యౌవనులు
క్రీస్తునందు సంతోషమును కనుగొనండి


“క్రీస్తునందు సంతోషమును కనుగొనండి,” యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శి (2022)

“క్రీస్తునందు సంతోషమును కనుగొనండి,” యౌవనుల బలము కొరకు

బావి పక్కన యేసు మరియు ఒక స్త్రీ మాట్లాడుకుంటున్న చిత్రలేఖనం.

క్రీస్తునందు సంతోషమును కనుగొనండి

ఎంపికలు ముఖ్యమైనవి. సువార్త బోధనలపై ఆధారపడిన ఎంపికలు మిమ్మల్ని మీ పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు దగ్గరగా నడిపించే అడుగులు. “ … మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను” అని యేసు చెప్పెను(యోహాను 15:11). ఆయన వైపు వేసే ప్రతి అడుగుతో, మీరు ఆత్మకు దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు మరియు దేవునితో మీ నిబంధన సంబంధం బలపడుతుంది.

కానీ దాని అర్థం, మార్గం సమస్యలు లేకుండా ఉంటుందని కాదు. మరియు ఎవరూ పూర్తిగా సరళ రేఖలో నడవరు కాబట్టి, మీ దిశను నిరంతరం తనిఖీ చేసుకోండి మరియు దేవుని ఆజ్ఞలను గౌరవించండి. దేవునితో మీ నిబంధనలను పాటించండి మరియు మరిన్ని నిబంధనలు చేయడానికి సిద్ధంగా ఉండండి. నిబంధనలు మిమ్మల్ని పరలోక తండ్రికి మరియు రక్షకునికి అనుసంధానిస్తాయి. అవి మీ జీవితంలో దేవుని శక్తిని పెంచుతాయి మరియు నిత్యజీవాన్ని పొందడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తాయి.

సాధ్యమయ్యే అన్ని ఎంపికలలో, అత్యంత ముఖ్యమైనది యేసు క్రీస్తును అనుసరించే ఎంపిక. ఆయనే యౌవనుల బలము. ఆయన సువార్త మీ పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే ఆనందకరమైన మార్గం.