లేఖన కథలు
ప్రభువు ఆలీవర్ కౌడరీని పంపును


“ప్రభువు ఆలీవర్ కౌడరీని పంపును,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“ప్రభువు ఆలీవర్ కౌడరీని పంపును,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1828–1829

3:10

ప్రభువు ఆలీవర్ కౌడరీని పంపును

దేవుడు మనతో ఎలా మాట్లాడతారో తెలుసుకొనుట

జోసెఫ్ మరియు ఎమ్మా స్మిత్ వారి చిన్న ఇంటి ముందు పనిచేస్తున్నారు.

జోసెఫ్, ఎమ్మాలు మోర్మన్ గ్రంథమును అనువదించడం కొనసాగించారు. ఈ పని కష్టమైనది, మరియు వారు వారి పొలములో కూడ పని చేయవలసియున్నది. మోర్మన్ గ్రంథమును అనువదించడానికి అతడికి సహాయపడటానికి ఎవరినైనా పంపమని జోసెఫ్ పరలోక తండ్రిని ప్రార్థించాడు.

పరిశుద్ధులు, 1:56, 58

ఆలీవర్ కౌడరీ ఒక పాఠశాల గంటను కొడుతున్నాడు.

న్యూయార్క్‌కు దూరంలో, ఒక యువ పాఠశాల బోధకుడైన ఆలీవర్ కౌడరీ, జోసెఫ్ స్మిత్ యొక్క తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. ఆలీవర్ జోసెఫ్ యొక్క తమ్ముళ్ళకు మరియు సహోదరీలకు బోధించాడు.

పరిశుద్ధులు, 1:58–59

ఆలీవర్ కౌడరీ ఒక నిప్పుగూడు దగ్గర కూర్చోని, జోసెఫ్ స్మిత్‌ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు.

జోసెఫ్ బంగారు పలకలు గురించి ఆలీవర్ విన్నాడు. అతడు ఆసక్తిగా ఉన్నాడు. అతడు జోసెఫ్ తల్లిదండ్రులతో మాట్లాడాడు. జోసెఫ్ దేవుని యొక్క కార్యమును చేస్తున్నాడని వారు ఆలీవర్‌కు చెప్పారు.

పరిశుద్ధులు, 1:59

ఆలీవర్ కౌడరీ తన మంచం వద్ద మోకరించి, జోసెఫ్ స్మిత్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ప్రార్థించాడు.

ఇప్పుడు ఆలీవర్ ఎన్నడూ లేనంత ఎక్కువ ఆసక్తిగా ఉన్నాడు. అతడు ప్రార్థించి, అది దేవుని కార్యమా కాదా అని తనకై తాను తెలుసుకోమని ఆలీవర్‌కు జోసెఫ్ తల్లిదండ్రులు చెప్పారు. కనుక ఒక రాత్రి, ఆలీవర్ నిజాయితీగా ప్రార్థించాడు. దేవుడు అతని మనసుకు శాంతిని ప్రసాదించారు. జోసెఫ్ స్మిత్ దేవుని సేవకుడని ఆలీవర్‌కు తెలుసు. తాను జోసెఫ్‌కు సహాయపడాలని అతడు భావించాడు.

పరిశుద్ధులు, 1:60

జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్‌ కౌడరీ నిప్పుగూడు దగ్గర కూర్చోన్నారు. ఎమ్మా కొన్ని చేతివ్రాత పేజీలను పట్టుకొన్నది.

పాఠశాల సంవత్సరం ముగిసినప్పుడు, ఆలీవర్, జోసెఫ్ మరియు ఎమ్మాలను కలవడానికి వెళ్ళాడు. జోసెఫ్, ఆలీవర్‌లు బంగారు పలకలు మరియు దేవుని పని గురించి మాట్లాడుతూ నిద్రపోలేదు.

పరిశుద్ధులు, 1:60

చేతివ్రాత పేజీపై వ్రాస్తున్న ఆలీవర్ కౌడరీ.

జోసెఫ్ అనువదిస్తుండగా తాను వ్రాస్తానని ఆలీవర్ చెప్పాడు. యేసు గురించి తాను నేర్చుకొన్న దానిని అతడు చాలా ఇష్టపడ్డాడు. అతడు ప్రశ్నలు కలిగియున్నాడు మరియు బలమైన విశ్వాసాన్ని కోరుకున్నాడు.

పరిశుద్ధులు, 1:61

జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్‌ కౌడరీలు కిటికీ దగ్గర కుర్చీలలో కూర్చోన్నారు.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా, ప్రభువు ఆలీవర్‌కు సందేశాన్ని ఇచ్చాడు. అతడు ప్రార్థించిన రాత్రిని గుర్తు చేసుకోమని ఆయన ఆలీవర్‌కు చెప్పారు. దేవుడు అతనికి శాంతిని ఇచ్చారు. ఈ ప్రార్థన గురించి దేవునికి మాత్రమే తెలుసు. ఆలీవర్ యొక్క విశ్వాసము బలంగా మారింది. అతడు జోసెఫ్‌కు సహాయపడటం కొనసాగించాడు, మరియు దేవుడు మనతో ఏవిధంగా మాట్లాడతారో అనేక విషయాలను ప్రభువు అతడికి బోధించారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 6:14–24; 8:1–3; 9:7–9; పరిశుద్ధులు, 1:62–64