“మే 25–31. ‘యెహోవా రక్షకునిగా నియమించెను’: న్యాయాధిపతులు 2–4; 6–8; 13–16,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“మే 25–31. ‘యెహోవా రక్షకునిగా నియమించెను,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
“I Will Surely Go with Thee”—Deborah the Prophetess [“నేను నీతో అగత్యముగా వచ్చెదను”—ప్రవక్త్రియైన దెబోరా], డి లెవిట్ చేత
మే 25-31: “యెహోవా రక్షకునిగా నియమించెను”
న్యాయాధిపతులు 2–4; 6–8; 13–16
ఒక తప్పు చేసి, దాని గురించి బాధపడటం, తరువాత పశ్చాత్తాపపడి, మన విధానాలను మార్చుకోవడానికి తీర్మానించుకోవడం ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. కానీ చాలా తరచుగా మనం మన పూర్వ సంకల్పాన్ని మరచిపోతాము మరియు శోధన వచ్చినప్పుడు, మనం అదే పాపాన్ని చేస్తున్నట్లు కనుగొంటాము. ఈ నమూనా న్యాయాధిపతుల గ్రంథములో తరచుగా కనిపిస్తుంది. ఎవరినైతే వారు దేశము నుండి తరిమివేయాలో—ఆ కనానీయుల నమ్మకాలు మరియు ఆరాధనా ఆచారాల చేత ప్రభావితం చేయబడి—ఇశ్రాయేలీయులు ప్రభువుతో తమ నిబంధనలను ఉల్లంఘించి, ఆయనను ఆరాధించుట నుండి మరలిపోయారు. ఫలితంగా, వారు ఆయన సంరక్షణను కోల్పోయారు మరియు దాస్యములో పడిపోయారు. అయినప్పటికీ, ఇది జరిగిన ప్రతీసారి, ప్రభువు తన నిబంధన జనులు పశ్చాత్తాపపడుటకు అవకాశమిచ్చారు మరియు ఒక రక్షకుడిని, “న్యాయాధిపతి” అని పిలువబడిన ఒక సేనా నాయకుడిని నియమించారు. న్యాయాధిపతుల గ్రంథములోని న్యాయాధిపతులందరూ నీతిమంతులు కాదు, కానీ వారిలో కొందరు ఇశ్రాయేలీయులను విమోచించుటలో మరియు ప్రభువుతో వారి నిబంధన అనుబంధమునకు వారిని పునఃస్థాపించుటలో గొప్ప విశ్వాసమును సాధన చేసారు. యేసు క్రీస్తు నుండి దూరంగా మనల్ని నడిపించేది ఏదైనప్పటికీ, ఆయన ఇశ్రాయేలు యొక్క విమోచకుడని, మనల్ని విడిపించుటకు ఎల్లప్పుడు సమ్మతిస్తున్నారని మరియు మనం ఆయన వద్దకు తిరిగి వచ్చినప్పుడు స్వాగతిస్తున్నారని ఈ కథలు మనకు జ్ఞాపకం చేస్తాయి.
న్యాయాధిపతుల గ్రంథమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “న్యాయాధిపతుల గ్రంథము” చూడండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
న్యాయాధిపతులు 2:1–19; 3:5-12
నేను పశ్చాత్తాపపడినంత తరచుగా ప్రభువు క్షమిస్తారు.
న్యాయాధిపతుల గ్రంథము ఒక హెచ్చరిక మరియు ప్రోత్సాహం రెండూ కాగలదు. మీరు న్యాయాధిపతులు 2:1–19; 3:5–12 చదువుతున్నప్పుడు, ఈ హెచ్చరిక మరియు ప్రోత్సాహం కొరకు చూడండి. హెచ్చరిక మరియు ప్రోత్సాహం మీకెలా వర్తిస్తుందని మీరు భావిస్తున్నారు?
ఉదాహరణకు, న్యాయాధిపతులు 2:19 ప్రాచీన ఇశ్రాయేలీయుల గురించి కాకుండా మీ గురించి మరియు మీ శోధనల గురించి అయ్యుంటే, అది ఏమి చెప్పవచ్చు? న్యాయాధిపతులు 3:9 మిమ్మల్ని విడిపించడానికి ప్రభువు చేసిన దాని గురించి అయ్యుంటే, అది ఏమి చెప్పవచ్చు?
యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శిలో 9వ పేజీలోని ప్రశ్న మరియు జవాబును చదవడాన్ని పరిగణించండి. న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలీయుల అనుభవానికి ఇది వర్తిస్తుందని మీరెలా భావిస్తున్నారు? యేసు క్రీస్తు గురించి ఇది మీకేమి బోధిస్తుంది?
