సువార్త కోర్సులు
అధ్యాయము 8: లక్ష్యాలు మరియు ప్రణాళికల ద్వారా కార్యాన్ని సాధించండి


“అధ్యాయము 8: లక్ష్యాలు మరియు ప్రణాళికల ద్వారా కార్యాన్ని సాధించండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)

“అధ్యాయము 8,” నా సువార్తను ప్రకటించండి

Go Ye Therefore (Go Ye Therefore, and Teach All Nations) [కాబట్టి మీరు వెళ్ళండి (కాబట్టి మీరు వెళ్ళి, సమస్త జనులకు బోధించుడి)], హ్యారీ ఆండర్సన్ చేత

అధ్యాయము 8

లక్ష్యాలు మరియు ప్రణాళికల ద్వారా కార్యాన్ని సాధించండి

దీనిని పరిగణించండి

  • నేను లక్ష్యాలను ఎందుకు నిర్దేశించుకోవాలి?

  • వ్యక్తుల ఆధ్యాత్మిక పురోగతిపై దృష్టి పెట్టడానికి పరివర్తన కొరకు కీలకమైన సూచికలు నాకు ఎలా సహాయపడతాయి?

  • నేను లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి, వాటిని సాధించడానికి ఎలా ప్రణాళికలు రూపొందించాలి మరియు నా ప్రణాళికలను ఎలా అమలు చేయాలి?

  • నేను వారపు మరియు రోజువారీ ప్రణాళికా సమావేశాలను ఎలా నిర్వహించాలి?

  • పనిని పూర్తి చేయడంలో నాకు సహాయపడడానికి నేను నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఎలా ఉపయోగించగలను?

  • జవాబుదారీతనం యొక్క సూత్రం ఏమిటి? ఇది నా ప్రయత్నాలను ఎలా ఆశీర్వదిస్తుంది?

ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రభువు పనికి సహాయం చేయడానికి మీరు నియమించబడ్డారు. ఆయన ప్రేమ మరియు సత్యంతో వ్యక్తులను మీరు ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నారు. మీరు వారిని ఆయన వద్దకు రమ్మని ఆహ్వానించి సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నారు.

మీరు “ఆతృతతో [ఈ] మంచి కార్యములో నిమగ్నమై ఉండాలని” ప్రభువు కోరుకుంటున్నారు. మీరు “[మీ] ఇష్టపూర్వకముగా అనేక కార్యములు చేసి, అధికమైన నీతిని నెరవేర్చవలెనని” ఆయన అడుగుతున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:27; 26–29 వచనాలు చూడండి). మీరు సేవచేసే వార్డు లేదా శాఖ సభ్యులపై సానుకూల ప్రభావం చూపడానికి మీ వంతు కృషి చేయండి.

ఈ అధ్యాయం లక్ష్యాలను ఎలా నిర్దేశించాలో, వాటిని సాధించడానికి ఎలా ప్రణాళికలు రూపొందించాలో మరియు మీ ప్రణాళికలను శ్రద్ధగా ఎలా అమలు చేయాలో నేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది. ఇది పరివర్తన కొరకు కీలకమైన సూచికలను వివరిస్తుంది, అవి దేవుని పిల్లలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడేందుకు మీ ప్రయత్నాలను నడిపిస్తాయి. ఇది మీ వ్యక్తిగత మరియు సహచర లక్ష్యాలతో సహా సువార్త పరిచర్య యొక్క అన్ని అంశాలలో మీరు ఉపయోగించగల సరళమైన లక్ష్య-నిర్దేశక ప్రక్రియను అందిస్తుంది. ఇది మీ సహచరుడితో వారపు మరియు రోజువారీ ప్రణాళికా సమావేశా‌లను ఎలా నిర్వహించాలో కూడా వివరిస్తుంది.

లక్ష్యాలను నిర్దేశించడాన్ని మరియు ప్రణాళికలు రూపొందించడాన్ని నేర్చుకోవడం అనేది మీ జీవితాంతం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇది దేవునితో నిబంధనలు చేసి పాటించడానికి, సంఘములో నమ్మకంగా సేవ చేయడానికి, విద్యను కొనసాగించడానికి, మీ ఉద్యోగంలో ఎదగడానికి మరియు బలమైన కుటుంబాన్ని నిర్మించడానికి మీకు సహాయపడుతుంది.

లేఖన అధ్యయనము

దేవుని పనిని సాధించడానికి ప్రణాళికను రూపొందించడం గురించి ఈ క్రింది లేఖనాల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

He Healed Many of Diverse Diseases [ఆయన అనేక రకాల వ్యాధులను నయం చేశారు], జె. కర్క్ రిఛర్డ్స్ చేత

రక్షకునికి పరివర్తన చెందడంలో ఇతరులకు సహాయపడండి

సువార్తికునిగా మీ ఉద్దేశ్యంపై దృష్టి పెట్టండి

సువార్తికులుగా మీ అనేక విధుల్లో ఏది అత్యంత ముఖ్యమైనదోనని మీరు బహుశా ఆశ్చర్యపడి ఉండవచ్చు. మీరు లక్ష్యాలను నిర్దేశించుకుని, ప్రతి వారం మరియు ప్రతి రోజు ప్రణాళిక రూపొందించేటప్పుడు పరిగణించవలసిన మంచి ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఇవ్వడానికి, సువార్తికునిగా మీ ఉద్దేశ్యం గురించి ఆలోచించండి:

“యేసు క్రీస్తునందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందుట మరియు అంతము వరకు సహించుట ద్వారా పునఃస్థాపించబడిన సువార్తను పొందడానికి వారికి సహాయపడుట ద్వారా క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇతరులను ఆహ్వానించండి.”

సువార్తికునిగా మీ ఉద్దేశ్యం మీ లక్ష్యాలను మరియు ప్రణాళికలను నడిపించనివ్వండి. రక్షకునికి పరివర్తన చెందడానికి మరియు ఆయన సువార్తను స్వీకరించడానికి వ్యక్తులు తమ కర్తృత్వాన్ని ఉపయోగించుకోవడానికి మీరు ఎలా సహాయపడగలరనే దానిపై దృష్టి పెట్టండి.

మీరు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందించేటప్పుడు ఆత్మ యొక్క నడిపింపును కోరండి మరియు మీ సహచరుడితో చర్చించండి. అప్పుడు మీ ప్రణాళికలను అనుసరించండి మరియు మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి.

అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్

“‘జనులను సంఘములోకి తీసుకురావడానికి’ లేదా సంఘ సభ్యత్వాన్ని పెంచడానికి మనం ప్రకటించము మరియు బోధించము. మెరుగైన జీవితాలను గడపడానికి జనులను ఒప్పించడానికి మాత్రమే మనం ప్రకటించము మరియు బోధించము. … దేవుని కుమారులు మరియు కుమార్తెల కొరకు సిలెస్టియల్ రాజ్యపు ద్వారాలను తెరవడానికి పశ్చాత్తాపం, బాప్తిస్మం మరియు నిర్ధారణ ద్వారా క్రీస్తు వద్దకు రావాలని మనం అందరినీ ఆహ్వానిస్తున్నాము. మరెవరూ దీన్ని చేయలేరు” (Dallin H. Oaks, “The Purpose of Missionary Work,” missionary satellite broadcast, Apr. 1995).

లేఖన అధ్యయనము

ఈ సువార్తికులు మరియు ప్రవక్తలు ప్రభువు యొక్క సహాయంతో తమ ప్రణాళికలను ఎలా సాధించారు?

పరివర్తన కొరకు కీలకమైన సూచికలతో సమలేఖనం చేయండి

సంఘ నాయకులు పరివర్తన కొరకు కీలకమైన ఆరు సూచికలను గుర్తించారు. దేవుని పిల్లల ఆధ్యాత్మిక పురోగతిపై దృష్టి పెట్టడానికి కీలక సూచికలు మీకు సహాయపడతాయి. మీ రోజువారీ ప్రయత్నాలను సువార్తికునిగా మీ ఉద్దేశ్యంతో సమలేఖనం చేయడంలో మీకు సహాయపడడానికి అవి ఉద్దేశించబడ్డాయి.

పరివర్తన కొరకు కీలకమైన సూచికలు క్రింద చూపబడ్డాయి.

