“లిబర్టీ చెరసాల,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“లిబర్టీ చెరసాల,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1838 అక్టోబరు–1839 మార్చి
లిబర్టీ చెరసాల
కష్ట సమయాల్లో ప్రభువును కనుగొనుట
మిస్సోరిలో నివసించిన చాలా మందికి పరిశుద్ధులు అంటే ఇష్టం లేదు. గవర్నర్ సైనికులను పంపి వారిని వెళ్ళగొట్టాడు. సైనికులు పరిశుద్ధులను వారి ఇళ్ల నుండి తరిమికొట్టారు, వారి ఇళ్ల నుండి వస్తువులను దొంగిలించారు మరియు వారిలో చాలా మందిని గాయపరిచారు.
Saints, 1:355–56, 362, 364
ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులను సైనికులు బంధించారు.
Saints, 1:357–58
తన కుటుంబంతో ఒంటరిగా కొంత సమయం గడపవచ్చా అని జోసెఫ్ అడిగారు. సైనికులు వద్దు అని అన్నారు. వారు జోసెఫ్‌ను మరియు ఇతర ఖైదీలను తీసుకెళ్లారు.
Saints, 1:366
ఒక రాత్రి, తమ కాపలాదారులు పరిశుద్ధుల పట్ల వారు చేసిన చెడు పనుల గురించి చెప్పుకుంటూ నవ్వుతుండగా జోసెఫ్ మరియు ఇతర ఖైదీలు విన్నారు. జోసెఫ్ ఇక దానిని వినడాన్ని సహించలేకపోయారు. ఆయన లేచి నిలబడి, “నిశ్శబ్దం!” అని అరిచారు. ఆయన దేవుని శక్తితో మాట్లాడారు. కాపలాదారులు భయపడ్డారు. వారు క్షమించండి అని చెప్పి, మాట్లాడడం మానేశారు.
Saints, 1:367–68
తరువాత, జోసెఫ్ మరియు ఆయన స్నేహితులను లిబర్టీ అనే పట్టణంలోని చెరసాలలో ఉంచారు. చెరసాల చాలా చల్లగా, చిన్నగా మరియు చీకటిగా ఉంది. వారి దగ్గర పడుకోవడానికి కొంత మురికి గడ్డి మాత్రమే ఉంది. అక్కడ కొంచెం ఆహారం మాత్రమే ఉంది మరియు అది వారిని అనారోగ్యానికి గురి చేసింది.
Saints, 1:369–70, 374, 384–85
జోసెఫ్ పరిశుద్ధుల గురించి చాలా ఆలోచించారు. ఆయన వారిని ప్రేమించారు. ఆయన వారి గురించి ఆందోళన చెందారు. కానీ వారికి సహాయపడేందుకు ఆయన ఏమీ చేయలేకపోయారు.
Saints, 1:385–86
జోసెఫ్ చాలా ప్రార్థించారు. ఆయన ఎక్కడ ఉన్నారు, పరిశుద్ధులకు ఎందుకు సహాయం చేయడం లేదని ఆయన దేవుడిని అడిగారు. దేవుడు ఆయన గురించి మరియు సంఘము గురించి మరచిపోయారా?
సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–6
దేవుడు జోసెఫ్ ప్రార్థనకు జవాబిచ్చారు. “నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక” అని ఆయన అన్నారు. అతని సవాళ్లు శాశ్వతంగా ఉండవని, అవి అతని మంచి కోసమే ఉంటాయని ఆయన జోసెఫ్‌తో చెప్పారు. యేసు క్రీస్తు ఇంకా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని దేవుడు జోసెఫ్‌కు గుర్తు చేశారు. “ఎప్పటికీ” జోసెఫ్‌తో ఉంటానని ఆయన వాగ్దానం చేశారు.