దైవిక అధికారం, ఉన్నతమైన యువకులు
అహరోను యాజకత్వము కలిగియున్నవారు, దాని అధికారాలు, విధులు మరియు బాధ్యతలతో మనందరినీ దీవిస్తున్నందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను.
ఎల్డర్ ఆండర్సెన్, యాజకత్వ శక్తి మరియు రక్షకుని ప్రాయశ్చిత్త శక్తి యొక్క అద్భుతమైన వ్యక్తీకరణకు మీకు ధన్యవాదాలు.
ఈ జనవరిలో ఒక ఆదివారం ఉదయం, నేను సంస్కార సమావేశంలో కూర్చున్నప్పుడు, డజనుకు పైగా యువకులు అహరోను యాజకత్వంలో పురోగతి సాధించడానికి ఆమోదించబడ్డారు. ప్రపంచం భౌతికంగా మారుతున్నట్లు నాకు అనిపించింది.
ప్రపంచవ్యాప్తంగా, వివిధ సమయాలలో, ఇలాంటి సంస్కార సమావేశాలలో, ప్రతిచోటా విస్తరించి ఉన్న ఇశ్రాయేలును సమకూర్చుడంలో—ఈ ఉదయం అధ్యక్షుడు హాలండ్ స్నేహితుడు ఈస్టన్ లాగా—జీవితాంతం యాజకత్వ పరిచర్యకు నియమించబడడానికి వేలాదిమంది పరిచారకులు, బోధకులు మరియ యాజకులు ఆమోదించబడుతున్నారని నాకు అనిపించింది.
ప్రతి జనవరిలో, దాదాపు 1,00,000 మంది యువకుల తలలపై చేతులు ఉంచబడతాయి మరియు వారిని యాజకత్వ విధి ద్వారా—యేసు క్రీస్తు నుండి బాప్తిస్మమిచ్చు యోహానుకు, అతని నుండి పునఃస్థాపన సమయంలో జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు ఇవ్వబడిన ప్రకాశవంతమైన అధికార క్రమమునకు అనుసంధానిస్తారు.
ఇప్పుడు, మన సంఘము ఎల్లప్పుడూ అంత ప్రదర్శనాత్మకమైన సంఘముగా ఉండదు. ఇక్కడ, మనం తక్కువ అంచనా వేస్తున్నాము.
అయినప్పటికీ, కొత్తగా యాజకత్వమునకు నియమించబడి, భూమి అంతటా వ్యాపించి ఉప్పెనలా ముందుకుసాగుతున్న వారిని చూసి,—”ఆనందకరమైన సంఘము” తరహాలో—పైకప్పు మీద నిలబడి అందరికీ వినబడేలా అరవకూడదని అంటే నేను ఆశ్చర్యపోయాను. “ఈ రోజు,” “బూర ధ్వనులు, తాళాల ధ్వనులు మరియు మరియు రోమన్ కొవ్వొత్తులతో వెలిగిపోవాలి. ప్రదర్శనలు కూడా ఉండాలి!” అని నేను అనుకున్నాను.
నిజంగా దేవుని యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్న మనము, దైవిక అధికారం భూమిపై విస్తరించడంతో ఈ ప్రపంచ నమూనా చెదిరిపోవడాన్ని చూశాము.
ఈ నియామకాలు ఈ యువకులను జీవితకాల సేవలోకి ప్రవేశపెడతాయి, ఎందుకంటే వారు తమ ఉనికి, ప్రార్థనలు మరియు వారు కలిగియున్న దేవుని యాజకత్వ శక్తులు చాలా ముఖ్యమైనవిగా ఉండే సంభవనీయ సమయాలు మరియు ప్రదేశాలలో తమను తాము కనుగొంటారు.
ఈ యువకుల నియామకము యొక్క సంఘటనల ప్రతిచర్య దేవుడు పంపిన ఒక పరిచర్య దేవదూతతో ప్రారంభమైంది. ప్రాచీన కాలానికి చెందిన పునరుత్థానం చేయబడిన బాప్తిస్మమిచ్చు యోహాను, జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు కనిపించి, వారి తలలపై తన చేతులుంచి, ఇలా అన్నారు, “నా తోటి సేవకులైన మీపై, మెస్సీయ నామములో నేను అహరోను యాజకత్వమును అనుగ్రహించుచున్నాను, ఇది దేవదూతల పరిచర్య యొక్కయు, పశ్చాత్తాప సువార్త యొక్కయు, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము యొక్కయు తాళపుచెవులను కలిగియున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1).
