లేఖన కథలు
ఒహైయోలో సమకూడుట


“ఒహైయోలో సమకూడుట,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“ఒహైయోలో సమకూడుట,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1830 డిసెంబరు–1831 మే

2:55

ఒహైయోలో సమకూడుట

లూసీ స్మిత్ విశ్వాసం మరియు ఒక అద్భుతం

ఒహైయోకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న లూసీ స్మిత్ మరియు కుటుంబ సభ్యులు.

ఒహైయోలో చాలామంది సంఘములో చేరుతున్నారు. వేరే ప్రదేశాలలో ఉన్న పరిశుద్ధులు ఒహైయోలో సమకూడాలని ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు చెప్పారు. దానికోసం చాలా దూరం ప్రయాణించాలి. కానీ వారు సమకూడిన తర్వాత, పరిశుద్ధులకు తన ధర్మశాస్త్రాన్ని బోధిస్తానని మరియు ఆయన పనిని చేయడానికి వారికి శక్తినిస్తానని ప్రభువు వాగ్దానం చేసారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 37; 38:32; Saints, 1:109–110

ఒహైయోకు వెళ్ళడానికి పడవలో ఎక్కుతున్న లూసీ మరియు ఇతర ప్రయాణీకులు.

జోసెఫ్ తల్లి లూసీ మరియు సుమారు 80 మంది సంఘ సభ్యుల సమూహం న్యూయార్క్‌లో ఉన్న తమ ఇళ్ళను వదిలి, ఒహైయోకు వెళ్ళారు. వారు తమను కొంతదూరం వరకు తీసుకువెళ్ళే పడవలో ఎక్కారు. వారు కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత, పడవ ఆగిపోవలసి వచ్చింది. నీళ్ళలో దట్టమైన మంచు వారి దారిని అడ్డుకుంది.

Saints, 1:121-22

నౌకాశ్రయంలో పడవకు అడ్డుపడిన మంచు.

పరిశుద్ధులు మంచు విడిపోయే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. వారు అలసిపోయారు, ఆకలితో, తడిగా మరియు చల్లగా ఉన్నారు.

Saints, 1:122

సహనం కోల్పోయి వాదించడం మొదలుపెట్టిన కొంతమంది పరిశుద్ధులు.

వేచి ఉండడం కష్టమైంది. కొంతమంది పరిశుద్ధులు ఒకరితో ఒకరు వాదించుకోవడం ప్రారంభించారు.

Saints, 1:122

నౌకాశ్రయంలోని మంచు విడిపోవాలని దేవుడిని ప్రార్థించమని పరిశుద్ధులతో చెబుతున్న లూసీ.

పరిశుద్ధులు వాదించుకోవడం లూసీకి నచ్చలేదు. ఏదో చెప్పాలని ఆమెకు తెలుసు. “మీ విశ్వాసానికి ఏమైంది?” అని ఆమె అడిగింది. వారు దేవుణ్ణి ప్రార్థిస్తే, వారు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆయన మంచును విడగొడతారని లూసీ పరిశుద్ధులతో చెప్పింది.

Saints, 1:122-23

మంచులో తెరుచుకుంటున్న దారి.

అకస్మాత్తుగా, మంచు విరిగిపోయినప్పుడు వారు ఉరుములాంటి శబ్దం విన్నారు. వారి పడవ వెళ్ళడానికి తగినంత దారినిస్తూ, మంచులో ఒక మార్గం తెరుచుకుంది.

Saints, 1:123

పరలోక తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి సమకూడిన పరిశుద్ధులు.

పరిశుద్ధులు ఆశ్చర్యపోయారు మరియు కృతజ్ఞతతో ఉన్నారు. వారు ప్రార్థన చేయడానికి మరియు పరలోక తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి సమకూడారు. వారి పడవ ఒహైయో వైపు సురక్షితంగా ప్రయాణించింది.

Saints, 1:123

ఒహైయోలో స్వాగతించబడుతున్న పరిశుద్ధులు.

పరిశుద్ధులు ఒహైయోకు వచ్చినప్పుడు, అక్కడి సంఘ సభ్యులు వారిని స్వాగతించారు మరియు నివసించడానికి స్థలాలను కనుగొనడంలో వారికి సహాయం చేశారు. ప్రభువు వారికి తన ధర్మశాస్త్రాన్ని బోధిస్తానని మరియు ఆయన పనిని చేయడానికి వారికి శక్తినిస్తానని చెప్పిన తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 42; Saints, 1:126