లేఖన కథలు
పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్


“పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)

“పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్” సిద్ధాంతము మరియు నిబంధనలు

1830 ఆగష్టు–సెప్టెంబరు

3:32

పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్

ఆత్మను అనుసరించుటకు విశ్వాసము

పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్ వారి పొలములో ఉన్నారు.

పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్ ఓహైయోలో రైతులుగా ఉన్నారు. ఒకరోజు, బైబిలు గురించి జనులకు బోధించడానికి అతడి ఇంటిని విడిచి వెళ్ళమని ఆత్మ తనకు చెప్పడాన్ని పార్లీ భావించాడు.

పరిశుద్ధులు, 1:92

పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్ బైబిలు గురించి బోధించడానికి వెళుతున్నారు.

పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్ వారి పొలమును అమ్మేసారు. వారు ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు, కానీ ఆయనకు సేవ చేసినందుకు దేవుడు వారిని దీవిస్తాడని వారు నమ్మారు.

పరిశుద్ధులు, 1:92

న్యూయార్క్‌లో పడవ దిగుతున్న పార్లీ.

పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్ కొన్ని దుస్తులను, డబ్బును తీసుకొని ఒక పడవ ఎక్కారు. వారు న్యూయార్క్ గుండా ప్రయాణించినప్పుడు, పడవ దిగమని ఆత్మ పార్లీకి చెప్పింది. పార్లీ తాను లేకుండా థాంక్‌ఫుల్ ప్రాట్‌ను వెళ్ళమని అడిగాడు. ఆమె వద్దకు త్వరగా వస్తానని అతడు వాగ్దానమిచ్చాడు. న్యూయార్క్‌లో తాను ఏదో చేయాలని దేవుడు కోరుతున్నట్లు అతడు భావించాడు.

పరిశుద్ధులు, 1:92

పార్లీ మోర్మన్ గ్రంథము గురించి నేర్చుకుంటున్నాడు.

పార్లీ చాలా దూరం నడిచాడు. చివరికి అతడు ఒక బోధకుని ఇంటి వద్దకు వచ్చాడు. ఆ బోధకుడు తనకు ఎవరో ఇచ్చిన వింతైన గ్రంథము గురించి పార్లీకి చెప్పాడు. అది బంగారు పలకల నుండి వచ్చింది మరియు చాలాకాలం క్రితం వ్రాయబడింది. అది మోర్మన్ గ్రంథమని పిలవబడింది. న్యూయార్క్‌లో ఒక యువకుడు దానిని దేవుని శక్తితో అనువదించాడు.

పరిశుద్ధులు, 1:92

మోర్మన్ గ్రంథము గురించి సాక్ష్యాన్ని పొందుతున్న పార్లీ.

పార్లీ చాలా ఆసక్తిగా ఉన్నాడు. బోధకుడు పార్లీకు ఆ గ్రంథాన్ని చూపించాడు. ఉత్సాహము చెందిన పార్లీ, దానిని తెరచి చదవటం ప్రారంభించాడు. గంటలు గడిచాయి, కానీ అతడు తినడానికి, లేదా నిద్రపోవడానికి కూడ చదవడం ఆపలేదు. అది సత్యమని ప్రభువు యొక్క ఆత్మ అతనికి చెప్పింది.

పరిశుద్ధులు, 1:92–93

పార్లీ మరియు హైరమ్ స్మిత్ మోర్మన్ గ్రంథము గురించి మాట్లాడుకుంటున్నారు.

పార్లీ మోర్మన్ గ్రంథమును ఎంతగా ప్రేమించాడంటే, అతడు దానిని అనువదించిన వ్యక్తిని వెదకాలని కోరాడు. అతడు స్మిత్ కుటుంబపు పొలము వద్దకు నడిచి వెళ్ళి, అక్కడ జోసెఫ్ అన్నయైన హైరమ్‌‌ను కలిసాడు. వారు రాత్రంతా మాట్లాడుకున్నారు. మోర్మన్ గ్రంథము సత్యమని హైరమ్ పార్లీకి చెప్పాడు. అతడు పార్లీకి తన స్వంత గ్రంథాన్ని ఇచ్చాడు.

పరిశుద్ధులు, 1:93

పార్లీ మోర్మన్ గ్రంథమును చదవటం కొనసాగించాడు.

అతడు చదవటం కొనసాగించినప్పుడు, చాలా కాలం క్రితం యేసు క్రీస్తు అమెరికాలోని జనులను దర్శించాడని పార్లీ నేర్చుకున్నాడు. మోర్మన్ గ్రంథము లోకంలోని సంపదలన్నిటి కంటే ఎక్కువ విలువైనదని పార్లీ చూడగలిగాడు. అతడు థాంక్‌ఫుల్ వద్దకు తిరిగి వెళ్ళి, తాను నేర్చుకొన్న దానిని ఆమెతో పంచుకునే వరకు అతడు వేచి ఉండలేకపోయాడు.

పరిశుద్ధులు, 1:93; 3 నీఫై 11:1–12

థాంక్‌ఫుల్ మరియు అతని కుటుంబంతో పార్లీ మోర్మన్ గ్రంథమును పంచుకున్నాడు.

థాంక్‌ఫుల్ మరియు అతని ఇతర కుటుంబ సభ్యులతో పార్లీ మోర్మన్ గ్రంథము గురించి చెప్పాడు. అతడు యేసు క్రీస్తు గురించి అది బోధిస్తున్న దానిని వారికి చెప్పాడు. పార్లీ ఆత్మను అనుసరించి దేవుడు అతడిని చేయమని కోరిన పనిని కనుగొన్నందుకు థాంక్‌ఫుల్ సంతోషించింది. పార్లీ వలె, థాంక్‌ఫుల్ మోర్మన్ గ్రంథము సత్యమని తనంతట తాను నేర్చుకున్నది.

పరిశుద్ధులు, 1:98–99