సర్వసభ్య సమావేశము
నీవు క్రీస్తువు
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:12

నీవు క్రీస్తువు

(మత్తయి 16:16)

మన పిల్లలు యేసు క్రీస్తునందు విశ్వసించడానికి, నిబంధన ద్వారా యేసు క్రీస్తుకు మరియు ఆయన సంఘానికి చెందడానికి మరియు యేసు క్రీస్తు వలె మారడానికి ప్రయాసపడాలని మనము కోరతాము.

మా కుమారుడు ఎలి నాల్గవ తరగతిలో ఉన్నప్పుడు, అతడి తరగతి ఒక నకిలీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, దానిలో అతడు తరగతి జడ్జిగా సేవ చేయడానికి తన సహవాసుల చేత ఎంపిక చేయబడ్డాడు. ఒకరోజు, యూటా రెండవ జిల్లా న్యాయస్థానంలో పదవీకాలం కొనసాగిస్తున్న ఒక న్యాయమూర్తి ఎలిని సందర్శించి, తన అధికారిక వస్త్రాలను ఎలికి ధరింపజేసి, ఆ తరువాత వారి తరగతి కోసం ఒక ప్రమాణ స్వీకారం నిర్వహించాడు. ప్రభావితమైన ఎలి యొక్క యువ మనసులో, ఇది న్యాయశాస్త్రం మరియు శాసనకర్తయగు యేసు క్రీస్తును గురించి అధ్యయనం చేయాలనే మనోభావనను రగిలించింది.

సంవత్సరాల తరబడి శ్రద్ధగా ప్రయత్నించిన తరువాత, న్యాయ కళాశాల కోసం తాను ఎంచుకున్న అత్యుత్తమ ఎంపికలలో ఒకదానితో ఇంటర్వ్యూకి ఎలి ఆహ్వానాన్ని పొందాడు. అతడు ఇలా చెప్పాడు, “అమ్మా, నన్ను 10 ప్రశ్నలు అడిగారు. చివరి ప్రశ్న ఏమిటంటే, ‘ఏది ఒప్పు మరియు ఏది తప్పు అనే నైతిక నిర్ణయాన్ని మీరు ఎక్కడ నుండి పొందుతారు?’ చరిత్ర అంతటా మానవజాతి, వారి జీవితాలను ఒకరి జీవితంలో పునరావృతమయ్యే నమూనాల నుండి రూపొందించడం ద్వారా నైతిక వ్యవస్థలను పొందింది. నా జీవితానికి నమూనాగా చేసుకోవడానికి నేను ప్రయత్నించే నైతికత యొక్క ఆదర్శము యేసు క్రీస్తే. సమస్త మానవాళి కొండమీది ప్రసంగములో యేసు క్రీస్తు యొక్క బోధనలను పాటించిన యెడల, ప్రపంచము ఉత్తమమైనదిగా, మరింత శాంతికరమైన స్థలంగా ఉండగలదని” నేను పేర్కొన్నాను. అప్పుడు ఇంటర్యూ ముగిసింది, అతడు తనలో తాను, “న్యాయ కళాశాలకు వెళ్లడానికి నా అవకాశాన్ని కోల్పోయాను. లౌకిక విద్యారంగం ఏదీ యేసు క్రీస్తు గురించి వినాలని కోరుకోదు” అని అనుకున్నాడు.

రెండు వారాల తర్వాత, ఎలి ఉపకారవేతనముతో అంగీకరించబడ్డాడు. దానిని అంగీకరించకముందు, మేము కళాశాల ఆవరణను సందర్శించాము. న్యాయ కళాశాల ఒక కోట లాగా ఉంది మరియు ఒక అందమైన సరస్సుకు ఎదురుగా ఉన్న కొండపై ఏర్పాటు చేయబడింది. అసాధారణంగా, మేము అద్భుతమైన గ్రంథాలయం మరియు గంభీరమైన వరండాల గుండా నడుస్తున్నప్పుడు, కొండమీది ప్రసంగంలోని లక్షణాలను మేము రాతిచెక్కడాలపై మరియు బ్యానర్లపై కనుగొన్నాము.

