సర్వసభ్య సమావేశము
విశ్వాసము: నమ్మకం మరియు విధేయత యొక్క బంధం
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:17

విశ్వాసము: నమ్మకం మరియు విధేయత యొక్క బంధం

విశ్వాసం అనేది మనం యేసు క్రీస్తును నమ్మినప్పుడు మొలకెత్తుతుందని మరియు మనం ఆయనపట్ల నమ్మకంగా, విధేయతతో ఉన్నప్పుడు వికసిస్తుందని గమనించండి.

నాకు పదిహేడేళ్ళు ఉన్నప్పుడు, నేను ఈత నేర్పుతానని నా స్నేహితుడు హోసే లూయిస్‌తో ఒక ఒప్పందం చేసాను. కాబట్టి ఒకరోజు ప్రొద్దున మేము సాధన చేయడానికి వెళ్ళాము. మా పాఠం పూర్తయిన తర్వాత నేను కొలను విడిచి వెళ్తున్నప్పుడు, నా స్నేహితుడు సహాయం కోసం అరవడం విన్నాను. అతను కొలను యొక్క లోతైన చివరలో మునిగిపోతున్నాడు.

సహాయం కోసం ప్రార్థిస్తూ నేను నీళ్ళలోకి దూకి, అతని వైపు ఈదాను. అతని చేయి పట్టుకొని పైకి లాగుతున్నప్పుడు, భయంతో ఉన్న నా స్నేహితుడు నా వీపుమీద ఎక్కి నా మెడ చుట్టూ చేతులు బిగించాడు. అప్పుడు ఇద్దరం మునిగిపోతున్నాము. పైకి రావడానికి నా వంతు కృషి చేస్తూ, దేవుని నుండి ఒక అద్భుతాన్ని కోరుతూ నేను నా బలమంతటితో ప్రార్థించాను. తరువాత, నెమ్మదిగా కానీ స్థిరంగా, ఒక చేయి నన్ను కొలనులో తక్కువ లోతు ఉన్న వైపుకు తోస్తూ, మమ్మల్ని సురక్షితంగా తీసుకువెళుతున్నట్లు నేను భావించినప్పుడు దేవుని శక్తి ప్రత్యక్షపరచబడింది.

ఈ అనుభవం అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు ఒకసారి బోధించిన లోతైన పాఠాన్ని ధృవీకరించింది: “నీటిలో మునిగిపోతున్న వ్యక్తి గాలిని అందుకొనుటకు మరియు ఎగ ఊపిరి తీసుకొన్నప్పడు, అదే తీవ్రతతో మీ జీవితంలో ప్రభువు యొక్క శక్తి కొరకు మీరు చేరుకున్నప్పుడు, యేసు క్రీస్తు నుండి శక్తి మీదగును.”

ప్రియమైన పిల్లలు మరియు యౌవనులారా, ఈ రోజు నేను యేసు క్రీస్తు నందు విశ్వాసము అనే ఆవశ్యకమైన సూత్రం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను.

క్రీస్తు నందు విశ్వాసం అంటే ఆయనను నమ్మడం

క్రీస్తు నందు విశ్వాసం కలిగియుండడం అంటే అర్థమేమిటి? మనం ఆయనను నమ్ముతున్నాం లేదా ఆయన నిజమనే సాక్ష్యాన్ని కలిగియున్నాం అని దానర్థమా? అది ఒక ప్రారంభం కావచ్చు, కానీ అది అంతకు మించినది. విశ్వాసం అంటే నమ్మకం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బాగా నమ్మే ఒక వ్యక్తి గురించి ఆలోచించండి—బహుశా ఒక కుటుంబ సభ్యుడు లేదా ఒక స్నేహితుడు. మీరు వారిని ఎందుకు నమ్ముతారు? బహుశా మీరు వారి స్థిరమైన ప్రేమను మరియు సహాయాన్ని చూడడం వలన కావచ్చు.

క్రీస్తు నందు మనం విశ్వాసం కలిగియున్నప్పుడు, మనం ఆయన దీవెనలను గుర్తిస్తాం మరియు ఆయనతో ఒక నమ్మకమైన బంధాన్ని పెంపొందించుకుంటాం.

క్రీస్తునందు నమ్మకాన్ని మీరు ఎలా పెంచుకోగలరు?

ఇటీవలి యువజన భక్తిసమావేశంలో, మీ జీవితంలో పరలోకపు కాంతి కిరణాన్ని పొందిన సమయాన్ని ధ్యానించమని మీరు ఆహ్వానించబడ్డారు. దాన్ని ప్రయత్నించండి!

