“జోసెఫ్ మరియు సిడ్నీ ముట్టడి చేయబడ్డారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“జోసెఫ్ మరియు సిడ్నీ ముట్టడి చేయబడ్డారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1832 ఫిబ్రవరి
జోసెఫ్ మరియు సిడ్నీ ముట్టడి చేయబడ్డారు
కోపముతోనున్న జనులు దేవుని ప్రవక్త యొక్క పనిని ఆపడానికి ప్రయత్నిస్తారు
పరలోక తండ్రి, యేసు క్రీస్తు మరియు పరలోకం గురించి జోసెఫ్ స్మిత్ బోధిస్తున్నది కొంతమందికి నచ్చింది. కానీ అతను బోధించినది ఇతరులకు నచ్చలేదు. వారిలో కొందరు కోపగించుకొని, జోసెఫ్ బోధించకుండా ఆపాలనుకున్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76; Saints, 1:149–50
ఒక రాత్రి, జోసెఫ్ చాలాసేపు మేల్కొనియుండి, వారు దత్తత తీసుకున్న కవల పిల్లలలో ఒకరిని చూసుకోవడానికి ఎమ్మాకు సహాయం చేసాడు. బాబు చాలా అనారోగ్యంతో ఉన్నాడు.
Saints, 1:150
ఎమ్మా బిడ్డను తీసుకొని, జోసెఫ్‌ను విశ్రాంతి తీసుకోమని చెప్పింది. అతడు ప్రొద్దున బోధించవలసి ఉంది. చివరికి, జోసెఫ్ మరియు ఎమ్మా ఇద్దరూ నిద్రపోయారు.
Saints, 1:150
అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది మరియు కోపంతో ఉన్న వ్యక్తుల గుంపు గదిలోకి పరిగెత్తింది. వ్యక్తులు జోసెఫ్ చేతులు, కాళ్లు మరియు జుట్టు పట్టుకోవడంతో ఎమ్మా అరిచింది. వారు అతన్ని ఇంటి నుండి బయటకు లాక్కొచ్చారు.
Saints, 1:150–51
జోసెఫ్ ఆ వ్యక్తుల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ వారు అతన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ వ్యక్తులు తన స్నేహితుడైన సిడ్నీ రిగ్డన్‌ను కూడా అతని ఇంటి నుండి ఈడ్చుకురావడం జోసెఫ్ చూసాడు.
Saints, 1:151
ఆ వ్యక్తులు జోసెఫ్ బట్టలు చింపి, అతని చర్మం మరియు వెంట్రుకలపై వేడిగా ఉండి, అంటుకుపోయే తారు పోసారు. తర్వాత వారు అతన్ని ఈకలతో కప్పి పారిపోయారు.
Saints, 1:152
ఆ వ్యక్తులు వెళ్లిన తర్వాత, జోసెఫ్ తడబడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. జోసెఫ్‌ని చూడగానే ఎమ్మా భయపడింది. దగ్గరలో నివసించే స్నేహితులు ఏమి జరిగిందో విని, సహాయం చేయడానికి వచ్చారు. జోసెఫ్ చర్మం నుండి ఎమ్మా తారును తీసివేసింది. మిగిలిన రాత్రంతా, ఎమ్మా మరియు ఆమె స్నేహితులు జోసెఫ్ మరియు సిడ్నీలను చూసుకోవడంలో సహాయం చేసారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:5; Saints, 1:153
మరుసటి రోజు, జోసెఫ్ ఇంకా చాలా నొప్పితో ఉన్నాడు. కానీ అతను తయారై వెళ్ళి, యేసు క్రీస్తు గురించి ఒక జనసమూహానికి బోధించాడు. అతనిపై దాడి చేసిన కొందరు వ్యక్తులు అతని బోధన విన్నారు. తర్వాత ఆ రోజు, జోసెఫ్ ముగ్గురికి బాప్తిస్మం ఇచ్చాడు. జనులు అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు కూడా అతను ప్రభువు యొక్క పని చేస్తూనే ఉన్నాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 24:8; Saints, 1:153