ఒక వ్యక్తితో కరచాలనము చేస్తున్న సువార్తికులు

కొత్త వ్యక్తులు బోధింపబడుట. ఒక వారంలో ఒక పాఠం పొందిన (కానీ గత మూడు నెలల్లో బోధించబడని) మరియు తిరిగిరావడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని అంగీకరించిన (బాప్తిస్మం పొందని) ప్రతి వ్యక్తి. ఒక పాఠంలో సాధారణంగా ప్రార్థన (సముచితమైనప్పుడు), కనీసం ఒక సువార్త సూత్రాన్ని బోధించడం మరియు ఆహ్వానాన్ని అందించడం ఉంటాయి.

బోధించుచున్న సువార్తికులు

ఒక సభ్యుడు పాల్గొనే పాఠాలు. ఒక నిర్దిష్ట వారంలో ఒక వ్యక్తి (బాప్తిస్మం పొందని) బోధింపబడిన మరియు ఒక సభ్యుడు పాల్గొన్న పాఠాల సంఖ్య.

సంఘము వద్ద కుటుంబము

సంస్కార కూడికకు హాజరవుతూ బోధింపబడుతున్న వ్యక్తులు. మీరు బోధిస్తుండగా ఒక నిర్దిష్ట వారంలో సంస్కార కూడికకు హాజరైన (బాప్తిస్మం పొందని) ప్రతీ వ్యక్తి.

ప్రార్థన చేస్తున్న కుటుంబము

బాప్తిస్మపు తేదీ గల వ్యక్తులు. ఒక నిర్దిష్ట తేదీన బాప్తిస్మం పొందడానికి మరియు నిర్ధారించబడడానికి అంగీకరించిన ప్రతీ వ్యక్తి.

బాప్తిస్మము

బాప్తిస్మం పొందిన మరియు నిర్ధారించబడిన వ్యక్తులు. బాప్తిస్మం మరియు నిర్ధారణ యొక్క విధులను పొందిన మరియు ఒక నిర్దిష్ట వారంలో ఎలక్ట్రానిక్‌గా ఫారమ్ సమర్పించబడిన ప్రతీ కొత్త సభ్యుడు. (పరివర్తన చెందినవారి బాప్తిస్మం యొక్క నిర్వచనం మరియు రికార్డులను సృష్టించడం గురించి సమాచారం కోసం 12వ అధ్యాయం చూడండి.)

సంఘము వద్దనున్న స్త్రీలు

సంస్కార కూడికకు హాజరవుతున్న కొత్త సభ్యులు. ఒక నిర్దిష్ట వారంలో సంస్కార కూడికకు హాజరై, గత 12 నెలల్లోపు బాప్తిస్మం మరియు నిర్ధారణ ఫారమ్ సమర్పించబడిన ప్రతీ కొత్త సభ్యుడు.

సంక్షిప్తంగా, ఈ అనుభవాలలో పాల్గొనడానికి ఎంచుకోవడంలో జనులకు సహాయపడడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ప్రయత్నాలను ఈ క్రింది కార్యకలాపాలపై కేంద్రీకరించండి:

  • బోధించడానికి కొత్త వ్యక్తులను కనుగొనడంలో మీకు సహాయపడేవి

  • నిబంధనలు చేసి పాటించడం వైపు జనులు పురోగతి సాధించడంలో సహాయపడేవి

  • గత సంవత్సరంలో బాప్తిస్మం పొంది నిర్ధారించబడిన వ్యక్తులకు సహాయపడేవి

మీ కీలక సూచికలలో చూపబడినట్లుగా మీ ప్రయత్నాలు ఒక వ్యక్తి పురోగతికి ఎలా సహాయపడగలవో మీరు చూడలేకపోతే, ఆ కార్యక్రమం మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో అంచనా వేయండి.

మీరు తక్కువ సమయం గడిపే వ్యక్తుల కోసం, సువార్తపై వారి ఆసక్తిని పెంపొందించడాన్ని కొనసాగించండి. వారిని సంప్రదించమని మీరు సభ్యులను ఆహ్వానించవచ్చు. వారిని ప్రోత్సహించడానికి మరియు వారికి పరిచర్య చేయడాన్ని కొనసాగించడానికి మీరు సాంకేతికతను కూడా ఉపయోగించవచ్చు. అదనపు ఉపాయాల కోసం 9వ అధ్యాయంలోనున్న “సాంకేతికతను ఉపయోగించండి” చూడండి.

ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్

“ప్రణాళిక రూపొందించడం మరియు లక్ష్యాలను నిర్దేశించడం యొక్క అంతిమ లక్ష్యం శిష్యులను తయారు చేయడం—అంటే, బాప్తిస్మపు నిబంధనతో ప్రారంభించి, దేవాలయ నిబంధనలకు దారితీసే పవిత్ర నిబంధనలు చేసి వాటిని పాటించే అంకితభావంతో పరివర్తన చెందినవారిని కలిగి ఉండడం” (Quentin L. Cook, “Purpose and Planning,” mission leadership seminar, June 25, 2019).

కీలక సూచిక లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలు రూపొందించండి

వారపు ప్రణాళిక సమయంలో, మీరు మరియు మీ సహచరుడు అన్ని కీలక సూచికలకు లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీ కీలక సూచిక లక్ష్యాలు ఎక్కువమంది పరివర్తన యొక్క ఆశీర్వాదాలను అనుభవించడంలో సహాయపడాలనే మీ కోరికను ప్రతిబింబించాలి.

కీలక సూచిక ఫలితాలను ప్రభావితం చేసే మీ నియంత్రణలో ఉన్న పనులను చేయడానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలను రూపొందించండి. ఉదాహరణకు:

  • వారంలో నిర్దిష్ట సంఖ్యలో కొత్త వ్యక్తులకు బోధించడం ప్రారంభించడానికి మీరు ఒక కీలక సూచిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చు. మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అనేది ఇతరుల కర్తృత్వంపై ఆధారపడి ఉంటుంది. కానీ దానిని సాధించడానికి మీ నియంత్రణలో ఉన్నదానిని చేయండి. ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక మార్గం. అప్పుడు మీరు దానిని ఎలా చేయాలో ప్రణాళిక చేసుకోండి. ఈ అధ్యాయం యొక్క అనుబంధం 2 మరియు 9వ అధ్యాయంలోని ఉపాయాలను చూడండి.

  • మీరు బోధిస్తున్న కొత్త సభ్యులు మరియు వ్యక్తులు నిర్దిష్ట సంఖ్యలో సంస్కార కూడికకు హాజరు కావాలని మీరు కీలక సూచిక లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. వారు వస్తారా లేదా అనేది వారి కర్తృత్వంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ కీలక సూచిక ఫలితాలను ప్రభావితం చేయడానికి మీ నియంత్రణలో ఉన్నదానిని చేయండి. వారిని ఎప్పుడు ఆహ్వానించాలి మరియు ఎలా తదనంతర చర్య తీసుకోవాలో ప్రణాళిక చేయండి.

  • వారంలో నిర్దిష్ట సంఖ్యలో పాఠాలలో సభ్యులు పాల్గొనాలని మీరు కీలక సూచిక లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అనేది సభ్యులు మరియు మీరు బోధిస్తున్న వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ కీలక సూచిక ఫలితాన్ని ప్రభావితం చేయడానికి మీరు చేయగలిగినది చేయండి. సభ్యులు హాజరు కావడానికి వార్డు నాయకులతో కలిసి పనిచేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. తరువాత మీరు వారి భాగస్వామ్యాన్ని ఎలా సమన్వయం చేస్తారో ప్రణాళిక చేసుకోండి.

సహచరులుగా, మీరు మీ స్వంత ప్రాంతం కోసం కీలక సూచిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని (1) మీరు బోధిస్తున్న వారి పురోగతి మరియు (2) బోధించడానికి కొత్త వ్యక్తులను కనుగొనవలసిన అవసరం ఆధారంగా చేసుకోండి. బోధించడానికి కొత్త వ్యక్తులను కనుగొనడం అనేది నిరంతరం అవసరం.

మిషను-వ్యాప్త కీలక సూచిక లక్ష్యాలు ప్రతి సాహచర్యం నిర్దేశించిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి.

