“అధ్యాయము 6: క్రీస్తువంటి లక్షణాలను వెదకండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 6,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 6
క్రీస్తువంటి లక్షణాలను వెదకండి
దీనిని పరిగణించండి
-
క్రీస్తువంటి లక్షణాలను వెదకడం సువార్తికునిగా నా ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎలా సహాయపడుతుంది?
-
నేను క్రీస్తువంటి లక్షణాలను ఎలా వెదకగలను మరియు పొందగలను?
-
నేను ఇప్పుడు ఏ లక్షణం లేదా లక్షణాలపై దృష్టి పెట్టాలి?
పరిచయము
తన మర్త్య పరిచర్య ప్రారంభంలో, యేసు గలిలయ సముద్ర తీరం వెంబడి నడుస్తూ, పేతురు మరియు అంద్రియ అనే ఇద్దరు జాలరులను పిలిచారు. “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును” (మత్తయి 4:19; మార్కు 1:17 కూడా చూడండి) అని ఆయన చెప్పారు.
ప్రభువు మిమ్మల్ని కూడా తన పనికి పిలిచారు మరియు ఆయనను వెంబడించమని కూడా ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. “కావున, మీరు ఏ విధమైన మనుష్యులై యుండవలెను?” అని ఆయన అడిగారు. “నేను ఉన్నట్లుగానే అని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను” (3 నీఫై 27:27).
నా సువార్తను ప్రకటించండి లోని కొన్ని అధ్యాయాలు సువార్తికునిగా మీరు ఏమి చేయాలో, అంటే ఎలా అధ్యయనం చేయాలి, ఎలా బోధించాలి మరియు లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి వంటి వాటిపై దృష్టి పెడతాయి. మీరు ఏమి చేస్తారనేది ఎంత ముఖ్యమో, మీరు ఎవరు మరియు మీరు ఎలా మారుతున్నారు అనేది కూడా అంతే ముఖ్యం. ఈ అధ్యాయం యొక్క దృష్టి అదే.
సువార్తికునిగా మరియు మీ జీవితాంతం మీరు వెదకడం అవసరమైన క్రీస్తువంటి లక్షణాలను లేఖనాలు వివరిస్తాయి. క్రీస్తువంటి లక్షణం అనేది రక్షకుని స్వభావం మరియు వ్యక్తిత్వం యొక్క లక్షణం లేదా ప్రత్యేకత. ఈ అధ్యాయం ఆ లక్షణాలలో కొన్నింటిని వివరిస్తుంది. వీటిని మరియు వీటితో అనుబంధించబడిన లేఖనాలను అధ్యయనం చేయండి. మీరు ఇతర లేఖన గద్యభాగాలను అధ్యయనం చేస్తున్నప్పుడు క్రీస్తువంటి ఇతర లక్షణాల కోసం చూడండి.
వ్యక్తిగత అధ్యయనము
సిద్ధాంతము మరియు నిబంధనలు 4 అధ్యయనం చేయండి. సువార్తికులకు ఏ లక్షణాలు ముఖ్యమైనవని ప్రభువు గుర్తిస్తారు? ఈ లక్షణాలను వెదకడం సువార్తికునిగా మీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడంలో మీకు ఎలా సహాయపడుతుంది?
“ఆ యేసును వెదకండి”
ప్రవక్త మొరోనై ఇలా ఉద్బోధించాడు: “ఎవరిని గూర్చి ప్రవక్తలు మరియు అపొస్తలులు వ్రాసియుండిరో, ఆ యేసును వెదకమని నేను మీకు సిఫారసు చేయుచున్నాను” (ఈథర్ 12:41). యేసును వెదకడానికి ఒక ముఖ్యమైన మార్గం ఏమిటంటే, ఆయన గురించి తెలుసుకోవడానికి మరియు ఆయనలాగా మారడానికి శ్రద్ధగా ప్రయత్నించడం. మీ సువార్తసేవ దీనిపై దృష్టి పెట్టడానికి అనువైన సమయం.
మీరు ఎక్కువగా క్రీస్తువలె మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సువార్తికునిగా మీ లక్ష్యాన్ని బాగా నెరవేరుస్తారు. ఆయన లక్షణాలు మీ వ్యక్తిత్వంలో భాగమైనప్పుడు మీరు ఆనందం, శాంతి మరియు ఆధ్యాత్మిక వృద్ధిని అనుభవిస్తారు. మీ జీవితాంతం ఆయనను అనుసరించడాన్ని కొనసాగించడానికి మీరు ఒక పునాదిని కూడా ఏర్పరుస్తారు.
దేవుడిచ్చిన బహుమానాలు
క్రీస్తువంటి లక్షణాలు దేవుడిచ్చిన బహుమానాలు. అన్ని మంచి సంగతులవలె, ఈ బహుమానాలు “తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ యొక్క కృప” (ఈథర్ 12:41) ద్వారా వస్తాయి.
మీరు ఆయన లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు క్రీస్తుపై దృష్టి పెట్టండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36 చూడండి). ఈ లక్షణాలు ఒక జాబితాలోని అంశాలు కావు. అవి మీరు స్వీయ-అభివృద్ధి కార్యక్రమంలో వృద్ధి చేసుకునే పద్ధతులు కావు. అవి వ్యక్తిగత సంకల్పం ద్వారా మాత్రమే సంపాదించబడవు. బదులుగా, మీరు యేసు క్రీస్తు యొక్క మరింత అంకితభావంతో కూడిన శిష్యుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు వాటిని పొందవచ్చు.
దేవుడు మిమ్మల్ని ఈ లక్షణాలతో ఆశీర్వదించాలని ప్రార్థించండి. మీ బలహీనతను మరియు మీ జీవితంలో ఆయన శక్తి కోసం మీ అవసరాన్ని వినయంగా అంగీకరించండి. మీరు అలా చేస్తున్నప్పుడు, ఆయన “బలహీనమైన సంగతులను [మీ] కొరకు బలమైనవిగా చేయును” (ఈథర్ 12:27).
క్రమంగా జరిగే ప్రక్రియ
రక్షకునిలాగా మారడం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. దేవుణ్ణి సంతోషపెట్టాలనే కోరికతో, ఒక్కో నిర్ణయాన్ని మెరుగుపరచుకోండి.
మీ పట్ల మీరు సహనము కలిగియుండండి. మార్పు మరియు ఎదుగుదలకు సమయం పడుతుందని దేవునికి తెలుసు. మీ హృదయపూర్వకమైన కోరికలతో ఆయన సంతోషిస్తారు మరియు మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
మీరు క్రీస్తులాగా మారడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నప్పుడు, మీ కోరికలు, ఆలోచనలు మరియు చర్యలు మారతాయి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మీ స్వభావం శుద్ధి చేయబడుతుంది (మోషైయ 3:19 చూడండి).
పరిశుద్ధాత్మ మన సామర్థ్యాలను విస్తరిస్తారు మరియు విశాలం చేస్తారు. ఆయన “సుగుణం, దయ, మంచితనం, సున్నితత్వం, సౌమ్యత మరియు దాతృత్వాన్ని ప్రేరేపిస్తారు. … సంక్షిప్తంగా చెప్పాలంటే, అది ఎముకకు మజ్జ, హృదయానికి ఆనందం, కళ్ళకు వెలుగు, చెవులకు సంగీతం మరియు మొత్తం జీవికి జీవం లాంటిది” (Parley P. Pratt, Key to the Science of Theology [1855], 98–99).