క్రీస్తు గురించి, ఆయన ప్రాయశ్చిత్తం మరియు సువార్త మీ జీవితానికి తీసుకువచ్చే ఆనందం గురించి ధ్యానం చేయడం ద్వారా ప్రారంభించండి. అలాగే, దేవుడు మీ కోసం, మీ ప్రియమైనవారి కోసం మరియు లేఖనాలలోని జనుల కోసం ఉన్నారని “ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకాలను” నమోదు చేయండి. ఇప్పుడు, ఆత్మ ఈ సాక్ష్యాలను మీ హృదయములు అను “పలకల” మీద చెక్కే వరకు అవి మీ జీవితానికి శక్తిని తీసుకురావు. కాబట్టి ఈ అద్భుతాలు సరైన సమయంలో జరగడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదాన్ని ధ్యానించి, నమోదు చేయండి.

తరువాత, ఈ అభ్యాసాన్ని దేవునికి దగ్గరయ్యే అవకాశంగా ఉపయోగించుకోండి. మీ పరలోక తండ్రిని మొదటిసారి ప్రార్థించినట్లుగా ప్రార్థించండి. ఆయన ఆశీర్వాదాల పట్ల మీ ప్రేమను, కృతజ్ఞతను తెలియజేయండి. మీ గురించి మరియు మీ జీవితం సాగుతున్న మార్గం గురించి ఆయన ఎలా భావిస్తున్నారో కూడా ఆయనను అడగండి.

మీరు నిజాయితీపరులు, వినయము గలవారైతే, మీరు ఆయన సమాధానాన్ని వింటారు మరియు పరలోక తండ్రితో, యేసు క్రీస్తుతో వ్యక్తిగత, శాశ్వత సంబంధాన్ని ప్రారంభిస్తారు. అంతే కాదు, మీ మతపరమైన అలవాట్లు అర్థవంతంగా మారతాయి! ఉదాహరణకు, మీ ప్రార్థనలు, వ్యక్తిగత అధ్యయనం మరియు దేవాలయ ఆరాధనను వారి గురించి తెలుసుకోవడానికి మరియు వారితో ఉండడానికి అవకాశాలుగా మీరు చూస్తారు.

విశ్వాసం విధేయతతో వర్ధిల్లుతుంది

విశ్వాసం అనేది మనం యేసు క్రీస్తును నమ్మినప్పుడు మొలకెత్తుతుందని మరియు మనం ఆయనపట్ల నమ్మకంగా, విధేయతతో ఉన్నప్పుడు వికసిస్తుందని గమనించండి. మీరు క్రీస్తుతో నిజమైన సంబంధాన్ని కోరుకుంటే, నిబంధనలు చేయడం ద్వారా మరియు వాటిని విశ్వాసంతో, విధేయతతో గౌరవించడం ద్వారా ఆయనకు చూపించండి. యేసు క్రీస్తుతో నిబంధనలు చేయడం నిరీక్షణను పెంచుతుంది. వాటిని గౌరవించడం విశ్వాసాన్ని పెంచుతుంది.

ఒక వ్యక్తిగత ఉదాహరణ చెబుతాను: నా చిన్నతనంలో, ఒక రోజు మా అమ్మ ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావని నేను ఆమెను అడిగినప్పుడు, ఆమె సున్నితంగా, “నువ్వు మంచి అబ్బాయివి కావాలి” అని చెప్పింది. ఆమె బాధకు కారణం నేను కాదని తెలిసినప్పటికీ, నేను మా అమ్మను చాలా ప్రేమించాను, నమ్మాను మరియు ఆమె జీవితంలో కష్టాన్ని తగ్గించాలనుకున్నాను. కాబట్టి, కన్నీళ్లతో మరియు తొమ్మిదేళ్ల పిల్లవాడికి ఉండే పూర్తి గంభీరతతో, నేను ఎల్లప్పుడూ ఉత్తమ కొడుకుగా ఉండడానికి మరియు ఆమె గర్వపడేలా చేయడానికి ప్రయత్నిస్తానని ఆ రోజు ఆమెకు వాగ్దానం చేసాను.

ఆ వాగ్దానం నాపై ఎంత శక్తిని కలిగి ఉండేదో—ఇంకా ఎంత శక్తిని కలిగి ఉందో—మీరు ఊహించగలరా?

