2024 రండి, నన్ను అనుసరించండి
ఏప్రిల్ 27–మే 3. “యెహోవా పరిశుద్ధుడు”: నిర్గమకాండము 35–40; లేవీయకాండము 1; 4; 16; 19


“ఏప్రిల్ 27–మే 3. ‘యెహోవా పరిశుద్ధుడు’: నిర్గమకాండము 35–40; లేవీయకాండము 1; 4; 16; 19,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ఏప్రిల్ 27–మే 3. ‘యెహోవా పరిశుద్ధుడు,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

రియో డి జనీరో బ్రెజిల్ దేవాలయము

రియో డి జనీరో బ్రెజిల్ దేవాలయము

ఏప్రిల్ 27–మే 3: “యెహోవా పరిశుద్ధుడు”

నిర్గమకాండము 35–40; లేవీయకాండము 1; 4; 1619

ఐగుప్తును విడిచివెళ్ళడం—ముఖ్యమైనది మరియు అద్భుతమైనది అయినప్పటికీ—ఇశ్రాయేలీయుల కొరకు దేవుని ఉద్దేశాలను పూర్తిగా నెరవేర్చలేదు. వాగ్దానదేశంలో సౌకర్యవంతమైన జీవితం కూడా వారి కొరకు దేవుని అంతిమ లక్ష్యం కాదు. ఇవి దేవుడు తన జనుల కొరకు నిజంగా కోరుకున్న దిశగా అడుగులు మాత్రమే: “మీరు పరిశుద్ధులైయుండవలెను: మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనైయున్నాను” (లేవీయకాండము 19:2). తరతరాలుగా చెరలో జీవించిన తన జనులను పరిశుద్ధులుగా చేయాలని దేవుడు ఏవిధముగా కోరారు? అరణ్యములో ఒక పరిశుద్ధ ప్రదేశమును—ఒక గుడారమును తయారు చేయమని ఆయన వారిని ఆజ్ఞాపించారు. వారి క్రియలను నడిపించడానికి మరియు వారి హృదయాలను మార్చడానికి ఆయన వారికి నిబంధనలను, ధర్మశాస్త్రాలను ఇచ్చారు. మరియు వారి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం గురించి వారికి బోధించడానికి జంతు బలులు చేయమని ఆయన వారికి ఆజ్ఞాపించారు. ఇదంతా వారి మనస్సులను, హృదయాలను మరియు జీవితాలను రక్షకుని వైపు నడిపించడానికి ఉద్దేశించబడింది. ఇశ్రాయేలీయుల కొరకు మరియు మన కొరకు ఆయనే పరిశుద్ధతకు నిజమైన మార్గము. మనమందరము కొంతకాలము పాపపు చెరలో గడిపాము మరియు పాపాన్ని వదిలివేసి, “నేను మిమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు శక్తిని కలిగియున్నాను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:7) అని వాగ్దానం చేసిన యేసు క్రీస్తును అనుసరించమని మనమందరము ఆహ్వానించబడ్డాము.

లేవీయకాండమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “లేవీయకాండము” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

నిర్గమకాండము 35–40; లేవీయకాండము 19

సెమినరీ చిహ్నము
పరిశుద్ధునిగా మారాలని ప్రభువు నన్ను కోరుతున్నారు.

ఒక గుడారమును నిర్మించడానికి ఇశ్రాయేలీయుల ప్రయత్నాలను నిర్గమకాండము 35-40 వివరిస్తుంది, అక్కడ పరిశుద్ధ జనులు కావడానికి పవిత్ర విధులు వారికి సహాయపడతాయి. మీరు ఈ అధ్యాయాలను చదువుతున్నప్పుడు, గుడారంలో ఉంచమని ప్రభువు తన జనులను కోరిన వస్తువుల కొరకు చూడండి. ఈ వస్తువులు వేటిని సూచిస్తాయి? పరిశుద్ధతను పెంచుకోవడం గురించి అవి మీకు ఏమి సూచిస్తున్నాయి? ప్రత్యేకించి ఈ వస్తువులు మీ ఆలోచనలను రక్షకుని వైపు ఎలా త్రిప్పుతాయో పరిగణించండి. ఇటువంటి ఒక పట్టిక మీకు సహాయపడవచ్చు:

ఏ వస్తువును మీరు కనుగొన్నారు?

ఇది దేనిని సూచించగలదు?

