2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము శనివారం ఉదయకాల సభ శనివారం ఉదయకాల సభ2024, అక్టోబరు 5-6 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 194వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం ఉదయకాల సభ. Henry B. Eyringసంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఅధ్యక్షులు ఐరింగ్ ఆమోదించు ఓటు కొరకు ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను సమర్పిస్తున్నారు. నీల్ ఎల్. ఆండర్సెన్నిరీక్షణ యొక్క గెలుపుమనం యేసు క్రీస్తు యందు నిరీక్షణ కలిగియుండి, ఆయనపై మన నమ్మకాన్ని ఉంచినప్పుడు, మనం ఆయన శాంతిని అనుభవించగలమని ఎల్డర్ ఆండర్సెన్ బోధిస్తున్నారు. ఎమిలి బెల్ ఫ్రీమాన్మీ విశేషాధికారాలకు అనుగుణంగా జీవించండివారి సామర్థ్యాన్ని చేరుకొనేలా సహాయపడుతూ, యాజకత్వ విధులు మరియు నిబంధన వాగ్దానాలు వారి జీవితాల్లోకి దేవుని శక్తిని ఎలా అనుమతిస్తాయో నేర్చుకోమని సంఘములోని స్త్రీలు మరియు యువతులను అధ్యక్షురాలు ఫ్రీమాన్ ప్రోత్సహిస్తున్నారు. కార్ల్ డి. హిర్స్ట్దేవునికి ప్రియమైనదిపరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క దైవిక ప్రేమను ఎలా అనుభవించాలో ఎల్డర్ హిర్స్ట్ మనకు బోధిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్“ఇది నా సువార్త”—“ఇది నా సంఘము”రక్షకుని సువార్త మరియు రక్షకుని సంఘముల సమ్మేళనము మనకు దేవుని శక్తికి ప్రాప్యతను ఇస్తుందని మరియు మనం పరిశుద్ధంగా మారడానికి సహాయపడుతుందని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. డేవిడ్ పి.హోమర్మన పరలోక తండ్రియందు నమ్మకముంచుటమనం దేవునిపై నమ్మకం ఉంచి, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు మనకు ఆశీర్వాదాలు లభిస్తాయని ఎల్డర్ హోమర్ బోధిస్తున్నారు. గ్రెగోరియో ఈ. కాసిల్లాస్దేవుడు తన పిల్లలందరిని ప్రేమిస్తున్నారుపరిచర్య మరియు శిష్యరికం ద్వారా మనం దేవుని పిల్లల జీవితాలను ఆశీర్వదించగలమని ఎల్డర్ కాసిల్లాస్ బోధిస్తున్నారు. డాలిన్ హెచ్. ఓక్స్క్రీస్తును వెంబండించుటవివాదాన్ని నివారించమనే ఆయన ఆజ్ఞను నొక్కి చెప్తూ, అధ్యక్షులు ఓక్స్ యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను బోధించారు. శనివారం మధ్యాహ్నకాల సభ శనివారం మధ్యాహ్నకాల సభ2024, అక్టోబరు 5-6 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 194వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం మధ్యాహ్నకాల సభ. డి. టాడ్ క్రిస్టాఫర్సన్మన తిరుగుబాటు ఆయుధములను పాతిపెట్టుటమన జీవితాలలో దేవునికి వ్యతిరేకముగానున్న ఏ తిరుగుబాటు మూలమునైనా పాతిపెట్టమని ఎల్డర్ క్రిస్టాఫర్సన్ ప్రోత్సహిస్తున్నారు, అది చురుకుగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించేదైనా లేదా ఆయన ఇష్టాన్ని నిష్క్రియంగా విస్మరించేదైనా. హోసె ఎ.టెషేరాయేసు క్రీస్తుకు బద్ధులైయుండుట: లోకమునకు ఉప్పుగా మారుటయేసు క్రీస్తుకు బద్ధులైయుండగల నాలుగు సరళమైన మరియు గంభీరమైన విధానాలను ఎల్డర్ టెషేరా బోధిస్తున్నారు. జువాన్ పాబ్లొ విల్లార్మనకు సహాయపడటానికి ఆయన హస్తం సిద్ధంగా ఉన్నదిరక్షకునిపై మనకు విశ్వాసం ఉంటే ఎలాంటి సవాలునైనా అధిగమించడానికి ఆయన ఎల్లప్పుడూ సహాయంగా ఉంటారని ఎల్డర్ విల్లార్ బోధిస్తున్నారు. ప్యాట్రిక్ కీరన్ఆనందకరమైన సంఘానికి స్వాగతంయేసు క్రీస్తు యొక్క సంఘములో కనుగొనబడగల ఆనందము