లేఖన కథలు
జాక్సన్ కుటుంబము


“జాక్సన్ కుటుంబము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“జాక్సన్ కుటుంబము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1856 మే–నవంబరు

4:1

జాక్సన్ కుటుంబము

విశ్వాసము మరియు రక్షణ గల ప్రయాణం

ఇంగ్లండులోని లివర్‌పూల్‌లో ఓడ ఎక్కుతున్న జాక్సన్ కుటుంబం.

పరిశుద్ధుల యొక్క మొదటి బృందం సాల్ట్ లేక్ లోయకు వెళ్ళిన తర్వాత, వేలాది మంది ఇతర పరిశుద్ధులు కూడా వెళ్ళారు. వారు చాలా దూరం ప్రయాణించారు మరియు ప్రభువు వారికి సహాయం చేశారు. ప్రయాణం చేసిన కుటుంబాల్లో ఒకటి జాక్సన్ కుటుంబం. వారు ఇంగ్లండు‌లోని తమ ఇంటిని విడిచిపెట్టి, సీయోనును నిర్మించడంలో పరిశుద్ధులకు సహాయం చేయడానికి వెళ్ళేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 136:1–11; Saints, 2:222–23

ఓడలో ప్రయాణిస్తున్న జాక్సన్ దంపతులు.

జాక్సన్ దంపతులు ఓడలో సముద్రం దాటారు. తరువాత వారు సాల్ట్ లేక్ లోయకు వెళ్లే దారిలో కొంతభాగం రైలులో ప్రయాణించారు. మిగిలిన దూరం వారు నడిచి వెళ్ళవలసి ఉంటుంది.

Saints, 2:222–23

తమ తోపుడుబండిలో వస్తువులు ఎక్కిస్తున్న జాక్సన్ దంపతులు.

వారు తమ ఆహారం, దుస్తులు మరియు వారు తీసుకురావాలనుకునే ఇతర వస్తువులను మోసుకెళ్లడానికి ఒక చిన్న తోపుడుబండిని తయారు చేసుకున్నారు. చాలామంది పరిశుద్ధులు ఈ విధంగా లోయకు సురక్షితంగా చేరుకున్నారు.

Saints, 2:223–26

తమ తోపుడుబండితో పశ్చిమానికి ప్రయాణిస్తున్న జాక్సన్ దంపతులు.

ఎలిజబెత్ మరియు ఆరన్ జాక్సన్ బరువుగానున్న తమ తోపుడుబండిని లాగారు. వారి పిల్లలు మార్తా, మేరీ మరియు ఆరన్ జూనియర్‌లు నడిచారు. అది చాలా కష్టమైన పని. చలికాలానికి ముందు లోయకు చేరుకోవాలని వారు ఆశించారు. కానీ శరదృతువు వచ్చినప్పుడు, వారు ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది. చలి మొదలైంది మరియు వారి ఆహారం అయిపోతోంది.

Saints, 2:223–26, 229, 231–32

పశ్చిమానికి ప్రయాణిస్తున్న పరిశుద్ధులకు సహాయం చేయమని సాల్ట్ లేక్‌లోని పరిశుద్ధులను అడుగుతున్న బ్రిగమ్ యంగ్.

సాల్ట్ లేక్ పట్టణంలో, లోయకు వస్తున్న పరిశుద్ధుల గురించి బ్రిగమ్ యంగ్ తెలుసుకున్నారు. ఆయన వారి గురించి ఆందోళన చెందారు. మరుసటి రోజు సంఘములో, ఈ పరిశుద్ధు‌లు ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన అందరికీ చెప్పారు. పరిశుద్ధులకు అవసరమైన వస్తువులతో బండ్లను నింపమని ఆయన వారిని కోరారు. “వెళ్లి ఆ జనులను తీసుకురండి” అని ఆయన చెప్పారు.

Saints, 2:229–30

పశ్చిమానికి ప్రయాణిస్తున్న పరిశుద్ధులకు సహాయం చేయడానికి వస్తువులను సేకరిస్తున్న సాల్ట్ లేక్‌లోని పరిశుద్ధులు.