యోహాను ఈ అధికారాన్ని మోషే సోదరుడు మరియు యాజకత్వ సహచరుడిని బట్టి “అహరోను యాజకత్వము” అని పిలిచాడు. ప్రాచీనకాలంలో, అహరోను యాజకత్వం కలిగియున్నవారు విధుల ద్వారా బోధించాలి మరియు సహాయం చేయాలి—అవి భవిష్యత్తు మెస్సీయ అయిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యరికంపై కేంద్రీకరించిన విధులు (ద్వితీయోపదేశకాండము 33:10 చూడండి).
సంఖ్యాకాండము అహరోను యాజకత్వము కలిగియున్నవారికి విధుల యొక్క పాత్రలను ఉపయోగించే పనులను స్పష్టంగా కేటాయిస్తుంది. “నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను … వారు మందసము బల్ల … తాము సేవచేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు … కాపాడవలసినవారు” (సంఖ్యాకాండము 3:10, 31).
పాత నిబంధన యొక్క విధియైన జంతు బలి నెరవేర్చబడింది మరియు రక్షకుని యొక్క జీవితం మరియు ప్రాయశ్చిత్తం ద్వారా భర్తీ చేయబడింది. ఆ ప్రాచీన విధి, ఇప్పుడు మనం ప్రభురాత్రి భోజనం యొక్క సంస్కారం అని పిలిచే విధితో భర్తీ చేయబడింది.
అహరోను యాజకత్వాన్ని నేటి వారికి ప్రభువు అప్పగించి, వారు పురాతన కాలంలో చేసిన పనులనే చేయమని చెబుతున్నారు: బోధించడం మరియు విధులను నిర్వహించడం—ఇవన్నీ ఆయన ప్రాయశ్చిత్తాన్ని మనకు గుర్తు చేయడానికి ఉన్నాయి.
పరిచారకులు, బోధకులు మరియ యాజకులు సంస్కారానికి సహాయం చేసినప్పుడు, వారు అందరిలాగే దాని దీవెనలను పొందుతారు: వారు వ్యక్తిగతంగా సంస్కారంలో పాలుపంచుకున్నప్పుడు వారు చేసిన నిబంధనను పాటించడం ద్వారా ఆ దీవెనలను పొందుతారు. అయితే ఈ పవిత్ర విధుల నిర్వహణలో, వారు తమ యాజకత్వ పాత్రలు మరియు బాధ్యతల గురించి కూడా మరింత నేర్చుకుంటారు.
అహరోను యాజకత్వాన్ని సన్నాహక యాజకత్వం అని పిలుస్తారు, ఎందుకంటే దాని విధులు ప్రభువు పనిలో ఉండడం వల్ల కలిగే గౌరవాన్ని మరియు ఆనందాన్ని అనుభవించడానికి, భవిష్యత్తులో యాజకత్వ సేవ కోసం—అనగా ఆశలు, కలలు, జీవితం మరియు మరణం కూడా అస్థిరంగానున్న సమయాల్లో ప్రేరేపిత దీవెనలను పలకడంతో సహా ఊహించలేని మార్గాల్లో పరిచర్య చేయడానికి వారు పిలువబడినప్పుడు వారిని సిద్ధం చేయడానికి అనుమతిస్తాయి.
అలాంటి తీవ్రమైన అంచనాలకు తీవ్రమైన సిద్ధపాటు అవసరం.
పరిచారకులు మరియు బోధకులు “హెచ్చరించి, వివరించి, ఉద్బోధించి, బోధించవలెను మరియు క్రీస్తునొద్దకు రమ్మని అందరిని ఆహ్వానించవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:59) అని సిద్ధాంతము మరియు నిబంధనలు వివరిస్తుంది. ఈ అవకాశాలతో పాటు, యాజకులు “ప్రకటించడం, బోధించడం, వివరించడం, ఉద్బోధించడం, బాప్తిస్మమివ్వడం” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:50) చేయాలి.
సరే, ఇదంతా చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ వాస్తవ ప్రపంచంలో, ఇవి ప్రపంచవ్యాప్తంగా సహజంగానే జరుగుతాయి.
ఒక బిషప్పు తన కొత్త పరిచారకుల సమూహం అధ్యక్షత్వానికి ఈ విధులను నేర్పించాడు. వారి సమూహంలో మరియు వారి వార్డులో దానిని ఎలా చేయవచ్చనే దాని గురించి యువ అధ్యక్షత్వం మాట్లాడడం ప్రారంభించారు. వారు వృద్ధులైన వార్డు సభ్యులను సందర్శించి వారికి ఏమి అవసరమో చూసి, ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు.