మీరు కీలక సూచిక లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు జనులపై దృష్టి కేంద్రీకరించడానికి నా సువార్తను ప్రకటించండి యాప్ మీకు సహాయం చేస్తుంది. ఈ యాప్ గత లక్ష్యాల నుండి నేర్చుకోవడానికి మరియు ప్రస్తుత లక్ష్యాల వైపు మీ పురోగతిని చూపించడానికి కూడా మీకు సహాయపడుతుంది.

కీలక సూచిక లక్ష్యాలు మరియు ఫలితాలు నా సువార్తను ప్రకటించండి యాప్ ద్వారా మీ మిషను నాయకులకు మరియు యువ సువార్తికుల నాయకులకు స్వయంచాలకంగా నివేదించబడతాయి.

ఒక కీలక సూచిక లక్ష్యాన్ని మిగతా వాటికంటే ఎక్కువగా నొక్కి చెప్పకుండా జాగ్రత్త వహించండి. అన్ని కీలక సూచికలపై నిరంతరం దృష్టి పెట్టడం అనేది మీరు ఇతరులను క్రీస్తు వద్దకు వచ్చి నిబంధనలు చేయమని నిరంతరం ఆహ్వానించడంలో సహాయపడుతుంది.

అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్

“పనితీరు కొలవబడినప్పుడు, పనితీరు మెరుగుపడుతుంది. పనితీరును కొలిచి నివేదించినప్పుడు, మెరుగుదల రేటు వేగవంతం అవుతుంది” (quoted by Thomas S. Monson, “Thou Art a Teacher Come from God,” Improvement Era, Dec. 1970, 101).

శ్రద్ధగా పనిచేయండి

మీ సువార్త సేవలో మీరు “పూర్తి శ్రద్ధతో పనిచేయవలెనని” ప్రభువు కోరుతున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:99). శ్రద్ధ అనేది స్థిరమైన, సాహసోపేతమైన ప్రయత్నం.

మీ కీలక సూచిక లక్ష్యాలపై శ్రద్ధగా పనిచేయండి. పరివర్తనకు దారితీసే నిబద్ధతలు చేయమని జనులను ఆహ్వానించండి. మీ శ్రద్ధగల ప్రయత్నాలు వారు క్రీస్తు వద్దకు రావడానికి సహాయపడే చర్యలు తీసుకోవడానికి వారిని ప్రేరేపించగలవు (2 నీఫై 2:14–16 చూడండి).

జనుల అవసరాలను తీర్చే మార్గాల్లో సువార్తను బోధించండి. ఆత్మ ద్వారా అర్థం చేసుకున్నప్పుడు, సిద్ధాంతం అన్నింటికంటే ఎక్కువగా వారిని చర్య తీసుకోవడానికి ప్రేరేపించే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో, కీలక సూచిక లక్ష్యాలు ఇతరుల కర్తృత్వంపై ఆధారపడి ఉంటాయని గుర్తించండి. జనుల కర్తృత్వాన్ని ఎల్లప్పుడూ గౌరవించండి.

కీలక సూచికలు అంతిమ లక్ష్యం కాదని గుర్తుంచుకోండి. బదులుగా, అవి బాప్తిస్మం, నిర్ధారణ మరియు శాశ్వతమైన పరివర్తన వైపు ఒక వ్యక్తి యొక్క సంభావ్య ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తాయి. జనుల యొక్క వాస్తవ పురోగతి వారి ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. మీరు లక్ష్యాలను నిర్దేశించినప్పుడు, ప్రణాళిక చేసినప్పుడు, శ్రద్ధగా వ్యవహరించినప్పుడు మరియు ప్రేరేపిత మార్గంలో వారికి పరిచర్య చేస్తున్నప్పుడు వారి తరఫున క్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా మీరు వారి పురోగతికి మద్దతు ఇస్తారు.

లక్ష్యాలను ఎలా నిర్దేశించాలి మరియు వాటిని సాధించడానికి ప్రణాళికలు ఎలా రూపొందించాలి

లక్ష్యాన్ని నిర్దేశించడం మరియు ప్రణాళిక రూపొందించడం అనేవి విశ్వాసం యొక్క చర్యలు. లక్ష్యాలు మీ హృదయ వాంఛలను మరియు మిమ్మల్ని, ఇతరులను రక్షకుని వద్దకు తీసుకురావడానికి సహాయపడే మీ ఆలోచనను ప్రతిబింబిస్తాయి.

జాగ్రత్తగా పరిగణించబడిన లక్ష్యాలు మరియు ప్రణాళికలు మీకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తాయి. బోధించడానికి ఎక్కువ మందిని కనుగొనడంలో అవి మీకు సహాయపడతాయి. మీరు బోధించే వారు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి మరియు పరివర్తన వైపు పురోగతి సాధించడానికి సహాయపడడంలో అవి మీకు మార్గనిర్దేశం చేయగలవు.

మీ లక్ష్యాన్ని నిర్దేశించడం మరియు ప్రణాళికను రూపొందించడాన్ని ప్రేరేపిత అనుభవంగా చేసుకోండి. మనఃపూర్వకంగా ప్రార్థించండి, విశ్వాసాన్ని సాధన చేయండి, మీ సహచరుడితో చర్చించండి మరియు ఆత్మ యొక్క ప్రేరేపణలను అనుసరించండి. మీరు ఈ విధంగా ప్రణాళిక చేస్తున్నప్పుడు, ఇతరులను ఆశీర్వదించడానికి ప్రభువు మీ ద్వారా పనిచేస్తున్నట్లు మీరు భావిస్తారు.

అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్

“ఒక ప్రణాళిక మీరక్కడికి వెళ్ళుటకు మార్గము కాగా, ఒక లక్ష్యానికి ఒక గమ్యస్థానము లేక ముగింపు ఉ౦టు౦ది. … లక్ష్యము ఏర్పరచుట, ఆవశ్యకముగా మనస్సులో ముగింపుతో ప్రారంభమౌతుంది. ఆ ముగింపును చేరుటకు ఒక మార్గమును కనిపెట్టడమే ప్రణాళిక చేయటం” (ఎమ్. రస్సెల్ బాల్లర్డ్, “తిరిగి రండి మరియు పొందుము,” లియహోనా, మే 2017, 62–63).

లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మరియు సాధించడానికి సూత్రాలు

ఈ క్రింది ప్రక్రియ మీరు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మరియు సాధించడానికి సహాయపడుతుంది.

లక్ష్యాలను నిర్దేశించే పటము
  1. ప్రార్థనాపూర్వకంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలు రూపొందించండి. మిమ్మల్ని విస్తరింపజేసే మరియు విశ్వాసం అవసరమయ్యే వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. చాలా ఉన్నతమైన లేదా చాలా అల్పమైన లక్ష్యాలను నిర్దేశించుకోకుండా ఉండండి. మీరు వాటిని ఎలా సాధించాలో ప్రణాళిక చేసుకోండి.

  2. నమోదు చేసి షెడ్యూల్ చేయండి. మీ లక్ష్యాలను మరియు ప్రణాళికలను వివరణాత్మక కాలపట్టిక‌లో నమోదు చేయండి.

  3. మీ ప్రణాళికలపై చర్య తీసుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి శ్రద్ధగా పని చేయండి. మీకు సహాయం చేయడానికి ప్రభువుపై విశ్వాసం ఉంచండి.

  4. సమీక్షించండి మరియు తదనంతర చర్య తీసుకోండి. పురోగతిని అంచనా వేయండి మరియు మీ ప్రయత్నాలను క్రమం తప్పకుండా నమోదు చేయండి. భిన్నంగా ఏమి చేయాలో మరియు ఎలా మెరుగుపరచాలో నిర్ణయించుకోండి. అవసరమైన విధంగా ప్రణాళికలను సర్దుబాటు చేయండి.

మీరు ఈ లక్ష్య నిర్దేశ ప్రక్రియను ఉపయోగించినప్పుడు, ప్రభువు మీ ప్రయత్నాలను గొప్పగా చేస్తారు. మీరు ఆయన చేతుల్లో ఒక సాధనంగా మీ సామర్థ్యంలో పెరుగుతారు. పరలోక తండ్రి పిల్లలను ఆశీర్వదించడంలో మీరు చాలా మంచిని జరిగిస్తారు.