ఏ వస్తువును మీరు కనుగొన్నారు?

నిబంధన మందసము (నిర్గమకాండము 37:1–9; 40:20–21)

ఇది దేనిని సూచించగలదు?

(నిర్గమకాండము 25:20–22; లేఖన దీపిక, “నిబంధన మందసము” చూడండి)

ఏ వస్తువును మీరు కనుగొన్నారు?

ధూప వేదిక (నిర్గమకాండము 40:26–27; నిర్గమకాండము 30:1, 6–8 కూడా చూడండి)

ఇది దేనిని సూచించగలదు?

(ప్రకటన 8:3-4 చూడండి)

ఏ వస్తువును మీరు కనుగొన్నారు?

దీపవృక్షము లేదా దీపస్తంభము (నిర్గమకాండము 37:17–24)

ఇది దేనిని సూచించగలదు?

(మత్తయి 5:14–16; యోహాను 8:12 చూడండి)

ఏ వస్తువును మీరు కనుగొన్నారు?

బలిపీఠము (నిర్గమకాండము 38:1–7; నిర్గమకాండము 27:1; 29:10–14 కూడా చూడండి)

ఇది దేనిని సూచించగలదు?

(లేఖన దీపిక, “త్యాగము,” చూడండి)

ఏ వస్తువును మీరు కనుగొన్నారు?

నీటి గంగాళము (నిర్గమకాండము 30:17–21)

ఇది దేనిని సూచించగలదు?

(2 దినవృత్తాంతములు 4:6; యెషయా 1:16; యిర్మీయా 33:8 చూడండి)

నిజమే, పరిశుద్ధ స్థలాల్లో ఉండడం మాత్రమే మనల్ని పరిశుద్ధంగా చేయదు. పరిశుద్ధతలో వృద్ధి చెందుటకు సహాయపడేందుకు ప్రభువు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రములు మరియు ఆజ్ఞలను లేవీయకాండము 19 వివరిస్తుంది. ప్రభువు నుండి పరిశుద్ధతను వెదకడంలో మీకు సహాయపడగలిగేలా ఈ ఆజ్ఞలలో మీరేమి కనుగొంటారు? ఈ సూత్రాలను మరింత సంపూర్ణంగా జీవించడానికి ఏమి చేయాలని మీరు మనస్సులో ముద్రవేయబడ్డారు?

హెన్రీ బి. ఐరింగ్, “పరిశుద్ధత మరియు రక్షణ ప్రణాళిక,” లియహోనా, నవ. 2019, 100–103 కూడా చూడండి.

7:19

The Tabernacle

పవిత్రమైన సంగీతాన్ని ఉపయోగించండి. ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించడానికి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించడానికి సంగీతానికి గొప్ప శక్తి ఉంది. కీర్తనలలోని సందేశాలు తరచుగా లేఖనాలలోని సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. రక్షకునిలా మరింత పరిశుద్ధంగా మారడం అంటే ఏమిటో ఆలోచించడానికి మరియు పరిశుద్ధతను పెంచుకోవడానికి ఆయన మీకు ఎలా సహాయం చేస్తున్నారో ధ్యానించడానికి కూడా ఇది మీకు సహాయం చేస్తుంది.

నిర్గమకాండము 35:4–35; 36:1–7

సమ్మతిగల హృదయముతో నా అర్పణలను అర్పించమని ప్రభువు నన్ను అడుగుతారు.

ఐగుప్తును విడిచివెళ్ళిన తరువాతి సంవత్సరంలో, యెహోవాతో ఇశ్రాయేలీయుల సంబంధము పరస్పరం విరుద్ధంగా ఉందని వివరించవచ్చు. అయినప్పటికీ, మీరు నిర్గమకాండము 35:4–35 మరియు 36:1–7 చదువుతున్నప్పుడు, గుడారమును నిర్మించమనే ఆజ్ఞకు ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారో గమనించండి. ప్రభువును బాగుగా సేవించడానికి మీకు సహాయపడగలిగేలా ఇశ్రాయేలీయుల నుండి మీరేమి నేర్చుకుంటారు?

గుడారం కోసం విలువైన లోహాలు, నారలు లేదా కలప కోసం ఆయన మిమ్మల్ని అడగకపోవచ్చు. ప్రభువు మీకు ఏమి ఇచ్చారు మరియు ఆయన ఏమి ఇవ్వమని అడుగుతున్నారు? మీ “హృదయం [మీరు] పనికి రావాలని ఎప్పుడు ప్రేరేపించింది”?

