లేఖన కథలు
కర్ట్‌లాండ్ దేవాలయము ప్రతిష్ఠించబడింది


“కర్ట్‌లాండ్ దేవాలయము ప్రతిష్ఠించబడింది,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“కర్ట్‌లాండ్ దేవాలయము ప్రతిష్ఠించబడింది,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1836 మార్చి

2:41

కర్ట్‌లాండ్ దేవాలయము ప్రతిష్ఠించబడింది

ప్రభువు మందిరంలో ఆయన ఆత్మను అనుభవించుట

కర్ట్‌లాండ్ దేవాలయము వద్దకు నడిచివెళ్తున్న కుటుంబము.

దాదాపు మూడు సంవత్సరాల శ్రమ తర్వాత, కర్ట్‌లాండ్ దేవాలయం చివరికి పూర్తయింది. దేవాలయాన్ని ప్రతిష్ఠించడానికి ఒక ప్రత్యేక సమావేశానికి ప్రవక్త జోసెఫ్ పరిశుద్ధులను ఆహ్వానించాడు. అతను ఒక ప్రత్యేక ప్రార్థన చేసి, దేవాలయాన్ని ప్రభువుకు ఇస్తాడు. అది ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరం అవుతుంది.

Saints, 1:235

ప్రతిష్ఠాపన కోసం దేవాలయంలో సమకూడిన జనులు.

సమావేశము నాడు తెల్లవారుజామున వందలాది మంది పరిశుద్ధులు దేవాలయానికి తరలివచ్చారు. కుర్చీలన్నీ నిండిపోయాక, జనులు గుమ్మంలో మరియు బయట నిలబడి కిటికీల గుండా చూస్తున్నారు. దేవాలయం ప్రతిష్ఠించబడడాన్ని చూడడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు.

Saints, 1:235–36

ప్రతిష్ఠాపన కోసం ప్రార్థనను చదువుతున్న జోసెఫ్ స్మిత్.

దేవాలయాన్ని ప్రతిష్ఠించడానికి జోసెఫ్ ఒక ప్రార్థనను చదివాడు. పరిశుద్ధులు ఆయనకు విధేయులైయున్నారని అతను ప్రభువుతో చెప్పాడు. దేవాలయాన్ని ఆయన మందిరంగా అంగీకరించమని అతను ప్రభువును కోరాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 109:1–5

ప్రార్థనలో తమ కళ్ళు మూసుకున్న జనులు.

దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభువు యొక్క శక్తిని అనుభవించాలని మరియు అది ఆయన మందిరము అని తెలుసుకోవాలని జోసెఫ్ ప్రార్థించాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 109:13

ప్రభువును స్తుతిస్తున్న జనసమూహము.

పరిశుద్ధులు పాపం చేసినప్పుడు, వారు వెంటనే పశ్చాత్తాపపడగలరని కూడా జోసెఫ్ ప్రార్థించాడు. ప్రపంచమంతటా ఆయన సువార్తను పంచుకోవడానికి వారికి శక్తిని ఇవ్వమని కూడా అతడు ప్రభువును కోరాడు. ప్రార్థన తరువాత, గాయక బృందము “The Spirit of God [దేవుని ఆత్మ]” అనే కొత్త పాట పాడారు. జనులు ఆనందంతో నింపబడ్డారు. వారు నిలబడి, ప్రభువును స్తుతించారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 109:21–32; Hymns, no. 2; Saints, 1:237

దేవాలయం పైకి దిగివస్తున్న ప్రకాశవంతమైన వెలుగు.

దేవాలయంలో ఆ రోజు చాలామంది దేవదూతలను చూసారు. పరలోకము నుండి దేవాలయముపైకి ప్రకాశవంతమైన వెలుగు రావడాన్ని వారు చూసారు. కొంతమంది అది మేఘంలా ఉందని చెప్పారు; మరికొందరు అది నిప్పులా ఉందని చెప్పారు. దేవాలయం ఒక పరిశుద్ధ స్థలమని వారందరు భావించారు. ఇప్పుడది నిజంగా యెహోవా మందిరము.

Saints, 1:237