2020–2024
మనకు సహాయపడటానికి ఆయన హస్తం సిద్ధంగా ఉన్నది
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:13

మనకు సహాయపడటానికి ఆయన హస్తం సిద్ధంగా ఉన్నది

మనం విశ్వాసంతో యేసు క్రీస్తును చేరుకున్నప్పుడు, ఆయన ఎల్లప్పుడూ అక్కడ ఉంటారు.

నేను చిన్నవానిగా ఉన్నప్పుడు, మేము సెలవులకు కుటుంబ సమేతంగా నా స్వదేశమైన చిలీ తీరంలో ఉన్న ఒక బీచ్‌కి వెళ్లాము. నా కుటుంబంతో వేసవిని ఆనందిస్తూ కొన్ని రోజులు గడపడానికి నేను ఉత్సాహపడ్డాను. నేను ఉద్వేగం చెందాను, ఎందుకంటే నేను చివరకు నా ఇద్దరు అన్నలతో కలసి వారు మామూలుగా నీటిపై సరదాగా చేసే వాటిని నేను కూడా చేయాలని అనుకున్నాను.

ఒకరోజు, నా అన్నలు అలలు ఎగిసిపడుతున్న చోట ఆడుకోవడానికి వెళ్ళారు, నన్ను నేను పెద్దవానిగా మరియు వారిని అనుసరించేంత పరిపక్వత చెందిన వానిగా భావించాను. నేను ఆ ప్రాంతం వైపు కదిలినప్పుడు, అలలు తీరం నుండి కనబడిన వాటికంటే పెద్దవిగా ఉన్నట్లు నేను గ్రహించాను. అకస్మాత్తుగా, ఒక అల వేగంగా నన్ను సమీపించింది, నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రకృతి శక్తి నన్ను ఆక్రమించినట్లుగా నేను భావించాను, మరియు నేను సముద్రపు లోతులలోనికి లాగబడ్డాను. చుట్టూ విసిరి వేయబడటం వలన నేను ఎక్కడున్నానో చూడలేకపోయాను లేదా అనుభూతి చెందలేదు. భూమిపై నా సాహసయాత్ర ముగిసిపోతుందని నేను అనుకుంటున్నప్పుడు, ఒక చేయి నన్ను ఉపరితలం వైపుకు లాగుతున్నట్లుగా భావించాను. చివరికి, నేను సూర్యుని చూడగలిగాను మరియు నేను ఊపిరి పీల్చుకున్నాను.

పెద్దవానిగా నటించడానికి నేను చేస్తున్న ప్రయత్నాలను చూసిన నా అన్న క్లాడియో నన్ను రక్షించడానికి వచ్చాడు. నేను సముద్రతీరానికి అంత దూరంగా లేను. నీరు తక్కువగా ఉన్నప్పటికీ, నేను దిక్కుతోచని స్థితిలో ఉండి నాకు నేను సహాయం చేసుకోగలనని గ్రహించలేదు. నేను జాగ్రత్తగా ఉండాలని క్లాడియో నాకు చెప్పాడు మరియు నేను కోరుకొంటే, అతను నాకు నేర్పించగలడని అన్నాడు. నేను చాలా నీళ్ళు మింగినప్పటికినీ, నా తీర్మానము మరియు పెద్దవానిగా ఉండాలనే కోరిక బలంగా ఉండి, నేను “తప్పకుండా” అని చెప్పాను.

నేను అలలపై దాడి చేయాలని క్లాడియో నాతో చెప్పాడు. భారీ నీటి గోడలా అనిపించే దానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో నేను తప్పకుండా ఓడపోతానని నాకు నేను చెప్పుకున్నాను.

ఒక క్రొత్త పెద్ద అల దగ్గరకి వచ్చినప్పుడు, క్లాడియో వెంటనే, “నా వైపు చూడు; దానిని నువ్విలా ఇలా చేయాలి.” అని నాతో చెప్పాడు. క్లాడియో రాబోతున్న అలవైపు పరుగెత్తాడు మరియు అది ఎగిసిపడేలోపు దానిలోకి దూకాడు. అతడు దూకడాన్ని చూసి నేను ఎంతగా ఆకట్టుకోబడ్డానంటే రాబోతున్న అలను కూడా నేను గమనించలేదు. కనుక, మరలా నేను సముద్రపు లోతులలోనికి పంపబడి, ప్రకృతి శక్తుల చేత కొట్టబడ్డాను. కొన్ని క్షణాల తరువాత, ఒక చేయి నన్ను పట్టుకొన్నది, మరియు మరలా నేను నేల ఉపరితలం మరియు గాలి వైపు లాగబడ్డాను. నా మొండి తీర్మానపు జ్వాల ఆరిపోతున్నది.