లేఖన అధ్యయనము
యేసు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించడం గురించి ఈ లేఖనాలు ఏమి బోధిస్తాయి?
-
యోహాను 13:1–16
-
1 పేతురు 2:21
క్రీస్తువంటి లక్షణాలను వెదకడం గురించి ఈ క్రింది లేఖనాల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?
యేసు క్రీస్తు నందు విశ్వాసము
విశ్వాసం రక్షణకు దారితీయాలంటే, మీరు దానిని యేసు క్రీస్తుపై కేంద్రీకరించాలి (అపొస్తలుల కార్యములు 4:10–12; మోషైయ 3:17; మొరోనై 7:24–26 చూడండి). మీరు క్రీస్తుపై విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, మీరు దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా ఆయనను నమ్ముతారు. మీరు పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా మీ పాపాలు క్షమించబడతాయని మరియు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడతారని మీరు విశ్వసిస్తారు (3 నీఫై 27:16, 20 చూడండి).
విశ్వాసం అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండడం కాదు. బదులుగా, అది మీ చేత చూడబడనప్పటికీ సత్యమైన సంగతుల గురించి ఆత్మ నుండి వచ్చే హామీ. (ఆల్మా 32:21 చూడండి.)
మీరు మీ విశ్వాసాన్ని క్రియల ద్వారా వ్యక్తపరుస్తారు. ఈ క్రియలలో రక్షకుని బోధనలు మరియు మాదిరిని అనుసరించడం కూడా ఉంటుంది. వాటిలో ఇతరులకు సేవ చేయడం మరియు వారు క్రీస్తును అనుసరించడానికి ఎంచుకోవడంలో సహాయపడడం కూడా ఉంటాయి. మీరు శ్రద్ధ, పశ్చాత్తాపం మరియు ప్రేమ ద్వారా కూడా మీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తారు.
విశ్వాసం అనేది శక్తి యొక్క సూత్రం. మీరు యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచినప్పుడు, మీ పరిస్థితికి తగినట్లుగా ఆయన శక్తితో మీరు ఆశీర్వదించబడతారు. ప్రభువు చిత్త ప్రకారం మీరు అద్భుతాలను అనుభవించగలరు. (జేకబ్ 4:4–7; మొరోనై 7:33; 10:7 చూడండి.)
మీరు ఆయనతో మరియు ఆయన బోధనలతో బాగా పరిచయం పెంచుకున్న కొద్దీ యేసు క్రీస్తుపై మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు లేఖనాలను శోధించినప్పుడు, హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు మరియు ఆజ్ఞలను పాటించినప్పుడు అది పెరుగుతుంది. సందేహం మరియు పాపం విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి.
“విశ్వాసం అనేది ఒక భావన మాత్రమే కాదు; అది ఒక నిర్ణయం. ప్రార్థన, అధ్యయనం, విధేయత మరియు నిబంధనలతో, మనం మన విశ్వాసాన్ని నిర్మించుకుంటాము మరియు బలపరుస్తాము. రక్షకుని పట్ల మరియు ఆయన కడవరి-దిన పని పట్ల మనకున్న నమ్మకం మనం మిగతా వాటన్నిటిని తీర్పు తీర్చే శక్తివంతమైన కటకంగా మారుతుంది. అప్పుడు, మనం జీవితపు సంక్లిష్టతలో ఉన్నప్పుడు, … సరైన మార్గాన్ని తీసుకునే బలం మనకు ఉంటుంది” (Neil L. Andersen, “It’s True, Isn’t It? Then What Else Matters?” Liahona, May 2007, 74).
లేఖన అధ్యయనము
విశ్వాసము అంటే ఏమిటి?
-
హెబ్రీయులకు 11:1; పాదవివరణ ఆ చూడండి.
-
Bible Dictionary: “Faith”
-
Guide to the Scriptures
మీరు విశ్వాసాన్ని ఎలా పొందుతారు మరియు విశ్వాసం ద్వారా మీరు ఏమి చేయగలరు?
-
రోమా 10:17
-
హెబ్రీయులకు 11
విశ్వాసం ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?
నిరీక్షణ
నిరీక్షణ అనేది కేవలం ఊహాజనితమైన ఆలోచన కాదు. బదులుగా, అది దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారని క్రీస్తు యందు మీ విశ్వాసంపై ఆధారపడిన స్థిరమైన నమ్మకం (మొరోనై 7:42 చూడండి). ఇది క్రీస్తు ద్వారా “రాబోవుచున్న మేలుల విషయమై” నిరీక్షణ (హెబ్రీయులు 9:11).
మీ నిరీక్షణకు అంతిమ మూలం యేసు క్రీస్తు. ప్రవక్త మోర్మన్ ఇలా అడిగాడు, “మీ నిరీక్షణ దేని కొరకైయున్నది?” తర్వాత అతనిలా జవాబిచ్చాడు, “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా నిత్యజీవమునకు లేపబడుటకు మీరు నిరీక్షణ కలిగియుండవలెను; మరియు ఇది వాగ్దానము ప్రకారము ఆయనయందు మీ విశ్వాసమును బట్టియైయున్నది” (మొరోనై 7:41; 40–43 వచనాలు చూడండి).
మీరు క్రీస్తుపై మీ నిరీక్షణను కేంద్రీకరించినప్పుడు, మీ మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుననే హామీ మీకు ఉంటుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24 చూడండి). మీరు పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు విశ్వాసంతో పట్టుదలగా ఉండడానికి ఈ హామీ మీకు సహాయపడుతుంది. ఇది శ్రమల నుండి ఎదగడానికి, ఆధ్యాత్మిక స్థితిస్థాపకతను మరియు బలాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మీకు సహాయపడుతుంది. క్రీస్తు యందు నిరీక్షణ మీ ఆత్మకు ఒక లంగరును అందిస్తుంది (ఈథర్ 12:4 చూడండి).
దేవుడు మీ శ్రద్ధగల, నీతివంతమైన ప్రయత్నాలను గొప్పగా చేస్తారనే నమ్మకాన్ని నిరీక్షణ మీకు ఇస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 123:17 చూడండి).
నిరీక్షణను పెంచుకోవడానికి ఒక మార్గం పశ్చాత్తాపం. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా శుద్ధి చేయబడి, క్షమించబడడం నిరీక్షణను పుట్టిస్తుంది మరియు తిరిగి బ్రతికిస్తుంది (ఆల్మా 22:16 చూడండి).
“క్రీస్తు నందు నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్కయు మనుష్యులందరి యొక్కయు ప్రేమను కలిగియుండి మీరు శ్రద్ధగా ముందుకు సాగవలెను” (2 నీఫై 31:20) అని నీఫై ఉద్బోధించాడు. మీరు సువార్తను జీవిస్తున్నప్పుడు, మీరు “విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు” (రోమా 15:13) మీ సామర్థ్యంలో ఎదుగుతారు.
“కష్ట సమయాల్లో, దేవుని ప్రవక్తల సలహాను మనం అనుసరిస్తున్నప్పుడు, విషయాలు ‘[మన] మేలు కొరకు సమకూడి జరుగును’ అనే నిరీక్షణను మనం కోల్పోకుండా ఉండవచ్చు. దేవునిపై, ఆయన మంచితనంపై మరియు ఆయన శక్తిపై ఈ రకమైన నిరీక్షణ కష్టమైన సవాళ్ల సమయంలో మనల్ని ధైర్యంతో నింపుతుంది మరియు భయం, సందేహం మరియు నిరాశ యొక్క గోడల చేత చుట్టుముట్టబడడం ద్వారా బెదిరింపులకు గురయ్యే వారికి బలాన్ని ఇస్తుంది” (Dieter F. Uchtdorf, “The Infinite Power of Hope,” Liahona, Nov. 2008, 23).
