“ఎలైజా ఏబుల్,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“ఎలైజా ఏబుల్,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1838
ఎలైజా ఏబుల్
విశ్వాసము మరియు ధైర్యము గల సువార్తసేవ
ప్రభువు ఎలైజా ఏబుల్ అనే వ్యక్తిని సువార్తికునిగా పిలిచారు. యునిస్ మరియు చార్లెస్ ఫ్రాంక్లిన్‌లకు ఎలైజా యేసు క్రీస్తు యొక్క సువార్త గురించి బోధించాడు. అతను వారికి మోర్మన్ గ్రంథము మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ గురించి చెప్పాడు. యునిస్ మరియు చార్లెస్ అతను బోధించిన వాటిని నమ్మారు మరియు సంఘములో చేరాలని కోరుకున్నారు. ఎలైజా వారికి బాప్తిస్మం ఇచ్చాడు.
Saints, 1:316
ఎలైజా మరొక పట్టణంలో సువార్త పంచుకోవడానికి బయలుదేరాడు. కొన్ని నెలల తర్వాత, ఒక రాత్రి, అతను తన స్నేహితురాలు యునిస్ గురించి కలగన్నాడు. కలలో, మోర్మన్ గ్రంథము నిజమని లేదా జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త అని ఇకపై యునిస్‌కు ఖచ్చితంగా తెలియదు. ఎలైజా మేల్కొన్నప్పుడు, అతను యునిస్‌ను కలవడానికి వెంటనే తిరిగి వచ్చాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 75:27; Saints, 1:315–16
యునిస్ తన గుమ్మంలో ఎలైజాను చూసి ఆశ్చర్యపోయింది! ఎలైజా కల సరైనదే: యునిస్ ఇకపై మోర్మన్ గ్రంథమును లేదా జోసెఫ్ స్మిత్‌ను నమ్మలేదు.
Saints, 1:317
అతను పాఠశాలలో బోధించినప్పుడు వినడానికి రమ్మని ఎలైజా యునిస్‌ను కోరాడు. ఆమె ఎలైజా మాటలు విన్నప్పుడు, ఆమె మళ్లీ పరిశుద్ధాత్మను అనుభవించింది. సువార్త నిజమని ఆమెకు తెలుసు!
Saints, 1:317
రెండు వారాల్లో మళ్లీ బోధించడానికి వస్తానని యునిస్‌కు ఎలైజా వాగ్దానం చేసాడు. అయితే ఆ ఊరిలో కొంతమంది అతను తిరిగి రావడానికి ఇష్టపడలేదు. ఎలైజా వెళ్లిపోయిన తర్వాత, అతను జనులను చంపాడని వారు అందరికీ చెప్పడం ప్రారంభించారు. అతడిని కనిపెట్టిన వారికి బహుమానం ప్రకటించారు.
Saints, 1:318
జనులు ఎలైజా గురించి అబద్ధాలు చెబుతున్నారని యునిస్‌కు తెలుసు. అతను ఎవరినీ చంపలేదు. అతను మంచి వ్యక్తి మరియు దేవుని సేవకుడు. వారి అబద్ధాలు ఎలైజా బోధించడానికి తమ పట్టణానికి రాకుండా ఆపలేవని ఆమెకు తెలుసు. ఎలైజా తిరిగి వస్తాడని యునిస్ జనులకు చెప్పింది. “దేవుడు అతన్ని రక్షిస్తాడు,” అని ఆమె చెప్పింది.
Saints, 1:318
ఎలైజా తిరిగి వచ్చాడు. అతను ఇంతకు ముందు బోధించిన పాఠశాలకే వచ్చాడు. అతడిని ఖైదు చేయాలని కోరుకున్న జనంతో అది కిక్కిరిసిపోయింది. ఎలైజా జనసమూహం ముందు నిలబడ్డాడు. వారు అతన్ని ఖైదు చేయాలనుకుంటే, అతడు బోధించడం ప్రారంభించకముందే చేయాలని అతడు చెప్పాడు. లేకపోతే, వారు అతడిని బోధించనివ్వాలి.
Saints, 1:318
ఎవరూ కదలలేదు. ఎలైజా వేచి ఉన్నాడు, కానీ జనులు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎలైజా ఒక కీర్తన పాడాడు, ప్రార్థన చేసాడు మరియు యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధించాడు. దేవుని శక్తి అతనితో ఉంది. అతను బోధించడం పూర్తి చేసిన తర్వాత, అతను తన స్నేహితులు యునిస్ మరియు చార్లెస్‌లతో మాట్లాడి, శాంతియుతంగా తన సువార్తసేవను కొనసాగించాడు.
Saints, 1:319