యౌవనులు
యేసు క్రీస్తు మీకు సహాయం చేస్తారు


“యేసు క్రీస్తు మీకు సహాయం చేస్తారు,” యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు మార్గదర్శి (2022)

“యేసు క్రీస్తు మీకు సహాయం చేస్తారు,” యౌవనుల బలము కొరకు

యేసు క్రీస్తు యొక్క చిత్రలేఖనం.

యేసు క్రీస్తు మీకు సహాయం చేస్తారు

కీర్తనలు 147:3

యేసు క్రీస్తే మీ బలం. ఈ జీవితంలో మరియు నిత్యత్వంలో మీరు సంతోషముగా ఉండటానికి అవసరమైనవన్నీ ఆయన చేసారు. ఆయనను మరియు ఆయన సువార్తను ఎంచుకోవడం ద్వారా, మీరు శాశ్వతమైన ఆనందాన్ని ఎంచుకుంటున్నారు.

మూసివున్నమనిషి కన్నును యేసు చేతితో తాకుతున్న చిత్రలేఖనం.

మంచి ఎంపికలు చేసుకోవడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, కొన్నిసార్లు మీరు తప్పులు చేస్తారు. మీరు చేయకూడదని కోరుకునే పనులు చేస్తారు. అందరూ అలాగే చేస్తారు. అలా జరిగినప్పుడు, నిరుత్సాహపడటం లేదా ఎప్పటికీ తగినంత మంచి వాళ్ళంకాము అని ఆలోచిస్తాము. కానీ శుభవార్త ఉంది—అద్భుతమైన, నిరీక్షణకలిగియున్న వార్త! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును పంపారు, మీరు పశ్చాత్తాపపడి అభివృద్ధి చెందడానికి ఆయన మీ పాపములను స్వయంగా తనపైకి తీసుకున్నారు.

నిత్య సత్యాలు

యేసు క్రీస్తు మిమ్మల్ని బలపరచగలరు. మీ కోరికలను, మీ ఆలోచనలను మరియు మీ చర్యలను మార్చుకోవడానికి ఆయన మీకు సహాయం చేయగలరు. మీరు ఆందోళన చెందుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు లేదా ఏ విధంగానైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆయన మిమ్మల్ని ఓదారుస్తారు. మీ జీవితంలోని అన్ని అంశాలలో ఆయన మీకు సహాయం చేస్తారు.

పశ్చాత్తాపము పాపము కొరకు శిక్ష కాదు; అది రక్షకుడు మనల్ని పాపమునుండి స్వతంత్రులుగా చేసే విధానము. పశ్చాత్తాపపడడమనగా మారడం—పాపము నుండి మరలి, దేవుని వైపు తిరుగుట. దాని అర్థము మెరుగుపరచుకొనుట మరియు క్షమాపణను పొందుట. ఈ రకమైన మార్పు ఒకేసారి జరిగే సంఘటన కాదు; అది కొనసాగుతున్న ప్రక్రియ.

ఆహ్వానాలు

పశ్చాత్తాపపడండి. అభివృద్ధి చెందాలనే కోరికతో ప్రభువు వైపు తిరగండి. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు, దానిని దేవుని ముందు నిజాయితీగా అంగీకరించండి మరియు అవసరమైతే, మీ బిషప్పు మరియు మీరు హాని చేసిన వారిఎదుట అంగీకరించండి. విషయాలు చక్కదిద్దడానికి మీ వంతు కృషి చేయండి.

ఉత్తమముగా చేయడానికి మరియు ఉత్తమముగా ఉండటానికి అందించబడిన బహుమతిలో సంతోషించండి. అది సులభంగా లేకపోయినా మరియు మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నా కూడా, ప్రయత్నించడం ఎప్పుడూ ఆపకండి. ప్రభువునందు నమ్మికయుంచి పనిచేయుము. రక్షకుడు మీకు ప్రతి అడుగులో సహాయం చేస్తారు.

వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు

మీరు పశ్చాత్తాపపడినప్పుడు యేసు క్రీస్తు మిమ్మల్ని క్షమించి స్వస్థపరుస్తారు. ఆయన మీ అపరాధభావాన్ని శాంతి మరియు ఆనందంతో భర్తీ చేస్తారు. ఆయన ఇకపై మీ పాపములను జ్ఞాపకముంచుకోరు. ఆయన బలము వలన, ఆయన ఆజ్ఞలను పాటించాలనే మీ కోరిక పెరుగుతుంది.