కొండమీది ప్రసంగము ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇవ్వబడిన అత్యంత ముఖ్యమైన ప్రసంగము, దాని బోధనలలో అగ్రగామిగా ఉన్నది. యేసు క్రీస్తు యొక్క స్వభావాన్ని, ఆయన దైవిక లక్షణాలను మరియు ఆయన వలే కావాలనే మన అంతిమ ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరే ఇతర ప్రసంగం మనకు ఇంతగా సహాయపడలేదు.

యేసు క్రీస్తు యొక్క జీవితకాల శిష్యత్వము మన గృహాలలో—మరియు ప్రాథమికలో 18 నెలల వయస్సులోనే ప్రారంభమవుతుంది. మన పిల్లలు యేసు క్రీస్తునందు విశ్వసించడానికి, నిబంధన ద్వారా యేసు క్రీస్తుకు మరియు ఆయన సంఘానికి చెందడానికి మరియు యేసు క్రీస్తు వలె మారడానికి ప్రయాసపడాలని మనము కోరతాము.

యేసు క్రీస్తునందు విశ్వసించండి.

ముందుగా, యేసు క్రీస్తునందు విశ్వసించండి.

జీవాహారమైన ప్రసంగము తరువాత, “ఆయన శిష్యులలో అనేకులు” ఆయన బోధనలు మరియు సిద్ధాంతము అంగీకరించడానికి కష్టమైనదిగా కనుగొన్నారు మరియు వారు “వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. తరువాత రక్షకుడు పన్నెండుమంది వైపు తిరిగి, హృదయవిదారకమైన ప్రశ్నను అడిగారు: “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?”

పేతురు జవాబిచ్చాడు:

“ప్రభువా, యెవని యొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.

“… నీవే జీవముగల దేవుని కుమారుడవని, క్రీస్తువని మేము విశ్వసించి యెరిగియున్నాము.”

పేతురు రుజువు చేసినట్లుగా, నమ్మకమనేది “ఒకరియందు విశ్వాసమును కలిగియుండుట లేదా ఏదైనా నిజమని అంగీకరించుట.” మన విశ్వాసము రక్షణకు దారితీయడానికి, అది ప్రభువైన యేసు క్రీస్తునందు కేంద్రీకరించబడాలి. “ఆయన ఉన్నాడనే అభయాన్ని మనము కలిగియుండి, ఆయన [నిజమైన] లక్షణాన్ని [మరియు స్వభావమును] [అర్థం చేసుకొని], ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నామనే జ్ఞానమును మనము కలిగియున్నప్పుడు [యేసు] క్రీస్తు నందు మన విశ్వాసాన్ని … మనము సాధన చేస్తాము.”

మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ప్రకటించారు, “యేసు క్రీస్తు యందు విశ్వాసము సమస్త నమ్మకానికి పునాది మరియు దైవిక శక్తికి మార్గము.”

పిల్లలు యేసు క్రీస్తునందు వారి విశ్వాసమును బలపరచుకొని, ఆయన దైవిక శక్తిని పొందడానికి మనము ఎలా సహాయపడగలము? మనము చూడవలసినది మన రక్షకుని వైపు మాత్రమే.

“[ప్రభువు] జనులతో ఇలా చెప్తూ మాట్లాడారు:

“ఇదిగో, … యేసు క్రీస్తును నేనే. …

“లేచి నా యొద్దకు రండి. …

“… అంతట సమూహము ముందుకు వెళ్ళి, తమ చేతులతో ఆయన ప్రక్కలను తాకిరి మరియు ఆయన చేతులలో, కాళ్ళలో మేకుల గుర్తులను తడిమి తెలుసుకొనిరి; వారందరు ముందుకు వెళ్ళువరకు ఒకని తరువాత ఒకడు వెళ్ళుచూ వారు దీనిని చేసిరి, వారు తమ కన్నులతో చూచి, చేతులతో తడిమి తెలుసుకొనిరి మరియు ఎవరైతే రావలెనని ప్రవక్తల చేత వ్రాయబడినదో అది నిశ్చయముగా ఆయనేనని తెలుసుకొని, సాక్ష్యమిచ్చిరి.”