వారు సేవ చేసిన వారిలో కఠినమైన వైఖరితో, తరచుగా దుర్మార్గముగా మరియు కొన్నిసార్లు ప్రక్కనుండే శత్రువు వంటి ఆలన్ కూడా ఉన్నాడు. ఆలన్ భార్య వాండా సంఘ సభ్యురాలిగా మారింది, కానీ ఆలన్, మనం చెప్పినట్లుగా, చెడ్డ వ్యక్తి.
అయినప్పటికీ, పరిచారకులు పని చేయడానికి వెళ్లారు; వారు మంచును తొలగించేటప్పుడు మరియు చెత్తను పారవేసేటప్పుడు అతడు చేసిన అవమానాలను హాస్యాస్పదంగా విస్మరించారు. పరిచారకులను ద్వేషించడం కష్టం మరియు క్రమంగా ఆలన్ వారిని ప్రేమించడం ప్రారంభించాడు. ఒక సమయంలో వారు అతడిని సంఘానికి ఆహ్వానించారు.
“నాకు సంఘం ఇష్టం లేదు,” అని అతడు జవాబిచ్చాడు.
“సరే, మీరు మమ్మల్ని ఇష్టపడతారు.” “కాబట్టి మాతో రండి. “మీరు కావాలనుకుంటే మా సమూహ సమావేశానికి మాతో రండి” అని వాళ్ళు అన్నారు.
బిషప్పు ఆమోదంతో, అతడు వచ్చాడు—మరియు వస్తూనే ఉన్నాడు.
పరిచారకులు బోధకులుగా మారారు మరియు వారు అతనికి సేవ చేయడం కొనసాగించినప్పుడు, అతడు వారికి కార్లను మరమ్మత్తు చేయడం మరియు వస్తువులను తయారు చేయడం నేర్పించాడు. బోధకులుగా మారిన పరిచారకులు యాజకులుగా మారే సమయానికి, ఆలన్ వారిని “మా అబ్బాయిలు” అని పిలుస్తున్నాడు.
వారు ఆశగా సువార్తసేవకు సిద్ధమవుతున్నారు మరియు అతనితో మిషనరీ పాఠాలు సాధన చేయవచ్చా అని అడిగారు. తాను ఎప్పటికీ విననని లేదా నమ్మనని ప్రమాణం చేశాడు, అయితే, వారు అతని ఇంట్లో సాధన మాత్రం చేసుకోవచ్చు.
తర్వాత ఆలన్ అనారోగ్యానికి గురయ్యాడు. మరియు అతను మెత్తబడ్డాడు.
ఒకరోజు, సమూహ సమావేశంలో, అతడు ధూమపానం మానివేయడం కోసం తన కొరకు ప్రార్థించమని వారిని ఆప్యాయంగా అడిగాడు మరియు వారు ప్రార్థించారు. కానీ ఆపై వారు అతనితో పాటు అతని ఇంటికి వెళ్ళి, పొగాకు నిల్వ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆలన్ ఆసుపత్రులు మరియు పునరావాస కేంద్రాలలో చేరాడు, అతని అబ్బాయిలు అతనికి సేవ చేస్తూ, నిశ్శబ్దంగా యాజకత్వ శక్తులను మరియు నిష్కపటమైన ప్రేమను వెదజల్లడం ద్వారా అద్భుతాలు కొనసాగాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:41 చూడండి).
ఆలన్ బాప్తిస్మము తీసుకోవాలని అడిగినప్పుడు కూడా ఆ అద్భుతం కొనసాగింది—కానీ అది జరగకముందే అతను మరణించాడు. అతని కోరిక మేరకు, యాజకులుగా మారిన అతని పరిచారకులు అంత్యక్రియలలో శవపేటికను మోసేవారిగా మరియు వక్తలుగా వ్యవహరించారు, అక్కడ వారు సముచితంగా హెచ్చరించారు, వివరించారు, ఉద్బోధించారు, బోధించారు మరియు అందరినీ క్రీస్తు వద్దకు ఆహ్వానించారు.
మరియు తరువాత, దేవాలయములో, ఆ పూర్వపు పరిచారకుల సమూహ అధ్యక్షుడు, “ఆలన్ అబ్బాయిలలో ఒకడు”, ఆలన్‌కు బదులుగా ప్రాతినిధ్య బాప్తిస్మం తీసుకున్నాడు.
బాప్తిస్మమిచ్చు యోహాను చేయమని చెప్పినవన్నీ వారు చేసారు. ఈ సంఘమంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా పరిచారకులు, బోధకులు మరియు యాజకులు చేసేదే వారు చేసారు.
