యౌవనులు
దేవుని యొక్క వెలుగులో నడవండి


“దేవుని యొక్క వెలుగులో నడవండి,” యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శి (2022)

“దేవుని యొక్క వెలుగులో నడవండి,” యౌవనుల బలము కొరకు

రెడ్‌వుడ్ చెట్లు గుండా సూర్యరశ్మి ప్రసరిస్తోంది.

దేవుని యొక్క వెలుగులో నడవండి

గలతీయులకు 5:25

వెలుగు చిహ్నం వైపు జనులు నడుస్తున్నారు.

మీరు విషయాలను స్పష్టంగా చూడగలిగినప్పుడు మీరు మంచి ఎంపికలు చేస్తారు. అందుకే వెలుగు చాలా ముఖ్యమైనది: వెలుగు సరైన మార్గాన్ని సులభంగా చూడడానికి వీలు కల్పిస్తుంది. మంచి మరియు చెడులను, ఒప్పు మరియు తప్పులను స్పష్టంగా చూడడంలో మీకు సహాయపడటానికి—పరలోక తండ్రి మీకు పరలోక వెలుగును పొందే ప్రాప్యతను ప్రసాదించారు—పరిశుద్ధాత్మ వరము.

నిత్య సత్యాలు

సంస్కార సమయంలో నీటిని తీసుకుంటున్న యువతి.

బాప్తిస్మము తీసుకొనే సమయంలో మీరు పరలోక తండ్రి మరియు యేసుక్రీస్తుతో ఆనందకరమైన నిబంధన సంబంధంలోకి ప్రవేశిస్తారు. దేవాలయంలో, మీరు సంబంధాన్ని బలోపేతం చేసే అదనపు నిబంధనలు చేస్తారు. ప్రతి వారం సంస్కార సమయంలో, మీరు మీ నిబంధనలను పునరుద్ధరిస్తారు. మీరు ఆజ్ఞలను పాటించడానికి మీ సంసిద్ధతను వ్యక్తం చేస్తారు మరియు పరిశుద్ధాత్మను మీ స్థిరమైన సహవాసిగా కలిగియుండే అవకాశాన్ని ప్రభువు మీకు అనుగ్రహిస్తారు. అది ఆయన మీకిచ్చిన గొప్ప బహుమతులలో ఒకటి.

మంచి ఎంపికలు చేసుకోవడం వల్ల ఆత్మను అనుభూతి చెందే మీ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ లోకములో ఎన్నో మంచి మరియు ఆరోగ్యకరమైన విషయాలు ఉన్నాయి. మీరు తినే మరియు త్రాగే వాటి ద్వారా మీ శరీరం ప్రభావితమైనట్లే, మీరు చదివే, చూసే మరియు వినే వాటి ద్వారా మీ మనస్సు మరియు ఆత్మ తీవ్రంగా ప్రభావితమవుతాయి.

ఆహ్వానాలు

ప్రతిరోజు ప్రభువు కోసం సమయం కేటాయించండి. ఆయన యొద్ద నేర్చుకొనుడి. ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుము. మీ పరలోక తండ్రిని ప్రార్థించండి. పరిశుద్ధ లేఖనాలను మరియు జీవించియున్న ప్రవక్తల మాటలను అధ్యయనం చేయండి. తర్వాత మీరు నేర్చుకున్న దాని ప్రకారం జీవించడానికి కృషి చేయండి.

ఒక దేవాలయం దగ్గర ఉన్న తోటలో ముగ్గురు యువకులు.