ఈసారి, మా అన్న తనతో పాటు దూకమని నన్ను అడిగాడు. అతని పిలుపు ప్రకారం, నేను అతడిని అనుసరించాను, మరియు మేము కలిసి దూకాము. మిక్కిలి క్లిష్టమైన సవాళ్ళను జయించినట్లుగా నేను భావించాను. నిశ్చయంగా, అది అంత సులభం కాదు, కానీ నేను దానిని చేసాను, మా అన్న సహాయానికి మరియు చూపిన మాదిరికి ధన్యవాదాలు. అతడి చేయి నన్ను రెండుసార్లు విడిపించింది; ఆరోజు అతడి మాదిరి నా సవాలుతో ఎలా వ్యవహరించాలో మరియు విజయవంతంగా ఎలా ఉండాలో ఆరోజు నాకు చూపించింది.

సిలెస్టియల్‌గా ఆలోచించమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు, ఆయన సలహాను అనుసరించాలని మరియు నా వేసవి కథకు దానిని అన్వయించాలని కోరుతున్నాను.

అపవాదిపై రక్షకుని శక్తి

మనం సిలెస్టియల్‌గా ఆలోచించిన యెడల, వాటిని జయించడానికి మన సామర్ధ్యము కంటే గొప్పవిగా కనిపించే సవాళ్ళను మన జీవితాలలో ఎదుర్కొంటాయని మనం గ్రహిస్తాము. మన మర్త్య సమయంలో, అపవాది యొక్క దాడులకు లోబడియుంటాము. ఆ వేసవి దినమున అలలకు నాపై శక్తి కలిగియున్నట్లుగా, మనం శక్తిలేనివారిగా భావించవచ్చు మరియు బలమైన విధికి లోబడాలనుకుంటాము. అపవాది యొక్క ఆ “హానికరమైన దాడులు“ మనల్ని పక్క పక్కకు తిప్పగలవు. వాస్తవానికి, ఆ అలలపై మరియు సమస్త విషయములపై ఎవరికి అధికారం ఉన్నదో మరచిపోరాదు. అది మన రక్షకుడైన యేసు క్రీస్తు. ప్రతి దైన్య స్థితి నుండి లేదా ప్రతికూల పరిస్థితుల నుండి మనకు సహాయం చేయగల శక్తి ఆయనకు ఉంది. మనం ఆయనకు దగ్గరగా ఉన్నామో లేదా అనే దానితో సంబంధం లేకుండా, మనం ఉన్న పరిస్థితిలో మనకు ఆయన సహాయం చేయగలరు.

విశ్వాసంతో మనం ఆయన సహాయం కోరినప్పుడు, ఆయన ఎల్లప్పుడు అక్కడ ఉంటారు, మరియు ఆయన కాలంలో, ఆయన సిద్ధంగా ఉంటారు మరియు మన చేతులను పట్టుకొని, భద్రతవైపు మనల్ని లాగుతారు.

రక్షకుడు మరియు ఆయన పరిచర్య మాదిరి.

మనం సిలెస్టియల్‌గా ఆలోచించినట్లయితే, పరిచర్యలో మచ్చలేని మాదిరిగా యేసు క్రీస్తును గుర్తిస్తాము. ఆయన లేదా ఆయన శిష్యులు వారి చేతులతో సమీపించి అవసరతలో ఉన్న ఎవరికైనా సహాయపడటానికి, విడిపించడానికి, లేదా దీవెన ఇచ్చినప్పుడు, లేఖనాలలో మన కొక మాదిరి కనిపిస్తుంది. నా కథలో, అక్కడ మా అన్న ఉన్నాడని నాకు తెలుసు, కానీ అక్కడ అతను ఉండటం సరిపోదు. క్లాడియోకు నేను కష్టంలో ఉన్నానని తెలుసు, మరియు అతను నన్ను నీటి నుండి పైకి లేపడానికి సహాయం చేసాడు.

అప్పుడప్పుడు, ఎవరైన అవసరతలో ఉన్నవారికి కేవలం మనం అందుబాటులో ఉంటే చాలని అనుకుంటాము, మరియు అనేకసార్లు, మనం చేయగలది ఇంకా చాలా ఉంది అనుకుంటాము. నిత్య దృష్టికోణం కలిగియుండుట అవసరతలో ఉన్న ఇతరులకు సకాలంలో సహాయం అందించడానికి బయల్పాటును పొందడంలో మనకు సహాయపడగలదు. మానసిక ఓదార్పు, ఆహారం, రోజువారీ పనులలో ఉపకారము వంటి తాత్కాలిక మద్దతు అయినా లేదా పరిశుద్ధ నిబంధనల కోసం సిద్ధపడి, పాటించి మరియు గౌరవించడానికి వారి ప్రయాణంలో ఇతరులకు ఎలాంటి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అవసరమైనా ఎదైనా గ్రహించడానికి మనం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మరియు ప్రేరేపణపై ఆధారపడవచ్చు.