పని యొక్క అన్ని రంగాలలో లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలు రూపొందించండి

సువార్త పరిచర్య యొక్క అన్ని అంశాలకు లక్ష్య నిర్దేశ ప్రక్రియను మీరు వర్తింపజేసేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని కోరండి. వాటిలో కొన్ని:

  • మీరు బోధిస్తున్న వ్యక్తులు పురోగతి సాధించడానికి సహాయం చేయడం (ఈ అధ్యాయంలో అనుబంధం 1 చూడండి).

  • బోధించడానికి కొత్త వ్యక్తులను కనుగొనడం (ఈ అధ్యాయంలో అనుబంధం 2 చూడండి).

  • సభ్యులతో కలిసి పనిచేయడం, సమాజం మరియు వార్డులోని జనులకు సేవ చేయడం (9 మరియు 13వ అధ్యాయాలు చూడండి).

  • మీ సహచరుడితో ఐక్యంగా పనిచేయడం (“వారపు ప్రణాళికా సమావేశం”లోని 6వ అంశం చూడండి).

  • యేసు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని బలోపేతం చేయడం.

  • భాష నేర్చుకోవడంతో సహా మీ జ్ఞానం మరియు సామర్థ్యాలను మెరుగుపరచడం (7వ అధ్యాయం చూడండి).

సముచిత లక్ష్యాలను నిర్దేశించుకోండి

ఇతర సువార్తికుల కొరకు కీలక సూచిక లక్ష్యాలను నిర్దేశించకుండా ఉండండి. అయితే, వారు తమ స్వంత లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు లక్ష్య నిర్దేశం యొక్క సూత్రాలను వర్తింపజేయడంలో మీరు వారికి మార్గనిర్దేశం చేయవచ్చు మరియు ప్రోత్సహించవచ్చు.

ఇతరులతో పోల్చకుండా జాగ్రత్త వహించండి.

లక్ష్య సాధనను జనుల గుర్తింపు కోసం లేదా ఎవరినైనా బహిరంగంగా సరిదిద్దడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి మీ వంతుగా ఉపయోగించవద్దు.

అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్

“మేము కూడా లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో నమ్ముతాము. మేము లక్ష్యాల ద్వారా జీవిస్తాము. … [ఒక] ముఖ్యమైన లక్ష్యం అందరికీ సువార్తను అందించడం. … మా లక్ష్యం నిత్య జీవితాన్ని సాధించడం. అది ప్రపంచంలోనే గొప్ప లక్ష్యం” (Spencer W. Kimball, regional representatives’ seminar, Apr. 3, 1975, 6).

వారపు మరియు రోజువారీ ప్రణాళికా సమావేశాలను నిర్వహించండి

వారపు ప్రణాళిక మీరు సంపూర్ణ చిత్రాన్ని చూడడానికి మరియు జనులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది. రోజువారీ ప్రణాళిక మీరు ప్రతిరోజూ నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా సిద్ధం కావడానికి సహాయపడుతుంది. మీరు తీరిక లేకుండా ఉండడమే కాకుండా ఉత్పాదకంగా ఉండాలనుకుంటున్నారు.

ప్రణాళికా సమావేశా‌ల సమయంలో, మీరు ఏమి చేయాలని ప్రభువు కోరుకుంటున్నారనే దాని గురించి మిమ్మల్ని మీరు ప్రాథమిక ప్రశ్నలు అడగండి. ప్రతి పరిస్థితికి మరియు వ్యక్తికి తగిన విధంగా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రేరణ పొందండి. ఆ తర్వాత సమాధానాలు మీ ప్రణాళికలలో రూపుదిద్దుకోవాలి.

వారపు ప్రణాళికా సమావేశం

మీ మిషను అధ్యక్షుడు నిర్ణయించిన రోజు మరియు సమయంలో మీ సహచరుడితో వారపు ప్రణాళికా సమావేశాన్ని నిర్వహించండి. క్రింద ఉన్న దశలను అనుసరించండి.

  1. ప్రార్థన చేయండి మరియు ప్రేరణ పొందండి. ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి సహాయపడే ప్రణాళికలను రూపొందించడంలో మిమ్మల్ని నడిపించమని పరలోక తండ్రిని అడగండి. జనులు అభివృద్ధి చెందడానికి మరియు క్రీస్తు వద్దకు రావడానికి సహాయపడేందుకు మీ ప్రయత్నాలను ఆశీర్వదించమని ఆయనను అడగండి.

  2. నా సువార్తను ప్రకటించండి యాప్‌ని ఉపయోగించి అన్ని కీలక సూచికల కోసం లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలను రూపొందించండి. ఈ అధ్యాయంలో ఇంతకుముందు వివరించిన లక్ష్య నిర్దేశ ప్రక్రియను ఉపయోగించండి. దీనితో ప్రారంభించండి:

    • గత సంవత్సరంలో బాప్తిస్మం తీసుకొని నిర్ధారించబడిన వ్యక్తులు.

    • బాప్తిస్మపు తేదీ గల వ్యక్తులు.

    • మీరు బోధిస్తున్నప్పుడు సంస్కార కూడికకు హాజరైన వ్యక్తులు.

    • బోధింపబడుతున్న కొత్త వ్యక్తులు.

    • తిరిగి వచ్చే సభ్యులు, పాక్షిక-సభ్యత్వ కుటుంబాలు మరియు కాబోయే ఎల్డర్లు.

    • గతంలో బోధింపబడిన జనులు.

    మీరు బోధిస్తున్న వ్యక్తులతో పనిచేయడంలో లక్ష్య నిర్దేశ ప్రక్రియను ఉపయోగించడం గురించి ఉపాయాల కోసం ఈ అధ్యాయంలోని అనుబంధం 1 చూడండి.

  3. బోధించడానికి వ్యక్తులను కనుగొనడానికి లక్ష్య నిర్దేశ ప్రక్రియను ఉపయోగించండి (కనుగొనడంలో సహాయం కోసం ఈ అధ్యాయంలోని అనుబంధం 2 మరియు 9వ అధ్యాయం చూడండి).

  4. వార్డు నాయకులు మరియు సభ్యులతో సంబంధాలను పెంపొందించుకోవడానికి లక్ష్య నిర్దేశ ప్రక్రియను ఉపయోగించండి. లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు సువార్తను పంచుకోవడానికి వారి ప్రయత్నాలలో మీరు వారికి ఎలా మద్దతు ఇస్తారనే ప్రణాళికలు రూపొందించండి (9 మరియు 13వ అధ్యాయాలలోని ఉపాయాలను చూడండి). వార్డు యొక్క వారపు సమన్వయ సమావేశానికి సిద్ధం అవ్వండి (13వ అధ్యాయం చూడండి).

  5. నా సువార్తను ప్రకటించండి యాప్‌లో మీ ప్రణాళికలు మరియు లక్ష్యాలను సమీక్షించండి. మీ నిర్ణీత సమయా‌లు మరియు సమావేశాలను నిర్ధారించండి.

  6. సహచర సలహాసభను నిర్వహించండి. ఇందులో సాధారణంగా ఈ క్రింది అంశాలు ఉంటాయి:

    • కావాలనుకుంటే, తగిన వ్యక్తిగత లక్ష్యాలను పంచుకోండి మరియు వాటిని సాధించడంలో మీ సహచరుడిని సహాయం కోసం అడగండి.

    • మీ సంబంధం యొక్క బలాన్ని చర్చించండి. విధేయతతో ఉండడం లేదా ఐక్యంగా పనిచేయడం ద్వారా సవాళ్లను చర్చించండి. (1) ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను పూర్తిగా వ్యక్తీకరించడానికి అనుమతించడం, (2) ప్రతి వ్యక్తి యొక్క ఆందోళనలను అర్థం చేసుకోవడం, అంగీకరించడం మరియు (3) అతి ముఖ్యమైన సమస్యలను తీర్చే పరిష్కారాన్ని కలిసి నిర్మించడం ద్వారా విభేదాలను పరిష్కరించండి.

    • మీ సహచరుని బలాలు ఏమిటని మీరు అనుకుంటున్నారో అతను లేదా ఆమెతో పంచుకోండి. మీరు ఎలా మెరుగుపడవచ్చనే సూచనల కోసం అడగండి.

    • మీ సంబంధాన్ని మెరుగుపరిచే లక్ష్యాలను నిర్దేశించుకోండి.

    మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితం, సంఘ సేవ, ఉద్యోగం మరియు ఇతర అనుబంధాలలో మీరు ఉపయోగించగల ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహచర సలహాసభలు మీకు సహాయపడతాయి.

  7. ప్రార్థనతో ముగించండి.

రోజువారీ ప్రణాళికా సమావేశం

ప్రతిరోజూ ఉదయం 30 నిమిషాల పాటు మీ సహచరుడితో లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలు రూపొందించండి. క్రింద ఉన్న దశలను అనుసరించండి.

  1. ప్రార్థన చేయండి మరియు ప్రేరణ పొందండి.

  2. మీ వారపు కీలక సూచిక లక్ష్యాల వైపు పురోగతిని సమీక్షించండి.

  3. మీరు బోధిస్తున్న వ్యక్తులకు సహాయం చేయడానికి మీ ప్రణాళికలను సమీక్షించండి. అత్యధిక పురోగతి సాధిస్తున్న వారికి సహాయం చేసే మీ ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అవసరమైన విధంగా రోజువారీ లక్ష్యాలను మరియు ప్రణాళికలను సర్దుబాటు చేసుకోండి.

  4. బోధించడానికి కొత్త వ్యక్తులను కనుగొనడానికి మరియు మీరు బోధిస్తున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ఆ రోజు మీరు తీసుకునే చర్యలకు కట్టుబడి ఉండండి.

  5. స్థానిక నాయకులు మరియు సభ్యులతో మీరు ఎలా పని చేస్తారో ప్రణాళిక చేసుకోండి.

  6. ప్రార్థనతో ముగించండి.

సహచర అధ్యయనము

బోధన మరియు అన్వేషణలో లక్ష్య నిర్దేశ ప్రక్రియను ఎలా అన్వయించాలనే ఉపాయాల కోసం ఈ అధ్యాయం చివరిలో అనుబంధం 1 మరియు అనుబంధం 2ను సమీక్షించండి. ఈ ఉపాయాలలో కొన్నింటిని మీరు ఎలా ఉపయోగించవచ్చో గుర్తించండి.

నా సువార్తను ప్రకటించండి యాప్‌ని ఉపయోగించండి

అతని కాలంలో బాప్తిస్మం తీసుకున్న వారి గురించి మొరోనై ఇలా అన్నాడు, “వారిని సరియైన మార్గమందు ఉంచుటకు, వారు జ్ఞాపకము చేసుకొనబడి, దేవుని సువార్త ద్వారా పోషింపబడునట్లు వారి పేర్లు తీసుకొనబడినవి” (మొరోనై 6:4). మంచి రికార్డులను ఉంచడం అనేది ఈ సూత్రాన్ని మీరు అన్వయించుకోవడానికి ఒక మార్గం.

మీ ప్రయత్నాలను నమోదు చేయండి.

రికార్డులను ఉంచడం అనేది మీ ప్రాంతాన్ని ప్రేమతో మరియు శ్రద్ధతో జాగ్రత్తగా గమనించడంలో భాగం. మీ రికార్డులను ఖచ్చితంగా మరియు నిత్యనూతనంగా ఉంచండి. జనులకు సహాయం చేయడానికి మీరు ఏమి చేయాలో గుర్తుంచుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

నా సువార్తను ప్రకటించండి యాప్ ప్రజలు మరియు పని పురోగతిపై స్థానిక నాయకులతో, సభ్యులతో ముఖ్యమైన సమాచారాన్ని సమన్వయం చేసుకోవడానికి మరియు పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

సమాచారం మరియు గోప్యతా మార్గదర్శకాలను అనుసరించండి

నా సువార్తను ప్రకటించండి యాప్‌లో మరియు ముద్రణా సాధనాల‌లో లక్ష్యాలు మరియు ప్రణాళికలను నమోదు చేసేటప్పుడు సమాచార నిలుపుదల మరియు గోప్యతా మార్గదర్శకాలను అనుసరించండి. సమాచారం కోసం, Missionary Standards for Disciples of Jesus Christ, 7.5 చూడండి.

నా సువార్తను ప్రకటించండి యాప్, ఇమెయిల్, సామాజిక మాధ్యమం, వివరణలు లేదా ఇతర సం‌భాషణలలో సమాచారాన్ని నమోదు చేయడానికి లేదా పంచుకోవడానికి ముందు మిమ్మల్ని మీరు ఈ క్రింది ప్రశ్నలు అడగండి:

  • నేను నమోదు చేస్తున్న దాని గురించి ఈ వ్యక్తి ఎలా భావిస్తాడు?

  • ఎవరైనా నా గురించి ఈ రకమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది?

  • నేను ఈ సమాచారాన్ని నమోదు చేస్తే లేదా పంచుకుంటే నా ప్రాంతానికి సంబంధించిన సంఘ విధానాలు మరియు సమాచార గోప్యతా చట్టాలను నేను అనుసరిస్తున్నానా?

ప్రార్థిస్తున్న సువార్తికులు

జవాబుదారీతనం

దేవుని నిత్య ప్రణాళికలో జవాబుదారీతనం అనే సూత్రం ప్రాథమికమైనది (ఆల్మా 5:15–19; సిద్ధాంతం మరియు నిబంధనలు 104:13; 137:9 చూడండి). ప్రభువు మీకు ఇచ్చిన పవిత్ర బాధ్యత గురించి మీరు ఎలా ఆలోచిస్తారో మరియు ఎలా భావిస్తారో అనేదానిని ఈ సూత్రం ప్రభావితం చేస్తుంది. జవాబుదారీతనం మీరు మీ పనిని ఎలా చేస్తారనే దానిని కూడా ప్రభావితం చేస్తుంది.

తన భూసంబంధమైన పరిచర్య సమయంలో, రక్షకుడు తన శిష్యులు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి మరియు ఆయన పనిని సాధించడానికి సహాయపడేందుకు వారికి నియామకాలను ఇచ్చారు. వారికి ఇవ్వబడిన పనికి లెక్క చెప్పడానికి కూడా ఆయన వారికి అవకాశాలను ఇచ్చారు (లూకా 9:10; 3 నీఫై 23:6–13 చూడండి). ఒక సువార్తికునిగా, ప్రభువు మీకు చేయడానికి ఇచ్చిన పనికి మీరు కూడా లెక్క చెప్పాలి.

ప్రతిరోజు ప్రార్థన ద్వారా మీరు ప్రభువుకు లెక్క చెప్పాలి అనే ఆలోచనతో మీ లక్ష్యాన్ని నిర్దేశించడం మరియు ప్రణాళిక రూపొందించడం చేయండి. మీకు మరియు మీ మిషను నాయకులకు కూడా జవాబుదారీగా ఉండండి.

లెక్క చెప్పడం అనేది ప్రేమపూర్వకమైన, సానుకూల అనుభవంగా ఉండాలి, దీనిలో మీ ప్రయత్నాలు గుర్తించబడతాయి మరియు మీరు మెరుగుపరచగల మార్గాలను మీరు గుర్తిస్తారు.

లేఖన అధ్యయనము

జవాబుదారిగా ఉండడం అంటే అర్థమేమిటి?

జవాబుదారీతనంలో కర్తృత్వం ఎందుకు ముఖ్యమైనది?

ఒక సువార్తికుడు మరియు మిషను నాయకుడు ఎలా కలిసి పనిచేయాలి?

వారి బాధ్యతలలో విశ్వాసంగా ఉన్నవారికి ప్రభువు ఏమి వాగ్దానం చేస్తారు?


అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు

వ్యక్తిగత అధ్యయనము

  • మీ కాల్ లెటర్ నుండి ఈ క్రింది వాక్యాన్ని పరిశీలించండి: “ఇతర వ్యక్తిగత వ్యవహారాలన్నింటినీ విడిచిపెట్టి, మీరు మీ సమయాన్ని మరియు శ్రద్ధను ప్రభువుకు సేవ చేయడానికి అంకితం చేస్తున్నప్పుడు, ప్రభువు మిమ్మల్ని యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త గురించి హెచ్చైన జ్ఞానంతో మరియు సాక్ష్యంతో ఆశీర్వదిస్తారు.” మిమ్మల్ని మీరు ఈ క్రింది ప్రశ్నలు అడగండి మరియు మీ మనోభావాలను నమోదు చేయండి.

