“సాక్షులు మోర్మన్ గ్రంథము యొక్క పలకలను చూచెను,” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)
“సాక్షులు మోర్మన్ గ్రంథము యొక్క పలకలను చూచెను,” సిద్ధాంతము మరియు నిబంధనలు
1829 మార్చి–సెప్టెంబరు
సాక్షులు మోర్మన్ గ్రంథము యొక్క పలకలను చూచెను
లోకమునకు సాక్ష్యము వహించుట
జోసెఫ్, ఎమ్మా, మరియు ఆలీవర్‌లు పెన్సిల్వేనియాలోని స్మిత్ గృహములో బంగారు పలకలను అనువదించడం కొనసాగించారు. కానీ వారి పట్టణములోని జనులు వారిని ఆపాలనుకున్నారు. ఆలీవర్‌కు డేవిడ్ విట్‌మర్ అనే పేరుగల స్నేహితుడున్నాడు, అతడు న్యూయార్క్‌లో నివసించాడు. అనువాదము పూర్తి చేయడానికి వారు విట్‌మర్ కుటుంబంతో ఉండటానికి వెళ్లవచ్చా అని ఆలీవర్ డేవిడ్‌ను అడిగాడు.
పరిశుద్ధులు, 1:68
డేవిడ్ మరియు అతని కుటుంబము సమ్మతించింది. జోసెఫ్, ఎమ్మా, మరియు ఆలీవర్‌లను తమ ఇంటిలోనికి వారు ఆహ్వానించారు. ఇప్పుడు వారు శాంతముగా అనువాదం పనిని చేయగలరు. విట్‌మర్ ఇంటిలో అనేకమంది జనులు నివసిస్తున్నారు. దాని అర్ధము, చేయడానికి చాలా పని ఉంది అని, ప్రత్యేకంగా డేవిడ్ యొక్క తల్లి మేరీకి.
పరిశుద్ధులు, 1:68–70
ఒకరోజు, మేరీ పని చేస్తుండగా, మొరోనై దూత ఆమెను దర్శించాడు. అదనపు పనంతా ఆమెను అలసిపోయేలా చేస్తుందని తనకు తెలుసని అతడు చెప్పాడు. అతడు ఆమె విశ్వాసాన్ని బలపరచాలనుకున్నాడు. అతడు సంచి తెరచి, బంగారు పలకలను బయటకు తీసాడు. అతడు పేజీలను తెరిచి, వ్రాతలను మేరీకు చూపించాడు. ఆమె దీవించబడుతుందని అతడు మేరీకి వాగ్దానమిచ్చాడు.
పరిశుద్ధులు, 1:70–71
పలకలు నిజమైనవని కొందరు జనులు నమ్మలేదు. పలకలు ఎవరికీ చూపించరాదన్న ప్రభువు ఆజ్ఞకు జోసెఫ్ విధేయుడయ్యాడు. మరో ముగ్గురు సాక్షులను పలకలను చూసేందుకు అనుమతిస్తానని ప్రభువు చెప్పారు. వారు సాక్షులుగా ఉండవచ్చా అని డేవిడ్ విట్‌మర్, మార్టిన్ హార్రిస్, మరియు ఆలీవర్ కౌడరీలు అడిగారు. వారలా ఉండవచ్చని ప్రభువు చెప్పారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 5:11–12; 17; పరిశుద్ధులు, 1:73
జోసెఫ్, మార్టిన్, ఆలీవర్, మరియు డేవిడ్ చెట్ల పొదలలోనికి వెళ్ళారు. వారు మోకరించి, పలకలను చూడవచ్చా అని ఒకరి తరువాత ఒకరు దేవుడిని అడిగారు, కానీ ఏమీ జరగలేదు.
పరిశుద్ధులు, 1:73
వారి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం తానేనని మార్టిన్ హార్రిస్ భావించాడు. మార్టిన్ వెళ్ళాడు, మరియు మిగిలిన వారు ప్రార్థించడం కొనసాగించారు.