రక్షకుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు

పెద్ద అపొస్తులుడైన పేతురు, “యేసునొదద్దకు వెళ్ళుటకు నీళ్ళమీద నడచెను గాని … గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను.” నీళ్ళపై ఆయన వద్దకు రావడానికి పేతురు విశ్వాసమును సాధన చేసాడని యేసు ఎరుగును. పేతురు యొక్క భయాన్ని కూడా ఆయన ఎరిగియున్నాడు. వృత్తాంతం ప్రకారం, యేసు, “వెంటనే … చెయ్యిచాపి అతని పట్టుకొని,” ఈ క్రింది మాటలు అతనితో చెప్పెను: “అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివి?” పేతురుతో ఆయన మాటలు అతడిని గద్దించాలని కాదు కానీ మెస్సయా అయిన ఆయనే అతనితో, శిష్యులతో ఉన్నారని అతడికి గుర్తు చేయుట.

మనము సిలెస్టియల్‌గా ఆలోచించిన యెడల, యేసు క్రీస్తు వాస్తవానికి మన రక్షకుడు, తండ్రితో మన న్యాయవాది, మరియు మన విమోచకుడనే నిర్ధారణను మన హృదయాలలో పొందుతాము. మనము ఆయనయందు విశ్వాసాన్ని సాధన చేసినప్పుడు, ఈ తాత్కాలిక జీవితంలోని మన కష్టాలు, బలహీనతలు, మరియు అవసరతలను మించి మన పడిపోయిన స్థితి నుండి ఆయన మనల్ని రక్షిస్తారు, మరియు వరములన్నిటి కంటే మిక్కిలి గొప్ప వరమైన, నిత్యజీవాన్ని మనకిస్తారు.

ఆయన మనల్ని విడిచిపెట్టరు.

ఆరోజు మా అన్న నన్ను విడిచిపెట్టలేదు కానీ నాకై నేను దానిని ఎలా చేయాలో నేర్చుకోవలని పట్టుబట్టాడు. నన్ను రెండుసార్లు విడిపించుట అవసరమైనప్పటికినీ అతడు పట్టువిడువలేదు. నాకు మొదటిసారి రానప్పుడు అతడు పట్టువిడువలేదు. అతను పట్టుదలతో ఉన్నాడు కాబట్టి నేను ఆ సవాలును అధిగమించి విజయం సాధించగలిగాను. మనం సిలెస్టియల్‌గా ఆలోచించినప్పుడు, మన జీవితాలకు నిజమైన, శాశ్వతమైన ఆనందాన్ని ఏది తీసుకువస్తుందో దానిలో మనం నేర్చుకొని, మారాలని, అధిగమించాలని లేదా ఎదుర్కోవాలని లేదా జయించాలనుకుంటే సహాయం అందించడానికి అవసరమైనన్నిసార్లు మన రక్షకుడు అక్కడ ఉంటారని మనం గ్రహిస్తాము.

రక్షకుని యొక్క హస్తములు

లేఖనాలు రక్షకుని యొక్క హస్తముల చిహ్నాన్ని మరియు ప్రాముఖ్యతను శాశ్వతత్వం చేస్తాయి. ఆయన ప్రాయశ్చిత్త త్యాగములో, సిలువపై ఆయనను స్థిరంగా ఉంచడానికి ఆయన చేతులలో మేకులు కొట్టబడినవి. ఆయన పునరుత్థానము తరువాత, ఆయన పరిపూర్ణమైన శరీరములో తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు, కానీ ఆయన చేతులలోని గుర్తులు ఆయన అంతులేని త్యాగానికి జ్ఞాపకార్ధంగా నిలిచిపోయాయి. మనము దానిని చూడలేనప్పటికినీ లేదా దానిని మొదట తాకనప్పటికినీ ఆయన హస్తము మన కోసం ఎల్లప్పుడు అక్కడున్నది, ఎందుకనగా ఆయన మన రక్షకుడు, సమస్త మానవాళి యొక్క విమోచకునిగా ఉండటానికి మన పరలోక తండ్రి చేత ఎంపిక చేయబడ్డారు.

చాచియుంచిన రక్షకుని హస్తము.

Our Advocate [మన న్యాయవాది], జే బ్రయంట్ వార్డ్ చేత

రక్షకుని రక్షించే హస్తము.