    • ప్రభువుకు సేవ చేయడానికి నా సమయాన్ని మరియు శ్రద్ధను కేటాయించడంలో నేను ఎలా ఉన్నాను?

    • నేను ఏ ఆశీర్వాదాలను అనుభవించాను?

    • నా సాక్ష్యం ఎలా బలపడింది?

    • నేను ఎలా మెరుగుపడగలను?

  • సువార్త సేవా రంగంలో మీ చివరి రోజు గురించి ఆలోచించడానికి కొన్ని క్షణాలు తీసుకోండి. ఆ రోజు వచ్చినప్పుడు:

    • పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీ సంబంధం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు?

    • మీరు ఎలా మారాలనుకుంటున్నారు?

    మీ అధ్యయన పుస్తకంలో, ఈ ప్రశ్నలలో ప్రతీదానికి సమాధానం రాయండి. ఈ లక్ష్యాల కోసం మీరు ఇప్పుడు ఏమి చేయగలరో ప్రణాళిక చేయడానికి లక్ష్య నిర్దేశ ప్రక్రియను ఉపయోగించండి. మీ ప్రణాళికలను నమోదు చేయండి.

సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి

  • నా సువార్తను ప్రకటించండి యాప్‌ని ఉపయోగించి, కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:

    • అన్ని రికార్డులు ప్రస్తుతానికి అంగీకారంగా మరియు ఖచ్చితమైనవిగా ఉన్నాయా?

    • బోధించడానికి కొత్త వ్యక్తులను కనుగొనడంలో మీరు చేసిన ప్రయత్నాల నమోదు నుండి ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన సువార్తికుడు ప్రయోజనం పొందుతాడా?

    • మీరు ఇప్పుడే మీ యాప్‌ని సమీక్షించవలసివస్తే, జనులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి అది మీకు సహాయపడుతుందా? వారి పురోగతి గురించి తెలుసుకోవడానికి అది మీకు సహాయపడుతుందా?

జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ

  • జనులు పురోగతి సాధించడానికి వారు నిర్దేశించిన లక్ష్యాలతో మరియు వారు చేసిన ప్రణాళికలతో అనుభవాలను పంచుకోవడానికి సువార్తికులను ఆహ్వానించండి. ఉదాహరణలలో జనులకు సహాయపడే లక్ష్యాలు మరియు ప్రణాళికలు ఉండవచ్చు:

    • రక్షకునిపై ఎక్కువ విశ్వాసాన్ని పెంపొందించుకోండి.

    • పశ్చాత్తాపపడి, దేవునికి దగ్గరగా రావడానికి మార్పులు చేసుకోండి.

    • బాప్తిస్మం తీసుకొని నిర్ధారించబడండి.

    • సంఘానికి తిరిగి వచ్చి వారి బాప్తిస్మపు నిబంధనను నూతనపరచండి.

  • సువార్తికులకు ఈ క్రింది పరిస్థితులలో ఒకదాన్ని చదవండి. సువార్తికులను చిన్న సమూహాలుగా విభజించండి. ఈ ఉదాహరణలలోని వ్యక్తులు బాప్తిస్మం మరియు నిర్ధారణ వైపు పురోగతి సాధించడంలో సహాయపడడానికి ప్రతి సమూహం లక్ష్య నిర్దేశ ప్రక్రియలో 1 మరియు 2 దశలను ఉపయోగించనివ్వండి. ప్రతి సమూహం వారి ఆలోచనలను పంచుకోనివ్వండి.

    • మీరు బోధిస్తున్న వ్యక్తి ఈ వారం సంఘానికి హాజరు కావడానికి ఆహ్వానాన్ని అంగీకరించారు.

    • ఒక వ్యక్తి బాప్తిస్మపు ఆహ్వానాన్ని అంగీకరించారు మరియు బాప్తిస్మం తీసుకోవడానికి మీతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు.

    • ఒక వ్యక్తి మోర్మన్ గ్రంథాన్ని చదవమనే మీ ఆహ్వానాన్ని అంగీకరించి, 1 నీఫై 1 చదవడానికి కట్టుబడి ఉన్నాడు.

  • వాస్తవికమైన కానీ విస్తరించదగిన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి సువార్తికులను నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఉపయోగించమని ఆహ్వానించండి:

    • గత కీలక సూచిక చరిత్రను మరియు పురోగతిని సమీక్షించడం.

    • రోజువారీ, వారపు మరియు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించడం.

    • కీలక సూచిక లక్ష్యాలకు జనులను జోడించడం.

    జనులు పురోగతి సాధించడంలో సహాయపడేటప్పుడు సువార్తికులు మరింత సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోవడానికి ఈ దశలు ఎలా సహాయపడగలవో చర్చించండి. ఈ క్రింది వాటిని పరిగణించమని సువార్తికులను అడగండి:

    • మీరు ప్రణాళిక చేస్తున్నప్పుడు భవిష్యత్తులో నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఎలా ఉపయోగిస్తారు?

    • యాప్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి మీరు ఏ ఇతర మార్గాలను కనుగొన్నారు?

మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు

  • సువార్తికుల యొక్క నా సువార్తను ప్రకటించండి యాప్‌ను తరచుగా సమీక్షించండి. వారి లక్ష్యాలు మరియు ప్రణాళికల జాడ తెలుసుకోవడానికి మరియు జనులు పురోగతి సాధించడానికి వారు దానిని ఎలా ఉపయోగిస్తారో పంచుకోవడానికి వారిని ఆహ్వానించండి.

  • అప్పుడప్పుడు సువార్తికుల వారపు లేదా రోజువారీ ప్రణాళికా సమావేశాలను గమనించండి.

అనుబంధం 1

మీరు బోధిస్తున్న వ్యక్తులతో పనిచేయడంలో లక్ష్య నిర్దేశ ప్రక్రియను వర్తింపజేయండి

మీరు బోధిస్తున్న వ్యక్తులకు సహాయం చేయడానికి లక్ష్య నిర్దేశ ప్రక్రియను మీరు ఎలా అన్వయించవచ్చనే దానికి ఈ విభాగం ఉదాహరణలను అందిస్తుంది.

1. లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలు రూపొందించండి

మీరు బోధిస్తున్న వ్యక్తుల ఆధ్యాత్మిక అవసరాలను ప్రార్థనాపూర్వకంగా పరిగణించండి. ఈ అవసరాలను తీర్చడంలో వారికి సహాయపడడానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలు రూపొందించండి. ప్రతి వ్యక్తి పురోగతిని సమీక్షించడానికి నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఉపయోగించండి. క్రీస్తు వద్దకు రావడానికి ప్రతి వ్యక్తి తదుపరి అడుగు వేయడానికి సహాయపడే చర్యలను గుర్తించడానికి పరివర్తన కొరకు కీలకమైన సూచికలను ఉపయోగించండి.

మీరు లక్ష్యాలను నిర్దేశించుకుని, ప్రణాళికలు రూపొందిస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఇలాంటి ప్రశ్నలు అడగండి:

  • యేసు క్రీస్తుపై పెరుగుతున్న విశ్వాసాన్ని చూపించేలా ఆ వ్యక్తి ఏ ఎంపికలు చేస్తున్నాడు?

  • ఆ వ్యక్తి ఆత్మతో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నాడు?

  • అతను లేదా ఆమె ఏ సవాళ్లను ఎదుర్కొంటున్నారు?

  • అతను లేదా ఆమెకు సహాయం చేయడానికి ఆ వ్యక్తి నుండి మనం ఇంకా ఏమి తెలుసుకోవచ్చు?

  • ఈ వ్యక్తి యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, ఆత్మను అనుభూతి చెందడానికి మరియు గుర్తించడానికి, పశ్చాత్తాపపడడానికి మరియు బాప్తిస్మం తీసుకోవడానికి సహాయపడేందుకు ఏమి జరగాలి?

  • ఈ వ్యక్తికి సహాయం చేయడంలో వార్డు నాయకులను మరియు సభ్యులను చేర్చడానికి వార్డు యొక్క వారపు సమన్వయ సమావేశానికి మనం ఎలా సిద్ధం కావచ్చు? (13వ అధ్యాయము చూడండి.)

  • ప్రభువుపై మన విశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఏ కీలక సూచిక లక్ష్యాలను మనం నిర్దేశించుకోవచ్చు?