లేఖన అధ్యయనము
నిరీక్షణ అంటే ఏమిటి మరియు మనం దేని కోసం నిరీక్షిస్తున్నాము?
-
హెబ్రీయులకు 6:10–20
-
Guide to the Scriptures
దాతృత్వము మరియు ప్రేమ
ఒకసారి ఒక వ్యక్తి, “ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని యేసును అడిగాడు. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” అని యేసు జవాబిచ్చారు. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే” (మత్తయి 22:36–39).
దాతృత్వము “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది” (మొరోనై 7:47). అందులో ఆయన పిల్లలందరి పట్ల దేవునికి గల నిత్య ప్రేమ ఉంది.
“ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని హృదయము యొక్క పూర్ణ శక్తితో తండ్రికి” (మొరోనై 7:48) ప్రార్థన చేయమని మోర్మన్ ప్రవక్త బోధించాడు. దాతృత్వం మీ హృదయాన్ని నింపాలని మీరు ప్రార్థించినప్పుడు, మీరు దేవుని ప్రేమను రుచి చూస్తారు. జనుల పట్ల మీ ప్రేమ పెరుగుతుంది మరియు వారి నిత్య సంతోషం కోసం మీరు హృదయపూర్వకంగా ఆందోళన చెందుతారు. మీరు వారిని ఆయనలాగా మారే సామర్థ్యం గల దేవుని పిల్లలుగా చూస్తారు మరియు మీరు వారి తరఫున పని చేస్తారు.
మీరు దాతృత్వపు బహుమానం కోసం ప్రార్థించినప్పుడు, మీరు కోపం లేదా అసూయ వంటి ప్రతికూల భావాలపై దృష్టి పెట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు ఇతరులను తీర్పు తీర్చే లేదా విమర్శించే అవకాశం తక్కువగా ఉంటుంది. వారిని మరియు వారి దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి మీరు ఎక్కువ కోరిక కలిగి ఉంటారు. మీరు మరింత ఓపికగా ఉంటారు మరియు జనులు కష్టపడుతున్నప్పుడు లేదా నిరుత్సాహపడినప్పుడు వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. (మొరోనై 7:45 చూడండి.)
విశ్వాసం లాగే దాతృత్వం కూడా క్రియలకు దారితీస్తుంది. మీరు ఇతరులకు సేవ చేయడం ద్వారా మరియు మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవడం ద్వారా దానిని బలోపేతం చేస్తారు.
దాతృత్వం పరివర్తన కలిగించేది. పరలోక తండ్రి దానిని “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులందరికి అనుగ్రహిస్తారు; … తద్వారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనము ఉంటాము, … ఆయన శుద్ధముగా ఉన్నట్లే మనము శుద్ధము చేయబడతాము” (మొరోనై 7:48).
లేఖన అధ్యయనము
దాతృత్వము అంటే ఏమిటి?
-
1 కొరింథీయులకు 13
-
Guide to the Scriptures
యేసు క్రీస్తు దాతృత్వాన్ని ఎలా చూపారు?
-
లూకా 7:12–15
క్రింది లేఖనాల నుండి దాతృత్వము గురించి మీరు ఏమి నేర్చుకోగలరు?
-
1 తిమోతికి 4:12
సుగుణము
“సుగుణముతో … ఉండుటను మేము నమ్ముచున్నాము” అని విశ్వాస ప్రమాణాలు పేర్కొంటున్నాయి (1:13). సుగుణము అనేది ఉన్నత నైతిక ప్రమాణాలపై ఆధారపడిన ఆలోచన మరియు ప్రవర్తన యొక్క నమూనా. ఇది దేవునిపట్ల మరియు ఇతరుల పట్ల నమ్మకం. సుగుణము యొక్క ముఖ్యమైన భాగమేదనగా, ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నించడం.
సుగుణము మీ ఆలోచనలు మరియు కోరికలలో ఉద్భవిస్తుంది. “నీ ఆలోచనలు నిరంతరము సుగుణముతో అలంకరింపబడనీయము,” అని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45). నీతివంతమైన, ఉత్తేజకరమైన ఆలోచనలపై దృష్టి పెట్టండి. అనర్హమైన ఆలోచనలపై దృష్టి పెట్టడం కంటే వాటిని మీ మనస్సు నుండి తొలగించండి.
మీ మనస్సు నాటకశాలలో ఒక వేదిక లాంటిది. మీరు మీ మనస్సు యొక్క వేదికపై చెడు ఆలోచనలు కొనసాగడానికి అనుమతిస్తే, మీరు పాపం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ మనస్సును ఆరోగ్యకరమైన విషయాలతో చురుకుగా నింపుకుంటే, మీరు సుగుణవంతమైన వాటిని స్వీకరించే మరియు చెడును తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ మనస్సు యొక్క వేదిక పైకి ప్రవేశించడానికి మరియు దానిపై ఉండడానికి అనుమతించే వాటి గురించి వివేకంతో ఉండండి.
మీరు సుగుణంతో జీవించడానికి ప్రయత్నించినప్పుడు, మీ “ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా ఎదుగును; … పరిశుద్ధాత్మ మీ స్థిర సహచరునిగాయుండును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45–46).
లేఖన అధ్యయనము
సుగుణముతో ఉండడం అంటే అర్థమేమిటి?
-
2 పేతురు 1:3–8
-
Guide to the Scriptures: “Virtue”
యథార్థత
దేవుడిని ప్రేమించాలనే మొదటి గొప్ప ఆజ్ఞ నుండి యథార్థత ప్రవహిస్తుంది (మత్తయి 22:37 చూడండి). మీరు దేవుడిని ప్రేమిస్తున్నందున, మీరు అన్ని సమయాల్లో ఆయనపట్ల యథార్థంగా ఉంటారు. హీలమన్ కుమారులవలె, మీరు “ఆయన యెదుట యథార్థముగా నడుస్తారు” (ఆల్మా 53:21 చూడండి).
మీరు యథార్థతను కలిగియున్నప్పుడు, తప్పు ఒప్పు ఉన్నాయని మరియు సంపూర్ణ సత్యం—దేవుని సత్యం ఉందని మీరు అర్థం చేసుకుంటారు. దేవుని సత్యం ప్రకారం ఎంచుకోవడానికి మీరు మీ కర్తృత్వాన్ని ఉపయోగిస్తారు మరియు మీరు అలా చేయనప్పుడు వెంటనే పశ్చాత్తాపపడతారు. మీరు ఏమి ఆలోచించాలని ఎంచుకుంటారు—మరియు ఎవరూ చూడడం లేదని మీరు నమ్మినప్పుడు మీరు ఏమి చేస్తారు—అనేది మీ యథార్థతకు బలమైన కొలమానం.
యథార్థత అంటే ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా వారిచేత అంగీకరించబడడానికి మీరు మీ ప్రమాణాలను లేదా ప్రవర్తనను తగ్గించుకోరు. దేవునిపట్ల నిజాయితీగా ఉండాలనే మీ కోరికను ఇతరులు ఎగతాళి చేసినప్పటికీ మీరు సరైనదే చేస్తారు (1 నీఫై 8:24–28 చూడండి). మిమ్మల్ని మీరు ఆన్‌లైన్‌లో ఎలా చూపుకుంటారనే దానితో సహా అన్ని వాతావరణాలలో మీరు గౌరవంగా జీవిస్తారు.
