“అమూల్యమైన ముత్యము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“అమూల్యమైన ముత్యము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1835 జూలై–1842 మార్చి
అమూల్యమైన ముత్యము
ప్రభువు నుండి మరింత లేఖనము
ఒకరోజు, ఒక వ్యక్తి ఈజిప్టు నుండి మమ్మీలతో కర్ట్‌లాండ్‌కి వచ్చాడు. మమ్మీలతోపాటు కొన్ని పత్రాలు లేదా చాలా పాత కాగితపు చుట్టలు ఉన్నాయి. ఆ చుట్టల మీద ఈజిప్షియన్ వ్రాతలు ఉన్నాయి. ఆ వ్యక్తి వాటిని ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు చూపించాడు. జోసెఫ్‌కి రచనలంటే చాలా ఆసక్తి.
Saints, 1:219–20
మమ్మీలు మరియు పత్రాలు కొనడానికి కొంతమంది స్నేహితులు జోసెఫ్‌కు సహాయం చేసారు. జోసెఫ్ ఆ వ్రాతలను అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రభువు అతనికి బైబిలులోని ప్రవక్త అయిన అబ్రాహాము నుండి ప్రాచీన రచనలను బయలుపరిచారు. ఆలీవర్ కౌడరీ వంటి స్నేహితుల సహాయంతో, అబ్రాహాము బోధనల గురించి ప్రభువు అతనికి బోధించిన వాటిని జోసెఫ్ రాసాడు.
Saints, 1:220
మనము పుట్టకముందు పరలోక తండ్రితో మన జీవితము గురించి అబ్రాహాము దర్శనమును చూసాడు. యేసు మన రక్షకునిగా ఎన్నుకోబడ్డారని అతడు చూశాడు. అబ్రాహాము లోకము యొక్క సృష్టి గురించి కూడా తెలుసుకున్నాడు. అబ్రాహాము నుండి ఈ బోధనలను కలిగియున్నందుకు పరిశుద్ధులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రభువు వారికి మరింత బోధించాలని కోరుకున్నందుకు వారు సంతోషించారు.
అబ్రాహాము 2:6–11; 3–5; Saints, 1:220
అబ్రాహాము రచనలు అమూల్యమైన ముత్యము అని పిలువబడే లేఖన గ్రంథంలో భాగమయ్యాయి. ఈ గ్రంథంలో బైబిలులోని మరొక ప్రవక్త అయిన మోషే వ్రాసిన రచన కూడా ఉంది. ఇది బైబిలు నుండి కోల్పోబడిన సత్యాలను బోధిస్తుంది. జనులు ఈ సత్యాలను తెలుసుకోవాలని ప్రభువు కోరుకున్నారు, కాబట్టి ఆయన వాటిని జోసెఫ్ స్మిత్‌తో పంచుకున్నారు.
అమూల్యమైన ముత్యములో జోసెఫ్ స్మిత్ యొక్క సాక్ష్యము మరియు 13 విశ్వాస ప్రమాణాలు కూడా ఉన్నాయి. కడవరి-దిన పరిశుద్ధులు ఏమి నమ్ముతున్నారో ప్రపంచానికి తెలియజేయడానికి జోసెఫ్ స్మిత్ ఈ విషయాలను వ్రాసారు. ముత్యము చిన్నగా ఉన్నట్లే అమూల్యమైన ముత్యము కూడా ఒక చిన్న పుస్తకం, కానీ అది చాలా విలువైనది.