లేఖన కథలు
సిద్ధాంతము మరియు నిబంధనలు గురించి


“సిద్ధాంతము మరియు నిబంధనలు గురించి,” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)

“సిద్ధాంతము మరియు నిబంధనలు గురించి,” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)

పరిచయము

2:39

సిద్ధాంతము మరియు నిబంధనలు గురించి

ప్రభువు మరలా మాట్లాడతారు

ప్రాచీన అమెరికాలోని జనులకు యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యారు.

మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయనతో మనం నిబంధనలు, లేదా వాగ్దానాలు చేయాలని ఆయన కోరుతున్నారు, ఆవిధంగా ఆయన మనల్ని దీవించగలరు. మన రక్షకునిగా ఉండటానికి మరియు ఆయన వద్దకు తిరిగి వెళ్ళడానికి మనకు సహాయపడటానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును పంపారు.

ఒక ప్రాచీన ప్రవక్త ఒక కాగితపు చుట్టపై వ్రాస్తున్నాడు.

యేసు క్రీస్తు మరియు ఆయన ఆజ్ఞలు గురించి మనకు బోధించడానికి దేవుడు ప్రవక్తలను కూడా పంపుతారు. ప్రవక్తలు యేసు క్రీస్తుకు సేవ చేస్తారు మరియు ఆయన సంఘాన్ని నడిపించడానికి సహాయపడతారు.

మోషే పది ఆజ్ఞలను పట్టుకొనియున్నాడు.

మనకు ఏమి బోధించాలో యేసు ప్రవక్తలకు చెప్తారు. చాలా కాలం క్రితం బైబిలు మరియు మోర్మన్ గ్రంథము వంటి లేఖనాలలో ప్రవక్తల మాటలు వ్రాయబడినవి.

జోసెఫ్ స్మిత్ ఏ మత సంప్రదాయాన్ని అనుసరించాలో ఆలోచిస్తున్నాడు.

యేసు భూమిపైన ఉన్న తరువాత అనేక సంవత్సరాల వరకు, ప్రవక్తలు లేరు. జనులు దేవునితో నిబంధనలు చేసి, పాటించడంలేదు. యేసు క్రీస్తు యొక్క సంఘము భూమి మీద లేదు.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమయ్యారు.

అయితే దేవుడు జోసెఫ్ స్మిత్‌ను ఒక ప్రవక్తగా ఉండమని పిలిచారు. జోసెఫ్ కేవలం చిన్న బాలుడు, కానీ దేవుడు అతడికి చాలా ముఖ్యమైన పనిని కలిగి ఉన్నాడు.

సంఘ నాయకులుగా జోసెఫ్, ఆలీవర్‌లను ఆమోదించటానికి జనులు వారి చేతులను పైకెత్తారు.

జోసెఫ్ స్మిత్ యేసు గురించి బోధించాడు. అతడు యేసు యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడానికి సహాయపడ్డాడు. యేసు తన సువార్తను మరియు ఆయన సంఘాన్ని ఎలా నడిపించాలో జోసెఫ్ స్మిత్‌కు బోధించారు.

ఒక కుటుంబం సిద్ధాంతము మరియు నిబంధనలు చదువుతున్నారు.

యేసు జోసెఫ్ స్మిత్‌కు చెప్పిన అనేక విషయాలు సిద్ధాంతము మరియు నిబంధనలలో వ్రాయబడినవి. బైబిలు మరియు మోర్మన్ గ్రంథము వలె సిద్ధాంతము మరియు నిబంధనలు కూడా లేఖన గ్రంథము.

సిద్ధాంతము మరియు నిబంధనల చేత జనులు ఎలా ప్రభావితం చెందారో చూపే దృశ్య రూప వివరణ.

సిద్ధాంతము మరియు నిబంధనల కథలు, ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఇతరుల సహాయముతో, యేసు తన సంఘాన్ని ఎలా తిరిగి తెచ్చారో లేదా ఎలా పునఃస్థాపించారో తెలుపును. సంఘ సభ్యులు పరిశుద్ధులని పిలవబడ్డారు. ఈ కథలు దేవుడు ప్రపంచమంతటా ఉన్న తన పిల్లలందరిని ప్రేమిస్తున్నారని తెలియజేస్తున్నాయి. మనం ఆయనతో నిబంధనలను చేసినప్పుడు ఆయన మనల్ని దీవించాలని కోరుతున్నారు.