ఆమెతో చేసిన ఆ వాగ్దానం నా జీవితాన్ని నడిపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు, నా చర్యలు ఆమెను సంతోషపరుస్తాయో లేదో నేను ఆలోచిస్తాను. ఈ వాగ్దానం యొక్క బంధం మరియు మా అమ్మతో ఉన్న సంబంధం నా జీవితమంతా నా ప్రవర్తనకు లంగరులుగా నిలిచాయి.

చాలా సంవత్సరాల తరువాత, నేను యేసు క్రీస్తు గురించి బాగా తెలుసుకున్నప్పుడు, నా విశ్వాసాన్ని ఆయనపై ఎలా ఆధారం చేసుకోవాలో నాకు అప్పటికే తెలుసు. నేను ప్రభువుతో నిబంధనలు చేసాను మరియు నేను వాటిని గౌరవించడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన నా పాపాలను క్షమించారు, నా జీవితాన్ని నడిపించారు మరియు పూర్తిగా “తన ప్రేమతో నన్ను నింపారు”. క్రీస్తు నాలో ఆయన పట్ల లోతైన ప్రేమను, గౌరవాన్ని మరియు విధేయతను నింపారు.

“విశ్వాసం అనేది క్రియా సూత్రము” అని మరియు “విశ్వాసములేకుండ [దేవునికి] ఇష్టుడైయుండుట అసాధ్యము” అని మీకు అర్థమైందా?

మీరు దేవునికి ఇష్టమైనది చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఐగుప్తులో పోతీఫరు భార్య చేత శోధించబడినప్పుడు యోసేపు చెప్పినట్లుగా మీరు ఇలా చెప్తారు: “కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?” మరియు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, మీరు యువ ప్రవక్త జోసెఫ్‌లా ఇలా చెప్తారు: “దానిని నేనెరుగుదును, దేవుడు దానిని యెరిగియున్నాడని నేనెరుగుదును, దానిని నేను తృణీకరించలేను … ఆవిధముగా చేయుట వలన దేవుని బాధించెదనని నేనెరుగుదును.”

కాబట్టి యేసు క్రీస్తుపై విశ్వాసం అనేది విధేయతతో మరియు ప్రేమతో ఏర్పడిన నమ్మకం యొక్క బంధం. మరో మాటలో చెప్పాలంటే, కనికరముతో కూడిన దేవుని ప్రేమ (హెసెడ్) పట్ల కృతజ్ఞతగా, మనం ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా విధేయతతో కూడిన మన ప్రేమను (ఎమునా) చూపిస్తాము.

“నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే … నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందును,” అని క్రీస్తు వాగ్దానమిచ్చారు. మీరు ఆయనకు విధేయులుగా ఉండడానికి కట్టుబడి ఉంటే, ఆయన మీ పట్ల తన ప్రేమను ప్రదర్శిస్తారు.

ప్రతికూలతను ఎదుర్కోవడంలో విశ్వాసం

కానీ ఆయన అద్భుతాలు అవసరమయ్యే ప్రతికూల పరిస్థితులపట్ల మీరు ఎలా స్పందించాలి? సవాళ్లు అనివార్యమైనవి మరియు కొన్నిసార్లు భయానకమైనవి అయినప్పటికీ, “ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు” అని 2025 ఎఫ్‌ఎస్‌వై ఇతివృత్తం ఆహ్వానించినట్లుగా, ఆయన వైపు ధైర్యంగా నడవండి.

ధైర్యంగా ఆయన వైపు మీరెలా నడవగలరు?

మీరు తెలియని ప్రాంతంలో అన్వేషకుడిగా ఉన్నారని ఊహించుకోండి. మీ ముందున్న అడ్డంకులను అధిగమించడానికి, మీకు వెలుగు అవసరం. దేవుని పట్ల మీ విశ్వాసం మరియు ఆయనతో మీ నిరంతర సంభాషణలు మీ లాంతరుకు ఇంధనం. కాబట్టి మీరు చీకటిని, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, వాటి వైపు గుడ్డిగా నడవడానికి బదులుగా, అనిశ్చిత మార్గంలో ఆశా కిరణాలను వెదజల్లడానికి మీరు క్రీస్తుపై విశ్వాసమనే నూనెతో నిండిన మీ దీపాన్ని వెలిగిస్తారు. మీ గత అనుభవాలు, ప్రభువు మీ ప్రయాణంలో మిమ్మల్ని ఆదుకుంటారనే మీ నిరీక్షణను పెంచుతాయి.

లాంతరుతో పర్వతారోహకుడు.

క్రీస్తు నందు మీ నిరీక్షణ మరియు విశ్వాసంతో మీరు ఎంత దూరం వెళతారు?