2. మీ ప్రణాళికలను నమోదు చేయండి మరియు షెడ్యూల్ చేయండి

మీ లక్ష్యాలను మరియు ప్రణాళికలను వివరంగా నమోదు చేయడానికి మరియు షెడ్యూల్ చేయడానికి నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఉపయోగించండి. మీరు పనిని నిర్వహించడానికి మరియు ప్రతి రోజూ తీసుకోవలసిన చర్యలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. మీ ప్రాంతం కొరకైన సమాచార గోప్యతా చట్టాలను అనుసరించండి.

మీరు మీ ప్రణాళికలను నమోదు చేసి షెడ్యూల్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు అడగండి:

  • ఈ వ్యక్తి పురోగతికి మద్దతు ఇవ్వడానికి ఈ రోజు మరియు ఈ వారం మనం ఏ నిర్దిష్ట పనులు చేయవచ్చు?

  • క్రీస్తుపై బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు సువార్తను జీవించడానికి ఈ వ్యక్తికి ఏ సిద్ధాంతం (లేదా పాఠం) సహాయపడుతుంది? ఈ సిద్ధాంతాన్ని అతను లేదా ఆమె అర్థం చేసుకోవడానికి మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఉద్ధరించబడడానికి దీనిని మనం ఎలా బోధించగలం?

  • మనం నియామకాలను ఎలా మరియు ఎప్పుడు నిర్ధారిస్తాము?

  • మనం ఏ ఆహ్వానాలను అందించాలి లేదా తదుపరి చర్య తీసుకోవాలి? మనం ఎలా మరియు ఎప్పుడు తదుపరి చర్య తీసుకుంటాము?

  • ఆ వ్యక్తి సంఘానికి హాజరు కావడానికి, లేఖనాలు చదవడానికి, ప్రార్థించడానికి మరియు దేవునితో నిబంధనలు చేయడానికి దారితీసే నిబద్ధతలను పాటించడానికి మనం ఎలా మరియు ఎప్పుడు సహాయం చేస్తాము?

  • సభ్యులు ఎలా పాల్గొనవచ్చు?

  • ఆ వ్యక్తితో మనం ఏ ఆన్‌లైన్ వనరులను పంచుకోవచ్చు?

  • ఏదైనా ప్రణాళిక ప్రకారం జరగకపోతే మనం ఏ ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేయవచ్చు?

3. మీ ప్రణాళికలపై చర్య తీసుకోండి

మీరు మీ ప్రణాళికలపై చర్య తీసుకుంటున్నప్పుడు రోజంతా మీ హృదయంలో ప్రార్థిస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో, ఏమి చెప్పాలో మరియు ఏ సర్దుబాట్లు చేయాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయం చేస్తారు.

రోజులో, మిమ్మల్ని మీరు ఇటువంటి ప్రశ్నలు అడగండి:

  • ప్రభువు మనకు సహాయం చేస్తారని మరియు ఆయన పిల్లలకు సేవ చేయడానికి మన ప్రయత్నాలను హెచ్చిస్తారని నమ్ముతూ మనం విశ్వాసంతో ఎలా పని చేయవచ్చు?

  • మన ప్రణాళికలపై చర్య తీసుకొనేటప్పుడు మనం ఎలా సృజనాత్మకంగా మరియు ధైర్యంగా ఉండగలం?

  • జనుల అవసరాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా మన ప్రణాళికలను మనం ఎలా మార్చుకోవచ్చు?

ప్రణాళికలు ఎల్లప్పుడూ మీరు ఆశించిన విధంగా జరగవు. సరళంగా ఉండండి మరియు అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికలను ఉపయోగించండి.

4. పురోగతిని సమీక్షించండి మరియు తదుపరి చర్య తీసుకోండి

మీ సహచరుడితో కలిసి, జనులకు బోధించడానికి మరియు వారు పురోగతి సాధించడంలో సహాయపడడానికి మీరు నిర్దేశించిన లక్ష్యాల వైపు పురోగతిని సమీక్షించండి. తదుపరి చర్య తీసుకోవడానికి మార్గాలను ప్రణాళిక చేయండి. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ప్రణాళికలను అవసరమైన విధంగా సర్దుబాటు చేసుకోండి.

మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:

  • మనం బోధిస్తున్న వ్యక్తులు దేవునితో నిబంధనలు చేసుకునే దిశగా కదులుతున్నారా?

  • వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వారి ఆందోళనలు ఏమిటి?

  • వారికి సహాయం చేయడానికి మరియు వారు చర్య తీసుకొనేలా ప్రోత్సహించడానికి ఈ రోజు మనం ఏమి చేయవచ్చు—వ్యక్తిగతంగా లేదా సాంకేతికత ద్వారా?

  • ఆత్మను అనుభూతి చెందడంలో వారికి అనుభవాలు ఉన్నాయా?

  • వారు సంఘ నాయకులతో మరియు సభ్యులతో అనుసంధానించబడి, స్నేహాలను పెంచుకుంటున్నారా? తదుపరిసారి మనం బోధించేటప్పుడు ఎవరు పాల్గొనవచ్చు?

  • ఎదురుదెబ్బల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

  • మన లక్ష్యాలను చేరుకోవడంలో మనం ఎంత బాగా పనిచేసాము? మనం సర్దుబాటు చేసుకోవలసినది లేదా భిన్నంగా చేయవలసినది ఏదైనా ఉందా?

  • తక్కువ తరచుగా సంప్రదించాల్సిన సమయం ఆసన్నమైందా?

జనుల పురోగతికి ఎలా సహాయపడాలి మరియు తదుపరి చర్య ఎలా తీసుకోవాలి అనే దానిపై మరిన్ని సూత్రాలు మరియు ఉపాయాల కోసం 11వ అధ్యాయాన్ని చూడండి.

అనుబంధం 2

బోధించడానికి వ్యక్తులను కనుగొనడంలో లక్ష్య నిర్దేశ ప్రక్రియను వర్తింపజేయండి

బోధించడానికి కొత్త వ్యక్తులను కనుగొనడంలో లక్ష్య నిర్దేశ ప్రక్రియను మీరు ఎలా అన్వయించవచ్చనే దానికి ఈ విభాగం ఉదాహరణలను అందిస్తుంది. మీ వారపు మరియు రోజువారీ ప్రణాళికలో ఈ ప్రక్రియను ఉపయోగించండి.

1. లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలు రూపొందించండి

మీ సహచరుడితో కలిసి, బోధించడానికి ఎక్కువ మందిని కనుగొనడానికి మీరు ఏమి చేయాలని పరలోక తండ్రి కోరుతున్నారో ప్రార్థనాపూర్వకంగా పరిగణించండి. ప్రతీ వారం మరియు ప్రతిరోజూ దీన్ని చేయండి. ఆయన మీ కోసం జనులను సిద్ధం చేస్తున్నారని నమ్మండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 100:3–8 చూడండి).

ప్రతి రోజు అన్వేషణ లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీ నియంత్రణలో ఉన్న కీలక సూచిక ఫలితాలను ప్రభావితం చేసే చర్యల కోసం ప్రణాళికలు రూపొందించండి. ఉదాహరణలు:

  • ప్రతిరోజూ మీరు ఎంత మంది కొత్త వ్యక్తులతో సువార్త గురించి మాట్లాడతారు.

  • మీ సందేశంపై ఆసక్తి ఉన్న వారెవరైనా తెలుసా అని మీరు సభ్యులను, మీరు బోధిస్తున్న వ్యక్తులను మరియు మీరు సంప్రదించే వ్యక్తులను ఎన్నిసార్లు అడుగుతారు.

  • సామాజిక మాధ్యమ పోస్టులపై సిఫార్సులు లేదా వ్యాఖ్యలకు మీరు ఎంత త్వరగా స్పందిస్తారు.

నా సువార్తను ప్రకటించండి యాప్‌ను సమీక్షించండి మరియు మిమ్మల్ని మీరు ఇలాంటి ప్రశ్నలు అడగండి:

  • బోధించడానికి వ్యక్తులను కనుగొనడానికి ఈ రోజు మరియు ఈ వారం మనం ఏమి చేయాలని పరలోక తండ్రి కోరుతున్నారు?

  • బోధించడానికి వ్యక్తులను కనుగొనడానికి మనం ఏ రోజువారీ మరియు వారపు కీలక సూచిక లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు?