పరిశుద్ధులు, 1:73
తరువాత ఒక దేవదూత ఒక ప్రకాశవంతమైన కాంతిలో కనిపించాడు. అతడు ఆలీవర్‌కు మరియు డేవిడ్‌కు బంగారు పలకలను మరియు వాటిపై వ్రాతను చూపించాడు. జోసెఫ్ పలకలను దేవుని యొక్క శక్తి చేత అనువదించాడని, ఆ అనువాదము సరైనదని చెప్పిన స్వరాన్ని వారు విన్నారు. వారు చూసిన మరియు విన్న దానిని ప్రతి ఒక్కరికి చెప్పమని కూడా దేవుడు చెప్పారు.
“ముగ్గురు సాక్షుల సాక్ష్యము”; పరిశుద్ధులు, 1:73–74
మార్టిన్‌ను వెదకడానికి జోసెఫ్ వెళ్ళాడు. అతడు ఇంకా ప్రార్థిస్తున్నాడు. జోసెఫ్ అతనితోపాటు ప్రార్థించాడు. తరువాత దేవదూత ప్రత్యక్షమయ్యాడు, అతడు ఆలీవర్‌కు మరియు డేవిడ్‌కు చూపినట్లుగా మార్టిన్‌కు పలకలను చూపించాడు.
పరిశుద్ధులు, 1:74
తరువాత, మేరి విట్‌మర్‌ను సందర్శిస్తున్న తన తల్లిదండ్రులను చూడటానికి జోసెఫ్ వెళ్లాడు. ఇతరులు పలకలను చూసినందుకు తాను ఎంత సంతోషంగా ఉన్నాడో వారికి చెప్పాడు. జోసెఫ్ చెప్పేది సత్యమని ఇప్పుడు సాక్షులు జనులకు చెప్పగలరు. సాక్షులలో ఒకరిగా తనను దేవుడు అనుమతించినందుకు తాను ఎంత సంతోషంగా ఉన్నాడో మార్టిన్ ప్రతిఒక్కరికి చెప్పాడు.
పరిశుద్ధులు, 1:74–75
కొన్ని రోజులు తరువాత, మరో ఎనిమిదిమంది జనులకు బంగారు పలకలను చూపుతానని ప్రభువు జోసెఫ్‌కు చెప్పారు—అతని తండ్రి, అతని సోదరులలో ఇద్దరు, డేవిడ్ యొక్క సోదరులలో నలుగురు మరియు డేవిడ్ యొక్క బావ. వారు పలకలను పట్టుకొన్నారు మరియు పేజీలను తిప్పారు. పలకలు నిజమని వారికి తెలుసు.
“ఎనిమిదిమంది సాక్షుల సాక్ష్యము”; పరిశుద్ధులు, 1:75
మోర్మన్ గ్రంథ అనువాదము ఇప్పుడు పూర్తి చేయబడింది. జోసెఫ్ బంగారు పలకలను మొరోనై దేవదూతకు తిరిగి ఇచ్చాడు. గ్రంథ ప్రతులను ముద్రించడానికి ఇదే సమయం, ఆవిధంగా ప్రతిఒక్కరు దానిని చదవగలరు మరియు యేసు క్రీస్తు గురించి నేర్చుకోగలరు.
పరిశుద్ధులు, 1:75–76
మోర్మన్ గ్రంథమును ముద్రించడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. దానిని చెల్లించడం కొరకు మార్టిన్ తన పొలంలో కొంత భాగాన్ని వదులుకున్నాడు. మోర్మన్ గ్రంథము సత్యమని అతనికి తెలుసు కనుక అతడు ఇదంతా చేసాడు. గ్రంథము యొక్క ప్రతీ ప్రతిలో అందరూ చదవడానికి మార్టిన్ మరియు ఇతర సాక్షుల సాక్ష్యం ఉంటుంది. సాక్షులు వారి సాక్ష్యమును ఎన్నడూ నిరాకరించలేదు.
సిద్ధాంతము మరియు నిబంధనలు19:26–27, 34–35; పరిశుద్ధులు, 1:76–78