అహరోను యాజకత్వము కలిగియున్నవారు చేయవలసిన పనులలో సంస్కార విధి ఒకటి.
గత సంవత్సరం, నేను ఒక ప్రేరేపిత బిషప్పుని మరియు అతని అద్భుతమైన భార్యను కలిశాను. ఇటీవల శనివారం ఉదయం తమ కుమారుని బాప్తిస్మానికి కారు నడుపుతూ వెళ్తున్నప్పుడు, వారు రెండేళ్ల తమ ముద్దుల కుమార్తె టెస్‌ను విషాదకరంగా మరియు అకస్మాత్తుగా కోల్పోయారు.
మరుసటి రోజు ఉదయం, వారి వార్డు సభ్యులు కరుణతో నిండిన సంస్కార కూడికలో సమావేశమయ్యారు, ఈ పరిపూర్ణమైన చిన్న పాపని కోల్పోయినందుకు వారు బాధపడుతూ ఉన్నారు. ఆ ఉదయం బిషప్పు కుటుంబం సంఘములో ఉంటుందని ఎవరూ ఊహించలేదు, అయితే కూడిక ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు, వారు నిశ్శబ్దంగా ప్రవేశించి తమ స్థానాన్ని చేరుకున్నారు.
బిషప్పు వేదిక వద్దకు వెళ్లి తన సలహాదారుల మధ్య మామూలుగా కూర్చొనే స్థలాన్ని దాటి, సంస్కార బల్లవద్ద తన యాజకుల మధ్య కూర్చున్నారు.
అవగాహన మరియు శాంతి కోసం వెదుకుతున్న ఆవేదనతో కూడిన, నిద్రలేని ఆ రాత్రిలో, ఆయన కుటుంబానికి అత్యంత అవసరమైనది—మరియు ఆయన వార్డుకు అత్యంత అవసరమైన ఒక భావనను ఆయన పొందారు. అది—వారి బిషప్పు, వారి వార్డు అహరోను యాజకత్వ అధ్యక్షుడు మరియు దుఃఖిస్తున్న తండ్రి సంస్కార నిబంధన యొక్క వాగ్దానాలను పలకడాన్ని అందరు వినడం.
కాబట్టి, తగిన సమయంలో, ఆయన ఆ యాజకులతో మోకరిల్లి తన తండ్రితో మాట్లాడారు. ఆ సందర్భంలోని విషాదంతో, ఈ జీవితకాలంలో ఎవరైనా బిగ్గరగా చెప్పడానికి అనుమతించబడిన అత్యంత శక్తివంతమైన పదాలను ఆయన పలికారు.
నిత్య పర్యవసానము గల వాక్యములు.
విధి యొక్క వాక్యములు.
నిబంధన వాక్యములు.
ఈ జీవిత ఉద్దేశ్యాలకు—మరియు మన కోసం పరలోక తండ్రి ప్రణాళిక యొక్క అత్యంత అద్భుతమైన ఫలితాలకు—మనల్ని అనుసంధానించే ఉపదేశమది.
ప్రతి ఆదివారం మన ప్రార్థనా మందిరాలలో మనం వినే మాటల్లో, ఆ రోజు ఆ ప్రార్థనా మందిరంలో జనసమూహం ఏమి వినియుంటుందో మీరు ఊహించగలరా?
“ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, ఈ రొట్టెను దానిలో పాలుపొందుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా మీ కుమారుని శరీరము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని తిని, ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు మీ కుమారుని నామమును తమపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయన వారికిచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకు సమ్మతించుచున్నామని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఎల్లప్పుడు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక. ఆమేన్” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77).
తర్వాత: “ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, ఈ ద్రాక్షారసమును దానిని త్రాగుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా వారి కొరకు చిందించబడిన మీ కుమారుని రక్తము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని చేసి, ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొందురని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక. ఆమేన్” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:79).
ఆ వాగ్దానం నెరవేరిందని ఈ మంచి తల్లిదండ్రులు సాక్ష్యమిస్తున్నారు. నిజానికి, వారు తమ శాశ్వత ఆదరణ కొరకు, “ఆయన ఆత్మను ఎల్లప్పుడు వారితో కలిగియున్నారు”.
అహరోను యాజకత్వమును కలిగియున్నవారు దాని అధికారాలు, విధులు మరియు బాధ్యతలతో, “దేవదూతల పరిచర్య యొక్కయు, పశ్చాత్తాప సువార్త యొక్కయు, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము యొక్కయు” తాళపుచెవులను కలిగియుండి మనందరిని దీవిసున్నదానిని బట్టి నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1). యేసు క్రీస్తు నామములో, ఆమేన్.