The Hand of God [దేవుని యొక్క హస్తము], యాంగ్‌సుంగ్ కిమ్ చేత

నేను సిలెస్టియల్‌గా ఆలోచించిన యెడల, ఈ జీవితంలో మనమందరం ఒంటరిగా విడవబడమని నేను ఎరుగుదును. మనము కష్టాలు, శ్రమలు ఎదుర్కోవాల్సియుండగా, మన పరలోక తండ్రి మన సామర్ధ్యాలను ఎరుగును మరియు మనము మన కష్టాలను భరించగలమో లేదా జయించగలమో ఆయన ఎరుగును. మనము మన వంతు చేయాలి మరియు విశ్వాసముతో ఆయన వైపు తిరగాలి. ఆయన ప్రియమైన కుమారుడైన యేసు క్రీస్తు, మన రక్షకుడు మరియు ఎల్లప్పుడు అక్కడ ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సిలెస్టియల్‌గా ఆలోచించండి!,” లియహోనా, నవ. 2023, 118 చూడండి.

    “మీరు ఎంపికలు చేసినప్పుడు, సుదీర్ఘ దృష్టితో—నిత్య దృష్టితో చూడమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తుకు ప్రాధాన్యమివ్వండి, ఎందుకంటే మీ నిత్యజీవము ఆయన యందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమందు మీ విశ్వాసంపై ఆధారపడియుంది. …

    “మీరు గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! శోధన చేత పరీక్షించబడినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! జీవితం లేదా ప్రియమైన వారు మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! ఎవరైనా అకాలంగా మరణించినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి. ఎవరైనా వినాశకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి. జీవితం యొక్క ఒత్తిళ్ళు మీపైకి వచ్చినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా, మీరు ఒక ప్రమాదం లేదా గాయం నుండి కోలుకుంటున్నప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి!

  2. మార్కు 4:35–41 చూడండి.

  3. మనకు అది అవసరమైనప్పుడల్లా మనకు సహాయపడటానికి మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు సామర్ధ్యము కలిగియున్నారని మనము నమ్మినప్పుడు, వారి సహాయము మనము ఆశించిన విధంగా ఎల్లప్పుడు రాకపోవచ్చు. మనకై మనం ఎరిగిన దానికంటే మేలుగా వారు మనల్ని బాగా ఎరుగుదురని మరియు సరైన సమయంలో మనకై శ్రేష్ఠమైన సహాయము మరియు సహకారాన్ని ఇస్తారని నమ్మడం ముఖ్యమైనది: “నా కుమారుడా, ఇవన్నియు నీకు అనుభవమునిచ్చుటకు నీ మేలుకొరకేనని తెలుసుకొనుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 122:7).

    మనము ఎదుర్కొనే శ్రమలు మరియు కష్టాలు శోధనను జయించడానికి మరియు ప్రకృతి సంబంధియైన మనుష్యుని జయించడానికి బలాన్ని, స్వభావాన్ని వృద్ధి చేయడానికి మనకు సహాయపడతాయి.

  4. మత్తయి 14:31; మార్కు 1:31; 5:41; 9:27; అపొస్తులుల కార్యములు 3:7; 3 నీఫై 18:36 చూడండి.

  5. క్రొత్తది, పరిశుద్ధమైన విధానంలో పరిచర్య చేయమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించినప్పుడు, ఈ పరిచర్య చేసే క్రొత్త విధానము మన గురించి మరియు మనము ఇవ్వబోయే దాని గురించి కాదు కానీ ఇతరులకు అవసరమైన దానిని ఇవ్వడం (“పరిచర్య చేయుట,” లియహోనా, 2018 మే, 100 చూడండి). ఒక మహోన్నతమైన, పరిశుద్ధమైన విధానంలో మన పొరుగువారిని ప్రేమించడానికి అవకాశాన్ని యేసు క్రీస్తు మనకిస్తున్నారు (లూకా 10:27 చూడండి).

  6. మత్తయి 14:29–30.

  7. మత్తయి 14:31.

  8. సంతోషాన్ని నిజంగా గ్రహించడానికి, మన జీవితాలలో దీవెనల పాత్రను మనం గ్రహించాల్సియున్నది. The definition of blessings helps to clarify this concept: a blessing is “to confer divine favor upon someone. Anything contributing to true happiness, well-being, or prosperity is a blessing” (Guide to the Scriptures, “Bless, Blessed, Blessing,” Gospel Library). ప్రపంచం తరచుగా నిజమైన ఆనందాన్ని తాత్కాలిక ఆనందంతో అయోమయానికి గురిచేస్తుంది, ఇది స్వల్పకాలిక “సంతోషాన్ని” అనుకరిస్తుంది.

  9. యెషయా 49:16 చూడండి.