సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
సహోదర సహోదరీలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదపు ఓటు కొరకు సమర్పించుట నా విశేషావకాశము.
మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, దయచేసి సాధారణమైన విధానములో మీ మద్దతును తెలియజేయమని మేము కోరుతున్నాము. ఈ ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారు ఉన్న యెడల, మీరు మీ స్టేకు అధ్యక్షుడిని సంప్రదించవలెనని మేము అడుగుతున్నాము.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి, బయల్పాటుదారునిగా మరియు అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్; ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాలిన్ హారిస్ ఓక్స్; మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్‌లను ఆమోదించుటకు ప్రతిపాదించబడినది.
సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా ఉన్నయెడల, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క వ్యవహారిక అధ్యక్షునిగా జెఫ్రీ ఆర్. హాలండ్‌ను మనము ఆమోదించవలెనని ప్రతిపాదించబడినది.
సమ్మతించువారు, దయచేసి దానిని సూచించండి.
వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.
పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా వీరిని మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది: జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, నీల్ ఎల్. ఆండర్సెన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్లండ్, గెరిట్ డబ్ల్యు. గాంగ్, యులిసెస్ సోవారెస్ మరియు పాట్రిక్ కీరన్.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించు వారెవరైనా దానిని సూచించవచ్చు.
ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది.
సమ్మతించు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకులెవరైనా ఉన్న యెడల, అదే సూచన చూపండి.
అక్టోబరు 3, గురువారము నాడు సర్వసభ్య సమావేశపు నాయకత్వ సమావేశాలలో ఆరుగురు క్రొత్త ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారని మరియు అది తరువాత సంఘ వెబ్‌సైట్‌లో ప్రకటించబడిందని మేము గుర్తిస్తున్నాము. వారి క్రొత్త నియామకాలందు ఈ సహోదరులను ఆమోదించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించు వారెవరైనా, అదే సూచన చూపండి.
మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ప్రస్తుతము నియమించబడినట్లుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది.
సమ్మతించు వారందరు, పైకెత్తబడిన చేతితో తెలియజేయవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా తెలియజేయండి.
సహోదర సహోదరీలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు కృతజ్ఞతలు.
ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు
సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో ఈ ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:
మిగెల్ ఎ. అవిలా, జాన్ పియర్ ఎ. ఎల్. హబోకో, రమిరో ఇబర్రా శాంఛెజ్, జార్జ్ కటెంబో న్యోగు మనేనే, ఎ. ఎన్రికె టెక్సేరా, ఫ్రాన్సిస్కో వియేనుయేవా రోహాస్.