ఆత్మను ఉద్ధరించే, ప్రేరేపించే మరియు ఆహ్వానించే వాటిని వెతకండి. మీరు ఏమి చూడాలి, ఏమి చదవాలి, ఏమి వినాలి లేదా ఎందులో పాల్గొనాలి అనే దాని గురించి ఎంపికలు చేసుకునేటప్పుడు, అది మీకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. అది మంచి ఆలోచనలను ఆహ్వానిస్తుందా? పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేవి లేదా అనైతికమైనవి ఎమైనా వాటికి దూరంగా ఉండండి. హింస, మద్యం మరియు హానికరమైన మాదకద్రవ్యాలు వంటి మీ తీర్పును లేదా ఆత్మ పట్ల సున్నితత్వాన్ని మందగించే దేనిలోనూ పాల్గొనవద్దు. వీడియో లేదా ఆటను ఆపివేయడానికి, సినిమా లేదా నృత్యం నుండి బయటకు వెళ్లడానికి, మీరు వింటున్న సంగీతాన్ని మార్చడానికి లేదా ఆత్మకు విరుద్ధంగా ఉన్న దేనినైనా విడిచిపెట్టడానికి ధైర్యం కలిగి ఉండండి.

సామాజిక మాధ్యమంలో హృదయం చిహ్నం

ఉద్ధరించడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించండి. సామాజిక మాధ్యమం ఒక శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనం కాగలదు. మీరు దానిని ఉపయోగిస్తే, వెలుగు, విశ్వాసం మరియు సత్యంపై దృష్టి పెట్టండి. ఇతరులు అనుభవిస్తున్నట్లుగా కనిపించే దానితో మీ జీవితాన్ని పోల్చకండి. మీ విలువ సామాజిక మాధ్యమం నుండి కాదు, పరలోక తల్లిదండ్రుల బిడ్డగా ఉండటం వల్ల వస్తుందని గుర్తుంచుకోండి.

ఆరోగ్యకరమైన అనుభవాలను, నిజమైన మరియు శాశ్వతమైన సంబంధాలను కోరుకోండి. మీ సాంకేతికత మరియు మీడియా వినియోగం కుటుంబం మరియు స్నేహితులతో వ్యక్తిగతంగా గడిపే సమయాన్ని భర్తీ చేయకుండా జాగ్రత్త వహించండి. సామాజిక మాధ్యమం మరియు ఇతర సాంకేతికతలు మీకు సరిపడా విలువ ఇవ్వకుండానే మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. వర్చువల్ ప్రపంచం నుండి విరామం తీసుకోండి మరియు నిజ జీవితంలోని వ్యక్తులను కలుసుకోండి.

వాగ్దానం చేయబడిన దీవెనలు

మీరు ఎల్లప్పుడూ ఆత్మను మీతో కలిగియుండవచ్చు. పరిశుద్ధాత్మ పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి మీకు సాక్ష్యమిస్తుంది. ఆయన మిమ్మల్ని ఆదరిస్తారు, మీకు మార్గనిర్దేశం చేస్తారు, హెచ్చరిస్తారు మరియు పవిత్రం చేస్తారు. సత్యమును గుర్తించడానికి మరియు ప్రపంచంలోని మంచిని చూడటానికి ఆయన మీకు సహాయం చేస్తారు.

ప్రశ్నలు మరియు సమాధానాల చిహ్నం

ప్రశ్నలు మరియు సమాధానాలు

నేను పరిశుద్ధాత్మను అనుభూతి చెందుతున్నానో లేదో ఎలా తెలుసుకోవాలి? ఆత్మను తెలుసుకోవడం గురించి నేర్చుకోవడానికి సమయం పడుతుంది, దానికోసం అభ్యాసం మరియు సహనం అవసరం. ఆయన వేర్వేరు వ్యక్తులతో వివిధ విధానాలలో మాట్లాడతారు. ఒకరి సాక్ష్యం విన్నప్పుడు మీకు కలిగే ప్రశాంతమైన అనుభూతి లేదా చెడు ఎంపిక చేసుకున్న తర్వాత మీకు కలిగే అస్థిరమైన అనుభూతి వంటి సాధారణ విషయాలను విస్మరించవద్దు. ఆత్మ సంభాషించే వివిధ మార్గాల కోసం లేఖనాలను శోధించండి, దాని గురించి ప్రార్థించండి మరియు ఆత్మను అనుభూతి చెందే అవకాశాల కోసం వెతుకుతూ ఉండండి.