కొలను వద్ద నా కథ గుర్తుందా? నిరాశ చెందిన ఆ క్షణంలో, అద్భుతం నేను ఊహించిన విధంగానే జరిగింది, కానీ అది ఎల్లప్పుడూ మన చిత్త ప్రకారం జరుగుతుందని దేవుడు హామీ ఇవ్వలేదు. మన విశ్వాసం క్రీస్తుపై కేంద్రీకృతమై ఉండాలి మరియు ఆయన వాటిని పంపాలని ఎంచుకున్నట్లుగా, ఆయన ఆశీర్వాదాలపై మన నిరీక్షణ ఉండాలి. “అద్భుతాలను ఆశించండి,” కానీ “మన జీవితాలలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వండి.”

విశ్వాసులైన తన జనులకు దేవుని వాగ్దానాలు

నా యౌవన స్నేహితులారా, మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము మరియు నమ్ముతున్నాము! మీరు దేవుని కుటుంబానికి చెందినవారు మరియు నిబంధన సంతానము. యేసు క్రీస్తును విశ్వసించండి మరియు నమ్మండి. ఆయన మిమ్మల్ని నిజంగా తన శిష్యులుగా మారేలా చేస్తారు.

యేసు క్రీస్తుతో మీ అనుబంధాన్ని పెంచుకోవడాన్ని నేడే ప్రారంభించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆయనను ఎప్పటికీ విడిచిపెట్టకూడదని ఒప్పందం చేసుకోండి.

క్రీస్తుపై మీకున్న విధేయత, ప్రేమ మరియు నమ్మకం ఆయన మాదిరిగా మీ వ్యక్తిత్వాన్ని మరియు గుర్తింపును రూపొందిస్తాయి. మీరు సాతాను దాడులను అధిగమించడానికి ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని పొందుతారు. మరియు మీరు తప్పులు చేసినప్పుడు, మీరు ఆయన క్షమాపణ కోసం ఆరాటపడతారు. చివరగా, భవిష్యత్తు కోసం మీ నిరీక్షణ ప్రకాశవంతంగా ఉంటుంది. ఆయన సన్నిధికి తిరిగి వచ్చే శక్తితో సహా, ఆయన మీ నుండి ఆశించేది ఏదైనా సాధించడానికి మీకు తన శక్తినివ్వడానికి ఆయన మిమ్మల్ని నమ్ముతారు.

“విమోచించు ప్రేమ గీతమును” పాడడం నుండి మరియు “ఆయన ప్రేమ యొక్క బాహువులలో శాశ్వతముగా చుట్టబడియుండుట” నుండి వచ్చే ఆనందాన్ని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందుట,” లియహోనా, మే 2017, 42.

  2. విశ్వాసం అనే పదం లాటిన్ పదం ఫైడ్స్ నుండి వచ్చింది, దాని అర్థం “నమ్మడం” (see Michiel de Vaan, Etymological Dictionary of Latin and the Other Italic Languages [2008], “fido”). The Greek cognate, πίστις, translates as “trusting” (see Robert Beekes, Etymological Dictionary of Greek [2010], 1:1161–62).

  3. “విశ్వాసం అంటే యేసు క్రీస్తుపై భరోసా మరియు నమ్మకం” (Guide to the Scriptures, “Faith,” Gospel Library).

  4. Look unto Christ” (worldwide discussion for youth, Jan. 5, 2025), Gospel Library; అలెగ్జాండర్ డుష్కు, “స్తంభాలు మరియు కిరణాలు,” లియహోనా, మే 2024, 14–16 చూడండి.

  5. నీల్ ఎల్. ఆండర్సెన్, “ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకాలు,” లియహోనా, మే 2020, 18–22 చూడండి.

  6. 2 కొరింథీయులకు 3:2–3 చూడండి; మొరోనై 10:3; రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆయనను వినుము,” లియహోనా, మే 2020, 88–92 కూడా చూడండి.

  7. రోనాల్డ్ ఎ. రాస్బాండ్, “దైవ‌ ప్రణాళిక ద్వారా,” లియహోనా, నవంబర్. 2017, 55–57 చూడండి.

  8. మోషైయ 2:20–21; సిద్ధాంతము మరియు నిబంధనలు 59:21 చూడండి.

  9. See “Appendix 1: Sixth Theological Lecture on Faith, circa January–May 1835, as Published in Latter Day Saints’ Messenger and Advocate,” 124–25, josephsmithpapers.org.

  10. మొరోనై 7:41 చూడండి; see also Stephen M. R. Covey and Rebecca R. Merrill, The Speed of Trust: The One Thing That Changes Everything (2006), 215.

