు. వారికి, వారి స్నేహితులకు బోధించడానికి వారు సువార్తికులను ఆహ్వానించారు.

పరిశుద్ధులు, 1:104

లూసీ, అబిగైల్, మరియు ఇతరులు బాప్తీస్మము పొందారు.

ఆ రాత్రి, దాదాపు అర్ధరాత్రి సమయంలో, 17 మంది జనులు బాప్తీస్మము పొందారు. తరువాత కొన్ని రోజులలో, సువార్తికుల బోధలను వినడానికి ఇంకా 50 మంది వ్యక్తులు మోర్లే పొలము వద్దకు వచ్చారు, మరియు వారు బాప్తీస్మము తీసుకోవాలని కోరారు. లూసీ స్నేహితురాలైన అబిగైల్ డానియేల్స్ సువార్తికుల గురించి తన మనస్సు మార్చుకున్నది. ఆమె మరియు ఆమె భర్త సంఘములో చేరడానికి నిర్ణయించుకున్నారు.

పరిశుద్ధులు, 1:105; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:25, 37