“మార్టిన్ హారిస్ జోసెఫ్‌కు సహాయపడతాడు” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“మార్టిన్ హారిస్ జోసెఫ్‌కు సహాయపడతాడు” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1828–1829
మార్టిన్ హారిస్ జోసెఫ్‌కు సహాయపడతాడు
ప్రభువును విశ్వసించుట నేర్చుకోవడం
ఒకరోజు, జోసెఫ్, ఎమ్మాలు పెన్సిల్వేనియాలో నివసిస్తుండగా, మార్టిన్ హారిస్ అనే పేరుగల స్నేహితుడు వారిని సందర్శించడానికి వచ్చాడు. న్యూయార్క్‌లో మార్టిన్ పెద్ద పొలమును కలిగియున్నాడు. బంగారు పలకలతో జోసెఫ్ యొక్క పని అతనికి తెలుసు. అతడు జోసెఫ్‌కు ఇదివరకు సహాయపడ్డాడు, మరియు ఇప్పుడు ఇంకా సహాయపడగలనేమో తెలుసుకోవాలని అతడు కోరాడు.
పరిశుద్ధులు, 1:49
జోసెఫ్ మరియు ఎమ్మా కృతజ్ఞత కలిగియున్నారు. జోసెఫ్ అబద్ధమాడుతున్నాడని అనేకమంది జనులు అనుకున్నారు. బంగారు పలకలు నిజమైనవని నమ్మిన మార్టిన్ వంటి స్నేహితుడిని కలిగియుండుట మంచిది.
పరిశుద్ధులు, 1:49
జోసెఫ్ పలకలను అనువదించినప్పుడు, అతడు చెప్పిన దానిని మార్టిన్ వ్రాసాడు. ఈ గొప్ప కార్యములో ప్రభువుకు సహాయపడటానికి మార్టిన్ ఉత్సాహం చెందాడు.
పరిశుద్ధులు, 1:50
మార్టిన్ భార్య లూసీ, సంతోషంగా లేదు. జోసెఫ్ బంగారు పలకలను నిజంగా కలిగియున్నాడని ఆమె నమ్మలేదు. జోసెఫ్ మార్టిన్‌ని మోసగిస్తున్నాడని ఆమె భావించింది. మార్టిన్‌ను న్యూయార్క్‌కు తిరిగి రమ్మని మరియు జోసెఫ్‌కు సహాయపడటం ఆపమని ఆమె కోరింది.
పరిశుద్ధులు, 1:49–50
కానీ మార్టిన్ జోసెఫ్‌తో పనిచేయడం కొనసాగించాడు. వారు చేస్తున్న పనిని లూసీ చదివితే ఆమె కూడా నమ్ముతుందని అతడు అనుకున్నాడు. తన భార్యకు చూపించడానికి వారు అనువదించిన పేజీలను తాను న్యూయార్క్‌కు తీసుకెళ్ళవచ్చా అని అతడు జోసెఫ్‌ను అడిగాడు. తాను ప్రార్థించి దేవుణ్ణి అడుగుతానని జోసెఫ్ చెప్పాడు.
పరిశుద్ధులు, 1:50–51
మార్టిన్‌ను పేజీలు తీసుకువెళ్ళనివ్వద్దని దేవుడు అతనితో చెప్పారు. మరలా ప్రార్థన చేయమని మార్టిన్ జోసెఫ్‌ను అడిగాడు. జోసెఫ్ ప్రార్థించాడు మరియు అదే జవాబును పొందాడు. కానీ మార్టిన్ తన భార్యకు పేజీలను చూపించాలని నిజంగా కోరాడు, మరియు తన స్నేహితునికి సహాయపడాలని జోసెఫ్ కోరాడు. జోసెఫ్ స్మిత్ మూడవసారి ప్రార్థించాడు. ఈసారి అతడేమి చేయాలో నిర్ణయించుకోమని దేవుడు జోసెఫ్‌కు చెప్పారు.
