“నిత్య వివాహం మరియు కుటుంబాలు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“నిత్య వివాహం మరియు కుటుంబాలు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1843–1846
నిత్య వివాహం మరియు కుటుంబాలు
యేసు క్రీస్తు యొక్క శక్తిచేత ముద్రవేయబడింది
ఎమ్మా మరియు జోసెఫ్ పెళ్ళి చేసుకున్నప్పుడు, వారి వివాహం వారు చనిపోయినప్పుడు అంతమైపోతుందని వారు నమ్మారు. వివాహాలన్నీ అలాగే ఉండేవి. కానీ వివాహాలు మరియు కుటుంబాలు శాశ్వతంగా నిలిచియుండగలవని ప్రభువు జోసెఫ్‌తో చెప్పారు.
Saints, 1:413
నిత్య వివాహం గురించి ప్రభువు జోసెఫ్‌కు బోధించారు. యాజకత్వము యొక్క శక్తిచేత, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ప్రభువుతో నిబంధన చేయగలరు. వారు తమ నిబంధనను పాటిస్తే, వారి వివాహం శాశ్వతంగా నిలుస్తుందని ప్రభువు వాగ్దానమిస్తున్నారు. దీనిని ముద్రవేయబడుట అంటారు. త్వరలోనే, జోసెఫ్ మరియు ఎమ్మా నిత్యత్వము కొరకు ముద్రవేయబడ్డారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 132:7, 19–24; Saints, 1:413, 432–33, 481–82, 492, 502–3
ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ముద్రవేయబడినప్పుడు, వారి పిల్లలు వారితో ముద్రవేయబడతారని కూడా జోసెఫ్ నేర్చుకున్నాడు. యేసు క్రీస్తు యొక్క శక్తి కారణంగా, వారి కుటుంబం శాశ్వతంగా నిలిచియుండగలదు. జోసెఫ్ ఈ దీవెన గురించి పరిశుద్ధులకు చెప్పినప్పుడు, వారు చాలా సంతోషించారు! వారు ముద్రవేయబడడానికి వేచియుండలేకపోయారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 131:2; 132:6-7; Saints, 1:492–93, 580
ముద్రణలు దేవాలయంలో చేయబడాలని ప్రభువు తరువాత బోధించారు. వారు ముద్రవేయబడగలిగేలా, పరిశుద్ధులు నావూలో దేవాలయాన్ని పూర్తిచేయడానికి కష్టపడి పనిచేసారు. దేవాలయం పూర్తయినప్పుడు, అనేక కుటుంబాలు ముద్రవేయబడ్డాయి. మరణించిన కుటుంబ సభ్యులతో కూడా వారు ముద్రవేయబడ్డారు. ఈ దీవెన కోసం వారు కృతజ్ఞత కలిగియున్నారు!
Saints, 1:579-80