ఇప్పుడు చెప్పబడిన సూత్రాలు చిన్న పిల్లల జీవితాలలో ఎలా అన్వయించబడతాయో ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త సాక్ష్యాలను వారు వింటున్నారా? ఆయన పరిచర్య మరియు దైవత్వము యొక్క పూజ్యమైన, ఆరాధనా చిత్రాలను వారు చూస్తున్నారా? ఆయన వాస్తవికతను, దైవత్వమును గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుటను వారు భావించారా మరియు గుర్తించారా? వారు ఆయన సందేశము మరియు పరిచర్య గురించి తెలుసుకున్నారా?

యేసు క్రీస్తుకు మరియు ఆయన సంఘానికి చెందియుండుట

రెండవది, యేసు క్రీస్తుకు మరియు ఆయన సంఘానికి చెందియుండుట

రాజైన బెంజమిన్ యొక్క జనులు హృదయములో బలమైన మార్పును అనుభవించారు మరియు నిబంధన ద్వారా దేవుని చిత్తాన్ని చేయడానికి వారి జీవితాలను సమర్పించుకున్నారు. దేవునితో, యేసు క్రీస్తుతో వారు చేసిన నిబంధన కారణముగా, వారు “క్రీస్తు యొక్క సంతానమని, ఆయన కుమారులు, కుమార్తెలని పిలువబడుదురు.” యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, మనము ఆయన రాజ్యమును నిర్మించడానికి మరియు ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి నిబంధనపరమైన బాధ్యతను కలిగియున్నాము.

దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధం చేయడానికి సామాగ్రి.

పిల్లలు పవిత్రమైన నిబంధనలు చేసి, పాటించడానికి మనం ఎలా సహాయపడగలము? రండి, నన్ను అనుసరించుడి చేతిపుస్తకము యొక్క అనుబంధము ఎ మరియు బిలో, దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధం చేసే పవిత్ర బాధ్యతలో కుటుంబాలను శక్తివంతం చేసే మరియు బోధకులకు, నాయకులకు మద్దతు ఇచ్చే సంభాషణ ప్రారంభాలను, పాఠాలను మనము కనుగొంటాము.

యేసు క్రీస్తు వలె మారుట

మూడవది, యేసు క్రీస్తు వలె మారుట.

మోర్మన్ గ్రంథములో, రక్షకుడు క్రొత్తగా పిలువబడిన తన శిష్యులను వీలైనంత ఎక్కువగా ఆయనను అనుకరించమని హెచ్చరించారు: “కావున, మీరు ఏ విధమైన మనుష్యులై యుండవలెను? నేను ఉన్నట్లుగానే అని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.”

బాప్తిస్మము పొంది, నిర్ధారించబడిన పిల్లలు వారిని మరియు ఇతరులను యేసు క్రీస్తు వద్దకు సమకూర్చే వారి నిబంధన బాధ్యతను నెరవేర్చడానికి మనము ఎలా సహాయపడగలము? జీవితకాల శిష్యత్వానికి మనము “వినువారు మాత్రమైయుండక, వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై యుండుట” అవసరము.

ప్రభువు యొక్క అతి చిన్న శిష్యులకు ఆహ్వానాలను ఇచ్చినప్పుడు, వారిని నడిపించడానికి, మార్గనిర్దేశాన్ని ఇవ్వడానికి, వారి ప్రక్కన నడవడానికి మరియు మార్గము కనుగొనడంలో వారికి సహాయపడడానికి దయచేసి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. వారు బోధించడానికి, సాక్ష్యమివ్వడానికి, ప్రార్థించడానికి లేదా సేవ చేయడానికి సిద్ధపడినప్పుడు, ఈ ప్రశస్థమైన చిన్నపిల్లలకు సలహా ఇవ్వండి, తద్వారా వారు నమ్మకంగా ఉంటారు మరియు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది వారి సంఘమని మరియు రక్షకుని రాకడ కొరకు సిద్ధపడడంలో వారు ముఖ్యమైన పాత్రను కలిగియున్నారని తెలుసుకోవడానికి వారికి సహాయపడడానికి ప్రేరేపించబడిన విధానాలను వెదకండి.