గురించి ఎల్డర్ కీరన్ బోధిస్తున్నారు. డేవిడ్ ఎల్. బక్నర్“మీరు నా స్నేహితులు”మనం విభజించడానికి కారణాల కోసం వెదకడం మానేయాలి మరియు “ఒకటిగా ఉండడానికి” అవకాశాలను వెదకాలి అని ఎల్డర్ బక్నర్ బోధిస్తున్నారు. డి. మార్టిన్ గౌరీనీవు శుద్ధుడవు కమ్ముఅనుదిన పశ్చాత్తాపం మనకు మరింత సున్నితంగా ఉండటానికి మరియు ప్రభువు యొక్క మార్గనిర్దేశం మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను మరింతగా స్వీకరించడానికి సహాయపడుతుందని ఎల్డర్ గౌరీ బోధిస్తున్నారు. అరాల్డో బి. కేవల్కాంటేగాలి వీచుటను ఎన్నడూ మానలేదుదేవుడు మన కష్టాలలో మనకు సహాయపడగలరని, అలాగే మన ఆధ్యాత్మిక ప్రయాణాలలో మనం ఒకరికొకరు సహాయం చేసుకోగలమని ఎల్డర్ కేవల్కాంటే బోధిస్తున్నారు. యులిసెస్ సోవారెస్మన చిత్తాన్ని ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుకొనుటమన శిష్యత్వానికి అంతిమ పరీక్ష, మన పాత స్వభావాన్ని వదులుకోవడానికి మరియు ఆయన చిత్తం మన చిత్తమయ్యేలా మన హృదయాన్ని, మన పూర్ణాత్మను దేవునికి సమర్పించడానికి మన సుముఖతలో కనుగొనబడుతుంది అని ఎల్డర్ సోవారెస్ బోధిస్తున్నారు. శనివారం సాయంకాల సభ శనివారం సాయంకాల సభ2024, అక్టోబరు 5-6 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 194వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం సాయంకాల సభ. గెరిట్ డబ్ల్యు.గాంగ్అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధతపరిశుద్ధతను మన అనుదిన జీవితంలో భాగంగా చేసుకోమని ఎల్డర్ గాంగ్ మనల్ని ఆహ్వానిస్తున్నారు, అది మనల్ని ప్రభువుకు మరియు ఒకరినొకరికి దగ్గర చేస్తుంది. క్రిస్టిన్ ఎమ్. యీమన విమోచన యొక్క ఆనందముదేవునితో మన నిబంధన సంబంధం ద్వారా, యేసు క్రీస్తు యొక్క ప్రక్షాళన, స్వస్థత మరియు విమోచన శక్తిని మనం పొందగలమని సహోదరి యీ బోధిస్తున్నారు. కైల్ ఎస్.మెఖేయెహోవాతో మాట్లాడిన మనిషిఎల్డర్ మెఖే ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క గొప్ప జీవితం మరియు వారసత్వం గురించి తన సాక్ష్యమిస్తున్నారు. హోహె ఎమ్. ఆల్వరాడొప్రభువు ఇచ్చే పశ్చాత్తాప బహుమానాన్ని హత్తుకోండిఎల్డర్ ఆల్వరాడొ పశ్చాత్తాపం గురించి బోధిస్తున్నారు మరియు యేసు క్రీస్తు యొక్క విమోచన శక్తి ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న స్వస్థత గురించి సాక్ష్యమిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్కొద్ది సంవత్సరముల కాలములోనేప్రభువు నుండి మనల్ని దూరంగా నడిపించివేసే గర్వానికి వ్యతిరేకంగా హెచ్చరించడానికి ఎల్డర్ బెడ్నార్ మోర్మన్ గ్రంథములోని నీఫైయులు మరియు లేమనీయుల మాదిరులను ఉపయోగిస్తున్నారు. ఆదివారం ఉదయకాల సభ ఆదివారం ఉదయకాల సభ2024, అక్టోబరు 5-6 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 194వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు ఆదివారం ఉదయకాల సభ. జెఫ్రీ ఆర్. హాలండ్“ఆయనను నేనే”క్రీస్తు తన తండ్రిపట్ల కలిగియున్న పూర్తి విధేయత గురించి మరియు మనలో ప్రతీ ఒక్కరి పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ గురించి అధ్యక్షులు హాలండ్ బోధిస్తున్నారు. ట్రేసీ వై. బ్రౌనింగ్ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు వెదకడంమనం మనఃపూర్వకమైన ప్రశ్నలు అడిగి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయనపై మన నమ్మకాన్ని ఉంచినప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు మనకు సహాయపడగలరని సహోదరి బ్రౌనింగ్ బోధిస్తున్నారు. బ్రూక్ పి. హేల్స్మర్త్యత్వము పనిచేస్తుంది!యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు రక్షణ ప్రణాళిక కారణంగా, మర్త్యత్వము పనిచేస్తుందని ఎల్డర్ హేల్స్ బోధిస్తున్నారు! ఎల్. టాడ్ బడ్జ్మీ పూర్ణహృదయముతో ఆయనను వెదకుడిదేవుని ఆరాధించడానికి మరియు ఆయనతో సంభాషించడానికి కావలసిన నిశ్శబ్ద సమయం యొక్క ప్రాముఖ్యత గురించి బిషప్పు బడ్జ్ మాట్లాడుతున్నారు. గ్యారీ ఈ. స్టీవెన్సన్ఎన్నటికీ మరువలేని దినములురాబోయే 10 సంవత్సరాలు యేసు క్రీస్తు సువార్త యొక్క సువర్తమానమును ప్రపంచంతో పంచుకోవడానికి ఒక అపూర్వమైన అవకాశమని ఎల్డర్ స్టీవెన్సన్ ఎదురుచూస్తున్నారు. బ్రాడ్లీ ఆర్. విల్కాక్స్ఘనమైన జ్యేష్ఠత్వమున్న ఓ యువతాయువతతో మాట్లాడుతూ, సహోదరుడు విల్కాక్స్ ఈ ప్రశ్నను ప్రస్తావించారు, కడవరి దిన పరిశుద్ధులు ఇతరుల కంటే అంత భిన్నంగా ఎందుకు జీవించాలి? హెన్రీ బి. ఐరింగ్యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతము సరళమైనదియేసు క్రీస్తు యొక్క నిజమైన సిద్ధాంతాన్ని సరళంగా బోధించమని అధ్యక్షుడు ఐరింగ్ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు మన ప్రియమైనవారు కష్టాలు వచ్చినప్పుడు దానిని గుర్తుంచుకుంటారు మరియు మనం ఆశీర్వదించబడతాము. ఆదివారం మధ్యాహ్నకాల సభ ఆదివారం మధ్యాహ్నకాల సభ2024, అక్టోబరు 5-6 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 194వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు ఆదివారం మధ్యాహ్నకాల సభ. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్మూలాలను పోషించండి, కొమ్మలు పెరుగుతాయిమూలాలను, అనగా యేసు క్రీస్తు మరియు మన పరలోక తండ్రి యందు విశ్వాసాన్ని మనం పోషించినప్పుడు మన సాక్ష్యాలనే కొమ్మలు పెరుగుతాయని ఎల్డర్ ఉఖ్డార్ఫ్ బోధిస్తున్నారు. టాకాషి వాడాక్రీస్తు యొక్క మాటలు మరియు పరిశుద్ధాత్మ మనల్ని సత్యానికి నడిపిస్తాయిక్రీస్తు యొక్క మాటలను విందారగించటం మరియు ఆత్మను వినడం మనల్ని నిత్యజీవానికి ఎలా నడిపిస్తుందో ఎల్డర్ వాడా బోధిస్తున్నారు. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్“ఇదిగో, నా మాదిరిని మీరు అనుసరించుడి”సజీవ ప్రవక్త బోధనలను మరియు మాదిరిని అనుసరించడం ద్వారా ఆయనను ఆమోదించడం గురించి ఎల్డర్ రాస్బాండ్ బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్పవిత్ర లేఖనములు—విశ్వాసానికి పునాదికొనసాగుతున్న పరివర్తనలో లేఖనాలు, ప్రత్యేకించి మోర్మన్ గ్రంథము యొక్క ప్రాముఖ్యత గురించి ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. రూబేన్ వి.అల్లియుద్దేవుని కుమారులు మరియు కుమార్తెలుమనమందరము అక్షరాలా దేవుని పిల్లలమని ఎల్డర్ అల్లియుద్ బోధిస్తున్నారు. ఐ. రేమండ్ ఎగ్బోయేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై దృష్టిసారించాలిమనం యేసు క్రీస్తుపై మరియు ఆయన సువార్తపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, పరీక్షలు మరియు సవాళ్ల సమయంలో కూడా మనం ఆనందాన్ని పొందగలమని ఎల్డర్ ఎగ్బో బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారుయేసు క్రీస్తును మన జీవితాలకు పునాదిగా చేసుకోవడానికి మరియు ఆయన రెండవ రాకడ కోసం సిద్ధపడడానికి సమయం ఆసన్నమైందని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు.