లేఖన కథలు
నావూ నిర్మాణం


“నావూ నిర్మాణం,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“నావూ నిర్మాణం,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1840–1842

2:18

నావూ నిర్మాణం

అందమైన ఒక పట్టణం కోసం ప్రభువు ప్రణాళికలు

మిస్సిస్సిప్పి నది దగ్గర గుడారాలలో నివసిస్తున్న పరిశుద్ధులు.

ఒక కొత్త ప్రదేశంలో సమకూడాలని ప్రభువు పరిశుద్ధులకు చెప్పారు. అది మిస్సిస్సిప్పి అనే ఒక పెద్ద నదికి దగ్గరలో ఉంది. అక్కడి నేల తడిగా, బురదగా ఉంది. కొంతమందికి అది పట్టణాన్ని నిర్మించడానికి మంచి ప్రదేశంగా అనిపించలేదు. కానీ ప్రభువు సహాయంతో వారు దానిని అందంగా చేయగలరని ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు తెలుసు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:25; Saints, 1:417

నావూను నిర్మిస్తున్న పరిశుద్ధులు.

నివసించడానికి దానిని ఒక మంచి ప్రదేశంగా చేయడానికి పరిశుద్ధులు కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. ఆ పట్టణాన్ని ప్రవక్త జోసెఫ్ స్మిత్ నావూ అని పిలిచారు, దానర్థం “అందమైన ప్రదేశం.”

Saints, 1:417

ఒక ఇంటిపై పనిచేస్తున్న జోసెఫ్ స్మిత్ మరియు ఇతరులు.

యాత్రికులు వచ్చి, విశ్రాంతి తీసుకోగలిగేలా నావూలో ఒక ఇల్లు కట్టమని ప్రభువు పరిశుద్ధులతో చెప్పారు. నావూ ప్రతీఒక్కరు స్వాగతించబడినట్లు భావించే ప్రదేశంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:22-24, 60; Saints, 1:426

భవిష్యత్తులో దేవాలయం కోసం స్థలాన్ని సూచిస్తున్న జోసెఫ్.

నావూ కోసం తాను గొప్ప ప్రణాళికలను కలిగియున్నానని ప్రభువు ప్రవక్త జోసెఫ్‌తో చెప్పారు. పరిశుద్ధులు దేవాలయాన్ని నిర్మించగలిగేలా వారు ఇక్కడ సమకూడాలని ఆయన కోరుకున్నారు. ఆయన మందిరాన్ని నిర్మించడానికి వారు వీలైనంతగా కష్టపడి పనిచేయాలని ఆయన వారిని అడిగారు. పరిశుద్ధులు త్వరగా పనిచేయడం ప్రారంభించారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:25–28, 44, 55; Saints, 1:420–21, 425–27

దేవాలయం గురించి బోధిస్తున్న జోసెఫ్.

దేవాలయాన్ని నిర్మించాలని ప్రభువు పరిశుద్ధులను కోరారు, ఎందుకంటే వారికి ఇవ్వడానికి ఆయన గొప్ప దీవెనలను కలిగియున్నారు. దేవాలయంలో, వారు ప్రభువుతో నిబంధనలు లేదా ప్రత్యేక వాగ్దానాలు చేస్తారు. ఆయన పిల్లలందరి కోసం పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళిక గురించి కూడా వారు నేర్చుకుంటారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:29-41; Saints, 1:453-55

పూర్తయిన దేవాలయము.

ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా, పరిశుద్ధులు దేవాలయాన్ని నిర్మించడానికి కష్టపడి పనిచేసారు. చాలా సమయం పట్టింది, కానీ ఆయన దేవాలయంలో వారి కోసం ప్రభువు కలిగియున్న ప్రత్యేక వాగ్దానాల గురించి వారిలో ప్రతీఒక్కరు నేర్చుకోగల రోజు గురించి వారు ఉత్సాహంతో ఉన్నారు.

Saints, 1:453-55