యేసు క్రీస్తు మన జీవితాలకు కేంద్రముగా మారినప్పుడు, మనము ఏమి కోరుతున్నాము మరియు మనము దానిని ఎలా కోరుతున్నాము అనేది శాశ్వతంగా మార్చబడుతుంది. పరివర్తన సమస్తమును మార్చివేస్తుంది! అది “మనము చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరుకొనక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండునట్లు” మన స్వభావాన్ని మారుస్తుంది. అది మన సమయాన్ని, మన డబ్బును, మానసిక శక్తిని ఉపయోగించే విధానాన్ని; మనము చదివే దానిని, చూచే దానిని, వినే దానిని మరియు పంచుకొనే దానిని మారుస్తుంది. అది ఒక విశిష్టమైన, విద్యాపరమైన, వృత్తి దిశను నిర్ణయించే ఇంటర్వ్యూలో మనం స్పందించే విధానాన్ని కూడా మారుస్తుంది.

మన జీవితాలలోని ప్రతి మూలలోనికి యేసు క్రీస్తు యొక్క వెలుగును మనము నింపాలి. మన గృహాలలో మరియు ఈ సంఘము యొక్క ప్రతీ సమావేశంలో, ఆయన పూర్వమర్త్య జీవితపు దైవత్వము, ఆయన దైవిక నియమితకార్యము మరియు మరణపు చెరను తప్పించిన ఆయన పునరుత్థానము యొక్క యథార్థతను గూర్చి మనము సాక్ష్యమివ్వని యెడల మన ప్రేమ, సేవ, నిజాయితీ, వినయము, కృతజ్ఞత మరియు కనికరము గురించిన మన సందేశాలు ఆలోచనాపూర్వకంగా జీవించడానికి ప్రోత్సహించే ప్రసంగములు మాత్రమే కాగలవు. యేసు క్రీస్తు లేకుండా మార్చగల శక్తి లేదు, ఆపేక్షించగల ఉద్దేశ్యం లేదు మరియు జీవితపు సవాళ్లను (సువార్త ఉద్దేశ్యాలు మరియు సూత్రాలతో) సమన్వయపరచడం ఉండదు. యేసు క్రీస్తునందు మన శిష్యత్వము తేలికగా మారిన యెడల, అది మన పిల్లలకు గొప్ప ఆపద కలిగించవచ్చు.

మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు, పరలోకమందున్న వారి తండ్రి మరియు రక్షకుడైన యేసు క్రీస్తు కూడా వారిని ప్రేమిస్తున్నారని మనము వారికి చెబుతున్నామా? మన ప్రేమ ఆదరణనిచ్చి ప్రేరేపించగలదు, కానీ వారి ప్రేమ పరిశుద్ధపరచగలదు, ఉన్నతస్థితిలో ఉంచగలదు మరియు స్వస్థపరచగలదు..

ఈ యేసు కల్పితమైన యేసు లేదా సరళమైన లేదా భౌతిక శరీరము లేని యేసు లేదా సాధారణమైన యేసు, తెలియని యేసు కాకూడదు, కానీ ఆయన మహిమపరచబడిన, సర్వశక్తిమంతుడైన, పునరుత్థానము చెందిన, ఉన్నతస్థితి పొందిన, పూజింపదగిన, శక్తిమంతుడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, ఆయన రక్షించుటకు శక్తిమంతుడు. “రక్షించబడడానికి మనము విలువైనవారము!”, అని ఫిలిప్పీన్స్‌లో ఒక చిన్న బిడ్డ ఒకరోజు సంతోషంగా నాకు సాక్ష్యమిచ్చింది. “[గొప్ప] ప్రాయశ్చిత్తమై యుండుటకు దేవుడు పంపిన” ఆయన పవిత్రమైన మరియు పరిశుద్ధ నామములో, ఆమేన్.

