లేఖన కథలు
నావూను విడిచిపెట్టి, పశ్చిమానికి వెళ్ళుట


“నావూను విడిచిపెట్టి, పశ్చిమానికి వెళ్ళుట,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“నావూను విడిచిపెట్టి, పశ్చిమానికి వెళ్ళుట,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1844 జూన్–1847 జూలై

3:51

నావూను విడిచిపెట్టి, పశ్చిమానికి వెళ్ళుట

పరిశుద్ధులు ప్రభువుతో వాగ్దానములు చేసి, నిలబెట్టుకుంటారు

నావూ దేవాలయం పూర్తి కావడాన్ని పర్యవేక్షిస్తున్న బ్రిగమ్ యంగ్.

జోసెఫ్ స్మిత్ మరణించారు. ఇప్పుడు బ్రిగమ్ యంగ్ మరియు ఇతర అపొస్తలులు సంఘాన్ని నడిపించారు. నావూలో పరిశుద్ధులు ఇకపై సురక్షితంగా లేరని బ్రిగమ్‌కు తెలుసు. వారు వెళ్లిపోవలసి ఉంటుంది. కానీ ముందుగా, వారు దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభువు కోరుకున్నారు. వారు ఆయనతో నిబంధనలు చేసుకుని కుటుంబాలుగా ముద్రవేయబడాలని ఆయన కోరుకున్నారు.

Saints, 1:571, 579–80

దేవాలయంలో పరిశుద్ధులు దీవెనలు పొందడానికి సహాయం చేస్తున్న బ్రిగమ్.

కొన్ని నెలల తర్వాత, ప్రజలు అక్కడ నిబంధనలు చేసుకోవడానికి దేవాలయం సిద్ధంగా ఉంది. వేలమంది పరిశుద్ధులు దేవాలయానికి వచ్చారు. ప్రభువుతో నిబంధనలు చేసుకోవడంలో వారికి సహాయం చేయడానికి బ్రిగమ్ రాత్రి ఆలస్యంగా దేవాలయంలోనే ఉన్నారు. చివరికి, నావూ నుండి బయలుదేరాల్సిన అవసరం ఉందని బ్రిగమ్ అందరికీ చెప్పారు.

Saints, 1:582

నావూ నుండి బయలుదేరాలని పరిశుద్ధులతో చెబుతున్న బ్రిగమ్.

మరుసటి రోజు ఉదయం బ్రిగమ్ మేల్కొన్నప్పుడు, మరికొంత మంది పరిశుద్ధులు దేవాలయం వద్ద వేచి ఉన్నారు. నావూలో ఉండడం సురక్షితం కాదని బ్రిగమ్ వారికి చెప్పారు. వారు పశ్చిమాన కొత్త నివాసాన్ని కనుగొనవలసి ఉంది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు వారు కొత్త దేవాలయాన్ని నిర్మించవచ్చని ఆయన వాగ్దానం చేశారు.

Saints, 1:582–83; 2:13–14

దేవాలయంలో దీవెనలు పొందడానికి బ్రిగమ్‌ను వేడుకుంటున్న పరిశుద్ధులు.

కానీ పరిశుద్ధులు వెళ్ళలేదు. వారు కొత్త నివాసానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ప్రభువుతో నిబంధనలు చేసుకోవాలనుకున్నారు.

Saints, 1:583

దేవాలయంలో దీవెనలు పొందడానికి పరిశుద్ధులకు సహాయం చేయడాన్ని కొనసాగించిన బ్రిగమ్.

బ్రిగమ్ వారి ముఖాలను చూసి తన మనసు మార్చుకున్నారు. ఆ రోజు మిగిలిన సమయమంతా మరియు మరుసటి రోజు పరిశుద్ధులు దేవాలయంలో నిబంధనలు చేయడానికి ఆయన సహాయం చేసారు.

Saints, 1:583

నావూని విడిచిపెట్టి పశ్చిమానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించిన పరిశుద్ధులు.

