“హైరమ్ పేజ్ మరియు బయల్పాటు” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)
“హైరమ్ పేజ్ మరియు బయల్పాటు” సిద్ధాంతము మరియు నిబంధనలు
1830 సెప్టెంబరు
హైరమ్ పేజ్ మరియు బయల్పాటు
ఆయన తన సంఘాన్ని ఎలా నడిపిస్తారో పరిశుద్ధులు నేర్చుకున్నారు
హైరమ్ పేజ్, జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీల స్నేహితుడు. అతడు బంగారు పలకల గురించి సాక్ష్యమును పొందిన ఎనిమిది మందిలో ఒకరు. హైరమ్ వద్ద ఒక రాయి ఉన్నది, మరియు సంఘము కోసం, అతడికి దేవుడు సందేశాలను లేదా బయల్పాటులను ఇవ్వడానికి దానిని ఉపయోగిస్తున్నాడని అతడు నమ్మాడు. ఆలీవర్ మరియు మిగిలిన పరిశుద్ధులు హైరమ్ బయల్పాటులు దేవుని నుండి వచ్చాయని నమ్మారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 28, విభాగ శీర్షిక; పరిశుద్ధులు, 1:97
హైరమ్ బయల్పాటులు లేఖనాల వలే అనిపించాయి. కానీ అవి బైబిలు బోధించిన దాని నుండి భిన్నంగా ఉన్నాయి. అవి ప్రభువు, ప్రవక్త జోసెఫ్‌కు చెప్పిన దాని నుండి కూడ భిన్నంగా ఉన్నాయి. జోసెఫ్‌కు ఏమీ చేయాలో ఖచ్చితంగా తెలియదు.
పరిశుద్ధులు, 1:97
సహాయం కోసం దేవునిని అడుగుతూ జోసెఫ్ స్మిత్ రాత్రిలో చాలాసేపు మెలకువగా ఉన్నాడు. అతడు తప్పు చేస్తానేమోనని, అతని స్నేహితుని భావాలను గాయపరుస్తానేమోనని ఆందోళన చెందాడు.
పరిశుద్ధులు, 1:97
జనులు వారి స్వంత జీవితాల కోసం బయల్పాటును వెదకాలని జోసెఫ్ కోరాడు. కానీ ప్రతిఒక్కరు సంఘమంతటి కొరకు బయల్పాటు పొందడానికి ప్రయత్నిస్తే గందరగోళంగా ఉంటుంది.
పరిశుద్ధులు, 1:97
చివరిగా, ఆలీవర్‌తో పంచుకోమని ప్రభువు జోసెఫ్‌కు ఒక బయల్పాటును ఇచ్చారు. ప్రవక్త మాత్రమే మొత్తం సంఘానికి బయల్పాటును మరియు ఆజ్ఞలను పొందగలరని ప్రభువు చెప్పారు. ఆలీవర్ దీనిని హైరమ్‌కు బోధించాలని ఆయన చెప్పారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 28:2, 6–13
హైరమ్ తన స్వంత జీవితం కోసం బయల్పాటును పొందవచ్చని గ్రహించాలని ప్రభువు కోరారు. కానీ సంఘము కోసం బయల్పాటు ప్రభువు యొక్క ప్రవక్తకు వస్తుంది. హైరమ్ ఆలీవర్‌ను విన్నాడు మరియు పశ్చాత్తాపపడ్డాడు. ప్రభువు తన సంఘాన్ని ఎలా నడిపిస్తారో ఇప్పుడు పరిశుద్ధులు గ్రహించారు.
పరిశుద్ధులు, 1:98