సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
సహోదర సహోదరీలారా, ఇప్పుడు నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదపు ఓటు కొరకు సమర్పిస్తాను.
యథాప్రకారం మీ మద్దతును దయచేసి తెలియజేయండి. ఈ ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించే వారు ఉన్న యెడల, మీరు మీ స్టేకు అధ్యక్షుడిని సంప్రదించాలని మేము అడుగుతున్నాము.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క పన్నెండుమంది అపొస్తలుల సమూహానికి అధ్యక్షునిగా డాలిన్ హారిస్ ఓక్స్‌ను మనం ఆమోదించాలని ప్రతిపాదించబడింది.
సమ్మతించువారు, దయచేసి దానిని సూచించండి.
వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.
పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులుగా వీరిని మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది: డాలిన్ హెచ్. ఓక్స్, జెఫ్రీ ఆర్. హాలండ్, హెన్రీ బి. ఐరింగ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, నీల్ ఎల్. ఆండర్సెన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్లండ్, గెరిట్ డబ్ల్యు. గాంగ్, యులిసెస్ సోవారెస్ మరియు ప్యాట్రిక్ కీరన్.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించు వారెవరైనా దానిని సూచించవచ్చు.
పన్నెండుమంది అపొస్తలుల సమూహ సభ్యులను ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది.
సమ్మతించు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకులెవరైనా ఉన్న యెడల, అదే సూచన చూపండి.
సర్వసభ్య సమావేశపు నాయకత్వ సమావేశాలలో ఇద్దరు క్రొత్త ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారని మరియు అది సంఘ వెబ్‌సైట్‌లో ప్రకటించబడిందని మేము గుర్తిస్తున్నాము. వారి క్రొత్త నియామకాలందు ఈ సహోదరులను ఆమోదించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించు వారెవరైనా, అదే సూచన చూపండి.
ఇతర ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ప్రస్తుతము నియమించబడినట్లుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది.
సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా ఉన్నయెడల, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
సహోదర సహోదరీలారా, సంఘ నాయకత్వము తరఫున మీ ఆమోదపు ఓటు కొరకు ధన్యవాదాలు.
ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు
సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో ఈ ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:
భాను కె. హీరానందాని మరియు ఫెర్నాండో వివాస్.