“కెనడాలో పార్లీ యొక్క సువార్తసేవ,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“కెనడాలో పార్లీ యొక్క సువార్తసేవ,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1836 ఏప్రిల్–జూన్
కెనడాలో పార్లీ యొక్క సువార్తసేవ
ప్రభువు యొక్క వాగ్దానాలపై విశ్వాసం చూపుట
కర్ట్‌లాండ్ దేవాలయం ప్రతిష్ఠించబడిన వెంటనే, సంఘ నాయకులలో చాలా మంది సువార్త బోధించడానికి సువార్తసేవకు వెళ్లారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:81; 109:22–23; 112:28–29; Saints, 1:249
పార్లీ ప్రాట్‌కు సువార్తను పంచుకోవడం ఇష్టం. కానీ అతని భార్య థాంక్‌ఫుల్ అనారోగ్యంతో ఉన్నందున అతను ఇంట్లోనే ఉండాలని అనుకున్నాడు. వారి దగ్గర ఎక్కువ డబ్బు కూడా లేదు.
Saints, 1:249
పార్లీ స్నేహితుడు మరియు అపొస్తలులలో ఒకరైన హీబర్ కింబల్ సందర్శించడానికి వచ్చారు. ఆయన పార్లీకి దీవెన ఇచ్చి, అతను కెనడాలో సువార్త ప్రకటించాలని చెప్పారు. దీవెనలో, థాంక్‌ఫుల్ బాగవుతుందని హీబర్ వాగ్దానం చేసారు. ఆమెకు ఒక కొడుకు పుడతాడని మరియు పార్లీకి అవసరమైన డబ్బును పొందడానికి ప్రభువు అతనికి సహాయం చేస్తారని ఆయన వాగ్దానం చేసారు.
Saints, 1:249–50
థాంక్‌ఫుల్ మరియు పార్లీల పెళ్ళి జరిగి 10 సంవత్సరాలు అయింది. వారికి పిల్లలు లేరు. కానీ ప్రభువు వాగ్దానాలపై వారికి విశ్వాసం ఉంది. థాంక్‌ఫుల్‌కి దూరంగా కెనడాలో ఉండడం కష్టం అయినప్పటికీ, పార్లీ సువార్తను పంచుకోవడానికి బయలుదేరాడు.
Saints, 1:250
కెనడాలో, పార్లీ జనులకు బోధించే ప్రదేశాల కోసం వెతికాడు. సంఘాలు మరియు ఇతర భవనాలలో బోధించవచ్చా అని అతను అడిగాడు. అందరూ వద్దు అన్నారు.
Saints, 1:252–53
అప్పుడు పార్లీ, జాన్ మరియు లియోనోరా టేలర్‌లను కలిసాడు. వారు యేసు క్రీస్తును మరియు బైబిలును ప్రేమించేవారు. అతను బోధించేది బైబిలుకు భిన్నంగా ఉందా అని పార్లీని జాన్ అడిగాడు.
Saints, 1:252–53
పార్లీ తాను యేసు, ప్రవక్తలు, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మ గురించి బోధించానని చెప్పాడు. ఆ విషయాలన్నీ బైబిలులో ఉన్నాయి. “జోసెఫ్ స్మిత్ మరియు మోర్మన్ గ్రంథము గురించి?” అని జాన్ అడిగాడు. బైబిలు లాగానే మోర్మన్ గ్రంథము కూడా నిజమని తనకు తెలుసునని, జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని పార్లీ జాన్‌తో చెప్పాడు.
Saints, 1:253
పార్లీ చెప్పింది జాన్ నమ్మాడు. అతను మోర్మన్ గ్రంథాన్ని చదివాడు మరియు అది నిజమని తెలుసుకున్నాడు. పార్లీ బోధించినప్పుడు వినడానికి రావాలని జాన్ మరియు లియోనోరా తమ స్నేహితులైన జోసెఫ్, మెర్సీ, మేరీ ఫీల్డింగ్ మరియు ఇతరులను ఆహ్వానించారు. చాలా మంది బాప్తిస్మం పొంది, సంఘములో చేరారు.
Saints, 1:254–55
పార్లీ సంతోషంగా ఉన్నాడు, కానీ అతను కర్ట్‌లాండ్‌లో ఉన్న ఇంటికి థాంక్‌ఫుల్ దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. కెనడాలోని తన కొత్త స్నేహితులకు వీడ్కోలు పలికాడు. అతను వారితో కరచాలనం చేసినప్పుడు, వారు అతని కుటుంబాన్ని చూసుకోవడంలో సహాయం చేయడానికి అతనికి డబ్బు ఇచ్చారు.
Saints, 1:255–56
పార్లీ ఇంటికి వచ్చినప్పుడు, థాంక్‌ఫుల్ ఆరోగ్యం బాగుందని అతను కనుగొన్నాడు. పార్లీ మోర్మన్ గ్రంథము యొక్క మరిన్ని ప్రతులను తీసుకొని, సువార్తను పంచుకోవడానికి కెనడాకు తిరిగి వచ్చాడు. ఈసారి, థాంక్‌ఫుల్ అతనితో వెళ్ళింది.
Saints, 1:256
త్వరలోనే థాంక్‌ఫుల్ మరియు పార్లీ తమకు బిడ్డ పుట్టబోతున్నాడని తెలుసుకున్నారు. పార్లీకి హీబర్ ఇచ్చిన దీవెనను వారు గుర్తు చేసుకున్నారు. ఆ దీవెనలో ప్రభువు వాగ్దానం చేసినవన్నీ నిజమవుతున్నట్లు వారు భావించారు.
Saints, 1:256