వివరణలు

  1. మత్తయి 5–7 చూడండి.

  2. కొండమీది ప్రసంగము “ఎప్పటికీ ఇవ్వబడిన మిక్కిలి గొప్ప ప్రసంగము” (“The Way Home,” Ensign, May 1975, 15) అని అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ చెప్పారు.

  3. See “Seek Christlike Attributes,” chapter 6 of Preach My Gospel: A Guide to Sharing the Gospel of Jesus Christ (2023), 123–38.

  4. యోహాను 6:66; వివరణ చేర్చబడినది.

  5. యోహాను 6:67.

  6. మత్తయి 6:68–69; ఉద్ఘాటన జోడించబడింది.

  7. Guide to the Scriptures, “Belief, Believe,” Gospel Library.

  8. అపొస్తులుల కార్యములు 4:10–12; మోషైయ 3:17; మొరోనై 7:24–26; విశ్వాసప్రమాణాలు 1:4 చూడండి.

  9. Topics and Questions, “Faith in Jesus Christ,” Gospel Library; see also Lectures on Faith (1985), 38.

  10. Russell M. Nelson, “Christ Is Risen; Faith in Him Will Move Mountains,” Liahona, May 2021, 102.

  11. 3 నీఫై 11:9--10, 14--15; వివరణ చేర్చబడింది.

  12. మోషైయ 5:2; ఆల్మా 5:12, 14 చూడండి.

  13. మోషైయ 5:7.

  14. See Russell M. Nelson, “The Lord Jesus Christ Will Come Again,” Liahona, Nov. 2024, 121–22.

  15. See appendix A, “For Parents—Preparing Your Children for a Lifetime on God’s Covenant Path,” and appendix B, “For Primary—Preparing Children for a Lifetime on God’s Covenant Path,” in Come, Follow Me—For Home and Church: Doctrine and Covenants 2025.

  16. 3 నీఫై 27:27; 2 నీఫై 2:6--8; మొరోనై 7:48 కూడా చూడండి. సిలెస్టియల్ రాజ్యమును స్వతంత్రించుకొనువారు నీతిగల వ్యక్తులు, వారు యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా, ఆయన వలే మార్పు చెందారని లేఖనాలు బోధించును.

  17. See “A Message for Children from President Russell M. Nelson” (video, Friend to Friend 2021 broadcast), Gospel Library.

  18. యాకోబు 1:22.

  19. See “I Am a Child of God,” Hymns, no. 301; see also యోహాను 14:6 కూడా చూడండి.

  20. ప్రధాన చేతిపుస్తకం: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సేవ చేయుట, 12.2.1.2, 29.2.1.4, సువార్త గ్రంథాలయం చూడండి.

  21. ప్రధాన చేతి పుస్తకం, 29.2.2 చూడండి.

  22. ప్రధాన చేతి పుస్తకం, 12.2.1.2, 29.6 చూడండి.

  23. ప్రధాన చేతి పుస్తకం, 12.2.1.3; “Primary Children Invited to Serve Other Children in 2025,” Newsroom, Jan. 9, 2025, newsroom.ChurchofJesusChrist.org చూడండి.

  24. అపొస్తులుల కార్యములు 1:11; 1 థెస్సలోనికయులకు 4:16; సిద్ధాంతము మరియు నిబంధనలు 1:12; 34:6–7; 49:7 చూడండి.

  25. మోషైయ 5:2.

  26. యోహాను 8:12; సిద్ధాంతము మరియు నిబంధనలు 93:2 చూడండి.

  27. ఆల్మా 19:6 చూడండి.

  28. సిద్ధాంతము మరియు నిబంధనలు 76:4 చూడండి.

  29. యోహాను 3:14–17 చూడండి.

  30. 1 కొరింథీయులకు 15:20--23 చూడండి.

  31. See Becky Craven, “Careful versus Casual,” Liahona, May 2019, 9–11.

  32. 2 నీఫై 25:26 చూడండి.

