“జ్ఞానవాక్యము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“జ్ఞానవాక్యము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1833 ఫిబ్రవరి
జ్ఞానవాక్యము
ప్రభువు యొక్క ఆరోగ్య చట్టము
జోసెఫ్ స్మిత్ సంఘములోని కొంతమంది వ్యక్తులను న్యూయెల్ మరియు ఆన్ విట్నీ దుకాణం పైఅంతస్తులో తనతో సమావేశాలకు ఆహ్వానించాడు. అక్కడ వారు సువార్తను, ఇతర విషయాలను నేర్చుకున్నారు మరియు వారు ఒక సమూహంగా ప్రార్థించారు. వారు ఈ సమావేశాలను ప్రవక్తల పాఠశాల అని పిలిచారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:117–137; Saints, 1:166
పాఠాల సమయంలో చాలా మంది పురుషులు పొగ తాగుతూ పొగాకు నమిలేవారు. పొగ గాలిని మేఘావృతం చేసింది మరియు పొగాకు నేలమీద మరకలు చేసింది. సమావేశాల తర్వాత, గదిని శుభ్రం చేయడానికి ఎమ్మా స్మిత్ పైకి వెళ్ళింది. అది చాలా మురికిగా ఉంది!
Saints, 1:167
ఎమ్మా నేలను రుద్ది రుద్ది కడిగింది, కానీ పొగాకు మరకలు పోలేదు. ఆ మురికి గురించి ఆమె జోసెఫ్‌తో మాట్లాడింది.
Saints, 1:167
జోసెఫ్ ఎమ్మా మాట విన్నాడు. ఆమె మాట విన్నప్పుడు పొగాకు గురించి ప్రభువు ఎలా భావించారోనని అతను ఆశ్చర్యపోయాడు.
Saints, 1:167
కాబట్టి జోసెఫ్ పొగాకు గురించి ప్రభువును అడిగాడు. పరిశుద్ధుల కోసం జ్ఞానవాక్యం ఉందని ప్రభువు జోసెఫ్‌కు చెప్పారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 89:1–9; Saints, 1:167
పరిశుద్ధులు ధూమపానం చేయకూడదని, పొగాకు ఉపయోగించకూడదని, మద్యం లేదా “వేడి పానీయాలు” అంటే కాఫీ మరియు టీ త్రాగకూడదని ప్రభువు చెప్పారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 89:1–9; Saints, 1:167
ధాన్యాలు మరియు పండ్లు తినడం మంచిదని కూడా ప్రభువు పరిశుద్ధులకు బోధించారు. వారు కొన్నిసార్లు మాంసం తినవచ్చని కూడా ఆయన చెప్పారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 89:10–17; Saints, 1:168
తన జ్ఞానవాక్యాన్ని పాటించడానికి ఎంచుకున్న పరిశుద్ధులు రక్షించబడతారని ప్రభువు జోసెఫ్‌తో చెప్పారు. వారికి ఆరోగ్యాన్ని, తెలివిని, బలాన్ని అనుగ్రహిస్తానని ప్రభువు వాగ్దానం చేసారు. జోసెఫ్ ప్రవక్తల పాఠశాలలోని వ్యక్తులకు ప్రభువు యొక్క జ్ఞానవాక్యం గురించి చెప్పాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 89:18–21; Saints, 1:168
వారు ప్రభువు యొక్క జ్ఞానవాక్యానికి లోబడాలనుకుంటున్నారని చూపించడానికి గదిలో ఉన్న వ్యక్తులు తమ పొగాకును మరియు పొగాకు గొట్టాలను మంటల్లోకి విసిరారు.
Saints, 1:168