  11. 2 నీఫై 4:21.

  12. “God is my friend. In him I shall find comfort. … I desire to be with Christ. “ఆయన చిత్తం చేయడం [తప్ప] నా ప్రాణాన్ని నేను విలువైనదిగా ఎంచను” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 243–44).

  13. Bible Dictionary, “Faith.”

  14. హెబ్రీయులకు 11:6.

  15. యోహాను 8:29 చూడండి.

  16. ఆదికాండము 39:9.

  17. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:25.

  18. అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఇలా బోధించారు, “ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ పరలోక తండ్రిని ప్రార్థించండి మరియు ఎల్లప్పుడూ, అన్ని పరిస్థితులలో, మీ జీవితాల స్వభావం ద్వారా మీ విధేయతను మరియు మీ ప్రేమను చూపించండి” (“Loyalty,” Liahona, May 2003, 60; see also Brent J. Schmidt, Relational Faith: The Transformation and Restoration of Pistis as Knowledge, Trust, Confidence, and Covenantal Faithfulness [2022], 9; Teresa Morgan, Roman Faith and Christian Faith: Pistis and Fides in the Early Roman Empire and Early Churches [2015], 127–28).

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” లియహోనా, అక్టో. 2022, 4–11.

  20. “విశ్వాసానికి హెబ్రీయ పదం אמונה (ఎమునా) మరియు ఇది ‘మద్దతు’ అనే అర్థం వచ్చే క్రియ-ఆధారిత పదం. … [ఇది] ‘దేవునికి మద్దతిచ్చే’ వ్యక్తిపై చర్యను ఉంచుతుంది. అనగా దేవుడు చర్య తీసుకుంటాడని తెలుసుకోవడం కాదు, బదులుగా దేవునికి మద్దతివ్వడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను. ఎమునా అనే పదానికి మద్దతు ఇచ్చే ఈ ఆలోచనను నిర్గమకాండము 17:12 లో చూడవచ్చు. … మోషే చేతులను పట్టుకున్నది అహరోను మరియు హూరుల మద్దతు/ఎమునా, మోషే యొక్క మద్దతు/ఎమునా కాదు. ‘నాకు దేవుడి మీద నమ్మకం ఉంది’ అని మనం చెప్పినప్పుడు, ‘దేవుడికి మద్దతివ్వడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను’ అని మనం ఆలోచించాలి” (Jeff A. Benner, “Faith,” Ancient Hebrew Research Center, ancient-hebrew.org).

  21. యోహాను 14:21; 23వ వచనము కూడా చూడండి.

  22. యోహాను 15:9–10 చూడండి.

  23. రస్సెల్ ఎమ్. నెల్సన్, “యేసు క్రీస్తు యొక్క శక్తిని మన జీవితాలలోనికి తీసుకొనుట,” 39–42.

  24. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36.

  25. See Neil L. Andersen, “Faith Is Not by Chance, but by Choice,” Liahona, Nov. 2015, 65–68.

  26. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ వేగము యొక్క శక్తి,” లియహోనా, మే 2022, 99.

  27. రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము,” లియహోనా, నవ. 2020, 92–95 చూడండి.

  28. See Russell M. Nelson, “Children of the Covenant,” Ensign, May 1995, 32–35.

  29. యేసు నా స్నేహితుడు. నాకు ఇంతగా ఎవరూ ఇవ్వలేదు. … నేను ఆయనకు స్నేహితుడిగా ఉండడానికి అర్హుడనని భావిస్తున్నాను” (Gordon B. Hinckley, “My Testimony,” Liahona, July 2000, 85).

  30. యోహాను 6:67–68; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:20 చూడండి.

  31. See Russell M. Nelson, “Choices for Eternity” (worldwide devotional for young adults, May 15, 2022), Gospel Library; Richard G. Scott, 21 Principles: Divine Truths to Help You Live by the Spirit (2013), 90.

  32. ఆల్మా 48:17 చూడండి.

  33. మోషైయ 4:2; ఆల్మా 36:18 చూడండి.

  34. See Thomas S. Monson, “Be of Good Cheer,” Liahona, May 2009, 92.

  35. యెషయా 58:9; హీలమన్ 10:4-5; ఈథర్ 12:30; మొరోనై 7:33 చూడండి.

  36. 2 నీఫై 25:23 చూడండి.

  37. ఆల్మా 5:26; ఆల్మా 5:9; ఆల్మా 26:13 కూడా చూడండి.

  38. 2 నీఫై 1:15.