సమావేశంలో ఉన్న మహిళలు తమ వెచ్చని సాక్స్‌లను తీసి బండ్లలో వేశారు. మరికొందరు తమ ఆహారం, దుప్పట్లు, బూట్లు మరియు దుస్తులు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత, సహాయం చేయడానికి 50 మందికి పైగా పురుషులు 20 బండ్లలో లోయ నుండి బయలుదేరారు.

Saints, 2:230

నార్త్ ప్లాట్ నదిని దాటుతున్న ఆరన్ జాక్సన్ మరియు ఇతర పరిశుద్ధులు.

జాక్సన్ కుటుంబం నడుస్తూ ఉండగానే, మంచు కురవడం ప్రారంభమైంది. ఆరన్ చాలా అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి నడవడం చాలా కష్టంగా ఉంది. పరిశుద్ధులు గడ్డకట్టే నదిని దాటవలసి వచ్చింది, అది ఆరన్‌ను మరింత బలహీనపరిచింది. ఆ రాత్రి, ఆరన్ మరణించాడు. దురదృష్టవశాత్తూ, అతని కుటుంబం అతను లేకుండానే ముందుకు సాగాల్సి వచ్చింది.

Saints, 2:232–34

మంచులో తమ తోపుడుబండ్లను లాగుతున్న జాక్సన్‌లు మరియు ఇతర పరిశుద్ధులు.

మరుసటి రోజు ఉదయం, నేలపై మరింత మంచు ఉంది. జాక్సన్‌లు మరియు ఇతర పరిశుద్ధులు మంచులో తమ తోపుడుబండ్లను తోసుకుంటూ లాగుతున్నారు. దేవుడు తమకు సహాయం చేయాలని వారు ప్రతిరోజూ ప్రార్థించేవారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 136:29; Saints, 2:234–35

తన భర్త గురించి కలగంటున్న ఎలిజబెత్ జాక్సన్.

ఒక రాత్రి, ఎలిజబెత్ తన పిల్లల గురించి ఆందోళన చెందుతోంది. వారు ఆకలితో మరియు చలితో ఉన్నారు. వారు సాల్ట్ లేక్ లోయకు చేరుకుంటారా? ఆమె నిద్రలోకి జారుకుంది మరియు ఆరన్‌ను చూసినట్లు కలగన్నది. అతను, “ఎలిజబెత్, ఉత్సాహంగా ఉండు” అని అన్నాడు. సహాయం వస్తోందని అతను ఆమెకు చెప్పాడు.

Saints, 2:235–36

పరిశుద్ధులకు సహాయం చేయడానికి వస్తున్న జనులు.

ఆరన్ చెప్పింది నిజమే. త్వరలో, సాల్ట్ లేక్ నుండి వచ్చిన వ్యక్తులు తమ బండ్లతో చేరుకున్నారు. వారు పరిశుద్ధులకు ఆహారం మరియు దుస్తులు ఇచ్చారు. పరిశుద్ధులు ఉత్సాహంగా నవ్వుతూ వారిని కౌగిలించుకున్నారు. వారు ఒక కీర్తన పాడి, తమ ప్రార్థనలకు సమాధానం ఇచ్చినందుకు పరలోక తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 136:28; Saints, 2:236

ప్రయాణిస్తూ చివరకు సాల్ట్ లేక్ లోయకు చేరుకున్న పరిశుద్ధులు.

వారు చివరికి లోయకు చేరుకున్నప్పుడు, అది ఆదివారం. సంఘానికి వెళ్లే బదులు, వచ్చిన పరిశుద్ధుల‌ను స్వాగతించడానికి వెళ్లాలని బ్రిగమ్ యంగ్ సాల్ట్ లేక్ పట్టణంలోని సంఘ సభ్యులతో చెప్పారు. వారు చలిగా ఉన్న మరియు అలసిపోయిన పరిశుద్ధుల‌ను పలకరించి, వారి ఇళ్లలో ఉండమని ఆహ్వానించారు.

Saints, 2:239–40