లేఖన కథలు
మృతుల కొరకు బాప్తిస్మము గురించి పరిశుద్ధులు నేర్చుకుంటారు


“మృతుల కొరకు బాప్తిస్మము గురించి పరిశుద్ధులు నేర్చుకుంటారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“మృతుల కొరకు బాప్తిస్మము గురించి పరిశుద్ధులు నేర్చుకుంటారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1840 ఆగష్టు–అక్టోబరు

2:28

మృతుల కొరకు బాప్తిస్మము గురించి పరిశుద్ధులు నేర్చుకుంటారు

బాప్తిస్మము పొందని కుటుంబ సభ్యుల కొరకు నిరీక్షణ

జోసెఫ్ స్మిత్ మాట్లాడుతున్న ఒక అంత్యక్రియల సభలో జేన్ నేమన్.

జేన్ నేమన్ నావూలో నివసించేది. జోసెఫ్ స్మిత్ మాట్లాడుతున్న ఒక అంత్యక్రియల సభకు ఆమె వెళ్ళింది. ఆ సభ, ఆమె కొడుకు సైరస్ గురించి ఆమెను ఆలోచింపజేసింది. అతను చనిపోయాడు మరియు బాప్తిస్మం పొందలేదు. సైరస్ గురించి జేన్ ఆందోళన చెందింది. పరలోక తండ్రితో జీవించడానికి మనం బాప్తిస్మం పొందాలని ఆమెకు తెలుసు.

Saints, 1:421

ఆల్విన్ స్మిత్ సమాధి ముందు మోకరించిన జోసెఫ్.

ఆమె ఎలా భావించిందో జోసెఫ్‌కు తెలుసు. బాప్తిస్మము తీసుకోకుండానే మరణించిన తన అన్న ఆల్విన్ గురించి జోసెఫ్ అదే విధంగా ఆందోళన చెందాడు.

Saints, 1:421

మృతుల కొరకు బాప్తిస్మము గురించిన బోధనను పరిచయం చేస్తున్న జోసెఫ్.

అంత్యక్రియల సభలో, దేవుడు తనకు బోధించిన దానిని జోసెఫ్ పంచుకున్నాడు. బాప్తిస్మము పొందకుండా ఎవరైనా మరణించినట్లయితే, మనం వారి కోసం బాప్తిస్మం పొందవచ్చని అతను చెప్పాడు.

Saints, 1:421

తన కొడుకు కోసం బాప్తిస్మం పొందుతున్న జేన్.

ఇది విని జేన్ చాలా సంతోషించింది! అంత్యక్రియల తర్వాత వెంటనే, ఆమె సంఘము యొక్క ఒక ఎల్డర్‌తో కలిసి నది వద్దకు వెళ్ళింది. సైరస్ కోసం అతను ఆమెకు బాప్తిస్మం ఇచ్చాడు.

Saints, 1:421

మృతుల కొరకు బాప్తిస్మము గురించి ఎక్కువ మంది పరిశుద్ధులకు బోధిస్తున్న జోసెఫ్.

కొన్ని వారాల తర్వాత, జోసెఫ్ మృతుల కొరకు బాప్తిస్మము గురించి ఇంకా ఎక్కువగా పరిశుద్ధులకు బోధించాడు. మరణించిన వారిలో అనేకమంది బాప్తిస్మము పొందాలనుకుంటున్నారని అతను చెప్పాడు. వారు యేసు క్రీస్తును అనుసరించాలని కోరుకుంటున్నారు. ఇంకా బ్రతికియున్న వారి కుటుంబ సభ్యులు వారి కోసం బాప్తిస్మం పొందుతారని అనుకుంటూ వారు ఎదురుచూస్తున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 128:15–19; Saints, 1:423

మృతుల కొరకు బాప్తిస్మము పొందుతున్న పరిశుద్ధులు.

పరిశుద్ధులు వెంటనే నది దగ్గరికి వెళ్ళారు. వారు ప్రేమించిన వారి కోసం బాప్తిస్మం పొందారు. ఆల్విన్ కోసం హైరం స్మిత్ బాప్తిస్మం పొందాడు. తర్వాత, మృతుల కొరకు బాప్తిస్మము దేవాలయంలో ఇవ్వబడాలని, ప్రతి బాప్తిస్మము గురించి ఎవరైనా వ్రాసియుంచాలని మరియు మగవారి కోసం మగవారు, ఆడవారి కోసం ఆడవారు బాప్తిస్మం పొందాలని ప్రభువు బోధించారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:29–32; 127:5–12; 128:1–9; Saints, 1:424