యౌవనులు
ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము


ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము

మా ప్రియమైన యువ సహోదర మరియు సహోదరీలారా,

మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మరియు మీపై మాకు నమ్మకం ఉంది. మీరు నిజంగా పరలోక తండ్రి ఎంపిక చేసుకున్న ఆత్మలలో ఉన్నారు, ఈ సమయంలో ముఖ్యమైన కార్యములు చేయడానికి భూమికి పంపబడ్డారు.

మీరు గ్రహించిన దానికంటే మీరు మరింత బలవంతులు మరియు సమర్థులు. మరియు మీరు రక్షకునిపై ఆధారపడినప్పుడు, మీ బలం మరింతగా పెరుగుతుంది. ఆయనే “యౌవనుల బలము.”

నిత్యజీవానికి నడిపించే మార్గంలో కొనసాగడానికి అవసరమైన ఎంపికలు చేయడంలో ఒక బలమైన పునాదిని నిర్మించుకోవడానికి ఈ మార్గదర్శి మీకు సహాయపడుతుంది. దేవాలయంలో పవిత్రమైన నిబంధనలను చేయడానికి, సువార్త సేవచేయుటకు సిద్ధపడటానికి మరియు మీ జీవితమంతా యేసు క్రీస్తు వారిని అనుసరించడంలో ఆనందాన్ని పొందేందుకు ఇది మీకు సహాయం చేస్తుంది. ఆయన సంఘంలో మీకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. మీ పట్ల తన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి యేసు క్రీస్తు మీకు సహాయపడతారు.

దేవుడు జీవిస్తున్నాడని మనకు తెలుసు. నిబంధన మార్గంలో—అంటే దేవునితో పవిత్రమైన నిబంధనలు చేసుకుని వాటిని పాటించే మార్గంలో మీరు స్థిరంగా నిలిచి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. అదే మీ పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే మార్గం. మీరు అలా చేసినప్పుడు, మీరు మంచి కొరకు ఒక ప్రభావంగా ఉంటారు, సువార్తను ఆనందంగా పంచుకుంటారు, దేవుని పిల్లలను సమకూరుస్తారు మరియు రక్షకుని రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేస్తారు. గుర్తుంచుకోండి: యేసు క్రీస్తే మీ బలం!

ప్రథమ అధ్యక్షత్వము