“జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1817–1820
జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనము
వినయముగల ప్రార్థనకు జవాబు
జోసెఫ్ స్మిత్ యొక్క కుటుంబము నివసించిన చోట, యేసు క్రీస్తు గురించి బోధించిన అనేక సంఘాలున్నాయి. వారందరు ఆయన గురించి వేర్వేరు విషయాలు బోధించారు. జోసెఫ్‌కు ఎవరు చెప్పేది సరైనదో ఖచ్చితంగా తెలియదు. తనకు రక్షకుడు అవసరమని అతడికి తెలుసు, కానీ ఏ సంఘంలో చేరాలో అతడికి తెలియలేదు.
జోసెఫ్ స్మిత్,—చరిత్ర 1:5–6; పరిశుద్ధులు, 1:9
చాలాకాలం పాటు జోసెఫ్ దాని గురించి ఆలోచించాడు. అతడు తన పాపాల కోసం పశ్చాత్తాపపడాలని కోరాడు. అతడు అనేక సంఘాలకు వెళ్ళాడు, కానీ ఇంకా గందరగోళంగా భావించాడు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:8–10; పరిశుద్ధులు, 1:9–12
ఒకరోజు, జోసెఫ్ బైబిలులో యాకోబు 1:5 చదివాడు. మనకు జ్ఞానము అవసరమైన యెడల, మనము దేవునిని అడగవచ్చని అది చెప్పబడింది. తాను చేయవలసిన పని ఇదేనని జోసెఫ్‌కు తన హృదయంలో తెలిసింది.
1820 లో ఒక అందమైన వసంతకాలపు ఉదయాన, జోసెఫ్ తన ఇంటికి దగ్గరలోని అడవిలోనికి వెళ్ళాడు. పరలోక తండ్రితో ప్రార్థించడానికి తాను ఒంటరిగా ఉండగల ప్రదేశంలో ఉండాలని అతడు కోరాడు.
జోసెఫ్ మోకరించి, ప్రార్థించుట ప్రారంభించాడు. అతడు ఆవిధంగా చేసినప్పుడు, దుష్టశక్తి తనను పట్టుకొన్నట్లుగా భావించాడు. అతడు తన చుట్టూ చీకటిగా భావించాడు. అతడు దేవునితో మాట్లాడకుండా ఎవరో ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనపించింది. తనను రక్షించమని దేవుణ్ణి అడగటానికి జోసెఫ్ తన సమస్త బలాన్ని ఉపయోగించాడు.
హఠాత్తుగా, జోసెఫ్ పరలోకము నుండి ఒక అందమైన ప్రకాశవంతమైన వెలుగును చూసాడు. చీకటి వెళ్ళిపోయింది, మరియు అతడు శాంతిని అనుభవించాడు. వెలుగులో, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గాలిలో నిలబడటం జోసెఫ్ చూసాడు. పరలోక తండ్రి జోసెఫ్ పేరును చెప్పారు. తరువాత ఆయన యేసు వైపు చూపించి, ఇలా అన్నారు, “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనను ఆలకించుము!”
అతని పాపములు క్షమించబడినవని జోసెఫ్ స్మిత్‌తో యేసు చెప్పెను. ఏ సంఘంలో చేరాలో జోసెఫ్ యేసును అడిగాడు. వాటిలో దేనిని చేరవద్దని యేసు అతనికి చెప్పారు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:18–19; పరిశుద్ధులు, 1:16
తన సువార్తను గురించిన ముఖ్యమైన సత్యములు కోల్పోబడినవని యేసు చెప్పెను. లోకముతో పంచుకోవడానికి, జోసెఫ్‌కు ఈ సత్యాలను బోధించడానికి ఆయన దేవదూతలను పంపుతానని చెప్పారు.
పరిశుద్ధులు, 1:16–17
దర్శనము ముగిసిన తరువాత, జోసెఫ్ ప్రేమ, సంతోషంతో నింపబడ్డాడు. అతడు ఇక కలవరపడలేదు. దేవుడు అతడిని ప్రేమిస్తున్నారని అతనికి తెలుసు. పరలోక తండ్రిని మరియు యేసు క్రీస్తును అతడు చూసానని చెప్పినందుకు కొందరు జనులు అతడిని ద్వేషించినప్పటికినీ, అది సత్యమని జోసెఫ్‌కు తెలుసు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:20–26; పరిశుద్ధులు, 1:16