“కర్ట్‌లాండ్ దేవాలయ నిర్మాణం,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“కర్ట్‌లాండ్ దేవాలయ నిర్మాణం,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1832 డిసెంబరు–1836 మార్చి
కర్ట్‌లాండ్ దేవాలయ నిర్మాణం
ప్రభువు కొరకు ఒక ప్రత్యేక మందిరము
పరిశుద్ధులు కర్ట్‌లాండ్‌లో ప్రత్యేక మందిరాన్ని నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభువు జోసెఫ్ స్మిత్‌తో చెప్పారు. ఈ మందిరం ఒక దేవాలయం, ప్రభువు తన జనులను దర్శించి వారితో వాగ్దానాలు చేసే స్థలం. ఆయన తన దేవాలయంలో వారికి ప్రత్యేక బహుమతి ఇస్తారు. ఆయన ఆ బహుమతిని శక్తి యొక్క వరము అని పిలిచారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:119; 95:8; Saints, 1:205
పరిశుద్ధులు వెంటనే దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించలేదు. కొన్ని నెలల తర్వాత, దేవాలయం చాలా ముఖ్యమైనదని ప్రభువు వారికి గుర్తు చేసారు. హైరం స్మిత్ పనిముట్లను తీసుకురావడానికి తన తల్లిదండ్రుల ఇంటికి పరిగెత్తాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడని అతని తల్లి అడిగినప్పుడు, ప్రభువు మందిరం కోసం పని చేసేవారిలో తాను ముందుండాలని అనుకుంటున్నట్లు అతను చెప్పాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 95:1–8
కర్ట్‌లాండ్‌లోని పరిశుద్ధులు దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. దానికి చాలా డబ్బు ఖర్చయింది మరియు చాలా పని చేయవలసి వచ్చింది. సిడ్నీ రిగ్డన్ వంటి సంఘ సభ్యులు దేవాలయాన్ని నిర్మించడానికి చాలా డబ్బు ఇచ్చారు. వారు ప్రభువు ఆజ్ఞలను అనుసరించడానికి మరియు ఆయన మందిరంలో ఆయన దీవెనలు పొందడానికి ఉత్సాహంగా ఉన్నారు.
Saints, 1:209–211
పరిశుద్ధులు దేవాలయం కొరకు పని చేస్తున్నప్పుడు, వారికి డబ్బు తక్కువైంది. సిడ్నీ మరియు ఇతర సంఘ నాయకులు ఆందోళన చెందారు. సహాయం కోసం సిడ్నీ దేవుడిని ప్రార్థించాడు.
Saints, 1:210–11
కారొలైన్ టిప్పెట్స్ అనే సంఘ సభ్యురాలు మరియు ఆమె కుటుంబం చాలా డబ్బు ఆదా చేసింది. దేవాలయాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి సంఘము వారి డబ్బును అప్పుగా తీసుకోవడానికి కారొలైన్ అనుమతించింది.
Saints, 1:211–13
కర్ట్‌లాండ్‌లో ఉన్న చాలా మంది పరిశుద్ధులు దేవాలయాన్ని నిర్మించడానికి చాలా కష్టపడ్డారు. కొందరు రాళ్లతో నిండిన బండ్లను దేవాలయానికి తరలించారు. మరికొందరు పనివారికి బట్టలు మరియు ఆహారం తయారు చేశారు. పిల్లలు పగిలిన గాజు ముక్కలను సేకరించి పొడిచేసి, దేవాలయ గోడలు సూర్యకాంతిలో మెరిసేలా దానిని గోడలకు పూసారు.
Saints, 1:210, 219, 221
త్వరలోనే దేవాలయం పూర్తయింది! ప్రభువు వారికి వాగ్దానము చేసిన దీవెనలు పొందడానికి ఆయన మందిరానికి వెళ్ళేందుకు పరిశుద్ధులు ఉత్సాహముతో ఉన్నారు.
Saints, 1:221