“నైట్‌లు మరియు ఇతరులు సీయోను వద్ద సమకూడుతారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“నైట్‌లు మరియు ఇతరులు సీయోను వద్ద సమకూడుతారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1830 డిసెంబరు–1831 ఆగష్టు
నైట్‌లు మరియు ఇతరులు సీయోను వద్ద సమకూడుతారు
ప్రభువు యొక్క పిలుపుకు విధేయులగుట
పాలి మరియు జోసెఫ్ నైట్ తమ కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లో నివసించారు. వారికి జోసెఫ్ ప్రవక్త గురించి బాగా తెలుసు. సువార్త నేర్చుకున్న తర్వాత, వారు సంఘంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రభువు పరిశుద్ధులను ఒహైయోకు వెళ్ళమని కోరినప్పుడు, నైట్‌లు విధేయులయ్యారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 37; Saints, 1:33, 94, 109–110
నైట్‌లు ఒహైయోకి చేరుకున్నప్పుడు సంతోషంగా ఉన్నారు. కొంతమంది పరిశుద్ధులు తన స్థలంలో నివసించవచ్చని సంఘ సభ్యుడు లేమన్ కోప్లీ చెప్పాడు. అక్కడ పంటలు వేయడానికి, ఇళ్లు కట్టుకోవడానికి సరిపడా స్థలం ఉండేది. జోసెఫ్ నైట్ మరియు అతని కుమారులు మొక్కలు నాటడానికి పొలాలను సిద్ధం చేయడానికి చాలా కష్టపడ్డారు.
Saints, 1:126–27
కానీ ఒక రోజు, లేమన్ తన స్థలం గురించి మనసు మార్చుకున్నాడు. పరిశుద్ధులు ఇకపై అక్కడ నివసించడం అతనికి ఇష్టం లేదు. అతను నైట్‌లను మరియు అందరినీ అక్కడినుండి వెళ్ళిపొమ్మని చెప్పాడు.
Saints, 1:127
పరిశుద్ధులు ఆందోళన చెందారు. ఇప్పుడు వారు నివసించడానికి ఎక్కడా చోటు లేదు. ఏమి చేయాలని వారు ప్రవక్త జోసెఫ్‌ను అడిగారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 54; Saints, 1:127
ఈ పరిశుద్ధులు మిస్సోరికి వెళ్లి సీయోనును నిర్మించాలని ప్రభువు చెప్పారు. సీయోను ప్రభువు యొక్క జనులు సమకూడగల ఒక పట్టణం. సీయోనులో వారు దేవాలయాన్ని నిర్మిస్తారు, అక్కడ వారు దేవునితో నిబంధనలు లేదా వాగ్దానాలు చేస్తారు. వారు ఈ నిబంధనలను పాటిస్తే ఆయన వారిని ఆశీర్వదిస్తారు. నైట్‌లు వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 29:1–8; 42:30–36; 45:59–66; 54:6–9; 57:1–2; Saints, 1:128
నైట్‌లు మిస్సోరికి వెళ్లినప్పుడు, పాలి తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. ఆమె ఎక్కువ కాలం బ్రతకదని ఆమె భర్త జోసెఫ్ మరియు ఆమె కుమారులు ఆందోళన చెందారు. అయితే చనిపోయే ముందు తాను సీయోనులో ఉండాలని కోరుకుంటున్నట్లు పాలి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె అన్నింటికన్నా ఎక్కువగా దానిని కోరుకుంది!
Saints, 1:128
సుదీర్ఘ ప్రయాణం తర్వాత, నైట్‌లు మిస్సోరికి చేరుకున్నారు. దానిని చూడటానికి జీవించియున్నందుకు పాలి ప్రభువుపట్ల చాలా కృతజ్ఞతతో ఉంది. ఆ ప్రదేశం అందంగా ఉందని నైట్‌లు భావించారు. అక్కడ సీయోనును నిర్మించాలనే ప్రభువు యొక్క ఆజ్ఞను పాటించగలమని వారికి నమ్మకం ఉంది.
Saints, 1:132
పరిశుద్ధులు ఒక ప్రత్యేక ప్రార్థన చేసి, ప్రభువు యొక్క జనులు వచ్చే ప్రదేశాన్ని సీయోను అని పిలిచారు. దేవాలయపు మూల ఎక్కడ ఉంటుందో గుర్తించడానికి ప్రవక్త జోసెఫ్ ఒక రాయిని ఉంచారు. కొన్ని రోజుల తర్వాత, పాలి చనిపోయింది. సీయోనుకు వచ్చి చనిపోయిన పరిశుద్ధులు పరలోకంలో విశ్రాంతి తీసుకుంటారని ప్రభువు వాగ్దానం చేశారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 59:1–2; Saints, 1:132–33