న్యాయాధిపతులు 4:1–15
ప్రభువుపై విశ్వాసం కలిగియుండేలా నేను ఇతరులను ప్రేరేపించగలను.
ఒక్కోసారి ఒకరి విశ్వాసం చాలా మందిలో విశ్వాసాన్ని ప్రేరేపించగలదు. న్యాయాధిపతులు 4లో, ఆ ఒక్క వ్యక్తి దెబోరా. న్యాయాధిపతులు 4:1–15లో ఆమె గురించి చదవండి మరియు ఆమె చుట్టూ ఉన్న జనులపై ఆమె కలిగియున్న ప్రభావాన్ని గమనించండి. ఆమె అనుభవం మీ జీవితానికి ఎలా వర్తించవచ్చో పరిగణించడంలో మీకు సహాయపడడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి:
-
ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఉన్న పరిస్థితులను మీరు ఎలా వివరిస్తారు? (1–3 వచనములు చూడండి). వ్యక్తులలో మరియు సమాజంలో ఉన్న—నేటి పరిస్థితులకు మీరు ఏ పోలికలను చూస్తున్నారు?
-
దెబోరా యొక్క ఏ మాటలు లేదా క్రియలు ఆమె ప్రభువునందు విశ్వాసము కలిగియున్నదని మీకు చూపుతాయి? ఆమె విశ్వాసం ఇతరులను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది? ఆమె గురించి మిమ్మల్ని ఇంకా ఏది ఆకట్టుకుంటుంది?
-
14వ–వచనములో ఆమె ప్రశ్నను బట్టి దెబోరా ఉద్దేశ్యమేమిటని మీరు భావిస్తున్నారు: “యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా?” యెహోవా నీకు “ముందుగా ఎలా బయలుదేరును”? (సిద్ధాంతము మరియు నిబంధనలు 84: 87–88 చూడండి).
దెబోరా విశ్వాసం బారాకును మరియు ఇతర ఇశ్రాయేలీయులను ఆశీర్వదించిన విధంగా యేసు క్రీస్తుపై మీ విశ్వాసం ఇతరులను ఎలా ఆశీర్వదించగలదో ఆలోచించండి. దీని గురించి ఆలోచించడానికి మీకు సహాయపడేందుకు, ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ గారి సందేశము “మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము” (లియహోనా, నవ. 2020, 88–91)ను మీరు చదువవచ్చు. (1) రక్షకుని గురించి మరింత బహిరంగంగా మాట్లాడడానికి గల కారణాలు మరియు (2) దానిని చేసే మార్గాల కోసం సందేశాన్ని శోధించండి.
అప్పుడు మీరు యేసు క్రీస్తు గురించి—లేఖనాల నుండి, సజీవ ప్రవక్తల మాటల నుండి మరియు మీ వ్యక్తిగత అనుభవం నుండి మీకు తెలిసిన విషయాల జాబితాను తయారు చేయవచ్చు. ఇది ఎవరికి తెలియాలి? మీరు దానిని ఎలా పంచుకుంటారు?
మత్తయి 5:14–16; 1 పేతురు 3:15 కూడా చూడండి.
పంచుకోవడాన్ని ఆహ్వానించండి. ఇంటి వద్ద లేదా సంఘములో—మీరు ఒక బోధకులైతే—“రక్షకుని గురించి మరియు ఆయన సువార్త గురించి వారు నేర్చుకుంటున్న వాటిని ఒకరితో ఒకరు పంచుకోవడానికి అభ్యాసకులకు అవకాశాలను ఇవ్వండి. ఇలా చేయడం వారికి బోధించబడిన సత్యాలను అంతర్గతీకరించడానికి మరియు వాటిని వ్యక్తీకరించడానికి వారికి సహాయపడుతుంది” (రక్షకుని విధానములో బోధించుట, 26). ఉదాహరణకు, న్యాయాధిపతులు–4ని కలిసి అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు ప్రతి అభ్యాసకుడికి అధ్యాయంలో వెదకడానికి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వవచ్చు, ఆపై వారు కనుగొన్న వాటిని ఒకరితో ఒకరు పంచుకోవడానికి వారిని ఆహ్వానించవచ్చు.
న్యాయాధిపతులు 6–8
ఆయన మార్గములందు నేను విశ్వసించినప్పుడు ప్రభువు అద్భుతాలను చేయగలరు.