ఇప్పుడు పరిశుద్ధులు ప్రభువుతో నిబంధనలు చేసుకున్నారు కాబట్టి, నావూ నుండి బయలుదేరే సమయం ఆసన్నమైంది. ప్రభువు వారి కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేశారని బ్రిగమ్‌కు తెలుసు. ఆయన దానిని ఒక దర్శనంలో చూశారు. వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వాతావరణం చల్లగా ఉంది మరియు నేల బురదగా ఉంది. ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటికే వారి దగ్గర ఆహారం అయిపోతోంది.

Saints, 2:16–18, 20–21

మంచుతో కూడిన శిబిరంలో నివసిస్తున్న బ్రిగమ్ మరియు ఇతరులు.

పరిశుద్ధులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. వారు అంత సుదీర్ఘమైన మరియు కఠినమైన ప్రయాణాన్ని ఎలా చేయగలరని బ్రిగమ్ ఆశ్చర్యపోయారు. దేవుని సహాయం కోసం ఆయన ప్రార్థించారు.

Saints, 2:46

వింటర్ క్వార్టర్స్‌లో ఒకరినొకరు చూసుకుంటున్న పరిశుద్ధులు.

ప్రభువు బ్రిగమ్‌కు ఒక బయల్పాటునిచ్చారు. పరిశుద్ధులను ఎలా నడిపించాలో ఆయన బ్రిగమ్‌కు నేర్పించారు. పేదలను జాగ్రత్తగా చూసుకోవడానికి వారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఆయన అన్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 136:1–8

వసంతకాలంలో పశ్చిమ దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిశుద్ధులు.

పరిశుద్ధులు ఆయనతో చేసుకున్న నిబంధనలను గుర్తుంచుకోవాలని ప్రభువు చెప్పారు. వారు అలా చేస్తే, ఆయన వారిని ఆశీర్వదించి వారి ప్రయాణంలో వారికి సహాయం చేస్తారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 136:4, 11, 42; Saints, 2:47

సమాధి పక్కన మోకరిల్లిన కుటుంబం.

ప్రయాణం ఇంకా చాలా కష్టంగా ఉంది. కొంతమంది చనిపోయారు. కానీ వారి దేవాలయ నిబంధనల కారణంగా, వారు తమ కుటుంబ సభ్యులను మళ్ళీ చూస్తారని పరిశుద్ధులకు తెలుసు.

సాల్ట్ లేక్ లోయకు వస్తున్న విల్ఫర్డ్ వుడ్రఫ్ మరియు బ్రిగమ్ యంగ్.

కొన్ని నెలల తర్వాత, మొదటి పరిశుద్ధులు 1847లో సాల్ట్ లేక్ లోయకు చేరుకున్నారు. బ్రిగమ్ యంగ్ లోయను చూసినప్పుడు, “ఇది సరైన ప్రదేశం” అని చెప్పారు. ఆయన ఒక దర్శనంలో చూసినది ఇదే స్థలం. ఇక్కడే పరిశుద్ధులు సురక్షితంగా ఉంటారు. ఇక్కడ వారు ప్రభువును ఆరాధించవచ్చు మరియు ఆయన పనిని ప్రశాంతంగా చేయవచ్చు.

Saints, 2:17, 64–67

ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు మరియు పరిశుద్ధుల సమగ్ర చిత్రం.

సంవత్సరాలు గడిచేకొద్దీ, ఎక్కువ మంది పరిశుద్ధులు వచ్చారు. జనులు ప్రభువుతో నిబంధనలు చేసుకోగలిగేలా వారు మరిన్ని దేవాలయాలను నిర్మించారు. యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధించడానికి వారు ప్రపంచవ్యాప్తంగా సువార్తికులను పంపారు. ప్రతిచోటా పరలోక తండ్రి పిల్లలను ఆశీర్వదిస్తూ, రక్షకుని సంఘము పెరుగుతూనే ఉంది.