మీరు యథార్థతను కలిగి ఉన్నప్పుడు, మీరు దేవునితో మీ నిబంధనలను అలాగే ఇతరులతో మీ నీతివంతమైన నిబద్ధతలను పాటిస్తారు.
యథార్థత అంటే దేవునితో, మీతో, మీ నాయకులతో మరియు ఇతరులతో నిజాయితీగా ఉండడం. మీరు అబద్ధం చెప్పరు, దొంగిలించరు, మోసం చేయరు లేదా వంచించరు. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు, దానిని సమర్థించడానికి లేదా హేతుబద్ధం చేయడానికి ప్రయత్నించే బదులు మీరు బాధ్యతను అంగీకరిస్తారు మరియు పశ్చాత్తాపపడతారు.
మీరు యథార్థతతో జీవిస్తున్నప్పుడు, మీకు అంతర్గత శాంతి మరియు ఆత్మగౌరవం ఉంటాయి. ప్రభువు మరియు ఇతరులు మిమ్మల్ని నమ్ముతారు.
లేఖన అధ్యయనము
యేసు తన అత్యంత దుర్బల క్షణాల్లో కూడా ఎలా యథార్థతను చూపించారు?
-
మత్తయి 4:1–11
హీలమన్ సైన్యంలోని యువ యోధులు ఎలా యథార్థతను చూపించారు?
దానియేలు ఎలా యథార్థతను చూపించాడు? అతని యథార్థత వలన దేవుడు దానియేలును ఎలా ఆశీర్వదించారు?
-
దానియేలు 6
ప్రభువు జోసెఫ్ స్మిత్ సోదరుడు హైరమ్‌ను ఎందుకు ప్రేమించారు?
జ్ఞానము
“అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా కూడా నేర్చుకొనుటకు ప్రయత్నించుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:118) అని ప్రభువు సలహా ఇచ్చారు. మీ సువార్తసేవ సమయంలో మరియు మీ జీవితాంతం, జ్ఞానాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెదకండి.
ప్రతిరోజు లేఖనాలను, అలాగే జీవించి ఉన్న ప్రవక్తల మాటలను అధ్యయనం చేయండి. అధ్యయనం మరియు ప్రార్థన ద్వారా, నిర్దిష్ట ప్రశ్నలు, సవాళ్లు మరియు అవకాశాల కోసం సహాయం కోరండి. బోధించడంలో మరియు సువార్త గురించి ప్రశ్నలకు సమాధానమివ్వడంలో మీరు ఉపయోగించగల లేఖన గద్యభాగాల కోసం చూడండి.
మీరు శ్రద్ధగా మరియు ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీ మనస్సును ప్రకాశవంతం చేస్తారు. ఆయన మీకు బోధిస్తారు మరియు మీకు అవగాహన కల్పిస్తారు. మీ జీవితంలో లేఖనాలు మరియు కడవరి-దిన ప్రవక్తల బోధనలను అన్వయించుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తారు. నీఫై వలె, మీరు ఇలా చెప్పవచ్చు:
“నా ఆత్మ లేఖనములయందు ఆనందించును, నా హృదయము వాటిని ధ్యానించును. … నా ఆత్మ ప్రభువు యొక్క కార్యములందు ఆనందించును; నా హృదయము నేను చూచిన మరియు వినియున్న దర్శనములపై నిరంతరము ధ్యానించును” (2 నీఫై 4:15–16).
లేఖన అధ్యయనము
ప్రభువు కార్యమును నెరవేర్చుటకు జ్ఞానము మీకు ఏవిధంగా సహాయపడగలదు?
మీరు జ్ఞానమును ఎలా పొందగలరు?
-
Bible Dictionary: “Knowledge”
-
Guide to the Scriptures
ఓర్పు
మీరు ఆలస్యం, వ్యతిరేకత లేదా బాధలను ఎదుర్కొన్నప్పుడు దేవుణ్ణి విశ్వసించే సామర్థ్యమే ఓర్పు. మీ విశ్వాసం ద్వారా, దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు నెరవేరడానికి ఆయన సమయాన్ని మీరు నమ్ముతారు.
మీరు ఓపికగా ఉన్నప్పుడు, మీరు జీవితాన్ని నిత్య దృక్పథంతో చూస్తారు. మీరు తక్షణ ఆశీర్వాదాలు లేదా ఫలితాలను ఆశించరు. మీ నీతివంతమైన కోరికలు సాధారణంగా “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, … ఇక్కడ కొంచెం మరియు అక్కడ కొంచెం” (2 నీఫై 28:30) నెరవేరుతాయి. కొన్ని నీతివంతమైన కోరికలు ఈ జీవితం తర్వాత వరకు నెరవేరకపోవచ్చు.
ఓర్పు అంటే సోమరితనం లేదా నిష్క్రియాత్మకంగా విడిచిపెట్టడం కాదు. మీరు దేవునికి సేవ చేస్తున్నప్పుడు, “[మీ] సామర్థ్యము మేరకు అన్నింటిని సంతోషముతో [చేయడం] (సిద్ధాంతము మరియు నిబంధనలు 123:17). మీరు విత్తనాన్ని నాటి, నీరు పోసి, పోషించండి మరియు దేవుడు “క్రమంగా” పెరుగుదలను ఇస్తారు (ఆల్మా 32:42; 1 కొరింథీయులకు 3:6–8 కూడా చూడండి). మీరు మీ వంతు కృషి చేసిన తర్వాత, ఆయన తన సమయంలో మరియు వ్యక్తిగత కర్తృత్వం ప్రకారం తన పనిని నెరవేరుస్తారని నమ్ముతూ, మీరు దేవునితో భాగస్వామ్యంలో పని చేస్తారు.
ఓర్పు అంటే ఏదైనా మార్చలేనప్పుడు, మీరు దానిని ధైర్యం, కృప మరియు విశ్వాసంతో అంగీకరిస్తారని అర్థం.
మీ సహచరుడు మరియు మీరు సేవ చేసే వారితో సహా ఇతరులపట్ల ఓర్పును పెంపొందించుకోండి. మీతో కూడా ఓపికగా ఉండండి. మీరు దశలవారీగా పెరుగుతారని గ్రహిస్తూ మీలోని ఉత్తమమైన వాటి కోసం ప్రయత్నించండి.
ఇతర క్రీస్తు వంటి లక్షణాల మాదిరిగానే, ఓర్పులో ఎదగడం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ఓర్పును సాధన చేయడం మీ ఆత్మపై మరియు మీ చుట్టూ ఉన్నవారిపై స్వస్థత ప్రభావాన్ని చూపుతుంది.
“ఓర్పు అంటే చురుకుగా వేచి ఉండడం మరియు సహించడం. దాని అర్థం దేనితోనైనా ఉండి మనం చేయగలిగినదంతా చేయడం—పని చేయడం, నిరీక్షించడం మరియు విశ్వాసాన్ని సాధన చేయడం; మన హృదయపు కోరికలు ఆలస్యం అయినప్పటికీ, ధైర్యంతో కష్టాలను భరించడం. ఓర్పు అంటే కేవలం సహించడం కాదు; బాగా సహించడం!” (Dieter F. Uchtdorf, “Continue in Patience,” Liahona, May 2010, 57).
వ్యక్తిగత అధ్యయనము
మోషైయ 28:1–9 అధ్యయనం చేయండి.
