లేఖన కథలు
సిడ్నీ మరియు ఫీబి రిగ్డన్


“సిడ్నీ మరియు ఫీబి రిగ్డన్” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)

“సిడ్నీ మరియు ఫీబి రిగ్డన్” సిద్ధాంతము మరియు నిబంధనలు

1830 అక్టోబరు–నవంబరు

2:24

సిడ్నీ మరియు ఫీబి రిగ్డన్

సువార్తను అంగీకరించడానికి వారి జీవితాలను మార్చుకొనుట

వారు తన స్నేహితుడైన సిడ్నీని చూడాలని పార్లీ ప్రాట్ తన సహవాసులకు సూచించాడు.

స్థానిక అమెరికన్లతో సువార్తను పంచుకోవడానికి పార్లీ ప్రాట్ మరియు ఇతరులు వెళ్లుతున్నారు. వారి మార్గములో, ఆగి తన స్నేహితుడైన సిడ్నీ రిగ్డన్‌ను చూడాలని పార్లీ కోరాడు. సిడ్నీ బైబిలులో యేసు క్రీస్తు గురించి పార్లీకి బోధించిన ఒక బోధకుడు. ఇప్పడు పార్లీ మోర్మన్ గ్రంథములో యేసు గురించి సిడ్నీకి బోధించాలని కోరాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 32; పరిశుద్ధులు, 1:99

సిడ్నీ రిగ్డన్‌తో పార్లీ మోర్మన్ గ్రంథమును పంచుకున్నాడు.

పార్లీ మోర్మన్ గ్రంథము గురించి సిడ్నీకి చెప్పి, దానిని చదవమని అతడిని అడిగాడు. సిడ్నీ అంత నమ్మకంగా లేడు, కానీ పార్లీ ఒక స్నేహితుడు కనుక, తాను చదువుతానని అతడు వాగ్దానమిచ్చాడు.

పరిశుద్ధులు, 1:100

సిడ్నీ మోర్మన్ గ్రంథమును చదివి, దానిని తన భార్యతో పంచుకున్నాడు.

సిడ్నీ మోర్మన్ గ్రంథమును చదివినప్పుడు, అది దేవుని నుండి వచ్చినదని అతడు తెలుసుకున్నాడు. అతడు తన భావాలను, తన భార్య ఫీబితో పంచుకున్నాడు.

పరిశుద్ధులు, 1:101

సిడ్నీ తన కుటుంబంతో మాట్లాడుతున్నాడు.

కానీ తరువాత ఏమి చేయాలో సిడ్నీకి ఖచ్చితంగా తెలియదు. అతడు బాప్తీస్మము పొందిన యెడల, తన సంఘంలో ఒక బోధకునిగా ఉద్యోగాన్ని కోల్పోతాడు. అతడు ఫీబి మరియు వారి ఆరుగురు పిల్లలను ఎలా పోషించగలడు? అతడి సంఘములోని జనులు ఏమని భావిస్తారు? అతడు సహాయం కోసం పరలోక తండ్రికి ప్రార్థించాడు, మరియు అతడికి శాంతికరమైన భావన కలిగింది.

పరిశుద్ధులు, 1:101; సిద్ధాంతము మరియు నిబంధనలు 19:23

ఫీబి రిగ్డన్ సంఘంలో చేరడానికి తాను సమ్మతిస్తున్నానని సిడ్నీతో చెప్పింది.

వారి సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి, అతనితోపాటు ఈ క్రొత్త సంఘములో చేరడానికి ఆమె సమ్మతిస్తుందా అని ఫీబిని సిడ్నీ అడిగాడు. “జీవించియున్నా లేక మరణం సంభవించినా,” “దేవుని చిత్తాన్ని చేయాలన్నిది నా కోరిక,” అని ఆమె చెప్పింది. వారు బాప్తీస్మము పొందాలని నిర్ణయించుకున్నారు.

పరిశుద్ధులు, 1:101

సిడ్నీ జోసెఫ్ స్మిత్‌ను కలుసుకొన్నాడు.

తరువాత, సిడ్నీ ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను కలుసుకున్నాడు. జోసెఫ్‌ ద్వారా ప్రభువు సిడ్నీకి ఒక సందేశాన్ని ఇచ్చారు. సిడ్నీ చేసిన మంచి విషయాలను ఆయన చూసారని, అతని ప్రార్థనలు ఆలకించారని ఆయన అన్నారు. సిడ్నీ చేయడానికి ఆయన గొప్ప కార్యమును కలిగియున్నారని ప్రభువు చెప్పారు. సిడ్నీ గొప్ప విషయాలను చేస్తాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 35:3–4