లేఖన కథలు
దేవదూతలు యాజకత్వమును పునఃస్థాపించారు


“దేవదూతలు యాజకత్వమును పునఃస్థాపించారు” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“దేవదూతలు యాజకత్వమును పునఃస్థాపించారు” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1829

2:12

దేవదూతలు యాజకత్వమును పునఃస్థాపించారు

దేవుని పనిని చేయడానికి అధికారము

జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలు మాట్లాడుతున్నారు, యేసు మరియు ప్రాచీన అమెరికాలోని జనుల చిత్రమును జోడించారు.

జోసెఫ్ మరియు ఆలీవర్ బంగారు పలకలను అనువదించినప్పుడు, యేసు ప్రతి ఒక్కరు బాప్తీస్మము పొందాలని కోరుతున్నారని వారు నేర్చుకున్నారు. ఆయన ఇతరులకు బాప్తీస్మమివ్వడానికి జనులకు అధికారాన్ని కూడా ఇచ్చారు. జోసెఫ్ బాప్తీస్మము పొందలేదు. అతడు బాప్తీస్మము గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాడు.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:68; పరిశుద్ధులు, 1:65–66

అడవిలో మోకరించి ప్రార్థిస్తున్న జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీలు.

ఇప్పుడు జనులకు బాప్తీస్మిమివ్వడానికి ఎవరు అధికారాన్ని కలిగియున్నారని జోసెఫ్, ఆలీవర్‌లు ఆశ్చర్యపడ్డారు. వారు దేవునిని అడగాలని నిర్ణయించుకున్నారు. వారు అడవిలోనికి వెళ్ళి ప్రార్థించడానికి మోకరించారు.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:68; పరిశుద్ధులు, 1:66

దేవదూత, బాప్తీస్మమిచ్చు యోహాను, జోసెఫ్ స్మిత్‌కు అహారోను యాజకత్వమును ఇచ్చును.

వారు ప్రార్థించినప్పుడు, ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. తాను చాలాకాలం క్రితం యేసు క్రీస్తుకు బాప్తీస్మమిచ్చిన బాప్తీస్మమిచ్చు యోహానును అని అతడు చెప్పాడు. అతడు జోసెఫ్, ఆలీవర్‌లకు అహరోను యాజకత్వమును ఇచ్చాడు. యాజకత్వము దేవుని శక్తి. అది దేవుని పిల్లలను దీవించడానికి ఉపయోగించబడింది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 13; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:69, 72; పరిశుద్ధులు, 1:66–67

నది వద్ద ఆలీవర్ కౌడరీకి బాప్తిస్మమిస్తున్న జోసెఫ్ స్మిత్.

అహరోను యాజకత్వముగల వ్యక్తి జనులకు పశ్చాత్తాపపడమని బోధించి, వారికి బాప్తీస్మమివ్వవచ్చని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు. జోసెఫ్, ఆలీవర్‌లను బాప్తీస్మము పొందమని యోహాను చెప్పాడు. వారు నదిలోనికి వెళ్ళి ఒకరికొకరు బాప్తీస్మము ఇచ్చుకున్నారు. వారు నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు చాలా సంతోషించారు!

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:70–73

పేతురు, యాకోబు, మరియు యోహానులు జోసెఫ్ స్మిత్‌కు మెల్కీసెదకు యాజకత్వమును ఇచ్చారు.

తరువాత, మిగిలిన దేవదూతలు వచ్చారు. ముగ్గురు అపొస్తలులైన—పేతురు, యాకోబు, మరియు యోహానులు—జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు మెల్కీసెదకు యాజకత్వమును ఇచ్చారు. ఇప్పుడు జోసెఫ్‌, ఆలీవర్‌లు పరిశుద్ధాత్మ వరమును ఇవ్వగలరు. జోసెఫ్, ఆలీవర్‌లు అపొస్తులులుగా కూడ మారారు. వారు సంఘాన్ని నడిపించగలరు మరియు యేసు క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులుగా ఉండగలరు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 27:12; పరిశుద్ధులు, 1:84