“శామ్యుల్ స్మిత్ మోర్మన్ గ్రంథమును పంచుకొనును,” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)
“శామ్యుల్ స్మిత్ మోర్మన్ గ్రంథమును పంచుకొనును,” సిద్ధాంతము మరియు నిబంధనలు
1830–1832
శామ్యుల్ స్మిత్ మోర్మన్ గ్రంథమును పంచుకొనును
ఒక గ్రంథము అనేక జీవితాలను దీవించును
ప్రభువు, జోసెఫ్ చిన్న తమ్ముడైన శామ్యుల్ స్మిత్‌ను సువార్తను పంచుకోవడానికి ఒక మిషనుపై పిలిచారు. జాన్ మరియు రోఢా గ్రీన్‌ను శామ్యుల్ స్మిత్ కలుసుకొని, మోర్మన్ గ్రంథము గురించి వారికి చెప్పాడు. జాన్ మరొక సంఘంలో ఒక బోధకుడిగా ఉన్నాడు. అతడు గ్రంథము యొక్క ఒక ప్రతిని తీసుకొని, తన సంఘంలో ఎవరైనా దానిని చదవడానికి ఇష్టపడతారేమో చూస్తానని అతడు చెప్పాడు.
పరిశుద్ధులు, 1:99
కొన్ని నెలలల తరువాత, శామ్యుల్ తిరిగి వచ్చాడు. మోర్మన్ గ్రంథమును చదవడానికి ఇష్టపడిన వారెవ్వరూ తన భర్తకు కనబడలేదని రోఢా చెప్పింది. ఆమె దానిని శామ్యుల్‌కు తిరిగి ఇచ్చివేసింది.
పరిశుద్ధులు, 1:99
శామ్యుల్ విచారించాడు. అతడు వెళ్లిపోవడానికి తిరిగాడు, కానీ రోఢా అతడిని ఆపింది. తాను మోర్మన్ గ్రంథాన్ని చదివానని, దానిని ఆమె ఇష్టపడిందని ఆమె చెప్పింది.
పరిశుద్ధులు, 1:99
రోఢాకు గ్రంథాన్ని తిరిగి ఇవ్వమని పరిశుద్ధాత్మ శామ్యుల్‌కు చెప్పింది. “మీకు ఒక సాక్ష్యమును ఇవ్వమని దేవునిని అడగండి,” అని శామ్యుల్ ఆమెతో చెప్పాడు. పరిశుద్ధాత్మ గురించి మరియు మోర్మన్ గ్రంథము సత్యమని ఎలా తెలుసుకోవచ్చో అతడు రోఢాకు బోధించాడు.
మొరోనై 10:3–5; పరిశుద్ధులు, 1:99–100
శామ్యుల్ తన మిషను నుండి తిరిగి వచ్చాడు. అతడు ఎవరికీ బాప్తీస్మమివ్వలేదు, మరియు కేవలం కొద్దిమంది మాత్రమే మోర్మన్ గ్రంథమునందు ఆసక్తి చూపారు.
రోఢా మరియు జాన్ ప్రార్థించారు, మోర్మన్ గ్రంథము సత్యమని పరిశుద్ధాత్మ వారికి చెప్పింది. తరువాత రోఢా తన సోదరుడు బ్రిగమ్ యంగ్‌తో మోర్మన్ గ్రంథమును పంచుకొన్నది.
పరిశుద్ధులు, 1:100
బ్రిగమ్ యంగ్ మరియు అతని స్నేహితుడు హెబర్ కింబల్, యేసు యొక్క నిజమైన సంఘము కోసం వెదకుతున్నారు. వారు మోర్మన్ గ్రంథాన్ని చదివారు. యేసు క్రీస్తు యొక్క సువార్త గురించి వారు దాదాపు రెండు సంవత్సరాలు అధ్యయనం చేసారు మరియు ప్రార్థించారు.
ఆ సమయమందు, బ్రిగమ్ మరియు హెబర్ తమ కుటుంబాలతో సంఘ సమావేశాలకు వెళ్ళారు. ఈ సమావేశాలలో ఒక దానిలో, ఒక మిషనరీ తన సాక్ష్యమును చెప్పడం బ్రిగమ్ యంగ్ విన్నాడు. ఆ మిషనరీ గొప్ప ప్రసంగీకుడు కాదు, కానీ అతడు మాట్లాడినప్పుడు బ్రిగమ్ పరిశుద్ధాత్మను అనుభవించాడు. అతడు చెప్పుచున్నది సత్యమని బ్రిగమ్‌కు తెలుసు.
బ్రిగమ్, హెబర్ మరియు వారి భార్యలైన మిరియమ్, విలేట్‌లు బాప్తీస్మము పొందారు. వారు రక్షకుడిని మరియు ఆయన సువార్తను ప్రేమించారు. సంవత్సరాల తరువాత, ప్రభువు బ్రిగమ్ మరియు హెబర్‌లను తను అపొస్తులులుగా ఉండటానికి మరియు సేవ చేయడానికి పిలిచారు. శామ్యుల్ మోర్మన్ గ్రంథమును పంచుకొన్నాడు కనుక, అనేకమంది జనులు రక్షకుని సంఘములో చేరారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:127–29; 126; పరిశుద్ధులు, 1:215–16