  33. యోహాను 3:16; 13:34–35; 1 నీఫై 19:9 చూడండి.

  34. మోషే 6:59–60; 10:33 కూడా చూడండి.

  35. సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7; 84:36-38 Moses 1:39 చూడండి. అధ్యక్షులు ఫీల్డింగ్ జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ ఇలా వ్రాసారు: “తండ్రికి కలిగిన సమస్తము, ఆయన ఆజ్ఞలకు విధేయులైన వారికి ఇవ్వబడునని ఆయన కుమారుని ద్వారా వాగ్దానము చేసారు. వారు జ్ఞానమందును, తెలివియందు, మరియు శక్తియందు వృద్ధి చెంది, పరిపూర్ణమైన దినము యొక్క సంపూర్ణత వారిపై కుమ్మరించబడేంత వరకు కృప వెంబడి కృపను పొందుతారు.” (Doctrines of Salvation, comp. Bruce R. McConkie [1955], 02:36).

  36. 3 నీఫై 17:7 చూడండి.

  37. 2 పేతురు 1:16–18; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17 చూడండి.

  38. సిద్ధాంతము మరియు నిబంధనలు 110:1–4 చూడండి.

  39. See Dallin H. Oaks, “Apostasy and Restoration,” Ensign, May 1995, 84–86.

  40. ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్:

    “పరిశుద్ధమైన భావాన్ని కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యత ఇది---ఒక వ్యక్తి పవిత్రమైన విషయాలను మెచ్చుకొనకపోతే, అతడు వాటిని కోల్పోతాడు. భక్తి భావన లేకపోవడంతో, అతడు వైఖరిలో తేలికగా మారతాడు మరియు ప్రవర్తనలో నిర్లక్ష్యంగా మారతాడు. దేవునితో అతడి నిబంధనలు ఇచ్చే స్థిరత్వం నుండి మరియు స్పష్టత నుండి ఒకరు క్రమంగా దూరమవుతారు. దేవునికి జవాబుదారుడనే అతడి భావన తగ్గిపోతుంది మరియు తరువాత మరచిపోబడుతుంది. ఆ తరువాత, అతడు తన స్వంత ఓదార్పును మరియు తన అదుపులేని కోరికలను తృప్తిపరచుకోవడానికి మాత్రమే శ్రద్ధ తీసుకుంటాడు. చివరిగా, అతడు పరిశుద్ధమైన విషయాలను, దేవునిని కూడ తృణీకరిస్తాడు, మరియు ఆపై తనను తాను తృణీకరించుకుంటాడు.

    “మరొకవైపు, పరిశుద్ధమైన భావనతో ఒకరు జ్ఞానము, సత్యమునందు ఎదుగుతారు. పరిశుద్ధాత్మ అతడి నిరంతరమైన, స్థిరమైన సహచరి కాగలదు. అతడు పవిత్ర స్థలాలలో ఎక్కువగా నిలబడతాడు మరియు పవిత్రమైన విషయాలను అప్పగించబడతాడు. ద్వేషం మరియు నిరాశకు పూర్తిగా వ్యతిరేకం, అతడి ముగింపు నిత్యజీవము” (“A Sense of the Sacred” [Brigham Young University devotional, Nov. 7, 2004], 1, speeches.byu.edu).

  41. అపొస్తులుల కార్యములు 17:23; ఆల్మా 30:52–53 చూడండి.

  42. యోహాను 17:3–5 చూడండి.

  43. మోషైయ 3:5 చూడండి.

  44. లూకా 24:1–6; 3 నీఫై 11 చూడండి.

  45. ఫిలిప్పీయులకు 2:9–11 చూడండి.

  46. 2 నీఫై 25:29 చూడండి.

  47. నిర్గమకాండము 19:16; లూకా 4:32; యోహాను 1:12; రోమా 13:1; 1 నీఫై 17:48.

  48. యోహాను 3:16 చూడండి.

  49. 2 నీఫై 31:19; ఆల్మా 7:14; 34:18 చూడండి.

  50. రోమా 3:25; 1 యోహాను 2:2 ; 4:10 కూడా చూడండి.