గుడారము కొరకు అర్పణలను సమీకరిస్తున్న ఇశ్రాయేలీయులు

ఇశ్రాయేలీయులలో “బుద్ధిపుట్టిన ప్రతివాడు” (నిర్గమకాండము 35:5) గుడారము కొరకు అర్పణలు ఇచ్చాడు. కార్బర్ట్ గాథియర్ చేత వివరణ, ©Lifeway Collection/licensed from goodsalt.com

నిర్గమకాండము 40:12–14

దేవాలయ విధులు ప్రాచీన కాలంలోనే ఇవ్వబడ్డాయి.

మన కాలంలో కూడా ప్రభువు యొక్క మందిరంలో నిర్వహించబడే ప్రాచీన విధులను నిర్గమకాండము 40:12–14 సూచిస్తుంది. ఈ విధులు యేసు క్రీస్తు గురించి ఎలా సాక్ష్యమిస్తున్నాయో తెలుసుకోవడానికి మీకు సహాయపడే కొన్ని అదనపు వచనాలు ఇక్కడ ఉన్నాయి:

  • ప్రక్షాళనము: కీర్తనలు 51:2; యెహెజ్కేలు 36:25–27

  • పరిశుద్ధ వస్త్రాలు ధరింపజేయుట: యెషయా 61:10; మత్తయి 22:11–14; ప్రకటన 19:7–8

  • అభిషేకించుట: లూకా 4:18–19; అపొస్తలుల కార్యములు 10:38

లేవీయకాండము 1:1–9; 416

యేసు క్రీస్తు యొక్క త్యాగము కారణంగా నేను క్షమించబడగలను.

లేవీయకాండములో అధికభాగము మనకు వింతగా కనిపించవచ్చు—జంతు బలులు, రక్తము మరియు నీటిని కలుపుకొనియున్న ఆచారకర్మలు, జీవితంలోని అతిచిన్న వివరములను పరిపాలించే ధర్మశాస్త్రములు. కానీ ఈ ఆచారకర్మలు మరియు ధర్మశాస్త్రములు బాగా తెలిసినటువంటి—పశ్చాత్తాపము, పరిశుద్ధత, రక్షకుని ప్రాయశ్చిత్తము వంటి సూత్రాలను బోధించడానికి ఉద్దేశించబడినవి. మీరు లేవీయకాండము 1:1–9; 416 చదువుతున్నప్పుడు, ఈ సూత్రాలను కనుగొనడానికి ఇలాంటి ప్రశ్నలను పరిగణించండి:

  • ఏ పదాలు లేదా వాక్యభాగాలు నాకు యేసు క్రీస్తును మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగాన్ని గుర్తుచేస్తాయి?

  • ఈ త్యాగాల నుండి రక్షకుని త్యాగం గురించి నేను ఏమి నేర్చుకోవాలి?

  • ఇలాంటి త్యాగాలు చేసిన వాళ్లలా నేను ఎలా ఉన్నాను?

ప్రభువుకు ఇకపై జంతు బలులు అవసరం లేదు. కానీ త్యాగం ఇప్పటికీ సువార్త యొక్క ముఖ్యమైన సూత్రమైయుంది. ప్రభువు ఎలాంటి త్యాగం చేయమని కోరుతున్నారో తెలుసుకోవడానికి, 3 నీఫై 9:19–20; సిద్ధాంతము మరియు నిబంధనలు 64:34 చదవండి. మీరు ఈ రకమైన త్యాగాలను ఎలా అర్పిస్తున్నారు? మీరు మీ త్యాగాలను ఎలా చూడాలి అనే దాని గురించి మోషే 5:7 మీకు ఏమి బోధిస్తోంది?

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: గుడారము మరియు బలి” కూడా చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

నిర్గమకాండము 35:20–29; 36:1

దేవుడు తన పనిలో సహాయం చేయడానికి నాకు బహుమానాలు ఇచ్చారు.