-
మోషైయ కుమారుల యొక్క కోరికలేవి?
-
ఆ సువార్తికులకు ప్రభువు యొక్క సలహా ఏమిటి? (ఆల్మా 17:10–11; 26:27 చూడండి.)
-
వారి ఓర్పు మరియు శ్రద్ధ యొక్క కొన్ని ఫలితాలేవి? (ఆల్మా 26 చూడండి.)
మీ జవాబులను మీ అధ్యయన పుస్తకంలో రాయండి.
లేఖన అధ్యయనము
ఓర్పు ఎందుకు ముఖ్యమైనది? ఓర్పుకు విశ్వాసానికి గల సంబంధమేమిటి?
-
రోమా 5:3–5; 8:24–25
-
2 కొరింథీయులకు 6:1–10
-
యాకోబు 5:10–11
-
Guide to the Scriptures, “Patience.”
వినయము
వినయం అంటే ప్రభువు చిత్తానికి లోబడేందుకు ఇష్టపడడం. సాధించిన దాని కొరకు ఆయనకు గౌరవం ఇవ్వడానికి ఇష్టపడడం. బోధింపదగినట్లు ఉండడం (సిద్ధాంతము మరియు నిబంధనలు 136:32 చూడండి). వినయం అంటే దేవుని ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞత కలిగియుండడం మరియు ఆయన సహాయం కొరకు మీ నిరంతర అవసరాన్ని గుర్తించడం. వినయం గలవారికి ఆయన సహాయం చేస్తారు.
వినయం బలహీనతకు కాదు, ఆధ్యాత్మిక బలానికి సంకేతం. ఆధ్యాత్మిక వృద్ధికి వినయం ఒక ముఖ్యమైన ఉత్ప్రేరకం (ఈథర్ 12:27 చూడండి).
మీరు వినయంతో ప్రభువును నమ్మినప్పుడు, ఆయన ఆజ్ఞలు మీ మంచి కోసమే అనే భరోసాను మీరు కలిగియుంటారు. మీరు ఆయనపై ఆధారపడితే ఆయన మీ నుండి ఏమి కోరితే అది చేయగలరని మీరు నమ్మకంగా ఉంటారు. మీరు ఆయన సేవకులను నమ్మడానికి మరియు వారి సలహాను అనుసరించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వినయం మీరు విధేయులుగా ఉండడానికి, కష్టపడి పనిచేయడానికి మరియు సేవ చేయడానికి సహాయపడుతుంది.
వినయానికి వ్యతిరేకము గర్వము. గర్వంగా ఉండడం అంటే దేవునిపై కంటే తనపై ఎక్కువ నమ్మకం ఉంచడం. దాని అర్థం లోక విషయాలను దేవుని విషయాల కంటే ఎక్కువగా యెంచడం. గర్వం పోటీతత్వాన్ని కలిగి ఉంటుంది; గర్వంగా ఉన్నవారు ఎక్కువ కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు మరియు తాము ఇతరులకన్నా మెరుగైనవారని అనుకుంటారు. గర్వం ఒక పెద్ద అడ్డంకి.
లేఖన అధ్యయనము
వినయంగా ఉండడం అంటే అర్థమేమిటి?
-
మత్తయి 26:39
-
Guide to the Scriptures, “Humble, Humility.”
మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మీరు ఏ ఆశీర్వాదాలను పొందుతారు?
-
మత్తయి 23:12
మీలోని గర్వాన్ని మీరు ఎలా గుర్తించగలరు?
-
2 తిమోతి 3:1–4
-
సామెతలు 13:10
శ్రద్ధ
శ్రద్ధ అనేది స్థిరమైన, హృదయపూర్వక ప్రయత్నం. సువార్త పరిచర్యలో, శ్రద్ధ అనేది ప్రభువు పట్ల మీకున్న ప్రేమకు వ్యక్తీకరణ. మీరు శ్రద్ధగా ఉన్నప్పుడు, ప్రభువు పనిలో మీరు ఆనందాన్ని మరియు సంతృప్తిని పొందుతారు (ఆల్మా 26:16 చూడండి).
శ్రద్ధ అంటే ఏమి చేయాలో నాయకులు చెప్పే వరకు వేచి ఉండడానికి బదులుగా మీ స్వంత ఇష్టానుసారం అనేక మంచి పనులు చేయడం (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:27–29 చూడండి).
కష్టంగా ఉన్నప్పుడు లేదా మీరు అలసిపోయినప్పుడు కూడా మంచి చేయడాన్ని కొనసాగించండి. అయినప్పటికీ మీరు “[మీకు ఉన్న] శక్తికి మించి వేగంగా పరిగెత్తకుండా” (మోషైయ 4:27) సమతుల్యత మరియు విశ్రాంతి యొక్క అవసరాన్ని గుర్తించండి.
మీ హృదయాన్ని మరియు ఆసక్తులను ప్రభువుపై మరియు ఆయన పనిపై కేంద్రీకరించండి. మీ ప్రాధాన్యతల నుండి మీ దృష్టిని మరల్చే విషయాలను నివారించండి. మీ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతంగా మరియు మీరు బోధిస్తున్న వ్యక్తులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే కార్యకలాపాలపై మీ సమయాన్ని మరియు ప్రయత్నాలను కేంద్రీకరించండి.
“ఇది ప్రభువు యొక్క సంఘము. మనకు బలహీనతలు ఉన్నాయని తెలిసి కూడా ఆయన మనల్ని పిలిచారు మరియు మనల్ని నమ్మారు. మనం ఎదుర్కొనే కష్టాలు ఆయనకు తెలుసు. విశ్వాసంతో సేవ చేయడం ద్వారా మరియు ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా, ఆయన కోరుకునే దానిని మనం కోరుకునేలా మరియు ఆయన కోసం మనం సేవ చేసే వారిని ఆశీర్వదించడానికి మనం ఎలా ఉండాలో అలా మనం మారగలము. మనం తగినంత కాలం ఆయనకు శ్రద్ధతో సేవ చేస్తున్నప్పుడు, మనం మారతాము. మనం ఎప్పటికీ ఎక్కువగా ఆయనలా మారగలము” (Henry B. Eyring, “Act in All Diligence,” Liahona, May 2010, 62–63).
లేఖన అధ్యయనము
శ్రద్ధగా ఉండడం అంటే అర్థమేమిటి?
-
Guide to the Scriptures: “Diligence.”
మీరు శ్రద్ధగా ఉండాలని ప్రభువు ఎందుకు ఆశిస్తున్నారు?
శ్రద్ధకు కర్తృత్వానికి ఎలా సంబంధం ఉంది?
విధేయత
సువార్తికునిగా మీ సేవ మీరు బాప్తిస్మపు సమయంలో మరియు దేవాలయంలో దేవునితో చేసిన నిబంధనల యొక్క పొడిగింపు. మీరు బాప్తిస్మపు విధులను మరియు వరమును పొందినప్పుడు, మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారని నిబంధన చేసారు.
రాజైన బెంజమిన్ ఇలా బోధించాడు: “దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా వారు ఐహికమైన మరియు ఆత్మ సంబంధమైన విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉన్న యెడల, వారు పరలోకములోనికి చేర్చుకొనబడి దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు” (మోషైయ 2:41).
ఆజ్ఞలను పాటించడం అనేది పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పట్ల గల ప్రేమ యొక్క వ్యక్తీకరణ (యోహాను 14:15 చూడండి). “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు” (యోహాను 15:10) అని యేసు చెప్పారు.
