“ఇశ్రాయేలు సమాజము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“ఇశ్రాయేలు సమాజము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1833 నవంబరు–1835 ఫిబ్రవరి
ఇశ్రాయేలు సమాజము
ప్రభువును నమ్మడం నేర్చుకొనుట
మిస్సోరిలోని ఇండిపెండెన్స్‌లో నివసిస్తున్న పరిశుద్ధులకు సహాయం అవసరం. దేవుడు అడిగిన విధంగా సీయోనును నిర్మించడానికి వారు కష్టపడి పనిచేసారు. అయితే ఆ ఊరిలో కొంతమందికి వారు అక్కడ ఉండడం ఇష్టం లేదు. పరిశుద్ధులు తమ ఇళ్ళు వదిలి వెళ్ళిపోయేలా వారు చేసారు.
Saints, 1:195
జోసెఫ్ స్మిత్ కర్ట్‌లాండ్‌లో నివసిస్తున్నారు. మిస్సోరిలోని పరిశుద్ధులకు జరిగిన దానిని విని, ఆయన బాధపడ్డారు. ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఆయన ప్రార్థించారు. ఆయనతో పాటు మిస్సోరికి వెళ్ళడానికి జనులను కనుగొనమని ప్రభువు జోసెఫ్‌తో చెప్పారు. పరిశుద్ధులు వారి ఇళ్ళను తిరిగి పొందడంలో ప్రభుత్వం సహాయం చేస్తుందని వారు ఆశించారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 103:1–2, 11–20, 30–34; Saints, 1:195–96
ఆయనతో చేరడానికి సుమారు 100 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రవక్త ఈ సమూహాన్ని ఇశ్రాయేలు సమాజము అని పిలిచారు. వారు మిస్సోరిలోని పరిశుద్ధులకు సహాయపడేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
Saints, 1:197–99
బ్రిగమ్ యంగ్ మరియు అతని స్నేహితుడు హీబర్ కింబల్ ఆ సమూహంలో భాగమైయున్నారు. విల్ఫర్డ్ వుడ్రఫ్ అనే యువకుడు సహాయం చేయడానికి న్యూయార్క్ నుండి వచ్చాడు.
Saints, 1:197–98
అనేకమంది ఆ సమాజంతో చేరారు. వారు ఒక నెల పాటు నడిచి, విశాలమైన నదిని దాటి మిస్సోరిలోకి వచ్చారు. వారు అలసిపోయి, నొప్పితో ఉన్నారు. ఈ సుదీర్ఘ నడక కొంతమందిని నిరాశకు గురిచేసింది. ఇండిపెండెన్స్ నగరానికి చేరుకోవడానికి వారు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
Saints, 1:200–201
వారు ముందుకు సాగుతుండగా, ఒక స్త్రీ వారిని పిలిచింది. కొంతమంది పురుషులు వారిని చంపడానికి వస్తున్నారని ఆమె చెప్పింది.
Saints, 1:203
ఇశ్రాయేలు సమాజం ఆ రాత్రి ఒక నది పైన ఉన్న కొండపై ఆగింది. వారు గుడారాలు వేసినప్పుడు, ఐదుగురు పురుషులు గుర్రాలపై వారి వద్దకు వచ్చారు. సమాజంపై దాడి చేయడానికి మరో 300 మంది వస్తున్నారని వారు గొప్పలు చెప్పుకున్నారు. ఇశ్రాయేలు సమాజానికి చెందిన చాలా మంది సభ్యులు ఆందోళన చెందారు. దేవుడు వారికి సహాయం చేస్తారని నమ్మమని జోసెఫ్ వారికి చెప్పారు.
Saints, 1:203
త్వరలోనే ఆకాశం బూడిద రంగు మేఘాలతో నిండిపోయింది. భారీ వర్షం పడడం ప్రారంభమైంది. నది మరింత లోతుగా మారింది. గాలి చెట్లను కూల్చివేసింది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. జోసెఫ్ మరియు ఇతరులు సురక్షితంగా ఉండడానికి ఒక చిన్న సంఘ భవనాన్ని కనుగొన్నారు. వారు రాత్రంతా కీర్తనలు పాడారు. “ఈ తుఫానులో దేవుడు ఉన్నాడు!” అని జోసెఫ్ అన్నారు.
Saints, 1:203–4
వారిపై దాడి చేయాలనుకున్న జనులను తుఫాను ఆపివేసింది. సమాజం సురక్షితంగా ఉంది. కానీ ప్రభుత్వం పరిశుద్ధులకు సహాయం చేయబోమని చెప్పింది. ఇశ్రాయేలు సమాజం ఇంటికి వెళ్ళవచ్చని ప్రభువు జోసెఫ్‌తో చెప్పారు. పరిశుద్ధులు దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా సీయోనును నిర్మించాలి. తాను “సీయోను యొక్క యుద్ధములు పోరాడతానని” ఆయన వాగ్దానం చేసారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 105:1–19; Saints, 1:204–5
సమాజంలోని కొంతమంది సభ్యులు దీనిని విన్నప్పుడు కలత చెందారు. సీయోను కోసం పోరాడడానికి తమకు అవకాశం లభించలేదని వారు బాధపడ్డారు. ఇశ్రాయేలు సమాజం విఫలమైందని కొంతమంది భావించారు. కానీ బ్రిగమ్ యంగ్, హీబర్ మరియు విల్ఫర్డ్ వంటి ఇతరులు, ప్రవక్త జోసెఫ్‌తో కలిసి ఉండి ఆయన నుండి నేర్చుకునే అవకాశం లభించినందుకు కృతజ్ఞతతో ఉన్నారు.
Saints, 1:205–6
తరువాత, ఆయన సంఘాన్ని నడిపించడానికి పన్నెండుమంది అపొస్తలులను పిలవమని ప్రభువు జోసెఫ్ స్మిత్‌తో చెప్పారు. అపొస్తలులు ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తు నామానికి ప్రత్యేక సాక్షులుగా ఉంటారు. పన్నెండుమంది అపొస్తలులలో ఎనిమిది మంది ఇశ్రాయేలు సమాజంలో నడిచారు. జోసెఫ్‌తో కలిసి సేవ చేయడం వారిని ఈ ముఖ్యమైన పిలుపుకు సిద్ధం చేయడంలో సహాయపడింది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 18:26–27; 107:23; Saints, 1:214–17