“స్థానిక అమెరికన్లకు ఒక మిషను,” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)
“స్థానిక అమెరికన్లకు ఒక మిషను,” సిద్ధాంతము మరియు నిబంధనలు
1830 అక్టోబరు–1831 జనవరి
స్థానిక అమెరికన్లకు ఒక మిషను
డెలావేర్ ఇండియన్లు సువార్తను వింటారు
పార్లీ ప్రాట్ బాప్తీస్మము పొందిన వెంటనే, ప్రభువు అతడిని ఒక మిషనుపై ఆలీవర్ కౌడరీ మరియు ఇతరులతో చేరమని పిలిచారు. స్థానిక అమెరికన్లకు సువార్తను ప్రకటించాలని ఆయన వారిని కోరారు. అనేక వారాలు లోతైన మంచు గుండా సువార్తికులు ప్రయాణించారు. చివరికి, వారు డెలావేర్ ఇండియన్ల ముఖ్య నాయకుడు కిక్తావేనుండ్‌ను కలిసారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 28:14; 30:5–6; 32; పరిశుద్ధులు, 1:98, 115
ముఖ్య నాయకుడు మిషనరీలతో స్నేహపూర్వకంగా ఉన్నాడు. వారి సందేశమును వినడానికి తన స్నేహితులను అతడు ఆహ్వానించాడు. వారికి మోర్మన్ గ్రంథమును తేవడానికి అతడు మరియు పార్లీ చాలా దూరం ప్రయాణించారని ఆలీవర్ చెప్పాడు. అది చాలాకాలం క్రితం అమెరికాలో నివసించిన జనులను గూర్చి చెప్పును. ప్రతిఒక్కరు యేసు క్రీస్తు గురించి తెలుసుకోగలుగునట్లు గ్రంథమును పంచుకోమని దేవుడు వారిని కోరాడు.
పరిశుద్ధులు, 1:115–16
ఆలీవర్ మోర్మన్ గ్రంథ ప్రతిని కిక్తావేనుండ్‌కు ఇచ్చాడు. ఆలీవర్ మరియు అతని స్నేహితులు తన జనులతో దానిని పంచుకోవడానికి ఇంత దూరం వచ్చినందుకు అతడు కృతజ్ఞతను కలిగియున్నాడు. ఆలీవర్ మరియు పార్లీ తిరిగి వచ్చి వారికి మోర్మన్ గ్రంథమును చదవాలని, మరి ఎక్కువగా వారికి బోధించాలని తాను కోరుతున్నానని అతడు వారికి చెప్పాడు.
పరిశుద్ధులు, 1:116–17