Missionary Standards for Disciples of Jesus Christ లోని మార్గదర్శకాలను అనుసరించండి. మీ మిషను అధ్యక్షుడు మరియు ఆయన భార్య మీకు నీతిగా సలహా ఇస్తున్నప్పుడు వారి సలహాను కూడా అనుసరించండి.
“విధేయత అనేది మన ఎంపిక. రక్షకుడు దీనిని స్పష్టం చేసారు. లూకా 14:28 యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదంలో చెప్పినట్లుగా, ‘కాబట్టి, నేను బోధించి, ఆజ్ఞాపించు వాటిని చేయుదుమని మీ హృదయాలలో ఒక తీర్మానము తీసుకొనుము,’ అని యేసు ఆదేశించారు. ఇది చాలా సులభం. … మనం అలా చేసినప్పుడు, మన ఆధ్యాత్మిక స్థిరత్వం బాగా పెరుగుతుంది. దేవుడు ఇచ్చిన వనరులను మనం వృధా చేయకుండా ఉంటాము మరియు మన జీవితాల్లో ఉత్పాదకత లేని, వినాశకరమైన మలుపులు తీసుకోకుండా ఉంటాము” (Dale G. Renlund, “Constructing Spiritual Stability” [Brigham Young University devotional, Sept. 16, 2014], 2, speeches.byu.edu).
లేఖన అధ్యయనము
ఈ క్రింది లేఖనాల నుండి విధేయత గురించి మీరు ఏమి నేర్చుకోగలరు?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 75:2–5; 82:8–10; 123:12–14; 127:4; 130:20–21
-
మత్తయి 7:24–27
-
యోహాను 7:17; 14:15
మరింతగా క్రీస్తులా మారడానికి ఒక నమూనా
ఈ అధ్యాయంలో వివరించిన లక్షణాలను మరియు లేఖనాలలో వివరించిన ఇతర లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి మరియు పొందడానికి ఈ క్రింది నమూనా మీకు సహాయపడగలదు:
-
మీరు వెదకాలనుకుంటున్న లక్షణాన్ని గుర్తించండి.
-
లక్షణం యొక్క వివరణ రాయండి.
-
లక్షణం యొక్క ఉదాహరణలను చూపించే లేదా దాని గురించి బోధించే లేఖన గద్యభాగాలను జాబితా చేసి అధ్యయనం చేయండి.
-
మీ భావాలను మరియు అభిప్రాయాలను నమోదు చేయండి.
-
ఆ లక్షణంలో పురోగతి సాధించడానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలను రూపొందించండి.
-
మీరు ఆ లక్షణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు పొందడానికి సహాయం చేయమని దేవుడిని ప్రార్థించండి.
-
మీ పురోగతిని కాలానుగుణంగా అంచనా వేయండి.
“మెరుగుపడాలని కోరుకునే వారిని, ఆజ్ఞల అవసరాన్ని అంగీకరించి వాటిని పాటించడానికి ప్రయత్నించేవారిని, క్రీస్తువంటి సుగుణాలను గౌరవించేవారిని మరియు వాటిని పొందేందుకు తమ సామర్థ్యం మేరకు కృషి చేసే వారిని ప్రభువు ఆశీర్వదిస్తారు. అందరూ చేసినట్లే ఆ ప్రయత్నంలో మీరు పొరపాట్లు చేస్తే, మీరు ముందుకు సాగడానికి రక్షకుడు సహాయం చేస్తారు. … త్వరలో మీరు కోరుకునే విజయం మీకు లభిస్తుంది ” (Jeffrey R. Holland, “Tomorrow the Lord Will Do Wonders among You,” Liahona, May 2016, 126).
వ్యక్తిగత అధ్యయనము
ఈ అధ్యాయం నుండి లేదా లేఖనాల నుండి ఒక లక్షణాన్ని గుర్తించండి. ఆ లక్షణాన్ని అర్థం చేసుకోవడానికి మరియు వెదకడానికి ఇప్పుడే వివరించిన నమూనాను అనుసరించండి.
మీ సువార్తికుని నేమ్ ట్యాగ్‌ని చూడండి. ఒక కంపెనీ ఉద్యోగులు ధరించే వాటి నుండి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? రెండు ముఖ్యమైన భాగాలు మీ పేరు మరియు రక్షకుని పేరు అని గమనించండి.
-
ఆయన శిష్యులలో ఒకరిగా మీరు రక్షకునికి బాగా ఎలా ప్రాతినిధ్యం వహించగలరు?
-
జనులు మీ పేరును రక్షకుని పేరుతో సానుకూల మార్గంలో అనుబంధించడం ఎందుకు ముఖ్యం?
మీ ఆలోచనలను మీ అధ్యయన పుస్తకంలో వ్రాయండి.
లేఖన అధ్యయనము
క్రింది లేఖనాలలో జాబితా చేయబడిన లక్షణాలను సమీక్షించండి. మీ అధ్యయన పుస్తకంలో ఏవైనా మనోభావాలను నమోదు చేయండి.
-
ఫిలిప్పీయులకు 4:8
-
2 పేతురు 1:5–8
అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు
వ్యక్తిగత అధ్యయనము
-
ఈ అధ్యాయం చివరిలో ఉన్న “లక్షణ ప్రోత్సాహకార్యక్రమము”ను కాలానుగుణంగా పూర్తి చేయండి.
-
ఈ అధ్యాయంలో ఒక లక్షణాన్ని గుర్తించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:
-
ఈ లక్షణం గురించి నేను మరింతగా ఎలా నేర్చుకోవచ్చు?
-
ఈ లక్షణాన్ని వెదకడం యేసు క్రీస్తు సువార్తకు మెరుగైన సేవకునిగా మారడానికి నాకు ఎలా సహాయపడుతుంది?
-
-
లేఖనాలలో ఉన్న స్త్రీ పురుషుల జీవితాలలో క్రీస్తువంటి లక్షణాల ఉదాహరణలను కనుగొనండి. మీ మనోభావాలను మీ అధ్యయన పుస్తకంలో నమోదు చేసుకోండి.
-
సంఘము యొక్క పవిత్ర సంగీతంలో క్రీస్తువంటి లక్షణాల ఉదాహరణలను కనుగొనండి. మీరు ఒక లక్షణాన్ని వెదుకుతున్నప్పుడు, బలం మరియు శక్తిని కనుగొనడానికి కీర్తనలు లేదా పాటల పదాలను గుర్తుంచుకోండి. ప్రేరణ కోసం మరియు ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించడానికి పదాలను మీరే పునరావృతం చేయండి లేదా పాడండి.
సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి
-
సువార్త గ్రంథాలయములో లేదా ఇతర ఆమోదించబడిన వనరులలో క్రీస్తువంటి లక్షణాలకు సంబంధించిన అధ్యయన సూచికలను చదవండి. మీరు నేర్చుకున్న వాటిని ఎలా అన్వయించాలో చర్చించండి. క్రీస్తులాగా మారడానికి మీ వ్యక్తిగత ప్రయత్నాలలో మీరు నేర్చుకున్న వాటిని కూడా చర్చించవచ్చు.
జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ
-
సలహాసభ లేదా సభ్యసమావేశానికి చాలా రోజుల ముందు, ప్రతి సువార్తికుడిని క్రీస్తువంటి లక్షణంపై ఐదు నిమిషాల ప్రసంగాన్ని సిద్ధం చేయమని అడగండి. కొంతమంది సువార్తికులు తమ ప్రసంగాలను పంచుకోవడానికి సమావేశంలో సమయం కేటాయించండి.