పరిశుద్ధులు, 1:51
మార్టిన్ పేజీలను న్యూయార్క్‌కు తీసుకొని వెళ్లవచ్చని, కాని అతడు నిర్ధిష్టమైన కుటుంబ సభ్యులకు మాత్రమే వాటిని చూపించాలని జోసెఫ్ అతడితో చెప్పాడు. అతడు రెండు వారాలలో పేజీలను తిరిగి తీసుకొని రావాల్సియున్నది. మార్టిన్ అంగీకరించాడు మరియు పేజీలను తీసుకొని వెళ్ళాడు.
పరిశుద్ధులు, 1:51
మార్టిన్ వెళ్ళిన తరువాత, జోసెఫ్, ఎమ్మాలకు ఒక బిడ్డ జన్మించింది. కానీ బిడ్డ చనిపోయింది, మరియు ఎమ్మా అనారోగ్యానికి గురైంది. జోసెఫ్, ఎమ్మాలు చాలా విచారంగా ఉన్నారు.
పరిశుద్ధులు, 1:51–52
ఎమ్మా గురించి జోసెఫ్ ఆందోళన చెందాడు. అతడు మార్టిన్ గురించి కూడ ఆందోళన చెందాడు. రెండు వారాలు గడిచాయి, మరియు మార్టిన్ తిరిగి రాలేదు. ఎమ్మా కూడ ఆందోళన చెందింది.
పరిశుద్ధులు, 1:52
న్యూయార్క్ వెళ్ళి మార్టిన్ కోసం వెదకమని ఎమ్మా జోసెఫ్‌తో చెప్పింది. జోసెఫ్ మార్టిన్‌ను అతడి తల్లిదండ్రుల ఇంటి వద్ద కలిసాడు. జోసెఫ్ పేజీల గురించి మార్టిన్‌ను అడిగాడు, మార్టిన్ చాలా విచారంగా ఉన్నాడు. పేజీలు పోగొట్టబడినవని అతడు చెప్పాడు. అతడు ప్రతిచోట వెదికాడు కానీ వాటిని కనుగొనలేకపోయాడు.
పరిశుద్ధులు, 1:52–53
జోసెఫ్ చాలా విచారించాడు మరియు భయపడ్డాడు. మార్టిన్‌ను పేజీలను తీసుకోనివ్వడం తన తప్పని అతనికి తెలుసు. అతడు ఇంటికి తిరిగి వెళ్ళాడు మరియు జరిగిన దానిని ఎమ్మాకు చెప్పాడు. దేవదూత మొరోనై వచ్చి బంగారు పలకలను తిరిగి తీసుకొనివెళ్ళాడు. జోసెఫ్ తగ్గించుకొని, పశ్చాత్తాపపడిన యెడల, అతడు తిరిగి పలకలను తీసుకొని అనువదించవచ్చని అతడు చెప్పాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 3:5–11; 10:1–3; పరిశుద్ధులు, 1:53–54
అనేక వారాలుగా, జోసెఫ్ తాను చేసిన తప్పు గురించి ఆలోచించాడు. అతడు ప్రార్థన చేసి, క్షమాపణ కోసం అడిగాడు. దేవుడు అతనిని క్షమించాడు. దేవుని కార్యమును ఆపడానికి ప్రయత్నించిన జనుల చేత ఆ పేజీలు దొంగిలించబడినవని ఆయన జోసెఫ్‌కు చెప్పారు. కానీ దేవుని కార్యమును ఎవరూ ఆపలేరు. పనిని ముందుకు కొనసాగించడానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగియున్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 3:1–10; పరిశుద్ధులు, 1:54–55
మొరోనై పలకలను తిరిగి జోసెఫ్‌కు ఇచ్చాడు. జోసెఫ్ మరియు మార్టిన్ వినయంగా ఉండి, ఆయనను విశ్వసించిన యెడల, అనేక విధాలుగా ఆయన కార్యములో సహాయపడుటను వారు కొనసాగించగలరని దేవుడు వారికి చెప్పారు. మోర్మన్ గ్రంథాన్ని లోకానికి తీసుకొనిరావడానికి వారు సహాయపడగలరు. ప్రతిచోట ప్రతిఒక్కరూ పశ్చాత్తాపపడటానికి మరియు యేసు క్రీస్తు నందు విశ్వసించడానికి ఈ గ్రంథము సహాయపడుతుంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 3:16–20; 5:21–35; పరిశుద్ధులు, 1:56–57