“జోసెఫ్ మరియు ఆలీవర్ యాజకత్వ తాళపుచెవులను పొందుతారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“జోసెఫ్ మరియు ఆలీవర్ యాజకత్వ తాళపుచెవులను పొందుతారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1836 ఏప్రిల్
జోసెఫ్ మరియు ఆలీవర్ యాజకత్వ తాళపుచెవులను పొందుతారు
యేసు క్రీస్తు మరియు దేవదూతలు కర్ట్‌లాండ్ దేవాలయాన్ని సందర్శిస్తారు
కర్ట్‌లాండ్ దేవాలయం ప్రతిష్ఠించబడిన ఒక వారము తర్వాత, వేయిమంది పరిశుద్ధులు రక్షకుడిని ఆరాధించడానికి దేవాలయములో కలుసుకున్నారు. అది ఈస్టరు ఆదివారము. జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీ మరియు పన్నెండుమంది అపొస్తలులు పరిశుద్ధులకు సంస్కారమును అందజేసారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 110, ప్రకరణపు శీర్షిక; Saints, 1:239
సంస్కారము తర్వాత, జోసెఫ్ మరియు ఆలీవర్ ప్రార్థన చేయడానికి దేవాలయంలో తెర వెనుక నిశ్శబ్ద స్థలాన్ని కనుగొన్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 110, ప్రకరణపు శీర్షిక; Saints, 1:239
వారు ప్రార్థన ముగించిన తర్వాత, పైకి చూశారు. యేసు క్రీస్తు వారి ముందు నిలబడి ఉన్నారు! పరిశుద్ధులు దేవాలయాన్ని నిర్మించడానికి చాలా కష్టపడ్డారని ఆయనకు తెలుసు. “నేను ఈ ఇంటిని అంగీకరించాను,” అని ఆయన అన్నారు. దేవాలయం యొక్క ఆశీర్వాదాలు చాలామందికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయని యేసు జోసెఫ్ మరియు ఆలీవర్‌లతో చెప్పారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 110:1–10
యేసు వెళ్ళిపోయిన తర్వాత, పాత నిబంధన ప్రవక్తయైన మోషే జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు కనిపించాడు. ఇశ్రాయేలును సమకూర్చే యాజకత్వపు తాళపుచెవులను ఆయన వారికి ఇచ్చాడు. దీని అర్థం వారు సువార్తను పంచుకునే పనిని నడిపించగలరు. ప్రజలను రక్షకుని సంఘంలోకి తీసుకురావడానికి వారు ప్రపంచవ్యాప్తంగా సువార్తికులను పంపగలరు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11
తరువాత, ప్రవక్త ఎలియాసు కనిపించాడు. అబ్రాహాము నిబంధనను పునఃస్థాపించడానికి ఆయన జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు తాళపుచెవులను ఇచ్చాడు. దీని అర్థం అబ్రాహాము పొందిన అదే నిబంధనను పరిశుద్ధులు ప్రభువు నుండి పొందగలరు. వారు రాబోయే అనేక సంవత్సరాల పాటు ప్రతిచోటా ప్రజలకు సువార్తను మరియు దేవుని ఆశీర్వాదాలను అందించే శక్తిని కలిగి ఉంటారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 110:12
చివరకు, ప్రవక్త ఎలీషా కనిపించాడు. అతను జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు నిత్యత్వము కొరకు కుటుంబాలను ముద్రవేయడానికి లేదా ఏకం చేయడానికి యాజకత్వ తాళపుచెవులను ఇచ్చాడు. దేవాలయాలలో పరిశుద్ధులు చేసిన పని పరలోకంలో అంగీకరించబడుతుంది. ఇప్పుడు సంఘము రక్షకుని పనిని చేయడానికి మరియు ఆయన మళ్ళీ భూమిపైకి వచ్చే సమయం కొరకు సిద్ధపడడానికి శక్తి కలిగి ఉంది.