-
సువార్తికులను నాలుగు బృందాలుగా విభజించి వారికి ఈ క్రింది నియామకం ఇవ్వండి:
బృందం 1: 1 నీఫై 17:7–16 చదివి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:
-
నీఫై తన విశ్వాసాన్ని ఎలా సాధన చేసాడు?
-
నీఫై క్రీస్తులాగా ఏమి చేశాడు?
-
ప్రభువు నీఫైకి చేసిన వాగ్దానాలు ఏమిటి?
-
ఈ వృత్తాంతం సువార్త పరిచర్యకు ఎలా వర్తిస్తుంది?
బృందం 2: మార్కు 5:24–34 చదివి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:
-
ఈ స్త్రీ యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని ఎలా సాధన చేసింది?
-
ఆమె ఎందుకు స్వస్థత పొందింది?
-
సువార్తికులుగా మన ప్రయత్నాలలో ఆమె మాదిరిని మనం ఎలా అనుసరించవచ్చు?
బృందం 3: జేకబ్ 7:1–15 చదివి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:
-
జేకబ్ విశ్వాసం షెరేమ్ దాడిని ఎదిరించేంత బలంగా ఎందుకు ఉంది?
-
షెరేమ్‌తో మాట్లాడినప్పుడు జేకబ్ ఎలా విశ్వాసాన్ని సాధన చేసాడు?
-
జేకబ్ చర్యలు క్రీస్తు చర్యలను ఎలా పోలి ఉన్నాయి?
బృందం 4: జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:8–18 చదివి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:
-
జోసెఫ్ స్మిత్ ఏ విధాలుగా యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని సాధన చేసాడు?
-
అతని విశ్వాసం ఎలా పరీక్షించబడింది?
-
అతడు క్రీస్తులాగా ఏమి చేసాడు?
-
జోసెఫ్ స్మిత్ మాదిరిని మనం ఎలా అనుసరించవచ్చు?
బృందాలు ముగించిన తర్వాత, సువార్తికులను ఒకచోట చేర్చి, వారు చర్చించిన వాటిని పంచుకోమని అడగండి.
-
మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు
-
సువార్తికులను కొత్త నిబంధనలోని నాలుగు సువార్తలలో ఒకదాన్ని లేదా 3 నీఫై 11–28 చదవమని అడగండి. వారు కూడా చేయగలిగేలా రక్షకుడు చేసిన దాని క్రింద వారిని గీత గీయనివ్వండి.
-
శ్రద్ధ గురించి సువార్తికులకు బోధించడానికి లక్ష్య నిర్దేశం మరియు ప్రణాళికను ఉపయోగించండి. జనులపై దృష్టి పెట్టడంలో శ్రద్ధ ఏవిధంగా ప్రేమ యొక్క వ్యక్తీకరణో చూపించండి.
-
ఇంటర్వ్యూల సమయంలో లేదా సంభాషణలలో, వారు కోరుకునే క్రీస్తువంటి లక్షణం గురించి మాట్లాడమని సువార్తికులను అడగండి.
లక్షణ ప్రోత్సాహకార్యక్రమం
ఆధ్యాత్మిక వృద్ధికి అవకాశాలను గుర్తించడంలో మీకు సహాయపడడమే ఈ ప్రోత్సాహకార్యక్రమం యొక్క ఉద్దేశ్యం. క్రింద ఉన్న ప్రతి అంశాన్ని చదవండి. మీ గురించి ఆ వివరణ ఎంతవరకు నిజమో నిర్ణయించుకోండి మరియు తగిన ప్రతిస్పందనను ఎంచుకోండి. మీ అధ్యయన పుస్తకంలో మీ ప్రతిస్పందనలను రాయండి.
ప్రతి వివరణకు ఎవ్వరూ “ఎల్లప్పుడూ” అని చెప్పలేరు. ఆధ్యాత్మిక వృద్ధి అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. అందుకే అది ఉత్తేజకరమైనది మరియు ప్రతిఫలదాయకమైనది—ఎందుకంటే ఎదగడానికి మరియు వృద్ధి యొక్క ఆశీర్వాదాలను అనుభవించడానికి లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి.
మీరు ఉన్న చోట నుండి ప్రారంభించడంలో సౌకర్యంగా ఉండండి. ఎదగడానికి అవసరమైన ఆధ్యాత్మిక పనిని చేయడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. దేవుని సహాయం కోరండి. మీకు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, ఆయన మీకు సహాయం చేస్తారనే నమ్మకం కలిగి ఉండండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీ సువార్తసేవ సమయంలో వివిధ సమయాల్లో ఏ లక్షణాలపై దృష్టి పెట్టాలనే దాని గురించి నడిపింపును కోరండి.
ప్రతిస్పందన స్వరము
-
1 = ఎప్పుడూ లేదు
-
2 = కొన్నిసార్లు
-
3 = తరచుగా
-
4 = దాదాపు ఎల్లప్పుడూ
-
5 = ఎల్లప్పుడూ
విశ్వాసము
-
నేను క్రీస్తును నమ్ముతాను మరియు ఆయనను నా రక్షకుడిగా అంగీకరిస్తాను. (2 నీఫై 25:29)
-
దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నాకు నమ్మకముంది. (1 నీఫై 11:17)
-
నేను రక్షకుని చిత్తాన్ని అంగీకరించి, ఆయన అడిగినది చేసేంతగా ఆయనను నమ్ముతున్నాను. (1 నీఫై 3:7)
-
నేను పశ్చాత్తాపపడినప్పుడు, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా పాపాలు క్షమించబడతాయని మరియు నేను పరిశుద్ధపరచబడతానని నేను నమ్ముతున్నాను. (ఈనస్ 1:2–8)
-
దేవుడు నా ప్రార్థనలను వింటారని మరియు సమాధానమిస్తారని నాకు నమ్మకం ఉంది. (మోషైయ 27:14)
-
నేను రోజంతా రక్షకుని గురించి ఆలోచిస్తాను మరియు ఆయన నా కోసం చేసిన వాటిని గుర్తుంచుకుంటాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79)
-
మనల్ని మనం ఆయనకు మరియు ఆయన కుమారునికి అంకితం చేసుకుంటే దేవుడు నా జీవితంలో మరియు ఇతరుల జీవితాలలో మంచి విషయాలను జరిగిస్తారని నాకు నమ్మకం ఉంది. (ఈథర్ 12:12)
-
పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మోర్మన్ గ్రంథము సత్యమని నాకు తెలుసు. (మొరోనై 10:3–5)
-
నేను ఏమి చేయాలని క్రీస్తు కోరుకుంటున్నారో దానిని సాధించగలనని నాకు నమ్మకం ఉంది. (మొరోనై 7:33)
నిరీక్షణ
-
సిలెస్టియల్ రాజ్యములో నిత్యజీవాన్ని వారసత్వంగా పొందాలనేది నా గొప్ప కోరికలలో ఒకటి. (మొరోనై 7:41)
-
నేను సంతోషకరమైన మరియు విజయవంతమైన సువార్తసేవ చేస్తానని నాకు నమ్మకం ఉంది. (సిద్ధాంతము మరియు నిబంధనలు 31:3–5)
-
నేను భవిష్యత్తు గురించి ప్రశాంతంగా మరియు ఆశాజనకంగా భావిస్తున్నాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:23)
-
ఏదో ఒకరోజు నేను దేవునితో నివసిస్తానని మరియు ఆయనలా అవుతానని నేను నమ్ముతున్నాను. (ఈథర్ 12:4)
దాతృత్వము మరియు ప్రేమ
-
ఇతరుల నిత్య సంక్షేమం మరియు సంతోషం కోసం నేను హృదయపూర్వక కోరికను అనుభవిస్తున్నాను. (మోషైయ 28:3)