ఆయన మీ హృదయాన్ని మరియు మీ జీవితాన్ని మారుస్తారు. కొంచెం కొంచెంగా, మీరు ఎదుగుతారు మరియు మరింతగా ఆయన వలె మారతారు. ఆయనతో మీ నిబంధన సంబంధం ఆయన శక్తిని మీకు ఎక్కువగా అందుబాటులోకి తెస్తుంది.

ప్రశ్నలు మరియు సమాధానాల చిహ్నం

ప్రశ్నలు మరియు సమాధానాలు

దేవుడు నన్ను క్షమించారో లేదో నాకు ఎలా తెలుస్తుంది? పశ్చాత్తాపపడినవారిని క్షమిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆత్మ నుండి ఆదరణను అనుభవించినప్పుడు, రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త శక్తి మీ జీవితంలో పనిచేస్తుందని మీరు తెలుసుకోవచ్చు.

పశ్చాత్తాపం చెందడానికి నాకు బిషప్పు సహాయం ఎప్పుడు అవసరం? మీరు పశ్చాత్తాపపడేందుకు సహాయపడటానికి మీ బిషప్పు యాజకత్వ తాళపుచెవులను మరియు ఆత్మీయ బహుమానాలను కలిగియున్నారు. మీరు ఎప్పుడైనా అతని సహాయం మరియు సలహాను పొందవచ్చు. మీరు పవిత్రత యొక్క చట్టాన్ని ఉల్లంఘించడం వంటి తీవ్రమైన తప్పులు చేసి ఉంటే, మీ బిషప్పు‌ను కలవండి. అతను మిమ్మల్ని శిక్షించడు. అతను యేసు క్రీస్తు యొక్క ప్రతినిధి మరియు పూర్తిగా పశ్చాత్తాపపడి రక్షకుని యొక్క స్వస్థత మరియు బలపరిచే శక్తిని ఎలా పొందాలో తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తారు.

నేను పశ్చాత్తాపపడటానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నేను అదే తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి మరియు చెడు అలవాట్లను మానుకోవడానికి సమయం పడుతుంది, కాబట్టి నిరాశచెందవద్దు. క్రీస్తు వైపు తిరగండి. ఆయన కృప చాలును. మళ్ళీ ప్రయత్నించండి. పురోగతి సాధించే ప్రయత్నాలలో మీరు ఎన్నడూ ఒంటరివారుకారు. యేసు క్రీస్తు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు.

ఉధృతమైన అలల మధ్య యేసు పేతురు చేతిని పట్టుకొనియున్న చిత్రలేఖనం.

ఈనస్ 1:6 (అపరాధ భావనను తుడిచివేయవచ్చు); మోషైయ 4:3 (మీరు క్షమించబడ్డారని, దేవుడు మీకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తారు); 26:30 (మనం పశ్చాత్తాపపడినంత తరచుగా రక్షకుడు క్షమిస్తారు.); ఈథర్ 12:27 (రక్షకుని కృప బలహీనమైన వాటిని బలపరుస్తుంది); మొరోనై 6:8 (పశ్చాత్తాపపడేవారు క్షమించబడతారు); 10:32 (క్రీస్తులో పరిపూర్ణులుగా ఉండండి); సిద్ధాంతము మరియు నిబంధనలు 1:32 (పశ్చాత్తాపపడేవారిని ప్రభువు క్షమిస్తారు); 58:42–43 (పశ్చాత్తాపంలో పాపాన్ని ఒప్పుకోవడం మరియు విడిచిపెట్టడం ఉన్నాయి.). చూడండి

దేవాలయ చిహ్నం.

దేవాలయ సిఫారసు ప్రశ్నలు

నిత్యుడగు తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు, మరియు పరిశుద్ధాత్మయందు మీరు విశ్వాసమును మరియు సాక్ష్యమును కలిగియున్నారా?

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మరియు రక్షకునిగా, విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి మీరు సాక్ష్యము కలిగియున్నారా?