తన మంచం దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తున్న ఒక యువతి.

అశ్లీల చిత్రములు అంటే ఏమిటి? నేను దానిని ఎందుకు నివారించాలి? అశ్లీల చిత్రములు అనేవి లైంగిక భావాలను రేకెత్తించడానికి రూపొందించబడిన చిత్రాలు లేదా పదాలలో ప్రాతినిధ్యం వహిస్తుంది. అశ్లీలత అనునది వీడియోలు, చిత్రాలు, పుస్తకాలు మరియు సంగీతంతో సహా అనేక రూపాల్లో వస్తుంది. ఇది స్నేహితుల మధ్య పంపిన సందేశాలు లేదా చిత్రాలు కూడా కావచ్చు. అశ్లీల చిత్రాలు, పవిత్రమైన మన భౌతిక శరీరాలను మరియు లైంగిక భావాలను అమర్యాదగా చూస్తాయి. మీరు తెలియకుండానే అశ్లీల చిత్రాలను చూడవచ్చు. మీరు అశ్లీల చిత్రాలను ఉద్దేశపూర్వకంగా చూసినా లేదా చూడకపోయినా, వెంటనే దూరంగా ఉండండి. మీరు తల్లిదండ్రులతో లేదా ఇతర విశ్వసనీయ పెద్దలతో కూడా మాట్లాడాలనుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా అశ్లీల చిత్రాలను చూడటం పాపం మరియు ఆత్మను అనుభూతి చెందే మీ సామర్థ్యానికి హాని కలిగిస్తుంది. ఇది మీ స్వీయ నియంత్రణను బలహీనపరుస్తుంది మరియు మిమ్మల్ని మరియు ఇతరులను మీరు చూసే విధానాన్ని వక్రీకరిస్తుంది. అశ్లీల చిత్రాలను ప్రతిఘటించటానికి మరియు పశ్చాత్తాపపడటానికి మీకు సహాయం చేసే శక్తి యేసు క్రీస్తుకు ఉంది. ఆయన వైపుకు తిరగండి; చీకటి నుండి దూరంగా వెళ్ళండి. రక్షకుని ద్వారా బలాన్ని మరియు క్షమాపణను పొందడానికి మీ బిషప్పు మీకు. సహాయపడగలరు.

ఆమోసు 5:14 (మంచిని వెతకండి); గలతీయులు 5:22–23 (ఆత్మ ఫలములు); మొరోనై 7:18–19 (క్రీస్తు యొక్క వెలుగు); సిద్ధాంతము మరియు నిబంధనలు 6:23 (ప్రభువు శాంతిని పలుకుతారు); 20:77, 79 (సంస్కార ప్రార్థనలు) చూడండి.

దేవాలయ చిహ్నం.

దేవాలయ సిఫారసు ప్రశ్నలు

ఆయన యెదుట అన్ని సంగతులు “స్వచ్ఛతతో చేయబడవలెను“ అని ప్రభువు చెప్పెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:41). మీ ఆలోచనలలో, ప్రవర్తనలో నైతిక స్వచ్ఛత కొరకు మీరు శ్రమిస్తున్నారా? పవిత్రత చట్టమును మీరు గైకొనుచున్నారా?

మీ గృహములో మరియు సంఘములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా అనుసరించుటకు; మీ కూడికలు హాజరగుటకు; సంస్కారము కొరకు సిద్ధపడి యోగ్యతతో దానిలో పాలుపొందుటకు మీరు శ్రమిస్తున్నారా; మరియు మీ జీవితమును సువార్త యొక్క చట్టములు, ఆజ్ఞలకు అనుగుణముగా జీవిస్తున్నారా?