యౌవనులు
ప్రేరేపించబడిన ఎంపికలు చేయండి


ప్రేరేపించబడిన ఎంపికలు చేయండి

యౌవనుల బలము కొరకులో యేసు క్రీస్తు మరియు ఆయన ప్రవక్తల బోధనలను మీరు కనుగొంటారు. ఈ సత్యాలను మీ మార్గదర్శిగా చేసుకుని, ఇప్పుడు మరియు శాశ్వతంగా మిమ్మల్ని దీవించే ప్రేరేపించబడిన ఎంపికలను మీరు చేయండి.

నీవు దేవుని యొక్క ప్రియమైన ఆత్మీయ బిడ్డవి. ఆయన గొప్ప సంతోష ప్రణాళిక మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరియు మీ దైవిక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఆయన యేసు క్రీస్తును మీ రక్షకునిగా ఉండేందుకు పంపారు.

మీ పరలోక తండ్రి మిమ్మల్ని విశ్వసిస్తున్నారు. మిమ్మల్ని ఆయనతో బంధించి, ఆయన శక్తిని మీ జీవితంలోకి తీసుకువచ్చే సంపూర్ణ సువార్త, పవిత్రమైన విధులు మరియు నిబంధనలతో సహా ఆయన మీకు ఎన్నో శ్రేష్ఠమైన దీవెనలనిచ్చారు. ఈ నిబంధనలతో పాటు అదనపు ఆనందం మరియు బాధ్యత కూడా వస్తాయి. మీరు ప్రపంచంలో మార్పు తీసుకురాగలరని ఆయనకు తెలుసు మరియు అందుకు మీరు అనేక విషయములలో ప్రపంచానికి భిన్నంగా ఉండటం అవసరం. మీరు ఎంపికలు చేసుకునేటప్పుడు మీ పరలోక తండ్రి యొక్క మార్గదర్శకత్వాన్ని వెతకండి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని ప్రేరేపణతో దీవిస్తారు.

నిత్య సంతోషానికి మార్గం యేసు క్రీస్తే. మీరు యేసు క్రీస్తును అనుసరించడానికి మీ స్వేచ్ఛను ఉపయోగించినప్పుడు, మీరు నిత్య సంతోషానికి నడిపించే మార్గంలో ఉంటారు. యేసు క్రీస్తును మీ ప్రమాణంగా, మీ దృఢమైన పునాదిగా చేసుకోండి. ఆయన బోధనలపై మీ జీవితాన్ని నిర్మించుకోండి మరియు వాటి ద్వారా మీ ఎంపికలను అంచనావేయండి. బాప్తిస్మమందు, సంస్కార సమయంలో మరియు దేవాలయంలో మీరు చేసే నిబంధనలు, క్రీస్తునందు మీ దృఢమైన పునాదికి నిర్మాణ ఇటుకలు. మీరు ఇప్పటికీ పోరాటాలను మరియు శోధనలను ఎదుర్కొంటారు, కానీ పరలోక తండ్రి మరియు రక్షకుడు వాటన్నింటి ద్వారా మీకు సహాయం చేస్తారు.

మీరు ఎదుర్కొనే ప్రతి ఎంపిక గురించి “అవును” లేదా “కాదు” అని సమాధానం ఇవ్వడం యౌవనుల బలము కొరకు యొక్క ఉద్దేశ్యం కాదు. బదులుగా, ప్రభువు మిమ్మల్ని ఉన్నతమైన మరియు పవిత్రమైన మార్గంలో జీవించమని ఆహ్వానిస్తున్నారు—నిత్యసత్యాలపై మరియు ప్రభువు వాగ్దానం చేసిన దీవెనలపై దృష్టి సారించిన జీవితం. ఇది ఆయన మార్గము. ఈ మార్గదర్శి ఆయన మార్గం గురించి మీకు బోధిస్తుంది. అది ఆయన బయలుపరచిన సత్యాలను వివరిస్తుంది. ఎంపికలు చేసుకోవడానికి ఈ సత్యాలను మీ మార్గదర్శకంగా చేసుకోండి—దేవాలయంలో నిబంధనలు చేయడం మరియు ఒక సువార్తసేవ చేయడం వంటి గొప్ప ఎంపికలు, అలాగే జనులతో ఎలా వ్యవహరించాలి లేదా మీ సమయాన్ని ఎలా గడపాలి వంటి రోజువారీ ఎంపికలు.

ఇతరులు మీకు సహాయం చేయగలిగినప్పటికీ, మీ ఆధ్యాత్మిక వృద్ధి వ్యక్తిగతమైనది. ఇది మీ బాధ్యత! ప్రతిరోజూ మెరుగుపరచుకోవడానికి, దేవుని ఆజ్ఞలను పాటించడానికి, మీ నిబంధనలను ఘనపరచుకోవడానికి మరియు ఇతరులు రక్షకుని దగ్గరికి రావడానికి మీకు సాధ్యమైనంత వరకు చేయండి.

మోషైయ 4:29–30 (పాపము చేయగల విషయములు లెక్కించలేనివి, కాబట్టి మనల్ని మనం కనిపెట్టుకొనియుండాలి); హీలమన్ 5:12(మీరు మీ పునాదిని క్రీస్తుపై నిర్మించుకొనుడి); సిద్ధాంతము మరియు నిబంధనలు 45:57 (పరిశుద్ధాత్మను మీ మార్గదర్శిగా పొందండి); 25:13 (నిబంధనల ద్వారా మిమ్మల్ని మీరు బద్ధులుగా చేసుకొనండి) చూడండి.

ఈ మార్గదర్శి ఎలా నిర్వహించబడింది.

ప్రతి అంశానికి మూడు భాగాలు ఉన్నాయి:

  1. నిత్య సత్యాలు, లేదా యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సిద్ధాంతం

  2. ఆ సత్యాలపై చర్య తీసుకోవడానికి ఆహ్వానాలు

  3. ఆయన బోధనల ప్రకారం జీవించే వారికి ప్రభువు అందించే వాగ్దాన దీవెనలు