మీరు న్యాయాధిపతులు 6–8 చదివినప్పుడు, అసంభవం అనిపించేదాన్ని నమ్మమని ప్రభువు గిద్యోనును అడిగిన సందర్భాలను గమనించండి. ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా ఇలాంటిది అడిగారా?
ఈ వృత్తాంతముతో ప్రభువు మీకు ఏమి బోధించడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తున్నారు? అసాధారణంగా కనబడే విధానాలలో ప్రభువు తన కార్యమును చేయడాన్ని మీరు ఎలా చూసియున్నారు?
న్యాయాధిపతులు 13–16
నేను నా నిబంధనల పట్ల విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరుస్తారు.
నాజీరులకు ప్రత్యేకంగా అన్వయించబడిన వాటితో కలిపి, దేవునితో తన నిబంధనలను ఉల్లంఘించాడు కనుక సమ్సోను తన శారీరక బలమును మరియు ఆత్మీయ బలమును కోల్పోయాడు (నాజీరులను గూర్చి సమాచారము కొరకు సంఖ్యాకాండము 6:1–6; న్యాయాధిపతులు 13:7 చూడండి). మీరు న్యాయాధిపతులు 13–16లో సమ్సోను గురించి చదువుతున్నప్పుడు, ప్రభువు సమ్సోనుతో ఉన్నారని చూపించే వచనాలను, అలాగే సమ్సోను పూర్తిగా ప్రభువుకు కట్టుబడి లేడని చూపించే వచనాలను గమనించండి.
మీరు ప్రభువుతో చేసిన నిబంధనలను కూడా మీరు ధ్యానించవచ్చు. ఈ నిబంధనలు ఆయన శక్తిని మీ జీవితంలోకి ఎలా తీసుకొచ్చాయి? దేవునితో మీ నిబంధనలపట్ల యథార్థముగా నిలిచియుండడానికి మిమ్మల్ని ప్రేరేపించునట్లు సమ్సోను కథ నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
సహోదరి ఆన్ ఎమ్. డిబ్ ఇలా బోధించారు: “సమ్సోను గొప్ప సామర్థ్యంతో జన్మించాడు. ‘అతను ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టును’ [న్యాయాధిపతులు 13:5] అని అతని తల్లికి వాగ్దానం చేయబడింది. కానీ సమ్సోను ఎదుగుతున్న కొద్దీ, అతడు దేవుని నిర్దేశం కంటే లోకపు శోధనల వైపు ఎక్కువగా చూశాడు. ఆ ఎంపికలు సరైనవి అనేదానికి బదులుగా, అవి ‘[అతనికి] బాగా ఇష్టమైనవి’ [న్యాయాధిపతులు 14:3] కాబట్టి అతడు ఆ ఎంపికలు చేసుకున్నాడు. సమ్సోను ప్రయాణాలు, చర్యలు మరియు ఎంపికల గురించి చెప్పేటప్పుడు లేఖనాలు పదే పదే ‘మరియు అతడు వెళ్ళాడు’ [న్యాయాధిపతులు 14:7] అనే వాక్యభాగాన్ని ఉపయోగిస్తాయి. తన గొప్ప సామర్థ్యాన్ని నెరవేర్చడానికి లేచి ప్రకాశించే బదులు, సమ్సోను లోకంచేత జయించబడ్డాడు, దేవుడు ఇచ్చిన శక్తిని కోల్పోయాడు మరియు విషాదకరమైన, అకాల మరణంతో మరణించాడు. (“Arise and Shine Forth,” Liahona, May 2012, 118).
డాలిన్ హెచ్. ఓక్స్, “నిబంధనలు మరియు బాధ్యతలు,” లియహోనా, మే 2024, 93–96; యులిసెస్ సోవారెస్, “యేసు క్రీస్తు ద్వారా నిబంధన విశ్వాసం,” లియహోనా, మే 2024, 17–21 కూడా చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ఈ ఆదివారం నెలలో ఐదవ ఆదివారం కాబట్టి, “అనుబంధం బి: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లోని అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.
న్యాయాధిపతులు 3:7–9, 12–15
యేసు క్రీస్తు నా రక్షకుడు.
-
పాపం నుండి మనలను విడిపించే రక్షకుని శక్తి గురించి బోధించే నమూనాను న్యాయాధిపతులు 3 వివరిస్తుంది. ఈ నమూనాను గుర్తించడంలో మీ పిల్లలకు సహాయపడటానికి, మీరు ఈ వాక్యభాగాలను వ్రాయవచ్చు: “కీడు చేసాడు,” “యెహోవాకు మొరపెట్టాడు” మరియు “రక్షకుని నియమించాడు.” అప్పుడు మీ పిల్లలు న్యాయాధిపతులు 3:7–9 మరియు న్యాయాధిపతులు 3:12–15లో ఈ వాక్యభాగాల కొరకు చూడవచ్చు. ఈ నమూనా నుండి ప్రభువు గురించి మనమేమి నేర్చుకుంటాము?
