సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2024
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వమునకు
ప్రియమైన సహోదరులారా: సిద్ధాంతము మరియు నిబంధనల 120వ ప్రకరణంలో వ్రాయబడినట్లుగా, బయల్పాటు నిర్దేశానుసారం, ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపొస్తలుల సమూహముతో కూడిన దశమభాగ వినియోగ సలహాసభ, సంఘ నిధుల వినియోగాన్ని ఆమోదిస్తుంది. సంఘ విభాగాలు ఆమోదించబడిన ఆదాయ వ్యయ అంచనాలు, అభిమతాలు, విధానాల ప్రకారం నిధులను వినియోగిస్తాయి.
సంఘ ఆడిటింగ్, విశ్వసనీయ నిపుణులను కలిగి ఉన్నది మరియు అన్ని ఇతర సంఘ విభాగముల నుండి స్వతంత్రంగా ఉంటుంది, స్వీకరించిన విరాళాలు, చేసిన ఖర్చులు మరియు సంఘ ఆస్తుల రక్షణకు సంబంధించి సహేతుకమైన హామీని అందించే ఉద్దేశ్యంతో ఆడిట్‌లను నిర్వహించాల్సిన బాధ్యతను కలిగియున్నది.
జరుపబడిన ఆడిట్లపై ఆధారపడి, సంఘ ఆడిటింగ్ 2024 సంవత్సరానికి చెందిన అన్ని భౌతిక సంబంధమైన విషయాలు, పొందిన విరాళాలు, చేయబడిన ఖర్చులు, సంఘ ఆస్తులు ఆమోదించబడిన సంఘ ఆదాయ వ్యయ అంచనాలు, అభిమతాలు, వాణిజ్య సాధనాల ప్రకారం నమోదు చేయబడ్డాయని మరియు నిర్వహించబడ్డాయని భావిస్తుంది. సంఘం దాని సభ్యులకు బోధించే ఆదాయ వ్యయ అంచనాలలోపే జీవించుట, అప్పును మానివేయుట మరియు అవసరతగల సమయానికి దాచుకొనుట వంటి ఆచరణలను అనుసరిస్తుంది.
మర్యాదపూర్వకముగా నివేదించబడింది,
సంఘ ఆడిటింగ్ విభాగము
జెరెడ్ బి. లార్సన్
నిర్వాహణాధికారి