  • ఈ నమూనా చివరలో ఇశ్రాయేలీయుల అరణ్య గుడారపు చిత్రం ఉంది. మీరు దీన్ని మీ పిల్లలతో కలిసి చూడాలనుకోవచ్చు మరియు గుడారాన్ని నిర్మించడానికి ఏ సామగ్రి అవసరమైయుండవచ్చో వారిని అడగవచ్చు. ఈ సామాగ్రులు ఎలా అందించబడ్డాయో తెలుసుకోవడానికి మీరు నిర్గమకాండము 35:20–29 కలిసి చదవవచ్చు. ఆయన రాజ్యాన్ని నిర్మించడంలో సహకరించమని ప్రభువు మనల్ని ఎలా ఆహ్వానించారు?

  • గుడారాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి ప్రభువు బెసలేలు మరియు అహోలీయాబులకు ఏమి ఇచ్చారో తెలుసుకోవడానికి వారితో నిర్గమకాండము 36:1 చదవడాన్ని పరిగణించండి. ఆయన రాజ్యాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి ప్రభువు వారికి ఏమి ఇచ్చారని మీరు భావిస్తున్నారనే దాని గురించి మీరు మీ పిల్లలతో మాట్లాడవచ్చు. ఇతరులను దీవించడానికి వీటిని మనమెలా ఉపయోగించగలము?

రోమ్ ఇటలీ దేవాలయము

రోమ్ ఇటలీ దేవాలయము

నిర్గమకాండము 40:17–34

పరిశుద్ధ స్థలాలలో ప్రభువు సన్నిధిని నేను అనుభూతి చెందగలను.

  • నిర్గమకాండము 40:17–34 ఇశ్రాయేలీయుల గుడారంలో భాగమైన విషయాలను జాబితా చేస్తుంది. బహుశా మీరు మరియు మీ పిల్లలు వాటిని ఈ వచనాల్లో మరియు ఈ నమూనా చివరిలో ఉన్న గుడారం చిత్రంలో కనుగొనవచ్చు. గుడారంలోని ప్రతీ భాగం రక్షకుడు లేదా పరలోక తండ్రి గురించి ఎలా బోధించగలదనే దాని గురించి మాట్లాడండి. ఉదాహరణకు, సాక్ష్యపు మందసము మనకు దేవుని ఆజ్ఞలను గుర్తుచేయగలదు, బలిపీఠము యేసు క్రీస్తు బలిని మనకు గుర్తుచేయగలదు మరియు మొదలైనవి.

  • యేసు క్రీస్తుకు దగ్గరగా భావించడానికి మనకు సహాయపడేందుకు నేడు మనకు గల పరిశుద్ధ స్థలాలు ఏవి? దేవాలయం వంటి పవిత్ర స్థలాల గురించి మీరు ఎలా భావిస్తున్నారో ఒకరితో ఒకరు పంచుకోండి.

5:41

What Is a Temple?

లేవీయకాండము 1:1–4

యేసు క్రీస్తు యొక్క త్యాగము కారణంగా నేను క్షమించబడగలను.

  • పాత నిబంధనలో వర్ణించబడిన జంతు బలులు ఇశ్రాయేలు పిల్లలకు యేసు క్రీస్తు ద్వారా క్షమాపణ గురించి బోధించడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ త్యాగాల గురించి చదవడం మీ పిల్లలకు అదేవిధంగా ఎలా చేయగలదో పరిశీలించండి. మీరు పిల్లలతో కలిసి లేవీయకాండము 1:1–4 చదువుతున్నప్పుడు గెత్సేమనెలో మరియు శిలువపై ఉన్న యేసు క్రీస్తు చిత్రాలను చూపించవచ్చు (Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు. 5657 చూడండి). యేసు క్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసే పదాలు లేదా వాక్యభాగాలను కనుగొనడంలో వారికి సహాయపడండి.

  • జంతువులకు బదులు ఏమి బలి ఇవ్వాలని మనకు ఆజ్ఞాపించబడిందో తెలుసుకోవడానికి మీరు 3 నీఫై 9:19–20ను కూడా కలిసి చదవవచ్చు. విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మను ప్రభువుకు సమర్పించడం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడంలో సహాయం కోసం లేఖన దీపిక, “విరిగిన హృదయము” (సువార్త గ్రంథాలయము) చూడండి.

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ప్రాచీన గుడారము

The Ancient Tabernacle [ప్రాచీన గుడారము], బ్రాడ్లీ క్లార్క్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: పరిశుద్ధ స్థలాలలో ప్రభువు సన్నిధిని నేను అనుభూతి చెందగలను