లేఖన కథలు
ఎమ్మా కోసం బయల్పాటు


“ఎమ్మా కోసం బయల్పాటు,” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)

“ఎమ్మా కోసం బయల్పాటు,” సిద్ధాంతము మరియు నిబంధనలు

1830 జూలై

2:51

ఎమ్మా కోసం బయల్పాటు

ఆయన పని చేయడానికి ప్రభువు చేత ఎంపిక చేయబడింది

జోసెఫ్ ఎమ్మాకు వీడ్కోలు చెప్తూ తన చేతిని ఊపాడు.

ఎమ్మా, జోసెఫ్‌లకు జీవితం చాలా త్వర త్వరగా మారుతోంది. జోసెఫ్ పొలం పనిపై దృష్టిసారించడం మానేయ్యాలని ప్రభువు అతనితో చెప్పారు. బదులుగా, జోసెఫ్ తన సమయాన్ని జనులకు యేసు క్రీస్తు గురించి బోధించడానికి మరియు ప్రభువు యొక్క సంఘమును అభివృద్ధి చేయడానికి సహాయపడాలి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 24:7–9; పరిశుద్ధులు, 1:96

జోసెఫ్‌ వెళుతున్నప్పుడు ఎమ్మా కిటికీలో నుండి చూస్తుంది.

ఈ మార్పు గురించి ఎమ్మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. జోసెఫ్ ప్రభువుకు సేవ చేస్తూండగా తాను ఏమీ చేయాలో ఆమెకు తెలియలేదు. ప్రభువుకు మరియు ఆయన సంఘానికి ఆమె కూడా సహాయపడాలా?

పరిశుద్ధులు, 1:96

ఎమ్మా మరియు జోసెఫ్ నవ్వుతున్నారు.

జోసెఫ్‌కు ఇవ్వబడిన ఒక బయల్పాటు ద్వారా ఎమ్మాతో ప్రభువు మాట్లాడారు. “ఎమ్మా స్మిత్, నా కుమార్తె,” అని ఆయన పిలిచారు. ఆయన ఆమెను ఏర్పరచుకున్నానని మరియు ఆయన పనిని చేయడానికి ఆమెను పిలిచానని ఎమ్మాకు చెప్పారు. ఆమె ప్రత్యేకమైన స్త్రీ, మరియు ఆమె చేయాల్సిన గొప్ప పనులను ఆయన కలిగియున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 25:1–3

ఎమ్మా సువార్తను పంచుకొంటున్నది.

జోసెఫ్‌తో కలిసి ప్రయాణించమని ప్రభువు ఎమ్మాను అడిగారు. ఎమ్మా లేఖనాలను సంఘ సభ్యులకు వివరించాలని మరియు బోధించాలని ప్రభువు చెప్పారు. ఆమె జీవితంలో ఆయనకు ప్రాధాన్యతనిమ్మని మరియు నిబంధనలను పాటించమని ఆయన ఎమ్మాకు చెప్పారు. ఆయన ఆత్మను కలిగియుంటుందని ఎమ్మాకు ఆయన వాగ్దానమిచ్చారు. ఆమె నేర్చుకొని, వృద్ధి చెంది మరియు ఆయన దీవెనలు పొందాలని ఆయన కోరారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 25:12, 6–10, 15

ఒక సంఘ సమావేశంలో ఎమ్మా ఒక కీర్తనను నడిపిస్తున్నది.

తన పిల్లలు పాడటాన్ని వినుట ఆయనకు చాలా ఇష్టమని కూడా ప్రభువు ఎమ్మాకు చెప్పారు. పరిశుద్ధుల యొక్క పాటలు ఆయనకు ప్రార్థన వలె ఉన్నాయని ఆయన చెప్పారు. పరిశుద్ధులు కలిసి పాడగల కీర్తనల పుస్తకాన్ని తయారు చేయమని ఆయన ఎమ్మాను అడిగారు. ప్రభువు మరియు ఆయన సువార్త గురించి అనేక అందమైన పాటలను ఎమ్మా కనుగొని, వాటిని ఒక కీర్తన పుస్తకంగా చేసింది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 25:11–12; పరిశుద్ధులు, 1:221–22

జోసెఫ్, ఎమ్మాలు పొరుగు వారికి చేతులు ఊపుతున్నారు.

ఎమ్మా మరియు జోసెఫ్ యొక్క జీవితం మారటం కొనసాగింది, అయితే ప్రభువు తనను ప్రేమిస్తున్నారని, తన కోసం ఒక ఉద్దేశాన్ని కలిగియున్నారని ఎమ్మాకు తెలుసు. ఆమె ప్రభువుకు, తన చుట్టూ ఉన్న జనులకు సేవ చేసింది. ఆమె యేసు యొక్క సంఘము అభివృద్ధి చెందడానికి సహాయపడింది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 25:13–15; పరిశుద్ధులు, 1:221–23