  • రోజులో ఈ సమయంలో మరియు ప్రదేశంలో ఏ అన్వేషణ కార్యక్రమం ఉత్తమం?

  • ప్రేమించడం, పంచుకోవడం మరియు ఆహ్వానించడం అనే సూత్రాల ద్వారా సువార్తను పంచుకోవడానికి వారు చేసే ప్రయత్నాలలో మనం వార్డు సభ్యులను ఎలా ప్రేరేపించగలము మరియు మద్దతు ఇవ్వగలము?

  • సంస్కార కూడికకు హాజరు కావడానికి వారికి సహాయపడడానికి మనం ఏ కొత్త సభ్యులను సంప్రదించవచ్చు? వారు ఆహ్వానించగల స్నేహితులు ఎవరైనా ఉన్నారా?

  • సంప్రదించడానికి సభ్య కుటుంబాలను, తిరిగి వచ్చే సభ్యులను మరియు కాబోయే ఎల్డర్‌లను గుర్తించడానికి వార్డు సలహాసభ లేదా వార్డు యొక్క వారపు సమన్వయ సమావేశంలో పాల్గొనేవారితో మనం ఎలా పని చేయవచ్చు?

  • ప్రస్తుతం బోధించబడుతున్న వ్యక్తులు, గతంలో బోధించబడిన వ్యక్తులు మరియు సూచించబడిన ఏ వ్యక్తులను మనం సంప్రదించవచ్చు? మనం వారిని ఎలా సంప్రదిస్తాము? (వ్యక్తిగతంగా, సాంకేతికత ద్వారా, ఫోను ద్వారా లేదా ఇతర మార్గాల్లో)

  • మనం జనులను కనుగొనగల కొన్ని కొత్త మార్గాలు ఏవి?

  • మనం ఏ వ్యక్తిగత ప్రతిభలు మరియు బలాలను ఉపయోగించగలము?

  • బోధించడానికి వ్యక్తులను కనుగొనే మన సామర్థ్యాన్ని మనం ఎలా మెరుగుపరచుకోవచ్చు?

  • మనం సంప్రదించే వారు పరిశుద్ధాత్మ ప్రభావాన్ని అనుభూతి చెందడానికి మనం ఎలా సహాయం చేయవచ్చు?

అన్వేషణ కార్యక్రమాల ఉదాహరణల కోసం, 9, 10 మరియు 13వ అధ్యాయాలను చూడండి.

గతంలో ప్రభావవంతంగా ఉన్న అన్వేషణ కార్యక్రమాలను గుర్తించడంలో మీకు సహాయపడడానికి నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఉపయోగించండి. ఉదాహరణకు, ఇటీవల పరివర్తన చెందినవారు ఎలా కనుగొనబడ్డారో మీరు చూడవచ్చు.

ప్రేరణ కోసం వెదకండి మరియు కొత్త మనోభావాలను, ఆలోచనలను స్వాగతించండి. ఒక దినచర్యలో చిక్కుకోకుండా ఉండండి. బోధించడానికి స్థిరంగా కొత్త వ్యక్తులను కనుగొనే సువార్తికులు తరచుగా ప్రతి వారం వివిధ మార్గాలను ఉపయోగిస్తారు. వారు దాని కోసం నిరంతరం పని చేస్తారు.

2. మీ ప్రణాళికలను నమోదు చేయండి మరియు షెడ్యూల్ చేయండి

మీ సహచరుడితో కలిసి, మీ లక్ష్యాలను మరియు ప్రణాళికలను వివరంగా నమోదు చేయడానికి మరియు షెడ్యూల్ చేయడానికి నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఉపయోగించండి. మీ ప్రణాళికలను నమోదు చేయడం మరియు షెడ్యూల్ చేయడం అనేది మీరు ఏ చర్యలు తీసుకోవాలో మరియు వాటిని ఎప్పుడు తీసుకోవాలో గుర్తించడంలో సహాయపడుతుంది.

మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:

  • జనులను మనం ఎప్పుడు, ఎలా సంప్రదిస్తాము? ఉత్తమ విధానాలు ఏమిటి? ఉత్తమ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? జనులను కనుగొనడానికి వివిధ మార్గాల కొరకు రోజులో ఉత్తమ సమయాలు ఏవి?

  • మనం కలిసే వ్యక్తులతో అర్థవంతమైన సంభాషణలు ఎలా జరుపవచ్చు?

  • సామాజిక మాధ్యమము మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనం ఆన్‌లైన్‌లో ఎలా మరియు ఎప్పుడు కనుగొంటాము?

  • సూచించబడిన వ్యక్తులను మనం ఎప్పుడు సంప్రదిస్తాము?

  • ఇతర ప్రణాళికలు విఫలమైనప్పుడు మనం ఏ ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందిస్తాము?

3. మీ ప్రణాళికలపై చర్య తీసుకోండి

బోధించడానికి వ్యక్తులను కనుగొనాలనే మీ లక్ష్యాలను సాధించడానికి శ్రద్ధగా కృషి చేయండి. రోజంతా మీ హృదయంలో ప్రార్థిస్తూ ఉండండి. మీరు కలిసే వ్యక్తులను పలకరించడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి. ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో, ఏమి చెప్పాలో మరియు ఏ సర్దుబాట్లు చేయాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయం చేస్తారు.

రోజులో, మిమ్మల్ని మీరు ఇటువంటి ప్రశ్నలు అడగండి:

  • ప్రభువు మనకు సహాయం చేస్తారని మరియు ఆయన పిల్లలకు సేవ చేయడానికి మన ప్రయత్నాలను హెచ్చిస్తారని నమ్ముతూ మనం విశ్వాసంతో ఎలా పని చేయవచ్చు?

  • మన ప్రణాళికలపై చర్య తీసుకొనేటప్పుడు మనం ఎలా సృజనాత్మకంగా మరియు ధైర్యంగా ఉండగలం?

  • జనుల అవసరాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా మన ప్రణాళికలను మనం ఎలా మార్చుకోవచ్చు?

  • జనులు పరిశుద్ధాత్మ ప్రభావాన్ని అనుభూతి చెందడానికి మనం ఎలా సహాయం చేయవచ్చు?

ప్రణాళికలు ఎల్లప్పుడూ మీరు ఆశించిన విధంగా జరగవు. సరళంగా ఉండండి మరియు అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికలను ఉపయోగించండి.

4. పురోగతిని సమీక్షించండి మరియు తదుపరి చర్య తీసుకోండి

రోజు మరియు వారం అంతటా, బోధించడానికి వ్యక్తులను కనుగొనాలనే మీ లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతిని ప్రార్థనాపూర్వకంగా సమీక్షించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:

  • మన లక్ష్యాలను చేరుకోవడంలో మరియు మన ప్రణాళికలను అనుసరించడంలో మనం ఎంత బాగా చేసాము?

  • జనులను కనుగొనాలనే మన లక్ష్యాలను చేరుకోవడానికి మనం ఏ సర్దుబాట్లు చేసుకోవాలి?

  • బోధించడానికి వ్యక్తులను కనుగొనడంలో ప్రభావవంతంగా లేని దినచర్యలోకి జారిపోవడాన్ని మనం ఎలా నివారించవచ్చు?

  • రోజులోని ఈ సమయంలో మనం ప్రయత్నించగల కొత్త విషయం ఏమిటి?

  • బోధించడానికి వ్యక్తులను కనుగొనడంలో మనకు సహాయపడడానికి వార్డు యొక్క వారపు సమన్వయ సమావేశంలో మనం చర్చించగల కొన్ని ఆలోచనలు ఏమిటి? (13వ అధ్యాయము చూడండి.)

సాహచర్యంగా, మీ వారపు మరియు రోజువారీ అన్వేషణ ప్రయత్నాలను అంచనా వేయడానికి 9వ అధ్యాయంలోని “అన్వేషణ ప్రయత్నాలు” పటమును ఉపయోగించండి. మీరు బాగా చేస్తున్న పనులను గుర్తించండి మరియు మీరు ఎలా మెరుగుపరచుకోవచ్చో ఆలోచించండి.

రోజంతా, మీ పనిలో దేవుని హస్తాన్ని గుర్తించడానికి కొన్ని నిమిషాలు ఆగండి.