-
యేసు క్రీస్తు మన రక్షకుడని నొక్కిచెప్పడానికి, మీరు యేసు చిత్రంతో సహా వ్యక్తుల యొక్క అనేక చిత్రాలను సేకరించి, వాటిని తిరగేసి ఉంచవచ్చు. మీ పిల్లలను వంతులవారీగా చిత్రాలను తిరగేయనివ్వండి. వారు యేసు చిత్రాన్ని కనుగొన్నప్పుడు, ఆయన గురించి ఒక పాటను పాడండి మరియు ఆయన మిమ్మల్ని ఎలా విడిపించారో మీ పిల్లలకు చెప్పండి.
న్యాయాధిపతులు 4:1–15
ప్రభువుపై విశ్వాసం కలిగియుండడానికి నేను ఇతరులను ప్రేరేపించగలను.
-
న్యాయాధిపతులు 4లోని కథను మీ పిల్లలకు చెప్పడానికి మీరు పాత నిబంధన కథలు, 92–95లోని “ప్రవక్త్రియైన దెబోరా”ను ఉపయోగించవచ్చు. దెబోరా గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వాటిని ఒకరితో ఒకరు పంచుకోండి. ప్రభువుపై ఆమెకున్న విశ్వాసం ఆమె చుట్టూ ఉన్న జనులను ఎలా ఆశీర్వదించింది? యేసు క్రీస్తుపై అధిక విశ్వాసం కలిగియుండేందుకు ఇతరులకు సహాయపడడానికి మనం ఏమి చేయవచ్చు?
2:9Deborah the Prophetess
న్యాయాధిపతులు 7:1–21
గొప్ప కార్యము చేయడానికి ప్రభువు చిన్న వస్తువులను ఉపయోగించగలరు.
-
ప్రభువు ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఎలా చిన్నదిగా చేసారు అనే దాని గురించి మీ పిల్లలకు బోధించడానికి న్యాయాధిపతులు 7:4–7, ఈ వారం ప్రోత్సాహకార్యక్రమ పేజీ లేదా పాత నిబంధన కథలు, 96-99లోని “గిద్యోను యొక్క సైన్యము”ను ఉపయోగించండి. గిద్యోను యొక్క సైన్యం అంత చిన్నదిగా ఉండాలని ప్రభువు ఎందుకు కోరుకున్నారు? (న్యాయాధిపతులు 7:2 చూడండి).
2:37The Army of Gideon
-
మీ పిల్లలు కత్తి, డాలు, బూర, దివిటీ మరియు కుండ చిత్రాలను గీయవచ్చు మరియు వీటిలో ఏ వస్తువులు యుద్ధంలో వారికి కావాలనే దాని గురించి మాట్లాడవచ్చు. ఏమి ఉపయోగించమని ప్రభువు గిద్యోను సైన్యానికి చెప్పారో తెలుసుకోవడానికి అప్పుడు వారు న్యాయాధిపతులు 7:16 చదవవచ్చు. మీరు న్యాయాధిపతులు 7:19–21లో యుద్ధం గురించి చదువుతున్నప్పుడు, ఈ కథ నుండి మీరు ప్రభువు గురించి తెలుసుకున్న వాటిని ఒకరితో ఒకరు పంచుకోండి.
Samson Puts Down the Pillars [స్తంభములను పడద్రోయుచున్న సమ్సోను], జేమ్స్ టిస్సాట్ మరియు ఇతరుల చేత
న్యాయాధిపతులు 13:5
నిబంధనలను పాటించడం నాకు బలమునిస్తుంది.
-
మన నిబంధనలు మనకు ఆత్మీయ బలమునిచ్చునట్లు, ప్రభువుతో సమ్సోను నిబంధనలు అతడికి శారీరక బలమునిచ్చాయి. మీ పిల్లలు కొన్ని శారీరక వ్యాయామాలు చేయడాన్ని మరియు ఆ వ్యాయామాలు మన శరీరాలను దృఢంగా చేయడంలో ఎలా సహాయపడతాయో చర్చించడాన్ని ఆనందించవచ్చు. మన నిబంధనలను పాటించడం మన ఆత్మలను ఎలా బలపరుస్తుంది? (మోషైయ 18:8–10; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి).
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.