“అనుబంధము,” యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శి (2022)
“అనుబంధము,” యౌవనుల బలము కొరకు
అనుబంధము
నిబంధన మార్గంలో మీ పురోగతిని అంచనా వేయడానికి ఒక మార్గం ఏమిటంటే ఈ క్రింద ఉన్న ప్రశ్నలను లోతుగా ఆలోచించడం. అవి దేవాలయ సిఫార్సును స్వీకరించడానికి ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలు, కానీ ఇంటర్వ్యూ కోసం వేచి ఉండకండి. మీ స్వంత ఆత్మీయ పరీక్ష చేసుకోండి. యువతుల ఇతివృత్తము, అహరోను యాజకత్వ సమూహ ఇతివృత్తము మరియు పది ఆజ్ఞలు కూడా మీ స్వీయ-మూల్యాంకనంలో సహాయక సాధనాలుగా ఉంటాయి.
యువత కొరకు దేవాలయ సిఫారసు ప్రశ్నలు.
నిత్యుడగు తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు, మరియు పరిశుద్ధాత్మయందు మీరు విశ్వాసమును మరియు సాక్ష్యమును కలిగియున్నారా?
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మరియు రక్షకునిగా, విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి మీరు సాక్ష్యము కలిగియున్నారా?
యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన గూర్చి మీరు సాక్ష్యమును కలిగియున్నారా?
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షునిని ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా, సమస్త యాజకత్వ తాళపుచెవులను ఉపయోగించుటకు అధికారము పొందిన ఏకైక వ్యక్తిగా మీరు బలపరుస్తున్నారా? ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులను ప్రవక్తలు, దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారులుగా మీరు బలపరుస్తున్నారా? సంఘము యొక్క ఇతర ప్రధాన అధికారులు మరియు స్థానిక అధికారులను మీరు బలపరుస్తున్నారా?
ఆయన యెదుట అన్ని సంగతులు “స్వచ్ఛతతో చేయబడవలెను“ అని ప్రభువు చెప్పెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:41). మీ ఆలోచనలలో, ప్రవర్తనలో నైతిక స్వచ్ఛత కొరకు మీరు శ్రమిస్తున్నారా? పవిత్రత చట్టమును మీరు గైకొనుచున్నారా?
మీ కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో మీ వ్యక్తిగత మరియు బహిరంగ ప్రవర్తనలో యేసు క్రీస్తు సంఘము యొక్క బోధనలను అనుసరిస్తున్నారా?
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘపు బోధనలు, ఆచరణలు లేదా సిద్ధాంతములకు వ్యతిరేకముగా ఉన్న వేటినైనా మీరు బలపరుస్తున్నారా లేదా సమర్థిస్తున్నారా?
మీ గృహములో మరియు సంఘములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా అనుసరించుటకు; మీ కూడికలు హాజరగుటకు; సంస్కారము కొరకు సిద్ధపడి యోగ్యతతో దానిలో పాలుపొందుటకు మీరు శ్రమిస్తున్నారా; మరియు మీ జీవితమును సువార్త యొక్క చట్టములు, ఆజ్ఞలకు అనుగుణముగా జీవిస్తున్నారా?
మీరు చేయు వాటన్నిటిలో నిజాయితీగా ఉండుటకు శ్రమిస్తున్నారా?
మీరు పూర్తి దశమభాగమును చెల్లించువారిగా ఉన్నారా?
జ్ఞాన వాక్యమును మీరు అర్ధము చేసుకొని, గైకొనుచున్నారా?
మీ పశ్చాత్తాపములో భాగముగా యాజకత్వ అధికారులతో పరిష్కరించబడవలసియున్న తీవ్రమైన పాపములు మీ జీవితంలో ఏవైనా ఉన్నాయా?
ప్రభువు యొక్క మందిరములోనికి ప్రవేశించుటకు మరియు దేవాలయ విధులందు పాల్గొనుటకు మిమ్మల్ని మీరు యోగ్యులుగా పరిగణిస్తున్నారా?
యువతుల కూడికల ఇతివృత్తము
దైవిక స్వభావము, నిత్య గమ్యముతో, నేను పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన కుమార్తెను.
యేసు క్రీస్తు యొక్క శిష్యురాలిగా, నేను ఆయనవలే అగుటకు ప్రయాసపడతాను. వ్యక్తిగత బయల్పాటును నేను వెదకి, ఆ ప్రకారము చేసి, ఆయన పరిశుద్ధ నామములో ఇతరులకు పరిచర్య చేస్తాను.
నేను అన్ని సమయాలందు, అన్ని విషయాలందు, అన్ని స్థలములందు దేవునికి ఒక సాక్షిగా నిలబడతాను.
ఉన్నతస్థితి కొరకు నేను యోగ్యత కలిగియుండుటకు ప్రయాసపడినప్పుడు, పశ్చాత్తాపము యొక్క వరమును నేను ఆనందిస్తాను, ప్రతీరోజు మెరుగుపరచుకొనుటకు కోరతాను. విశ్వాసముతో, నేను నా గృహమును, కుటుంబమును బలపరుస్తాను, పరిశుద్ధ నిబంధనలను చేసి పాటిస్తాను, పరిశుద్ధ దేవాలయము యొక్క విధులను, దీవెనలను పొందుతాను.
అహరోను యాజకత్వ సమూహ ఇతివృత్తము.
నేను దేవునికి ప్రియమైన కుమారుడను, నేను చేయడానికి నా కొరకు దేవుడు ఒక కార్యమును కలిగియున్నారు.
నా పూర్ణ హృదయముతో, శక్తితో, మనస్సుతో, మరియు బలముతో, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నా నిబంధనలను పాటిస్తాను మరియు నా స్వంత గృహము నుండి ప్రారంభించి ఇతరులకు సేవ చేయడానికి ఆయన యాజకత్వాన్ని ఉపయోగిస్తాను.
నేను సేవచేయడానికి, విశ్వాసాన్ని సాధనచేసి, పశ్చాత్తాపపడి, అనుదినం మెరుగవడానికి ప్రయత్నించినప్పుడు, దేవాలయ దీవెనలు మరియు సువార్త యొక్క శాశ్వతానందమును పొందడానికి నేను అర్హుడనవుతాను.
నేను యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యుడిగా ఉండటం ద్వారా శ్రద్ధగల సువార్తికునిగా, నమ్మకమైన భర్తగా మరియు ప్రేమగల తండ్రిగా మారడానికి సిద్ధపడతాను.
నేను అందరినీ క్రీస్తుయొద్దకు రమ్మని, ఆయన ప్రాయశ్చిత్త శక్తి యొక్క దీవెనలు పొందమని ఆహ్వానించుట ద్వారా రక్షకుని యొక్క రాకడ కొరకు లోకమును సిద్ధపరుస్తాను.
పది ఆజ్ఞలు
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు.
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు.
విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
నరహత్య చేయకూడదు.
వ్యభిచరింపకూడదు.
దొంగిలకూడదు.
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.
నిర్గమకాండము 20:3–17 చూడండి.