3.
దేవుని కార్యములో మీరు సహాయపడవచ్చు
పరలోక తండ్రి తన పిల్లలందరినీ ప్రేమిస్తారు. వారు సంతోషాన్ని మరియు ఆనందాన్ని కనుగొనడానికి, ఆయన వద్దకు తిరిగి రావడానికి మరియు నిత్యజీవాన్ని పొందడానికి ఆయన సహాయం చేయాలనుకుంటున్నారు. ఇది ఆయన రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యము అని అంటారు మరియు ఇందులో సహాయం చేయమని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు!
నిత్య సత్యాలు
మీకు అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే దేవుని కార్యమును మహిమయైయున్నది. అమర్త్యత్వము అంటే పునరుత్థానం చేయబడిన శరీరంతో శాశ్వతంగా జీవించడం. నిత్యజీవం, లేదా ఉన్నత స్థితి అంటే, దేవునిలాగా మరింతగా మారడం మరియు కుటుంబాలుగా ఆయనతో నిత్యము జీవించడం. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము కారణంగానే ఇదంతా సాధ్యము. మీరు ఆయనను నమ్మవచ్చు.
క్రీస్తు వద్దకు రావడం ద్వారా మరియు ఇతరులు కూడా అదే విధంగా చేయడానికి సహాయం చేయడం ద్వారా మీరు దేవుని కార్యములో పాలుపంచుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఎవరినైనా యేసు క్రీస్తును అనుసరించడానికి సహాయం చేయడానికి ఏదైనా చేసినప్పుడు, మీరు దేవుని కార్యములో సహాయం చేస్తున్నట్లే.
ఆహ్వానాలు
సువార్తను జీవించండి. యేసు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి. అనుదినము పశ్చాత్తాపపడండి. దేవుని యాజకత్వ విధులను స్వీకరించి, మీ నిబంధనలను పాటించండి. మీ జీవితాంతం దానినే ఒక నమూనాగా చేసుకోండి.
అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట. మీ కుటుంబం, మీ స్నేహితులు మరియు మీ సమాజంతో సహా ఇతరులకు సేవ చేయడానికి మరియు సహాయం చేయడానికి మార్గాలను కనుగొనండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఒక గొప్ప మార్గం ఉపవాస నియమాన్ని పాటించడం మరియు ఉపవాస కానుకలను ఇవ్వడం.
సువార్తను పొందడానికి అందరిని ఆహ్వానించండి. మీ మాటలు మరియు మీ చర్యలు యేసు క్రీస్తుపై మీకున్న విశ్వాసాన్ని ప్రతిబింబించనివ్వండి. ఆయన శిష్యురాలిగా మీరు అనుభూతి చెందుతున్న నిరీక్షణ మరియు ఆనందం గురించి మిమ్మల్ని అడిగే వారెవరికైనా చెప్పడానికి సిద్ధంగా ఉండండి. పూర్తికాల సువార్త సేవ చేయడం అనేది యువకులకు ఒక యాజకత్వ బాధ్యత. యువతులకు ఇది ఒక గొప్ప అవకాశం; మీరు సేవ చేయాలని ప్రభువు కోరుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రార్థించండి. మీ జీవితాంతం సువార్తను పంచుకోవడానికి సిద్ధపడండి.
కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము చేయడం ద్వారా కుటుంబాలను నిత్యత్వం కోసం ఏకం చేయండి. మీ పూర్వీకులను గురించి తెలుసుకోండి. దేవాలయ విధులను ఎవరికి అవసరమో తెలుసుకోండి. వారి కొరకు బాప్తిస్మము మరియు నిర్ధారణ పొందడానికి వీలైనంత తరచుగా దేవాలయానికి వెళ్ళండి. మీకు సహాయం అవసరమైతే, సూచనల కోసం ఇక్కడ చూడండి FamilySearch.org.
వాగ్దానం చేయబడిన దీవెనలు
మీకు దేవుని సహాయం లభిస్తుంది. పరలోక తండ్రి ఈ కార్యమును మీరు ఒంటరిగా చేయాలని ఆశించడం లేదు. ఆయన మీతో ఉన్నారు. మీరు వినయపూర్వకంగా మీ సమయాన్ని మరియు హృదయాన్ని అర్పించినప్పుడు, ఆయన మీ ద్వారా అద్భుతమైన కార్యములు చేస్తారు. యేసు క్రీస్తే మీ బలం!
మీరు ఆనందముతో నింపబడతారు. దేవుని కార్యము ఆనందకరమైన కార్యము! మీరు ఆ కార్యములో పాల్గొన్నప్పుడు, ఆయన పొందే ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీరు పరలోక తండ్రి వద్దకు తీసుకురావడానికి సహాయం చేసిన ఆయన పిల్లలతో కలిసి మీరు పంచుకోబోయే ఆనందాన్ని ఊహించుకోండి!
ప్రశ్నలు మరియు సమాధానాలు
దేవుడు తన కార్యములో నన్ను నిజంగా ఉపయోగించుకోగలరా? అవును! ఆయన కార్యములో సహాయం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇతరులు మీ కంటే ఎక్కువ ప్రతిభావంతులుగా లేదా నైపుణ్యం కలవారిగా అనిపించవచ్చు, కానీ మీ పరలోక తండ్రి మీలోని సామర్థ్యాన్ని చూస్తారు. ఆయన తన పిల్లలకు సేవ చేయడానికి మరియు వారిని సమకూర్చడానికి మీరు ఉపయోగించుకోగల బహుమతులను మీకు ఇచ్చారు. ఈ బహుమతులు ఇతరుల వద్ద ఉన్న వాటి కంటే భిన్నంగా ఉన్నా పర్వాలేదు. నిజానికి, అందుకే మీ బహుమతులు అంత విలువైనవి. మీరు అవసరం!
మత్తయి 10:39 (మీరు రక్షకుని సేవలో మీ జీవితాన్ని కోల్పోతే, మీరు దానిని తిరిగి పొందుతారు.); 1 కొరింథీయులు 12:14–27 (క్రీస్తు యొక్క శరీరంలో సభ్యులందరూ అవసరం.); ఫిలిప్పీయులకు 1:6 (దేవుడు మీలో పనిచేస్తున్నారని నమ్మకంగా ఉండండి.); యాకోబు 5:72 (ఒలీవతోట యజమాని మీతో కలిసి పనిచేయును); సిద్ధాంతము మరియు నిబంధనలు 18:15–16 (మీరు క్రీస్తు వద్దకు తీసుకువచ్చే వారితో మీ ఆనందం గొప్పగా ఉంటుంది.); 64:33–34 (గొప్ప కార్యం చిన్న మరియు సాధారణ విషయాల నుండే పుడుతుంది.); మోషే 1:6 (“నేను నీ కొరకు ఒక కార్యమును కలిగియున్నాను”); 6:31–34 (వారు తమకు అర్హత లేదని భావించినప్పటికీ, దేవుడు పిలిచిన వారిని ఆయన అర్హులుగా చేస్తారు.) చూడండి.
దేవాలయ సిఫారసు ప్రశ్న
-
యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన గూర్చి మీరు సాక్ష్యమును కలిగియున్నారా?