-
నేను ప్రార్థించేటప్పుడు, నేను దాతృత్వం—క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమను అడుగుతాను. (మొరోనై 7:47–48)
-
నేను ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి మరియు వారి దృక్కోణాన్ని చూడడానికి ప్రయత్నిస్తాను. (యూదా 1:22)
-
నన్ను బాధపెట్టిన లేదా తప్పు చేసిన ఇతరులను నేను క్షమిస్తాను. (ఎఫెసీయులకు 4:32)
-
ఒంటరిగా, కష్టపడుతున్న లేదా నిరుత్సాహపడిన వారికి సహాయం చేయడానికి నేను ప్రేమతో ముందుకు వస్తాను. (మోషైయ 18:9)
-
సముచితమైనప్పుడు, ఇతరుల పట్ల నేను నా ప్రేమను, శ్రద్ధను మాట మరియు క్రియ చేత వారికి పరిచర్య చేయడం ద్వారా వ్యక్తపరుస్తాను. (లూకా 7:12–15)
-
నేను ఇతరులకు సేవ చేయడానికి అవకాశాల కోసం చూస్తాను. (మోషైయ 2:17)
-
నేను ఇతరుల గురించి సానుకూల విషయాలు చెబుతాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:27)
-
ఇతరులతో కలిసిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ, నేను వారితో దయగా మరియు ఓపికగా ఉంటాను. (మొరోనై 7:45)
-
ఇతరుల విజయాలలో నేను ఆనందాన్ని పొందుతాను. (ఆల్మా 17:2–4)
సుగుణము
-
నేను స్వచ్ఛమైనవాడిని మరియు హృదయశుద్ధి గలవాడిని. (కీర్తనలు 24:3–4)
-
నేను మంచి చేయాలనుకుంటున్నాను. (మోషైయ 5:2)
-
నేను నీతివంతమైన, ఉత్తేజకరమైన ఆలోచనలపై దృష్టి పెడతాను మరియు నా మనస్సు నుండి చెడు ఆలోచనలను తొలగిస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45)
-
నేను నా పాపాలకు పశ్చాత్తాపపడి, నా బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నిస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 49:26–28; ఈథర్ 12:27)
-
నా జీవితంలో పరిశుద్ధాత్మ ప్రభావాన్ని నేను అనుభవిస్తున్నాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–13)
యథార్థత
-
నేను అన్ని సమయాల్లో దేవునిపట్ల నిజాయితీగా ఉంటాను. (మోషైయ 18:9)
-
ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా వారిచే అంగీకరించబడడానికి నేను నా ప్రమాణాలను లేదా ప్రవర్తనను తగ్గించుకోను. (1 నీఫై 8:24–28)
-
నేను దేవునితో, నాతో, నా నాయకులతో మరియు ఇతరులతో నిజాయితీగా ఉంటాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 51:9)
-
నేను ఆధారపడదగినవాడిని. ఆల్మా 53:20.
జ్ఞానము
-
సువార్త సిద్ధాంతం మరియు సూత్రాలను నేను అర్థం చేసుకున్నానని నాకు నమ్మకం ఉంది. (ఆల్మా 17:2–3)
-
నేను ప్రతిరోజూ లేఖనాలను అధ్యయనం చేస్తాను. (2 తిమోతికి 3:16–17)
-
నేను సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు నా ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నిస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:7)
-
నేను ఆత్మ ద్వారా జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని కోరుకుంటాను. (1 నీఫై 4:6)
-
నేను సువార్త సిద్ధాంతం మరియు సూత్రాలను గౌరవిస్తాను. (2 నీఫై 4:15)
ఓర్పు
-
ప్రభువు యొక్క ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలు నెరవేరడం కోసం నేను ఓపికగా ఎదురు చూస్తాను. (2 నీఫై 10:17)
-
నేను కలత చెందకుండా లేదా నిరాశ చెందకుండా విషయాల కోసం వేచి ఉండగలను. (రోమా 8:25)
-
సువార్తికునిగా ఉండడం వల్ల వచ్చే సవాళ్లతో నేను ఓపికగా ఉంటాను. (ఆల్మా 17:11)
-
నేను ఇతరులతో ఓపికగా ఉంటాను. (రోమా 15:1)
-
నేను నా పట్ల ఓపికగా ఉంటాను మరియు నా బలహీనతలను అధిగమించడానికి నేను పనిచేస్తున్నప్పుడు ప్రభువుపై ఆధారపడతాను. (ఈథర్ 12:27)
-
నేను ఓర్పుతో మరియు విశ్వాసంతో ప్రతికూలతను ఎదుర్కొంటాను. (ఆల్మా 34:40–41)
వినయము
-
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను. (మత్తయి 11:29)
-
నేను సహాయం కోసం దేవునిపై ఆధారపడతాను. (ఆల్మా 26:12)
-
దేవుని నుండి నేను పొందిన ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞుడను. (ఆల్మా 7:23)
-
నా ప్రార్థనలు హృదయపూర్వకంగా మరియు నిజాయితీగా ఉంటాయి. (ఈనస్ 1:4)
-
నా నాయకులు లేదా బోధకుల నుండి వచ్చే దిశానిర్దేశాన్ని నేను అభినందిస్తున్నాను. (2 నీఫై 9:28–29)
-
నేను దేవుని చిత్తానికి లోబడేందుకు ప్రయత్నిస్తాను. (మోషైయ 24:15)
శ్రద్ధ
-
నేను దగ్గరి పర్యవేక్షణలో లేనప్పుడు కూడా సమర్థవంతంగా పని చేస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:26–27)
-
నేను నా ప్రయత్నాలను అతి ముఖ్యమైన విషయాలపై కేంద్రీకరిస్తాను. (మత్తయి 23:23)
-
నేను రోజుకు కనీసం రెండుసార్లు వ్యక్తిగత ప్రార్థన చేస్తాను. (ఆల్మా 34:17–27)
-
నేను సువార్తికునిగా నా పిలుపుపై నా ఆలోచనలను కేంద్రీకరిస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 4:2, 5)
-
నేను లక్ష్యాలను నిర్దేశించుకుంటాను మరియు క్రమం తప్పకుండా ప్రణాళిక వేసుకుంటాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:119)
-
పని పూర్తయ్యే వరకు నేను కష్టపడి పనిచేస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 10:4)
-
నా పనిలో నేను ఆనందాన్ని మరియు సంతృప్తిని పొందుతాను. (ఆల్మా 36:24–25)
విధేయత
-
నేను ప్రార్థించేటప్పుడు, శోధనను ఎదిరించడానికి మరియు సరైనది చేయడానికి బలాన్ని అడుగుతాను. (3 నీఫై 18:15)
-
నేను దేవాలయ సిఫారసు పొందడానికి అర్హుడిని. (సిద్ధాంతము మరియు నిబంధనలు 97:8)
-
నేను ఇష్టపూర్వకంగా మిషను నియమాలను పాటిస్తాను మరియు నా నాయకుల సలహాను అనుసరిస్తాను. (హెబ్రీయులకు 13:17)
-
నేను సువార్త యొక్క చట్టాలు మరియు సూత్రాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 41:5)